Comment navigation


15547

« 1 ... 1460 1461 1462 1463 1464 ... 1555 »

  1. మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    09/05/2007 3:38 pm

    గత శతాబ్దాల్లో వలస ప్రాంతాలని ఆక్రమించుకున్నప్పుడల్లా బ్రిటిష్ వారు శిస్తు విషయాలనూ, రాజ్యపాలననూ మాత్రమే హస్తగతం చేసుకుని స్థానిక భాషలనూ, ఆచారాలనూ పట్టించుకునేవారు కాదట; ఫ్రెంచివారు మాత్రం ఆక్రమిత దేశాల్లో తమ భాషనూ, సంప్రదాయాలనూ స్థానికులపై బలవంతంగా రుద్ది, వారిని ‘సంస్కరిస్తూ’ ఉండేవారట. ఈ సంగతి నేనెక్కడో చదివాను. దీన్ని గురించిన లక్ష్మన్నగారి అనుభవాలేవైనా ఉన్నాయేమో…?

  2. మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి కె.వి.గిరిధరరావు గారి అభిప్రాయం:

    09/05/2007 3:01 pm

    చక్కటి తెలుగులో చాలా బాగా వ్రాసారు.
    అభినందనలు.

    కె.వి.గిరిధరరావు

  3. మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    09/05/2007 2:59 pm

    వ్యాసం ఆసక్తికరంగా సాగింది. ఇంకొన్ని ఫోటోలున్నా బావుండేది. ఈ రోజుల్లో మనవాళ్ళు నివసించని దేశమంటూ లేదు కనక వారిలో కొందరైనా తమ అనుభవాలను ఈ పద్ధతిలో పంచుకోగలిగితే మోహనరావు గారన్నట్టుగా మనం మానసిక యాత్రలు చెయ్యగలుగుతాం. రాయగలిగే శక్తీ, ఆసక్తీ, ఓపికా ఉంటే చాలు. లక్ష్మన్నగారివి ఈ మూడు విషయాల్లోనూ మంచి మార్కులే.

  4. సాయము శాయరా డింభకా! గురించి krishna గారి అభిప్రాయం:

    09/05/2007 2:32 pm

    మనోడంటే మనకు సాయం చేసేవాడేనా? ఏదన్నా ఒకసారి సాయం చేయలేకపోతే వాడిని అర్జెంటుగా మన లిస్టులోంచి తీసెయ్యాల్సిందేనా? సాయానికీ మనవాడవటానికి సంబంధం ఏమిటో! సాయం వీలును బట్టే చేయమని అడిగినా మన మనసులో మాత్రం సాయం చేయకపోయవో నీ పీకనొక్కేస్తా అన్న భావంతోనే మనలో చాలామంది ఉంటామేమో? అవతలి వాడి కష్టాన్నీ ఇబ్బందినీ ఎందుకు గుర్తించరు?

    పాపం సతీష్ కూడా బామ్మర్ది రాక రాక వస్తున్నాడనేగా చెప్పింది. మనం మన బావ ఇంటికి వెళ్ళినపుడు మన బావ ఫ్రెండు కోసమని వెళితే నిజంగానే ఆనందించగలమా? ఈ చుట్టాలింతే అని మరో కథ రాయడానికి తాయారవమూ?

  5. వాన-పాట గురించి krishna గారి అభిప్రాయం:

    09/05/2007 2:09 pm

    అద్భుతమైన చిత్రాన్ని చూపి మరచిపోలేకుండా మనసుపై ముద్ర వేశారు.

  6. అరణ్య కవితలు గురించి krishna గారి అభిప్రాయం:

    09/05/2007 2:05 pm

    నాకు ఈ కవిత అర్ధం కాలేదో లేక అసలు ఈ మధ్య కవిత అనే పేరుతో వచ్చేవి ఇలా ఉంటున్నాయో తెలీదు. అసలు ఏముంది ఈ కవితలో? బాగుందో బాలేదో తర్వాత ఆలోచిద్దాం. ఎవరైనా కాస్త వివరించే పుణ్యం కట్టుకోరూ దయచేసి.

    వాక్యాలన్నిటినీ ఒకే పేరాలో వ్రాయకుండా విరిచేసి నాలుగో ఐదో పంక్తుల కట్టలు కొన్ని చదవడానికి పడేశారు. అలా నింపడమేనా కవిత్వం అంటే? అడవి అనేది అందంగా ఉంటుంది కాబట్టి ఏం రాసినా చెల్లిపోతుందనే భావన మాత్రమే ఉంది ఈ కవితలో. మనసును హత్తుకునే భావమ్ ఒక్కటి లేదు, ఒక అందమైన భావాన్ని అందంగా వివరించడం లేదు, చదివాక మనల్ని అలోచింపచేసేదిగా లేదు. మొత్తానికి అసలు కవిత అంటే ఏమిటో నేర్చుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది.

    ఇందువల్లే మన భాషకి అధోగతి పడుతోంది. కవులూ కాస్త చదవడం కూడా చేయండి. లేకపోతే అరిగిపోయిన భావాలే చర్విత చర్వణం అవుతాయి. శేషేంద్ర శర్మ గారి గురించి వారి శిష్యులు ఒకాయన వ్రాస్తూ అరిగిపోయిన భావాలు నింపిన ఒక అనువాదాన్ని చూపిస్తే ఆయనేమన్నారటో తెలుసా? “కిళ్ళీ బాగా నమిలి నమిలి నమిలీ రసమంతా అయిపోయాక థుపుక్కున ఉమ్మిన పిప్పిలా ఉంది” అని. కొత్త భావాల్లేని కవితలు చదివితే అలానే అనిపిస్తుంది. అందుకే కాస్త చదవండీ దయచేసి.

    రచయిత నొచ్చుకుంటారని తెలుసు. అయినా ఇంత ఘాటుగా వ్రాయడానికి కారణం, ఈ మధ్య కవితలు వ్రాసే వారు జాగ్రత్తలు తీసుకోవట్లేదన్న బాధే. అలాంటి కవితలే వస్తే ఇక సంపాదకులూ ఏం చేస్తారు? వచ్చిన వాటిల్లో ఏదో ఒకటి వేయడం తప్ప.. ఈ మధ్య ఆన్ లైన్ పత్రికలన్నిటిలో కవితలు ఇలానే ఉంటున్నాయి. కవులు జాగ్రత్త తీసుకోకపోతే కవిత్వం మీద ఆసక్తి చచ్చిపోయి భాష చచ్చిపోతుందన్నదే నా బాధ.

  7. మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:

    09/05/2007 1:25 pm

    చాలా బాగుంది లక్ష్మన్న గారూ. ఓపిగ్గా రాసి పంచుకున్నందుకు ధన్యవాదాలు. .. ఈ మూడేళ్ళ జీవితంలో మిమ్మల్నీ మీ కుటుంబ సభ్యుల్నీ కదిలించిన సంఘటనలు ఏవన్న ఉంటే .. వివరంగా వీలు చూసుకుని రాయండి.

  8. కవితల ఇంద్రధనుస్సు గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    09/05/2007 3:46 am

    సమీక్ష చాలా బావుంది. వెంటనే చంద్ర గారి పుస్తకం చదవాలనిపిస్తోంది.

  9. కీబోర్డ్ మీద రాగాలు గురించి Jaya గారి అభిప్రాయం:

    09/05/2007 3:44 am

    This article is interesting and educative about an uncommon topic.

  10. కీబోర్డ్ మీద రాగాలు గురించి నాగరాజా గారి అభిప్రాయం:

    09/05/2007 2:39 am

    థాంక్సు మాస్టారు. చాలా బాగుంది.

« 1 ... 1460 1461 1462 1463 1464 ... 1555 »