Comment navigation


15548

« 1 ... 1453 1454 1455 1456 1457 ... 1555 »

  1. సత్యజిత్ రాయ్ – ఓ చిన్న ఉపోద్ఘాతం గురించి sowmya గారి అభిప్రాయం:

    09/17/2007 11:14 am

    Adding a few more:
    1. Stranger and other stories
    – in Penguin (Most of these are seen in 20 short stories)
    2. The best of satyajit ray – Penguin
    3. The Complete Adventures of Feluda – Vol 1 (contains 16 novels)
    – Penguin
    4. The complete adventures of feluda – Vol 2(Contains 19 novels)
    -Penguin
    5. Our films, Their films
    6. Childhood days, a memoir

  2. తెలుగు భాష వయస్సెంత? గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    09/17/2007 8:58 am

    చరిత్ర, భాషా చరిత్రల గురించి ఆసక్తి ఉన్నవారందరికీ ఎంతో పనికొచ్చే మంచి వ్యాసం ఇది. క్రీ.పూ. ఏడో శతాబ్దం నాటికి తెలుగు తదితర దక్షిణాది భాషలకు స్పష్టమైన స్వరూపాలు ఏర్పడి ఉంటాయన్న ప్రతిపాదన పూర్తిగా సమంజసమైనది. అది బుద్ధుడూ, మహావీరుల కాలానికి ఒక శతాబ్దపు ముందరి కాలం. అప్పటికి ఉత్తరభారతమంతటా మహాజనపదాలుండేవి. దండకారణ్యం గుండా కనీసం కాలినడకకైనా పనికొచ్చే ‘దక్షిణాపథం’ ఒకటి ఉండేదేమో.

    నాగరికత అంతగా ప్రవర్తిల్లని కాలంలో విడి తెగలుగా, గుంపులుగా ఒకే ప్రాంతంలో నివసిస్తున్నవారంతా క్రమంగా ఒకరికొకరు తారసపడి సంపర్కాలు పెంచుకోవటం ద్వారానే ఏ ప్రాంతీయభాషకైనా రూపం ఏర్పడుతుంది. సుమేరియన్ రాజవంశాలకు ప్రసిద్ధికెక్కిన ఆ కాలానికి ఉత్తరభారతంలో అథర్వణవేదం తదితర సాహిత్యం సృష్టి కావడం, దక్షిణ భారతంలో గణరాజ్యాల వంటివాటి స్థాపనా వగైరాలు జరిగే ఉంటాయి. లిపి కాకపోయినా దక్షిణభాషలు అప్పటికే రూపుదిద్దుకుని ఉంటాయనీ, ఆ తరవాతి కాలంలో సంస్కృత, ప్రాకృత భాషలతో వాటికి ప్రమేయం కలిగి ఉంటుందనీ సులువుగా ఊహించవచ్చు. కొన్ని వందల మైళ్ళ ఎడం ఉన్న దక్షిణాది రాష్ట్రాలన్నిటా ఒకే మూలభాష ఉండేదనీ (తమిళమో మరేదో) అందులోంచి తక్కినవి పుట్టాయనీ నమ్మడం కష్టం. రకరకాల స్థానిక తెగల మూల భాషల నుంచి ఆధునిక భాషలు విడివిడిగా పుట్టుకొచ్చాయన్నదే సబబుగా అనిపిస్తుంది.

  3. తెలుగు భాష వయస్సెంత? గురించి Kompella Sarma గారి అభిప్రాయం:

    09/17/2007 7:36 am

    చాలా మంచి వ్యాసం. ప్రతీ తెలుగుజీవి దీనిని భగవద్గీతతో సమానంగా భద్రపరచుకోవాలి.
    ధన్యవాదములు.

    కొంపెల్ల శర్మ

  4. ఈమాట గురించి గురించి Kompella Sarma గారి అభిప్రాయం:

    09/17/2007 7:28 am

    ఈ మాట సంపాదక వర్గానికి యింత అద్భుతమైన తెలుగు సాహిత్య, సాంస్కృతిక పత్రికను నిర్వహిస్తున్నందులకు మన:పూర్వక ధన్యవాదములు. ప్రాచీన సాహిత్యపు రూపురేఖలను గమనిస్తుంటే ఆనాటి ప్రబంధయుగం నుంచి ఆయా ఛాయలు కానవస్తున్నాయి.

    నేను తెలుగు సాహిత్యంలో ఎదో కొంచెం రచనలు చేస్తూంటాను. మన మహానుభావులు అన్న శీర్షికతో http://www.telugujournal.com అన్న పత్రికలో రచనలు చేయడం జరుగుతూంది. మునుము తమిళనాడు ఈనాడు తెలుగు దినపత్రికలో సాంస్కతికపరమైన వ్యాసాలను, కార్యక్రమాలకు విశ్లేషణలను వ్రాయడం జరిగింది.

    పై అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, మీ ప్రముఖ పత్రికలో రచనలను వ్రాసేందుకు అనుమతి యివ్వమన్న నా ప్రార్ధనను అంగీకరిస్తారనే ఆశతో,
    కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ ( కొంపెల్ల శర్మ )

  5. మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి rajay గారి అభిప్రాయం:

    09/17/2007 6:45 am

    Its really wonderful experience reading your travellogue( can I call that so?)

    Regards.
    rajay

  6. రచయితలకు సూచనలు గురించి rajay గారి అభిప్రాయం:

    09/17/2007 5:50 am

    మీ ఈ మాట పత్రిక బాగున్నది. ఇందులోని కథలు కూడా బాగున్నవి.
    మీ పత్రిక ముందు ముందు బాగా ముందుకు సాగాలని ఆశిస్తూ

    శుభకామనలతో
    జయ.

  7. అరణ్య కవితలు గురించి Hanumantu గారి అభిప్రాయం:

    09/17/2007 3:06 am

    బాగు బాగు. అయ్యా తిమ్మారెడ్డి రవికిరణ్ గారు….

    ఈ చర్చలో అసంబద్ధత ఎక్కడ మొదలయ్యిందనే విషయంలో మీరు కావాలనే పప్పులో కాలు వేసినట్లు అగుపిస్తున్నది.

    పెద్ద తలకాయలో, పిన్న తలకాయలో కవిత్వం గురించి ఇచ్చిన నిర్వచనాలు, విశ్లేషించే పద్ధతులు సామాన్య పాఠకునికి అనవసరం. ఇవేవీ లేకుండానే కవిత బాగున్నదో లేదో అభిప్రాయం చెప్పగలిగే జ్ణానం సామాన్యపాఠకునికి ఉంటుంది.

    కాకపోతే, ఎవరో ఒకరిద్దరు ‘భుజకీర్తులు’ తొడిగారన్న ‘ఘనకీర్తి’తో అసలు విశ్లేషించకుండానే ‘దాడి’ చేయటం విమర్శకునికి తగదు.

    ముందస్తుగా అసలు కవితే అర్ధంకాలేదన్నారు కృష్ణ గారు. ఆపైన అరిగిపోయిన భావాలే అని తేల్చేసారు. ఆ భావాలతో భాషను అధోగతి పట్టించారనీ అపవాదు వేసారు. కవులూ కాస్త చదవటం కూడా చేయండనే సలహానూ పడేసారు.

    అరిగిపోయిన భావాలతో వచ్చిన మునుపటి కవితలను మాత్రం ఉదహరించలేదు. భాషలో ఏ లోపం ఉన్నదో ఎక్కడా విశ్లేషణా లేదు. కవులే కాదు, విమర్శకులకూ చదవటం అవసరమే అన్న విషయాన్ని ‘వివేకంగా’ మరచిపోవటంలోని ఔచిత్యం నాలాటి ‘అవివేకులు’ అర్ధం చేసుకోలేరేమో!

    ‘విస్తరణభీతి’ వలన అభిప్రాయం మాత్రమే తెలియబరచానని కృష్ణగారు ప్రకటించి మరీ, దాదాపు యాభలైనుల పైబడి ‘అభిప్రాయం’ మాత్రమే వ్రాసారనుకుంటాను కానీ, విశ్లేషణ మాత్రం ఎందుకో వ్రాయలేదు.

  8. అరణ్య కవితలు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    09/16/2007 12:35 pm

    కవిత్వం గురించి ఫలాని, ఫలాన వాళ్ళు ఏం చెప్పేరో, విమర్శ గురించి, విశ్లేషణ గురించి ఏఏ పెద్ద తలకాయలు ఏం చెప్పెయో తెలుసుకున్న వాళ్ళే విమర్శ చేయదగ్గ వాళ్ళనే స్వరం వొకటి ఈ కవిత మీద వచ్చిన అభిప్రయాల్లో వినిపిస్తుంది. ఐతే వాళ్ళు చెప్పిన కవిత్వ లక్షణాలు కానీ, వాళ్ళు కవిత్వానికిచ్చిన నిర్వచనాలుగానీ, వాళ్ళు స్థిరీకరించిన విష్లేషణా పద్దతులు కానీ తెలీకుండానే, తెలుసుకోవాల్సిన అవసరంలేకుండానే, తెలుగొచ్చిన ప్రతివాడికీ, ఫలాని కవిత తనకు నచ్చిందో, నచ్చలేదో, నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పగలీగే ఙ్ఞానం వుందని నా నమ్మకం.

    కృష్ణ గారి అభిప్రాయంతో మొదలైన ఈ చర్చ, మూలా సుబ్రహ్మణ్యం గారి జవాబుతో దారి తప్పిపోయి, అలోక్ గారి అభిప్రాయంతో అసభ్యత వైపు జారిపోయిందేవో అనిపిస్తుంది. “మీకు కనబడనంత మాత్రాన అసలు నీరే లేదనేంత అవివేకులు కారని,” కృష్ణ గారికి మూలా గారు జవాబియ్యటంతోనే అసంబద్దవైన వాదం మొదలైందనిపిస్తుంది. ఒక కవితలో వుండేటటువంటి అందాన్ని, అర్థాన్ని, అనుభవాన్ని, అనుభూతిని కష్టపడి తవ్వితీయవలసిన అగత్యం, అవసరం పాఠకుడికి లేదనే నేను భావిస్తాను. రచయిత తన అనుభవాన్ని, తనలోని ఉద్వేగాన్నీ కవిత ద్వారా పాఠకుడికి ట్రాన్ఫర్ చేయలేకపోవటం ఆ రచన బలహీనతని సూచిస్తుందే తప్ప పాఠకుడి అవివేకాన్ని కాదు. ఉదాహరణల కోసం ఎక్కడకో పోవాల్సిన అవసరం లేదు, ఇదే సంచికలో ప్రచురించబడినట్టి విన్నకోట రవిశంకర్ గారి “వాన-పాట” నే ఉదాహరించ వచ్చు. అందం, భావుకతా రెంటిలోనూ వుండొచ్చు, కానీ వాన-పాటలో వున్నటువంటి కవితకి ఆత్మలాంటి ఆ సూపర్కండక్టివిటి, రచయిత ఎమోషన్ ని పాఠకుడి మనసులోకి ట్రాన్ఫర్ చేసి, కవిత చదివేసిన తర్వాత కూడా, మనసుని వదలిపోని వొక ఉద్వేగాన్ని సృష్టించగలిగే ఆ శక్తి మూలా గారి కవితలో లేదు. కొందరు మూలా గారి కవిత చదివి అడవికి పోయినంత అనుభూతి పొందగలిగేరని తెలుస్తుంది. అంత అద్రుష్టం నా బోటి సామాన్య పాఠకులకి లేదేవోనని నా అభిప్రాయం. దళిత కవిత్వం, లేక అయావాద కవిత్వాలని తలకెక్కించుకోని ఈ అభిప్రాయం చెబుతున్నానని, లేక ఫలాని వారి విమర్శనాత్మక పుస్తకం చదవకపోవటం వలననో, లేకపోతే నా సహజవైన అవివేకంవలననో ఈ కవితమీద ఈ అభిప్రాయానికి వచ్చానని ఎవరైనా భావిస్తే వారి వివేకానికి సంతోషిస్తాను. కొంచం భావుకత, నాలుగు సున్నితవైన, అందవైన పదాలు కవిత కాలేవని అరణ్య కవితల ద్వారా మూలా గారు నిరూపించారనే నేననుకుంటునాను.

  9. చంపకోత్పలమాలల కథ గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    09/16/2007 11:44 am

    ఆ సూచన రెండవ పుటలోని క్రింది వాక్యమునకు
    వర్తిస్తుంది – “పెద్ద వృత్తాలు చిన్న వృత్తాలను పొడిగించి,
    ఇతర వృత్తాలతో చేర్చి, తరువాత మార్చి సృష్టించారు. ఇది
    మనము చదివే జెనెటిక్స్ లాంటిదే. జెనెటిక్స్‌లో కూడ
    జీన్ డూప్లికేషన్, జీన్ ఫ్యూషన్ వంటివి ఉన్నాయి.”
    అదియునుకాక చంపకమాలతో సీసము, కందము,
    ఆటవెలది, తేటగీతి, మధ్యాక్కరల గర్భితము చేయు రీతి
    proteins మరియు nucleic acids లోని sequence
    alignment ను బోలినదే. అందులో amino acids మరియు
    nucleotides ఉంటాయి. ఇక్కడ గురులఘువులు ఉన్నాయి,
    అంతే. – మోహన

  10. వాన-పాట గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    09/16/2007 7:56 am

    రవిశంకర్ గారి “వాన-పాట” కవితలో ఒక fluency of style ఉంది.కాబట్టి చదివిస్తుంది. చదివేప్పుడు బాగున్నట్లు అనిపిస్తుంది.అంచేత మరలా చదివిస్తుంది. అలా చదివినప్పుడు వాన,పాటలకు కవి స్పందించిన రీతి లేదా వాటికి సంబంధించి ఆయన పొందిన అనుభూతిని కవిత్వీకరించటం లో ఏదో వెలితి ఉన్నట్లు అనిపిస్తుంది.ఈ అసంతృప్తి కి కారణమేమై ఉంటుందని ఆలోచించినప్పుడు కవితలో అంతర్గత మైన అననుసంధానానుభూతి (Ununified emotional responses ) అని నాకు అనిపించింది.అసలు కవిత ప్రారంభమే ,”వాన లో తడిసినప్పుడు/పాతగాయాలేవో సలపరించినట్లు.”ఆ పైన తన “మెత్తబడ్డ మనసుని/నిర్దయ గా మరింతగా…….” కోసే వాన అందంగా ,స్వచ్ఛంగా కురుస్తుందనటం రసవైరుధ్యానికి దారి తీసి,పాఠకుడి స్పందన లో ఒక చిన్న గందరగోళం సృష్టిస్తుంది.

    మనల బాధ పెట్టే జ్ఞాపకాలు రెండు రకాలు.
    మొదటివి: ఒకప్పుడు మనకు గొప్ప ఆనందాన్ని కలిగించిన వ్యక్తో ,లేదా పరిస్థితో ఇప్పుడు లేకపోవటం అనే వాస్తవం తాలూకు జ్ఞాపకాలు .ఈ రకమైన జ్ఞాపకాలు మరువలేనివి,మరిచిపోతే బాగుండునని అనుకోనివి, నెమరువేసుకుంటూ బాధ పడేవి,బాధ పడుతూ నెమరువేసుకుండేవి.వీనికొక శాశ్వతత్వం ఉంటుంది. ఇవి వీడనివి.
    రెండవవి: ఒకప్పుడు మనకు దారుణమైన దు:ఖాన్ని కలిగించిన వ్యక్తో ,పరిస్థితో మనకు జ్ఞాపకం వచ్చినపుడు బాధపెట్టేవి ,భయపెట్టేవి ,పీడకలలాంటివి;జ్ఞాపకం రాకుండా ఉంటే బాగుండునని అనిపించేవి.
    కవితలోని జ్ఞాపకాలు మొదటి రకమైన జ్ఞాపకాలు గా “నీ పాట” అనడం ద్వారా సూచింపబడుతున్నట్లు నేను భావిస్తున్నాను.కాబట్టి తన కంటిమీద కన్నీటి తెరలు దించే ఆ పాట ,ఒకప్పుడు తనకు గొప్ప ఆనందాన్ని కలిగించిన అనుభవమై ఇప్పుడు ఒక గాఢమైన శాశ్వతమైన శోకానుభూతిని మిగిల్చినదై ఉండాలి.
    మరి ,నీ పాట లో “తడిసినప్పుడు” అనడం,”ముగిసిన ” నీ పాటమాత్రం అనడం,”కొన్నాళ్ళ వరకు తలపుల్లో గూడు కట్టుకుని ” అనడం, కవి మీద వేదనా ప్రగాఢతను వీడని దిగులు గొలిపే బలీయమైన శాశ్వతమైన బంధాన్ని సూచించకపోవటం వల్ల పాఠకుడి మీద కవిత బలీయమైన ముద్ర వేయలేకపోతుంది.”పాట లో తడిసినప్పుడు” అనడం ,పాట లో తడవక పోవటం అనే స్థితి ఉందని,పాట లో తడవటం ఒక శాశ్వతమైన,నిరంతరమైన మానసిక స్థితి కాదని స్ఫురింప చేస్తుంది.మరలా ఇక్కడ కూడా పైన పేర్కొనబడినటువంటి రసవైరుధ్యమే ఉత్పన్నమవుతుంది.అలాకాక,పాట ముగియటం శ్రవణ సంబంధి మాత్రమే నని, మనసు ,పాట లో శాశ్వతం గా అనుక్షణం తడుస్తూనే ఉంటుందనే భావాన్ని వైరుధ్యాలు లేని విధంగా కవిత్వీకరిస్తే ,ఈ కవిత చాలా బాగుండేది.
    ఈ కవిత లో impressive imagery లేకపోలేదు. కానీ ,ఆ ఇమేజరీ వైరుధ్యాలు లేని కవి యొక్క అనుభూతుల సమూహాలను ప్రతిబింబించకపోతే, దాని నిగనిగలు మాసిపోయినట్లు కనిపిస్తవి.
    అయినా,ఈ కవిత లో ఆకర్షణ లేకపోలేదు.

    C.S.Rao

« 1 ... 1453 1454 1455 1456 1457 ... 1555 »