Comment navigation


15548

« 1 ... 1455 1456 1457 1458 1459 ... 1555 »

  1. లింఫోమా – ఒక ‘నిసి షామల్’ కథ గురించి mohanraokotari గారి అభిప్రాయం:

    09/12/2007 8:13 pm

    లింఫొమా కథ ఎంతో అద్భుథంగా ఉంది, ఈ మద్య కాలం లో ఇంత మంచి కథ రాలేదు . హృదయాన్ని సుతిగా తాకిన మానవత్వపు విలువలున్నయి, ఇలాంతి నిజాయితి పరమైన మేధవులు, కారుణ్య మూర్తులు ఉన్నారు, వారికి సరైన గౌరవము, గుర్తింపు ఆంధ్ర దేశం లో చాలా వరకు లేనే లేవు. మా మంచి రచయిత్రి నుండి మరిన్ని హృద్యమైన కథలను demand చేస్తూ……

  2. మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి mohanraokotari గారి అభిప్రాయం:

    09/12/2007 7:46 pm

    చాలా బాగుంది, foreigners ని indianisation చేసారన్న మాట. ఆంధ్రుడు ఎక్కడికి పోయినా తన జాతి ఔన్నత్యాన్ని , సంస్కృతిని మరవడన్నదే నిజం, అయితే ఇక్కడ తెలుగు జాతి పరిస్థితి అన్నాయంగా మారిపొతోంది, దీనికి కూడా మిలాంటి వారే హెల్ప్ చేయాక తప్పదు, మీ గురించి మరింత తెలుసుకోవాలని ఉంది, ధన్యవాదములతో,

  3. అరణ్య కవితలు గురించి girinandini గారి అభిప్రాయం:

    09/12/2007 1:04 pm

    కవితా అంటే కవిత్వము అని అర్థము.
    తెలుగులోకి వచ్చేటప్పటికి దీర్ఘము
    హ్రస్వము అవుతుంది. అరణ్యకవిత
    దుష్టసమాసము కాదు. ఇక పోతే అది
    వినడానికి పొయెటిక్ గా ఉందో లేదో అన్నది
    వ్యక్తిగతమైన అభిప్రాయము. – మోహన

  4. అరణ్య కవితలు గురించి Sriram గారి అభిప్రాయం:

    09/12/2007 8:23 am

    అరణ్య కవితలు అనే కన్నా అడవి కవితలనో అరణ్యకవిత్వమనో అంటే బాగుండేది.

    సంస్కృత పదమూ తెలుగు పదమూ కలిపి దుష్టసమాసం చేసారని కాదు. ఈరోజుల్లో కవిత్వానికి తర్కమే కాదు వ్యాకరణం కూడా అఖ్ఖల్లేదు కదా.

    “అరణ్య కవితలు” అన్నది ఏంటో నాకు వినడానికే అన్ పొయెటిక్ గా ఉంది.

    కేవలం నా అభిప్రాయం.

    షరా: నేను స్వతహాగా ఛాందసుడినే కానీ, ఇది మాత్రం నా సహాధ్యాయి ప్రభావం.

  5. ఒంటరి విహంగం గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    09/11/2007 9:19 am

    ఈ కథ యథాతధంగా జరిగింది. ఇందులో కల్పితమేమీ లేదు.
    తండ్రి వివాహాన్ని కొడుకులు మెచ్చ లేదు సరికదా, పూర్తిగా మాట్లాడడం మానేసారు. అమెరికాలో ఉన్నంత మాత్రాన కొడుకులు అలా ఉండరన్నదేమీ లేదు. నాణేనికి రెండు వైపులూ ఉంటాయి.
    దాసరి నారాయణ రావు సినిమా అయితే కొడుకు వేంటనే మారి తండ్రి కాళ్ళ మీద పడతాడు. కానీ కథలో హరి తండ్రి వివాహాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేడన్నదే ఆఖరి వాక్యాలలో ఉంది.

  6. కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే … గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    09/11/2007 7:56 am

    న్యాయంగా, వేల్చేరు వారి పుస్తకం చదవకుండా నేనేమీ comment చెయ్యకూడదు. కానీ ఈ సమీక్షలోని కొన్ని విషయాలు ఆసక్తిని కలిగించడం వల్ల ఇది రాస్తున్నాను.

    “ఈ దృష్టితో చదివితే ఒక అంచెలో ( ఈ నాటకాన్ని వేరువేరు అంచెల్లో వ్యాఖ్యానించడానికి తావుంది) వచ్చే ఊహ: మధురవాణి గొంతుతో కందుకూరి వీరేశలింగం పంతులు గారిని, ఆయన చేపట్టిన వేశ్యా సంస్కరణోద్యమాన్నీ వేళాకోళం చేస్తున్నట్టు కనిపిస్తుంది. విషయమేమిటంటే, నాటక రచయిత ముఖ్యోద్దేశం సంఘ సంస్కరణ కాదు ;”
    ఇది వేల్చేరువారి ఊహో వేలూరివారి ఊహో తెలియదుకాని వీరేశలింగాన్ని వేళాకోళం చెయ్యడంగా ఊహించడం కొంత అతిశయంగా తోస్తోంది. గురజాడకి కందుకూరి మీద గౌరవం ఉందన్న విషయం అతని డైరీలూ, ఉత్తరాలూ చదివితే తెలుసే విషయమే. అందుచేత అతన్ని వేళాకోళం చేసేడని నేననుకోను. అతను చేపట్టిన సంఘ సంస్కరణలోని పరిమితులని వ్యంగ్యంగా సూచించేడని మాత్రమే చెప్పగలం. అలాగే రచయిత ముఖ్యోద్దేశం సంఘసంస్కరణ కాదు అనడం కూడా పూర్తిగా సమంజసం కాదు. ఇక్కడ సంఘసంస్కరణ అంటే వీరేశలింగంగారు చేపట్టిన సంఘసంస్కరణ అన్న ఉద్దేశంలో అన్నారా? సంఘంలోని లోటుపాట్లను ఎత్తిచూపడం ద్వారా కూడా సంఘాన్ని సంస్కరించే ప్రయత్నం చెయ్యవచ్చు అని ఒప్పుకుంటే, గురజాడ కన్యాశుల్కంలో ఆ ప్రయత్నం చేసాడన్నది ఒప్పుకోవలసిన విషయం.
    “నాటకంలో ఈ పెళ్ళి గురించి నలుగురికీ తెలియగానే, ఆ ఊళ్ళో అన్ని కులాలవాళ్ళూ ఒకే తాటిమీద నిలబడి ఆ పెళ్ళి జరక్కుండా చెయ్యడానికి పూనుకుంటారు. అప్పటి సమాజం నిజంగా ఇటువంటి పెళ్ళికి వ్యతిరేకి అని కనిపిస్తూఉంటే, సంస్కరణ ఏమిటి? ”
    ఒక్క మధురవాణి పాత్ర తప్ప, మిగతా అందరూ తమ తమ స్వార్థం కారణంగానే సుబ్బి పెళ్ళి ఆపడానికి సాయపడతారు. ఇందులో ఆనాటి సమాజం అటువంటి పెళ్ళికి వ్యతిరేకం అన్న విషయం ఎక్కడా కనిపించదు.
    లుద్ధావధానుల పాత్రలోని పరివర్తన ద్వారా ఆనాటి ప్రజలలో రావల్సిన మార్పును సూచించాడు. చివరికి బుచ్చమ్మను కూడా సంస్కరణోద్యమంలో భాగమైన విధవల పునరావాస కేంద్రంలో చేర్పించడం ద్వారా తన సంఘ సంస్కరణాభిలాషని చాటుకున్నాడు.
    అసలు గురజాడే స్వయంగా ముందుమాటలో
    “When I wrote the play, I had no idea of publication. I wrote it to advance the cause of Social Reform and to combat a popular prejudice that the Telugu language was unsuited to the stage. ” అని చెప్పుకున్న తర్వాత, సంఘసంస్కరణ అతని ముఖ్యోద్దేశం కాదని అనడం చాలా సాహసమే! మరి అతనన్న “Social Reform” ఏమిటి?
    నా ఉద్దేశంలో. కన్యాశుల్కం రచనా ధ్యేయం, ముమ్మాటికీ, సంఘంలోని లోటుపాట్లని ఎత్తిచూపడం ద్వారా సంఘసంస్కరణకి దోహదం చెయ్యడమే. ఐతే గురజాడ ఆధునిక నాటకాలలోని వాస్తవికతా లక్షణానికి ప్రభావితుడై, తన నాటకంలోపాత్రలని మూస పాత్రలుగా కాక, సమాజంలోని వివిధ రకాల మనుషులని వారి సహజ స్వాభావాలకి దగ్గరగా తీర్చిదిద్దాడు. ఈ కారణం వల్లనే మనకి నాటకంలో అటు మత మౌఢ్యంతో దురాచారాలకి పాల్పడే వారూ కనిపిస్తారు, ఇటు ఆధునికత/సంస్కరణ పేరుతో మోసాలుచేసే ఆసాములూ కనిపిస్తారు.
    కన్యాశుల్కంలో మచ్చలేని (ఆ కారణంగా పూర్తిగా కాల్పనికం అనుకోదగ్గ) ఒకే ఒక పాత్ర మధురవాణి.
    Velceru garu might have given more explanation on his proposition in the book and thus answers to my above questions/argument. But as I said, my curiosity has prompted me to put my comments here.

  7. అరణ్య కవితలు గురించి నవీన్ గార్ల గారి అభిప్రాయం:

    09/11/2007 7:32 am

    కుక్క పిల్ల
    అగ్గి పుల్ల
    సబ్బు బిళ్ళ
    ఆడ పిల్ల
    ……..కవితకేవి రెశ్ట్రిక్షెన్సు!!!!!

  8. అరణ్య కవితలు గురించి girinandini గారి అభిప్రాయం:

    09/11/2007 7:29 am

    బ్రహ్మాండమైన వ్యాసాలు, సమీక్షలు, కథలు చదివిన
    తరువాత అందరూ ఎందుకు ఈ కవితపైన మాత్రమే
    అభిప్రాయాలను ఇస్తున్నారు? అవి కూడా ఎంతో
    బాగున్నాయి. వాటిపైన రాయరేం ఎవరూ.
    – నందిని

  9. మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి #vishNubhoTla lakshmanna# గారి అభిప్రాయం:

    09/11/2007 3:48 am

    యాదృచ్ఛికంగా రమ్య రాసిన ఈ క్రింది అనుభవం నేను నిన్ననే చూసాను! నా వ్యాసంలొ అనుభవాలకి, తన స్కూలు అనుభవాలకి ఉన్న సామీప్యాన్ని చూసి ఆశ్చర్యపోయా!

    ****************************************
    My France School

    Ramya Vishnubhotla

    There I sat, completely clueless, looking out the window at the gloomy, almost morbid weather of France wondering why I, a twelve year old girl, was spending her Saturday mornings taking French biology? Then I remembered why: It was because of my father who had gotten a job transfer to a foreign country and insisted on dragging the family with him. What resentment I felt. I didn’t know anyone in this class. I understood nothing. I said nothing. I didn’t move out of fear of drawing attention to myself. I just tried, in vain, to copy down the chicken scratch from the board onto my paper, sitting in solitude and silence.

    A few moments passed, and my teacher told me to follow her to the back of the room. How awkward I felt, passing all those students with their international eyes watching me. I pretended not to notice. I sat down, and she explained to me in broken English that I must make a coversheet for my binder, handing me another student’s to use as an example. It sounded simple enough. I wrote the title: “Sciences de la Vie et de la Terre”. S.V.T. I used my various colored pens, feeling safe with the other students’ backs to me.

    Once I had finished, I waited patiently until my teacher came back, assuming she would just give me another menial assignment to do. I was surprised, however, when she scolded me! All because I had not used my ruler to underline the title! What was this, an elementary school art class? She crumpled up my paper and told me to do it again. I fought back tears. I was humiliated! My first week, and already I had upset a teacher with my shaky underlining.

    Then it hit me. My life had changed. These weren’t the good ol’ days of American middle school, where the teachers called you “Sweetie” and put stickers on your papers when you got an ‘A’. No, this was France. I was in a school with grades 6 to12, where the teachers didn’t care if you couldn’t speak French, where you were never praised, and where you were yelled at on your first day of Saturday classes for not using a ruler. Needless to say, I completed the assignment again, this time rather meticulously.

    I wish I could say that things were easier from this point on, once I had mastered proper ruler usage. Unfortunately, this is not so. My French classes only became more difficult and I was embarrassed by each failure. It was slow progress, past eighth grade, to ninth grade, where I was actually able to pass my grade level French biology class, vanquishing the course which I was once so afraid of.

    Upon returning to Texas, at the age of fifteen, I briefly reflected on my years in France. I had learned to love the country I once detested. I also realized that it was because of my multiple setbacks that I was forced on the road to progress, and eventually success. There was no room left for fear of defeat. It was as though there was nothing I couldn’t conquer in time. I still believe this is so.

  10. ఒంటరి విహంగం గురించి Sujatha Srinivas గారి అభిప్రాయం:

    09/11/2007 2:55 am

    అమెరికా జీవితాన్ని చూశాక రాజారావు empty గా ఫీలవడం సహజమే గాని, వివాహం చేసుకోవడం కొంచెం అసహజంగానే వుందనిపించింది. ఇవాళ India లో old age homes (డబ్బుండాలే గానీ) ఎంత సౌకర్యంగా , హాయిగా ఉంటున్నాయో ఒకసారి వచ్చి చూడండి. అంటే , పిల్లలు విదేశాల్లో ఉన్న parents అందరూ homesలో చేరాలని నా ఉద్దేశం కాదు. తోడు కావాలంటే, పెళ్ళే అక్కర్లేదని నా ఉద్డేశం. Hyd లోని Bombay Highway లో ఒక homeలో ఎంతో మంది retired doctors, class 1 Govt servants, హాయిగా ఉన్నారు. వాళ్ళ పిల్లల్లో చాలా మంది విదేశాల్లోనే ఉన్నారు. 24 గంటలూ doctors availability, good library, big garden (I ‘ve seen old people staying in the home are cultivating vegetables, and flowers for the home. We live nearby this home) good friends, bank nearby ….! (mobile Andhra Bank ATM comes to the home every week) పిల్లలు దూరాన ఉన్నప్పుడు, వాళ్ళతో ఉండడం కుదరక , ఒంటరిగా కుమిలేకంటే, చేతిలో డబ్బు ఉన్నప్పుడు, ఇలాంటి ఆశ్రమాల్లో ఉండటం హాయి. తీరిక లేని యవ్వనంలో, చేయలేని పనులెన్నో ఈ వయసులో చేయవచ్చు. హరి తల్లే అయితే 60+ వయసులో ఈ పని చేయగలదా? పిల్లల కోసం, అన్ని త్యాగాలు చేసిన రాజారావుకి చివరికి ఈ పెళ్ళి వల్ల మిగిలినదేమిట్ట? వాళ్ళ నిష్టూరాలు, చీదరింపులూ! పిల్లల్ని ప్రేమిం చడం తల్లి దండ్రులు మానరని రాజారావే చెప్పాడు. ఇటువంటి నిర్నయాలు తీసుకునే ముందు పిల్లలు తనను కాదనుకున్నా , పరవాలేదనుకోగలిగే గుండె నిబ్బరంఉండాలి మరి.

    రాజారావు ఉత్తరంలో ఆయన వ్యధ బాగా వర్ణించారు. కానీ, ముగింపు నిజంగానే దాసరి నారాయణ రావు సినిమా లాగానే వుందండీ!

« 1 ... 1455 1456 1457 1458 1459 ... 1555 »