అరణ్య కవితల్ని తెగిడినవాళ్ళకీ, పొగిడినవాళ్ళకీ, పేరడీలు రాసినవాళ్ళకీ అందరికీ కృతజ్ఞతలు.ఇక ఈ చర్చని, వాదనల్ని ఇంతటితో ఆపేస్తే బావుంటుందని నా అభిప్రాయం. లేదు ఇంకా లాగీ, పీకుతామంటే మీ ఇష్టం.
అయ్యా తిమ్మిరెడ్డిగారు…అసలు విషయాని మీరిట్టా బమ్మిని చెయ్యడం సమయోచితంగాలేదు. మీలెక్కన రారా, చేరా వగైరాల్ని తోసవతల పారేద్దాం. ప్రతి దద్దమ్మనీ కవిత్వం గురించి రాసేయమనేద్దాం. కత్తెర పట్టుకొన్నాడుగదాని దర్జీని కూడా ఆపరేషను ధియేటర్లోకి వొదిలేద్దాం.
పాఠకుడిగా విఫలమైన క్రిష్న గారు విమర్శకుడిగా అవతరించడంతోనే సిసలైన అసంబద్ధత బయలుదేరింది. సదరు అసంబద్ధత మాబాదిగ గారితో పరుగులెట్టడం మొదలెట్టింది. చివరకు క్రిష్నగారు ఆవకాయ గురించి అనర్గళంగా ప్రసంగించడంతో శిఖరాగ్రం చేరింది. హమ్మయ్య అక్కడితో అసంబద్ధం శాంతించిందని సంతోషించేలోగా మీతో మళ్ళీ మొదలైంది. ఈ విపరీత అసంబద్ధత ముందు మీరు నాకు ఆపాదించిన “అసభ్యత” యేపాటి?
//కొందరు మూలా గారి కవిత చదివి అడవికి పోయినంత అనుభూతి పొందగలిగేరని తెలుస్తుంది. అంత అద్రుష్టం నా బోటి సామాన్య పాఠకులకి లేదేవోనని నా అభిప్రాయం// అని అనడం మీ సభ్యతేవో !! కానివ్వండి.
రవిశంకర్ గారి కవితలో విస్తరణ దోషముంది. సాగతీత వుంది. మీరన్నట్టు సూపర్ కండక్టివిటీ, రేడియోయాక్టివిటీ గట్రా యేవీ లేవు. మీరుత్తినే ఆపాదించేస్తే సరిపోదు. మీమాటల్లోనే చెప్పాలంటే “కొంచం భావుకత, నాలుగు సున్నితవైన, అందవైన పదాలు కవిత కాలేవని వానపాట ద్వారా రవిశంకర్ గారు నిరూపించారనే నేననుకుంటునాను”
మఠాధిపతులు, పీఠాధిపతులు,ముఠాధిపతులు వీరంగం జేస్తున్న వర్తమాన తెలుగు సాహిత్య ప్రపంచంలో స్వచ్ఛమైన అక్షరం కోసం తపించడం నేరం.భుజకీర్తులు భజనబృందాలు లేకపోవడం లోపం.వాదాలు బూజులు దులుపుకోవడం ద్రోహం.
తనలో మునిగిన
ప్రతీ మామిడి ముక్కకీ
దీక్షగా కారపు ఘుమఘుమల నూనె
ఒక రుచినిస్తోంది
చూడ్డానికి ఒకేలా ఉన్నా
దేని రుచి దానిదే!
_______________________
ఏ ఊరి ఆవకాయని చూసినా
ఆ ఘుమఘుమలు
నా ఆకలిలో ప్రతిఫలిస్తున్నాయి
కొన్నాళ్ళకి నేను
ఆవకాయి వేయడం మొదలు పెట్టాను
______________________
ఒకరితో
నిమిత్తం లేదు
ఆవకాయ పెడతారు
ఖాళీ అయ్యాక కడిగేస్తారు
మా మంచి బామ్మలు.
********************************
అయ్యా! సరదగా నేను వ్రాసినా అందులో ఉద్దేశ్యం కనిపెట్టలేనివారు కాదు. ఈ ఆవకాయ కవితలా మాత్రం కవితలు ఉండకూడదన్నదే కృష్ణ గారు చెబుతున్నారు. కాస్త నిదానించి అర్ధం చేసుకోండి.
కొత్త విషయమో లేక కొత్తగానో చెప్పమని అడిగితే ఎక్కడ చూశారో చూపండీ అంటుంటే నవ్వు వస్తోంది. ఏనాడో రామాయణం నుంచి ఈ మధ్య నాటి ఎంకి పాటలు.. దాక ఎన్ని వేల సార్లు అడవి నీటిపై కిరణాలు ప్రతిఫలించడం ఎన్ని వేల రకాలుగా మనం చదవలేదు? అవేవీ ఎవరూ చదవలేదా ఏమిటి కొంపదీసి? ఎన్నో ప్రబంధ కావ్యాలున్నయి కదా.. వాటి నిండా ఈ గొడవే కదా (నాకు అవి నచ్చాయి అన్నది వేరే విషయం!) కొత్తగా కూడా ఎంతో మంది భావకులు వచనంలోనే ఎంతో అందంగా ఈ విషయాన్నే కొత్తగా చెప్పారు.
శాస్త్ర పరిఙ్ఞానం గురించి నేను మాట్లాడటం సరికాదు, కానీ ప్రాచీనత మీద మీరిచ్చిన లింకుల్లో వున్నటువంటి కుమారి. సంయుక్త కూనయ్య వ్యాసం చదివిన తర్వాత, ఆ వ్యాసంలో ఏ మాత్రం కనపడని వొక శాస్త్రీయ పద్దతి, పరిశీలనా గమనించాక, వో మని వుషారొచ్చి మనం కూడా మనకున్న మిడిమిడి ఙ్ఞానంతో, శాస్త్రీయ పరిశీలన, పరిశోధనా పద్దతులతో సంబంధం లేకుండా ఏదో వొకటి వ్రాసి పడేస్తే పోలా అనుకుని ఇది వ్రాస్తున్నాను.
కుమారి సంయుక్తా కూనయ్య గారు మొత్తానికి కమకూరు కి సుమేరుకి పెద్ద లంకే పెట్టేరు. అంతటితో వొదిలెయ్యకుండా గాజుల బలిజల్ని బైబిల్ కి ఎక్కించేసేరు. పెన్నా నదికి హీబ్రూ భాషకి లంకెపెట్టేసేరు. తెలుగు భాషా, తెలుగు జాతికి కొంచం మాత్రవే తెగులెక్కించారు. ఆ తెగులుని ఇంకోంచం పెంచే ప్రయత్నవే ఇది.
ఈ మద్య బ్రిటీష్ మ్యుజియం లో అక్కాడియన్ కాలంనాటి నగ వొకటి చూడటం తటస్తించింది. ఆ నగ అక్కాడియన్ 2250బి.సి, ఉర్ లోని పి.జి 559 సమాధి నుంచి. మన దక్షణ భారతదేశంలో వివాహవైన అందరి హిందూ ఆడవాళ్ళ మెడల్లో కనిపించేదే అది, మంగళ సూత్రం బొట్టు. దీని ఆధారంగా సుమేరు, మెసపుటోనియా నాగరికతల ఆనవాళ్ళు మన దక్షిన భారతంలోనే వున్నయని నేను ప్రకటిస్తే, పి. హెచ. డి విద్యార్థి సంయుక్త గారు వ్రాసిన పేపర్ “తెల్‌మున్ భాష తెలుగు” కంటే బలవైన ఆధారాన్నే చూపించిన వాడినౌతానేవో.
కుమారి సంయుక్తగారు మరో ముఖ్య విషయం మరచిపోయేరు, నెల్లూరు జిల్లాలో బహుళంగా కనిపించే యానాదుల జాతి గురించి వ్రాయడం. వీరిలో అక్కడక్కడా కనిపించే నీగ్రోయిడ్ పోలికల్ని బట్టీ, యానాదులు అనగా అనాదులు అనగా ప్రాచీనులు, మొట్ట మొదటి మనుషులు అని వాదించి అసలు మానవ జాతికి జన్మస్థానం నెల్లూరు జిల్లానే అని మరొక వాదాన్ని కుమారి గారికంటే, అందరి కంటే ముందు నేనే తీసుకొస్తున్నందుకు చాలా ఆనందిస్తునాను. ఈ క్రొత్త సిద్దాంతం నాచే కనుగొనబడిందని, మరొకరు దీన్ని వాడుకోదలచుకుంటే నా పేరు మాత్రం చెప్పొద్దని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇదిచూసి కోస్తా కాదు అసలు మొదటి మనిషి సంచరించింది మా తెలంగాణాలో అని, మా రతనాల సీమలో అని కొట్లాడుకోకుండా మనందరం మన గొప్పని డప్పు కొట్టటంలో మొదటి మనుషుల స్థాయిని దాటలేదేవోనని మనవి చేసుకుంటున్నాను.
రచయితలకు సూచనలు గురించి apchowdary గారి అభిప్రాయం:
09/19/2007 9:11 am
ఈ మాట పత్రిక బాగున్నది. ఇందులోని కథలు కూడా బాగున్నవి. ఇందులో మీ మాటలూ బాగున్నాయి.
This site is excellent! keep up the good work!
apchowdary
Hyderabad
అరణ్య కవితలు గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:
09/19/2007 5:10 am
గుడి గంటలు
మౌనంలోకి జారుకుంటాయి
చంద్ర కిరణాలు
కోనేటిని చేరుకుంటాయి
చిరుగాలి సైతం అలసిపోతుంది
ఆకుల శబ్దం ఆగిపోతుంది
వెన్నెలని నిండా కప్పుకుని
గన్నేరు చెట్టు నిద్రపోతుంది
గాయాలన్నీ మానిపోతాయి
సమస్యలన్నీ సమసిపోతాయి
నక్షత్రాల్లా మెరిసిపోతూ
అక్షరాలొక్కటే మిగిలిపోతాయి!
అరణ్య కవితల్ని తెగిడినవాళ్ళకీ, పొగిడినవాళ్ళకీ, పేరడీలు రాసినవాళ్ళకీ అందరికీ కృతజ్ఞతలు.ఇక ఈ చర్చని, వాదనల్ని ఇంతటితో ఆపేస్తే బావుంటుందని నా అభిప్రాయం. లేదు ఇంకా లాగీ, పీకుతామంటే మీ ఇష్టం.
అరణ్య కవితలు గురించి Alok గారి అభిప్రాయం:
09/19/2007 4:04 am
అయ్యా తిమ్మిరెడ్డిగారు…అసలు విషయాని మీరిట్టా బమ్మిని చెయ్యడం సమయోచితంగాలేదు. మీలెక్కన రారా, చేరా వగైరాల్ని తోసవతల పారేద్దాం. ప్రతి దద్దమ్మనీ కవిత్వం గురించి రాసేయమనేద్దాం. కత్తెర పట్టుకొన్నాడుగదాని దర్జీని కూడా ఆపరేషను ధియేటర్లోకి వొదిలేద్దాం.
పాఠకుడిగా విఫలమైన క్రిష్న గారు విమర్శకుడిగా అవతరించడంతోనే సిసలైన అసంబద్ధత బయలుదేరింది. సదరు అసంబద్ధత మాబాదిగ గారితో పరుగులెట్టడం మొదలెట్టింది. చివరకు క్రిష్నగారు ఆవకాయ గురించి అనర్గళంగా ప్రసంగించడంతో శిఖరాగ్రం చేరింది. హమ్మయ్య అక్కడితో అసంబద్ధం శాంతించిందని సంతోషించేలోగా మీతో మళ్ళీ మొదలైంది. ఈ విపరీత అసంబద్ధత ముందు మీరు నాకు ఆపాదించిన “అసభ్యత” యేపాటి?
//కొందరు మూలా గారి కవిత చదివి అడవికి పోయినంత అనుభూతి పొందగలిగేరని తెలుస్తుంది. అంత అద్రుష్టం నా బోటి సామాన్య పాఠకులకి లేదేవోనని నా అభిప్రాయం// అని అనడం మీ సభ్యతేవో !! కానివ్వండి.
రవిశంకర్ గారి కవితలో విస్తరణ దోషముంది. సాగతీత వుంది. మీరన్నట్టు సూపర్ కండక్టివిటీ, రేడియోయాక్టివిటీ గట్రా యేవీ లేవు. మీరుత్తినే ఆపాదించేస్తే సరిపోదు. మీమాటల్లోనే చెప్పాలంటే “కొంచం భావుకత, నాలుగు సున్నితవైన, అందవైన పదాలు కవిత కాలేవని వానపాట ద్వారా రవిశంకర్ గారు నిరూపించారనే నేననుకుంటునాను”
మఠాధిపతులు, పీఠాధిపతులు,ముఠాధిపతులు వీరంగం జేస్తున్న వర్తమాన తెలుగు సాహిత్య ప్రపంచంలో స్వచ్ఛమైన అక్షరం కోసం తపించడం నేరం.భుజకీర్తులు భజనబృందాలు లేకపోవడం లోపం.వాదాలు బూజులు దులుపుకోవడం ద్రోహం.
అరణ్య కవితలు గురించి chavakiran గారి అభిప్రాయం:
09/19/2007 2:01 am
సిగ్గు లేకుండా చెప్తున్నా
ఈ ఆవకాయ కవిత కూడా బాగుంది, నోరూరుతుంది.
కీబోర్డ్ మీద రాగాలు గురించి Ram Durvasula గారి అభిప్రాయం:
09/18/2007 7:28 pm
సంగీత జ్ణానం, స్వర పరిచయం అసలేమీ లేనివారికి కూడా…సులభ పద్ధతిలో కీబోర్డు మీద రాగాలు పలికించేందుకు మీరు చేసిన ప్రయత్నం అమోఘం.
అరణ్య కవితలు గురించి సరదా సుబ్బారావు గారి అభిప్రాయం:
09/18/2007 6:06 pm
ఎంత ఆకలేసి
దిక్కులంతా కలియతిరిగినా
ఎట్టకేలకు ఆవకాయ జాడీ
ఆకలితో మరొక సారి
అలమటించాలనుంది
_____________
చిక్కనైన కమ్మనైన ఆవకాయ జాడీ
పిండిలో దూరి
కారంతో మమేకమై
కమ్మని నూనె తమని
ముద్దాడుతుంటే
పుల్ల్లనైన
ఆవకాయ
ముక్కలన్నీ
నోరూరిస్తూ…
_________________
తనలో మునిగిన
ప్రతీ మామిడి ముక్కకీ
దీక్షగా కారపు ఘుమఘుమల నూనె
ఒక రుచినిస్తోంది
చూడ్డానికి ఒకేలా ఉన్నా
దేని రుచి దానిదే!
_______________________
ఏ ఊరి ఆవకాయని చూసినా
ఆ ఘుమఘుమలు
నా ఆకలిలో ప్రతిఫలిస్తున్నాయి
కొన్నాళ్ళకి నేను
ఆవకాయి వేయడం మొదలు పెట్టాను
______________________
ఒకరితో
నిమిత్తం లేదు
ఆవకాయ పెడతారు
ఖాళీ అయ్యాక కడిగేస్తారు
మా మంచి బామ్మలు.
********************************
అయ్యా! సరదగా నేను వ్రాసినా అందులో ఉద్దేశ్యం కనిపెట్టలేనివారు కాదు. ఈ ఆవకాయ కవితలా మాత్రం కవితలు ఉండకూడదన్నదే కృష్ణ గారు చెబుతున్నారు. కాస్త నిదానించి అర్ధం చేసుకోండి.
కొత్త విషయమో లేక కొత్తగానో చెప్పమని అడిగితే ఎక్కడ చూశారో చూపండీ అంటుంటే నవ్వు వస్తోంది. ఏనాడో రామాయణం నుంచి ఈ మధ్య నాటి ఎంకి పాటలు.. దాక ఎన్ని వేల సార్లు అడవి నీటిపై కిరణాలు ప్రతిఫలించడం ఎన్ని వేల రకాలుగా మనం చదవలేదు? అవేవీ ఎవరూ చదవలేదా ఏమిటి కొంపదీసి? ఎన్నో ప్రబంధ కావ్యాలున్నయి కదా.. వాటి నిండా ఈ గొడవే కదా (నాకు అవి నచ్చాయి అన్నది వేరే విషయం!) కొత్తగా కూడా ఎంతో మంది భావకులు వచనంలోనే ఎంతో అందంగా ఈ విషయాన్నే కొత్తగా చెప్పారు.
ప్రాచీనత గురించే మరోసారి! గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
09/18/2007 1:43 pm
శాస్త్ర పరిఙ్ఞానం గురించి నేను మాట్లాడటం సరికాదు, కానీ ప్రాచీనత మీద మీరిచ్చిన లింకుల్లో వున్నటువంటి కుమారి. సంయుక్త కూనయ్య వ్యాసం చదివిన తర్వాత, ఆ వ్యాసంలో ఏ మాత్రం కనపడని వొక శాస్త్రీయ పద్దతి, పరిశీలనా గమనించాక, వో మని వుషారొచ్చి మనం కూడా మనకున్న మిడిమిడి ఙ్ఞానంతో, శాస్త్రీయ పరిశీలన, పరిశోధనా పద్దతులతో సంబంధం లేకుండా ఏదో వొకటి వ్రాసి పడేస్తే పోలా అనుకుని ఇది వ్రాస్తున్నాను.
కుమారి సంయుక్తా కూనయ్య గారు మొత్తానికి కమకూరు కి సుమేరుకి పెద్ద లంకే పెట్టేరు. అంతటితో వొదిలెయ్యకుండా గాజుల బలిజల్ని బైబిల్ కి ఎక్కించేసేరు. పెన్నా నదికి హీబ్రూ భాషకి లంకెపెట్టేసేరు. తెలుగు భాషా, తెలుగు జాతికి కొంచం మాత్రవే తెగులెక్కించారు. ఆ తెగులుని ఇంకోంచం పెంచే ప్రయత్నవే ఇది.
ఈ మద్య బ్రిటీష్ మ్యుజియం లో అక్కాడియన్ కాలంనాటి నగ వొకటి చూడటం తటస్తించింది. ఆ నగ అక్కాడియన్ 2250బి.సి, ఉర్ లోని పి.జి 559 సమాధి నుంచి. మన దక్షణ భారతదేశంలో వివాహవైన అందరి హిందూ ఆడవాళ్ళ మెడల్లో కనిపించేదే అది, మంగళ సూత్రం బొట్టు. దీని ఆధారంగా సుమేరు, మెసపుటోనియా నాగరికతల ఆనవాళ్ళు మన దక్షిన భారతంలోనే వున్నయని నేను ప్రకటిస్తే, పి. హెచ. డి విద్యార్థి సంయుక్త గారు వ్రాసిన పేపర్ “తెల్‌మున్ భాష తెలుగు” కంటే బలవైన ఆధారాన్నే చూపించిన వాడినౌతానేవో.
కుమారి సంయుక్తగారు మరో ముఖ్య విషయం మరచిపోయేరు, నెల్లూరు జిల్లాలో బహుళంగా కనిపించే యానాదుల జాతి గురించి వ్రాయడం. వీరిలో అక్కడక్కడా కనిపించే నీగ్రోయిడ్ పోలికల్ని బట్టీ, యానాదులు అనగా అనాదులు అనగా ప్రాచీనులు, మొట్ట మొదటి మనుషులు అని వాదించి అసలు మానవ జాతికి జన్మస్థానం నెల్లూరు జిల్లానే అని మరొక వాదాన్ని కుమారి గారికంటే, అందరి కంటే ముందు నేనే తీసుకొస్తున్నందుకు చాలా ఆనందిస్తునాను. ఈ క్రొత్త సిద్దాంతం నాచే కనుగొనబడిందని, మరొకరు దీన్ని వాడుకోదలచుకుంటే నా పేరు మాత్రం చెప్పొద్దని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇదిచూసి కోస్తా కాదు అసలు మొదటి మనిషి సంచరించింది మా తెలంగాణాలో అని, మా రతనాల సీమలో అని కొట్లాడుకోకుండా మనందరం మన గొప్పని డప్పు కొట్టటంలో మొదటి మనుషుల స్థాయిని దాటలేదేవోనని మనవి చేసుకుంటున్నాను.
నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి swarupkrishna గారి అభిప్రాయం:
09/18/2007 4:14 am
చాలా బాగుంది. విషయాన్ని చక్కగా విశ్లేషించారు. పెద్దన కవితలోని పెద్దతనం ఇదే కాబోలు.
స్వరూప కృష్ణ
రచయితలకు సూచనలు గురించి swarupkrishna గారి అభిప్రాయం:
09/18/2007 4:01 am
ధన్యవాదాలు.
తెలుగులో ఒక మంచి పత్రికను అందించినందుకు అభినందనలు. కన్యాశుల్కం ప్రత్యేక సంచిక బాగుంది.
నమస్కారములతో
స్వరూప కృష్ణ
వాన-పాట గురించి Sivasankar గారి అభిప్రాయం:
09/18/2007 1:16 am
రవి శంకర్ గారు,
మీ కవిత చాలా బాగుంది.
రాధా విరహం లా అనిపించింది.
కృష్ణుడి పాటలకి/రాక కోసం ఆమె విలపించినట్టు ఉంది.
శివ