Comment navigation


15548

« 1 ... 1450 1451 1452 1453 1454 ... 1555 »

  1. న త్వం శోచితుమర్హసి గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    09/28/2007 2:41 pm

    రానారె గారు,
    చిత్తశుద్ధితో చేసిన సూచనలను సహృదయంతో ,ఔదార్యం తో స్వీకరించిన మీ దొడ్డ మనసుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
    కరుణ రసం మీ స్వభావానికి, మీ రచనాపాటవానికి తగిన creative channel గా నేను భావిస్తున్నాను.వాస్తవానికి కరుణ ను మించిన రసం వేరొకటి లేదు.
    రచయితగా మీకు ఉజ్జ్వలమైన భవిష్యత్తు నిస్సందేహంగా ఉంది.

    అభినందనలతో
    C.S.Rao

  2. లింఫోమా – ఒక ‘నిసి షామల్’ కథ గురించి Padmaja గారి అభిప్రాయం:

    09/28/2007 8:56 am

    Fabulous. Nisi Shamal is flawless. Can’t wait to read more about her.
    Thank you so much.

  3. కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే … గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    09/27/2007 8:33 pm

    వేలూరి గారూ, మన దేశంలో అధునికత బ్రిటీష్ వారి రాకతోనే మొదలైందని కోందరు, రాకకు మునుపే పదహారవ శతాబ్దంలోనే మొదలైందని, పలాని వాళ్ళెవరో వారి పరిశోధనల ద్వారా మనకి తెలియ చెప్పడానికి ప్రయత్నిస్తునారని మీరు చెప్పేరు. అధునికత వలస పాలనతోనో, పదహారవ శతాబ్ధంలోనో మొదలు కావటవేవిటండి. పోనీ ఆ పలాని అధునికతకి మీరేవైనా నిర్వచనం చెప్పేరా అంటే అదేంలేదు. మానవ జీవన విధానంలో అభివృధ్ధి, అధునికత వొక విడదీయలేని విషయం. అభివృద్ధి, అధునికత అనేవి రెండు ఒకే నాణానికి వున్న రెండు ముఖాల లాంటివి. ఇవి రెండూ కూడా కాలంతో పాటూ మారేవే, ముందుకు సాగేవే, అప్పుడప్పుడూ కోచేం డిప్ ఐనా. జీవనంలో (బయలోజికల్ లైఫ్ లో), జీవన విధానంలో అభివృధ్ధి ఒక అంతర్భాగం. ఆ అభువృధ్ధితో వచ్చే అధునికత ఒక continuous process. ఐతే వొక సమాజానికి సహజవైన ఈ అభివృధ్ధి, జీవన విధానంలో అధునికత, బయట శక్తుల వల్ల కూడా మార్పుకి లోనవుతాయ్. అది సముద్రాలవతల నుంచి వచ్చిన వలస పరిపాలన కావొచ్చు, సముద్రాలకివతలనుంచే వచ్చిన ఇస్లాం పాలన కావొచ్చు, పొరుగు హిందూ రాజ్యాలతో కలహాలు, విజయాలూ, అపజయాలు, లక్షా సవాలక్ష కారణాల్లో అన్నీ కావొచ్చు, ఏ వైనా కావొచ్చు.

    సమాజం అనేది వొక ఓపెన్ సిస్టమ్ లాంటిది. సమాజం లోపలి ఆటుపోట్లతో పాటు, సమాజం బయట ఆటుపోట్లు కూడా సమాజస్థితిని, గతిని నిర్దేశిస్తాయ్. సంస్కృతి, సాహిత్యం అనేవి సమాజం యొక్క అట్రిబ్యూట్స్ ఐనప్పుడు అవికూడా సమాజంతో పాటూ మార్పు చెందటం సహజం కదా. ఐతే ఏవిటీ మార్పు, వొక సాపేక్షంగా నిశ్చలవైనటువంటి సాంప్రదాయ సమాజంలో, ఈ కనిపించీ, కొన్నిసార్లు కనిపించని (cause is separated in time and space from the effect) శక్తులు సృష్టించేటువంటి అనిశ్చల స్థితి. Some times this change in society’s status may be temporary, some times the society may change and move into a state that is relatively different. అంటే ఏవిటి సాంప్రదాయ సమాజం, తన పాత సాంప్రదాయాన్ని, విదిలించుకోని, వదిలించుకోని, వొక క్రొత్త సాంప్రదాయం నెలకోల్పుతుందనమాట. ఈ క్రొత్త సాంప్రదాయ సృష్టికి, సమాజం బయటనుంచి వచ్చే శక్తులే కాణంకాదు, సమాజంలో వున్నటువంటి అంతర్గత శక్తులు కూడా పాత సాంప్రదాయాన్ని మార్చి క్రొత్త సాంప్రదాయాన్ని సృష్టించగలవు. అంటే అధునికత అనేది, పాత సాంప్రదాయాన్ని పాక్షికంగానో, సంపూర్ణంగానో మార్చి వొక అధునిక సాంప్రదాయాన్ని సృష్టించటం.

    “వాడికి పూర్వమే అధునికత ఉన్నది” అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈ ప్రక్రియ పదహారు, పదిహేడు శతాబ్ధాలనుంచి, వొక్క ఆంద్రదేశంలోనే కాదు, మానవ సమాజపు పుట్టుకనుంచి ఈ విధంగానే సాగుతుందని చెప్పదానికి నూతన పద్దతుల్లో పరిశోధనలవసరం లేదు.

    “వలస రాజ్యం తరువాత వచ్చిన అధునికత సాంప్రదాయ విరుద్దం అని చెప్పవచ్చు”, “బ్రితీషు వలస విధానం వలన వచ్చిన అధునికత, చారిత్రకంగా సంప్రదాయంగా వచ్చిన అధినికతని అణగ దొక్కింది” అధునికత అనేదే దేశీయమైన, విదేశీయమైనా సాంప్రదాయాన్ని త్రోసిరాజని క్రొత్త సాంప్రదాయాన్ని సృష్టించడమైనప్పుడు ఈ మాటలకర్థం ఏవిటి? ఆ మారిన సమాజంలో వచ్చిన క్రొత్త సాంప్రదాయంలో వుండే తప్పొప్పులకు బయటిశక్తులను కారణంగా చూపించి, ఆ తప్పులకు ముసుగు కప్పాల్సిన అవసరం లేదు. ఆ తప్పులకు, క్రొత్త సాంప్రదాయంలో పతనమైన విలువలకు, కారణం వలస రాజ్యవైనా, ఆ తప్పులని సంస్కరించుకునే భాద్యత మన సమాజానిదే.

    “అప్పారావుగారు తన నాటకంలో దిగజారిపోతున్న సమాజాన్ని, నైతికంగా పతనమవుతున్న సమాజాన్నీ సమర్పించలేదు. నైతిక వైరుధ్యం సమాజంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా తలయెత్తితే ఆ సమాజం తనకు తానుగా మార్పు తెచ్చుకోగల స్థితిలో ఉన్నది కాని, సాంఘిక సంస్కరణకోసం ఎదురు చూడలేదు.” నిజవేనండీ, ఏ సమాజవైనా తన నడకలో, అప్పుడప్పుడూ ఒకటి రెండడుగులు వెనకకు వయ్యడం సహజవే, ఆ అడుగుల్ని సరిచేసుకోని ముందుకు పోవడం సహజవే. కాకపోతే ఆ సరిచేసుకునే క్రమంలో, సంఘసంస్కరణ, సంఘసంస్కర్తలు అనే అంశాలు కూడా సహజవైనవే. సంఘసంస్కరణ సమాజం తనని తాను సరిచేసుకునే క్రమాన్ని మరింత వేగవంతం చేయడం కోసం, సమాజంకన్నా ఒకటిరెండడుగులు ముందుకు చూడగలిగిన (అన్ని విషయాల్లో కాకపోవచ్చు, అన్ని కాలాల్లో కాకపోవచ్చు) వ్యక్తుల ప్రయత్నం. ఆ సంస్కర్తలు తమకన్నా వొకడుగు వెనకబడిన వాళ్ళని సంస్కరించడానికి, తమకన్నా వొకడుగు ముందరున్న వాళ్ళని వెలివేయడానికి (మిగిలిన చాంధసులలాగానే) చూస్తారు. అప్పారావుగారి సౌజన్యారావు పంతులు ఈ సంస్కర్తలలో వుండే ఈ ద్వందాన్ని చూపించడానికేనని నా అభిప్రాయం. ఐతే వొక్కడుగు ముందుచూపున్న ఈ సంస్కర్తలని మనవీరోజు వాళ్ళకి రెండడుగుల ముందుచూపు లేదని విమర్శ చేయాల్సిన పనిలేదు, అసలు ముందుచూపే లేని సమాజంలో కనీశం ఆ మాత్రంముందుచూపు కలిగిన సంస్కర్తలు ఆ సమాజ మార్పుకి కేటలిస్ట్లాగా ఎంతో ఉపయోగపడ్డారు. అప్పారావు గారికి ఈ విషయం తెలుసుగాబట్టే సౌజన్యారావు పంతులుగారిని సృష్టించారని నా అభిప్రాయం. ఈ వొక్క పాత్ర చిత్రణలోనే అప్పారావు గారు అప్పటి సమాజానికాన్నా ఎంత ముందున్నారో మనకర్థవవుతుంది. లోపాన్ని ఎత్తి చూపించటం సంఘ సంస్కర్తలని తేలికపరచడవో, అగౌరపరచడవో, లేకపోతే ఆ సంఘసంస్కరణని గేలిచేయడవో కాదు.

    “ఈ సమాజం తనపై తనకి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసేటంత వత్తిడి బ్రిటీషు వలస విధానం తెచ్చిపెట్టిన ఉధృతం. ఇందుచేత పైకులాలు తమ ప్రాథమిక యోగ్యతలని మరిచిపోవడం జరిగింది.” అంటే పై కులాలు తమ ప్రాధమిక యోగ్యతలని మరచిపోకపోవడవే మన హిందూ సమాజాన్ని సరిఅయిన దారిలో వుంచుతుందా? అసలు ఏ సమాజం తెచ్చిన వత్తిడి పైకులాల్ని సృష్టించిందో మరి. ఏ వుధృతి, ఏ వత్తిడి సమాజాన్ని కులాలుగా విభజించిందో? ఆ యోగ్యతలని మరచిపోయి దిగజారిన పైకులాల్ని కొంచం పైకి లాగి పూర్తిగా కాకపోయినా కొంచంగానైనా మిగిలిన కులాల సరసన కూర్చోబెట్టింది ఆ వలస పాలన వత్తిడేనేవో.
    నాటకంలో ఏడవ అంకం ఆఖరి రంగాన్ని క్లుప్తంగా వివరించిన తర్వాత, వేలూరిగారు, ఆ అంకంలో మధురవాణి పాత్ర మీద తమ అభిప్రాయాన్ని ఈ విధంగా వివరించారు. “సౌజన్యా రావు కున్న అమాయకత్వపు సంస్కరణాభిలాష దెబ్బతియ్యడానికి మధురవాణి బృహన్నాటకం ఆడుతూ వుండవచ్చు. ఆధునికుడు, పాశ్చాత్య ప్రాభవంలో పెరిగిన పెద్దమనిషి, నీతులు వల్లించే వాడికి గుణపాఠం చెప్పడానికి మధురవాణి వచ్చి వుండవచ్చు. లేదా, కాలం మారుతున్నది; తన దగ్గిరకి గౌరవనీయులైన వాళ్ళెవ్వరూ రారేమో నన్న భయం పుట్టి వుండవచ్చు. — ఏది ఏమో? వీటికి సమాధానం అప్పారావుగారికే తెలియక పోవచ్చు!” ఇన్ని రకాలుగా విశ్లేషించగలిగిన వేలూరిగారు, ఆ అంకాన్ని చదవగానే, మనసుకి తోచే అత్యంత సరళవైన, సహజవైన, నాటకంలో చెప్పిన కారణాన్ని మాత్రం మర్చిపొయ్యారు. వయసు పైబడిన, చేయనినేరానికి శిక్ష పడే అవకాశమున్న, ఆ చెయ్యని నేరం ఆ బాపడి తలమీద పడటంలో తన పాత్ర గురించి తెలిసిన వొక మంచి మనిషిగా లుబ్ధావదాన్లుకి సహాయం చేయడం కోసవే మధురవాణి పంతులుగారింటికి వెళ్ళిందనే విషయం. ఇంత సరళవైన, సహజవైన విషయం వేలూరిగారికి ఎందుకు తట్టలేదో మరి. వెళ్ళిన తర్వాత, పంతులుగారి వెనకనున్న నలుపు, పంతులుగారికి కనిపించకపోతే దాన్ని తెలివిగా ఎత్తిచూపించటం, పంతులుగార్ని అవమానం చెయ్యడానికి కాదని తిరిగి చెప్పల్సిన అవసరం లేదు. వేశ్యని చూడటానికి, మాట్లాడడానికి కూడా విముఖుడైన పంతులు గారు, మధురవాణికి భగవత్ గీతని బహుకరించి, తనతో షేక్ హేండ్ చేయటంలోనే, తన తప్పుని గ్రహించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
    వేలూరిగారు ఇంత అసహజవైన విశ్లేషణ ఎందుకు చేశారో తరువాతి పేరాలో అర్థమవుతుంది. వేలూరిగారి మాటల్లోనే వారి వివరణ ఇలా సాగుతుంది. “ఈ దృష్టితో చదివితే ఒక అంచెలో ( ఈ నాటకాన్ని వేరువేరు అంచెల్లో వ్యాఖ్యానించడానికి తావుంది) వచ్చే ఊహ: మధురవాణి గొంతుతో కందుకూరి వీరేశలింగం పంతులు గారిని, ఆయన చేపట్టిన వేశ్యా సంస్కరణోద్యమాన్నీ వేళాకోళం చేస్తున్నట్టు కనిపిస్తుంది. విషయమేమిటంటే, నాటక రచయిత ముఖ్యోద్దేశం సంఘ సంస్కరణ కాదు ; ఆ సంస్కరణలో నిజమైన సాంఘిక విలువ ఏమీ లేదు. ఈ సంస్కరణ ఘోష కేవలం వలస రాజ్య విధానం వల్ల ఏర్పడ్డ బూటకపు మాయ అని బోధపడుతుంది.” ఇదండీ అప్పారవుగారు కన్యాసుల్కం నాటకం వ్రాయడంలో ఉద్దేశం, వీరేశలింగం పంతులుగారిని వేళాకోళం చేయడానికే. అప్పారవుగారి ఉద్దేశం సంఘసంస్కరణ కాదట, సంఘంలో వుండే నీచ సాంప్రదాయాల్ని పైకెత్తి చూపించడం సంస్కరణాకాంక్ష కాక మరేవిటో. ఆ సంస్కరణలో నిజవైన సాంఘీక విలువ లేదుట. ఏ సంస్కరణలో వేలూరి గారూ? తెలిసీ తెలియని లేత వయసులోనే ఆడ కూతుళ్ళని, చావుకి జానెడు దూరంలో వున్న ముసలాళ్ళకిచ్చి కట్టబెట్టటలో వున్న నీచత్వాన్ని చూపించడంలోనా? లేకపోతే, పరిష్కారం చూపించకుండానే, మూర్ఖంగా మరికొందరాడ కూతుళ్ళని పొగపెట్టి తరివెయ్యడం అనే సంస్కరణలో వుండే మూఢత్వాన్ని బహిర్గతం చెయ్యటంలోనా? మీకు దేంట్లో సంఘసంస్కరణాభిలాష కనపళ్ళేదు సార్.

    ఈ అసహజ విశ్లేషణ తర్వాతి కొద్ది పేరాల్లో అబద్దాల జాతరగా పరిణితి చెందుతుంది. “నాటకంలో ఈ పెళ్ళి గురించి నలుగురికీ తెలియగానే, ఆ ఊళ్ళో అన్ని కులాలవాళ్ళూ ఒకే తాటిమీద నిలబడి ఆ పెళ్ళి జరక్కుండా చెయ్యడానికి పూనుకుంటారు. పూజారి, పోలీసు, సేవకులు, స్కూలు పిల్లడు, పెళ్ళికొడుకు కూతురు (మీనాక్షి) అంతా ఈ పెళ్ళి కుదిర్చిన జిత్తులమారి రామప్పంతులునీ, పెళ్ళికొడుకుని మూర్ఖులుగా బయట పెడతారు. అప్పటి సమాజం నిజంగా ఇటువంటి పెళ్ళికి వ్యతిరేకి అని కనిపిస్తూఉంటే, సంస్కరణ ఏమిటి? ఎవరో, సౌజన్యారావు లాంటి అమాయకులు, సమాజం కుళ్ళిపోయిందని భ్రమించి, ఆ భ్రమని నమ్మి, సంస్కరించేద్దామన్న కుతూహలంతప్ప?”

    మీరే కన్యాశుల్కాన్ని విశ్లేషిస్తున్నరో అని అనుమానంగా వుంది వేలూరి గారు. గురజాడ గారి కన్యాశుల్కంలో మీరు మీ మనసులో ఏఏ మార్పులు చేసుకున్నారో, ఏఏ చేర్పులు చేసుకునారో! నే చదివిన కన్యాశుల్కంలో, పెళ్ళీ ఆపడం కోసం బావిలో దూకి ప్రాణం తీసుకోడానికి సిద్ద పడిన సుబ్బి అమ్మ, మేన కోడలు బతుకు బండలై పోకుండా వుండాలని కరటక శాస్త్రి, చెల్లెలి బతుకు తన బతుకులా నాశనవై పోకూడదని లేచిపోవడానికి తెగించిన బుచ్చమ్మ, కరటక శాస్త్రితో వున్న పరిచయంతో, తోటి మనిషికి తనవంతు సహాయం చెయ్యడానికోచ్చిన మధురవాణి, తెలొసో తెలియకో కరటక శాస్త్రి చెప్పేడు కాబట్టి శిష్యుడు మహేశం తప్ప సుబ్బి బాగు కోసం పెళ్ళి అపాలనుకున్న వాళ్ళు మరెవరూ నాకు కనపడలేదు సార్. తన సౌభాగ్యం ఎంత బాగుందో ప్రత్యక్షంగా అనుభవిస్తున్న మీనాక్షి కూడా పెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేసిందని చెప్పలేం ( తన పరిస్థితిలో తన పరిధికి మించిన విషయమే కాదనలేం).

    ఇంతకాలం ఈ నాటకాన్ని విమర్శకులు సరిగా అర్థం చేసుకోలేక పోయారట, పసిపిల్లకి వైధవ్యాన్ని తెచ్చిపెట్టే సంస్కృతి, కుళ్ళిపోఇందని భ్రమ పడ్డారట, ఈ పరిస్థితిని సంస్కరణల ద్వార మార్చాలని ఈ నాటకం భోధిస్తున్నదని ఆపోహ పడ్డారట. ఈ ఆపోహకి వేల్చేరు నారాయణరావు గారు నాలుగు కారణాలిచ్చారట. వేల్చేరు గారి కారణాలేవో నేను చదవలేదు, అందుకని వారి కారణాల గురించి నేను మాట్లాడటం పద్దతికాదు.

    ఏ వలస సమాజపు విలువలు, మరే మత విలువలతోనూ సరి చూసుకోనవసరం లేకుండానే, చిన్న పిల్లలని అమ్ముకునే సమాజపు విలువలు అతి నీచవైనవని చెప్పోచ్చు. ఐతే ఆ నిజాన్ని త్రొక్కి పట్టడానికి, పద్దెనిమిది, పంతొమ్మిదో శతాబ్దపు బ్రాహ్మణవర్గ సమాజాన్ని పైకెత్తటానికే కన్యాశుల్కానికి, ఈ అసంబద్దవైన, అసహజవైన, అశాస్త్రియవైన విశ్లేషణల అవసరంపడిందని నా అభిప్రాయం.

    ఈ వ్యాసానికి ఆలంబనలుగా పలు రెఫరెన్సులు, ఆ తర్వాత అనుభంధంలో పలువురి అభిప్రాయాలు ఇవ్వడం జరిగింది. ఐతే ఇక్కడొక్క విషయం చెప్పదలుచుకున్నను. ఈ నాటకవేవీ అతి క్లిష్టవైన scientific concept కాదు. ముందు వెనుకల చరిత్ర పఠనం, క్రొత్త పరిశోధనా పద్దతులు, కనీసం పాత పరిశోధనా పద్దతులు, గతితార్కిక భౌతికవాదం, మాక్సిస్టు వివరణలు, హైజాకులు, ఇవేవీ అవసరం లేకుండానే గురజాడ వారు ఏంచెప్పేరో, ఎందుకు చెప్పేరో, ఏ తప్పుల్ని హైలైట్ చేయదలుచుకున్నరో, ఏ వాస్తవాల్ని, ఏ మూఢత్వాల్ని, ఏ నీచాల్ని, ఏ అవినీతిని, మనుషుల్లో వుండే ఏ మంచి చెడుల్ని, మంచి మనుషులనబడే వాళ్ళలో ఏ చెడ్డని, చెడ్డవాళ్ళనబడే వాళ్ళలో ఏ మంచిని, ఆ కాలపు సంఘానికి తలమానికవనబడే కులంలో కనపడే నీచ సాంప్రదాయాల్ని, అతి సళంగా, అతి మెలుకువగా, ఎక్కడా ఏ విమర్శకుల, విశ్లేషకుల అవసరంలేకుండా, అతి సామాన్య పాఠకుడికి సైతం అర్థవయ్యేరీతిలో చెప్పేరు. ఈ నాటకంలో, అక్షరంలో కనపడని వివరణలకోసం, విశ్లేషణలు చేయడవంటే, చురుక్కుమనే నిజవేదో కన్యాశుల్కంలో మనకి తగిలిందనమాట.

  4. న త్వం శోచితుమర్హసి గురించి రానారె గారి అభిప్రాయం:

    09/27/2007 10:40 am

    సీ.యస్‌.రావుగారికి, మీ సూచనలు చాలా ముఖ్యమైనవి. ఇవే సూచనలను ఈ కథ ప్రచురింపబడే ముందు కొందరు పెద్దలు ఇచ్చియున్నారు. కానీ వాటిలోని క్లుప్తత, వారుపయోగించిన భాష వలన అవి నాకు ఎంతమాత్రమూ రుచించలేదు. మీ వ్యాఖ్యలో ముఖ్యంగా “మెసేజ్ లేదా ప్రబోధం – సాహిత్యప్రక్రియ కలిగించే రసానుభూతి లో అంతర్లీనమై పాఠకుడి ఉపచైతన్య స్థితి లోకి లేదా చైతన్యస్థితి లోకి మెల్లగా ప్రవేశించాలి.” అన్న మాటలను శిరసావహిస్తున్నాను. మీకు ధన్యవాదాలు.

    దిలీప్, మీరు మీ నేపథ్యానికి సంబంధించిన అనుభవాలతో మంచి రచనలు చేయగలరు. ప్రయత్నించి చూడండి.

  5. ఒంటరి విహంగం గురించి aanDaalu గారి అభిప్రాయం:

    09/27/2007 6:36 am

    నేను కూడా సుజాత గారి తో ఏకీభవిస్తున్నాను. ఇదే ఆడవాళ్ళైతే ఈ సలహా ఇచ్చేవారా రెండో పెళ్ళి చేసుకొమ్మని??
    మగవాడు కాబట్టి ముసలివాడైనా పెళ్ళి చేసుకోవచ్చు అంతేగా!

  6. కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే … గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:

    09/27/2007 3:04 am

    కామేశ్వర్రావుగారి వ్యాఖ్య బావుంది.
    కానీ మేస్టారూ, గురజాడ వీరేశలింగం పంతులుకి గౌరవమిస్తూనే తనకి నచ్చని వాటిని బాగానే ఎగతాళి చేశారు – గురజాడ రాసిన సాహిత్య వ్యాసాల్లో ఒకటి పూర్తిగా వీరేశలింగం రచనల్ని విమర్శించేందుకే. ఆయన విమర్శించడం మొదలు పెడితే, వీరేశలింగం అంటే ఎంత గురుభావం ఉన్నా, ఇక ఆ వ్యంగ్యానికి అంతు లేదు. ఈ వ్యాసం విశాలాంధ్ర వారు ప్రకటించిన గురజాడ సర్వసంలో ఒక సంపుటిలో ఉంది. రాజాస్థానంలో ఉన్న గురజాడ యాంటీనాచ్ ఉద్యమాన్ని ఆమోదించక పోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. గురజాడ తరవాతి తరం వాడైన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, పంతులు గారిని దేవుడీ మరో అవతారంగానే భావించేవారు, ఈ వేశ్యా వ్యతిరేకత విషయంలో తప్ప.

  7. “తండ్రి” తనం గురించి purnima గారి అభిప్రాయం:

    09/27/2007 2:10 am

    చాలా బాగుంది కథ . . మూర్ఖంగా తమ అభిప్రాయాలను పిల్లల మీద చూపించె తల్లితంద్రులకి ఇది ఉదాహరణ

  8. అరణ్య కవితలు గురించి Sivasankar గారి అభిప్రాయం:

    09/26/2007 1:12 am

    ఒక్కో మనిషి ఒక్కో రకముగా ఆలోచిస్తారు, వాళ్ళ వాళ్ళ పరిస్తితులను బట్టి వాళ్ళ మనసు స్పందిస్తూ ఉంటుంది.
    ప్రపంచము లొ దేనికీ ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు గాని కొలతలు గాని లేవు,యేదీ తప్పు కాదు యేదీ ఒప్పు కాదు.
    అలాగే కవిత్వం కూడాను, మనస్సు లోని భావాలకు అక్షరాలు జత కూర్చి చెప్పినదే కవిత్వం.
    సుబ్బు గారి కవిత్వం చాలా బాగుంది.

  9. వాన-పాట గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    09/25/2007 8:29 pm

    వానా, పాటా రెండూ ఆనందాన్నిచ్చేవే! అప్పుడప్పుడూ రెండూ బాధపెట్టేవే కూడానూ. అలాటి వాన గురించి, పాట గురించి, వానలాంటి పాట గురించీ చెప్పే కవిత…ఎంత బావుంది!
    ఒక్క వానగురించో, లేదా పాట గురించో మాత్రమే కవిత రాస్తే, అందులో ఎన్ని అందమైన, కొత్తవైన పదచిత్రాలున్నా, అది ఒక స్థాయిలో ఆగిపోతుంది. ఈ రెంటినీ పెనవేసి చెప్పడం ఒక గొప్ప కవితకి ఉండే లోతును కలిగించింది.
    వాన ఒక ప్రాకృతిక సంఘటన. పాట, మనిషి లోంచి పుట్టుకొచేది. కాబట్టి అవి కలిగించే అనుభూతిలో కొంత తేడా ఉంటుంది. పాట కలిగించే అనుభూతి మరి కొంత గాఢమైనదీ, మరికొంత ఎక్కువ కాలం నిలిచేదీనూ. అదే ఈ కవితలో మనకి కనిపించేది. ఇది మనసుకి హత్తుకోవాలంటే, కేవలం పాటని వానతో పోల్చే symbolism సరిపోదు. వానని వర్ణించి పాటగురించి కూడా ఇలాగే ఊహించుకోమని పాఠకులకి వదిలేస్తే, ఆ అనుభూతిలోని తారతమ్యం పాఠకులకి అందదు. అందికే ఈ కవిత “నీ పాట కూడా అంతే.” అన్న వాక్యంతో ఆగిపోదు. వానగా మొదలై పాటగా మిగిలిపోతుంది.
    ఇక శిల్పదృష్టితో చూస్తే:
    మొదటి చరణం ప్రాతిపదిక.
    రెండవ చరణంలో ప్రధానంగా కనిపించేది వాన. వాన ద్వారా పాట గురించిన ఊహ.
    మూడవ చరణంలో వాన-పాట సమాంతరంగా అవి కలిగించే అనుభూతుల చిత్రణ-సాదృశ్యం.
    నాల్గవ చరణంలో చివరకి మిగిలిపోయేది పాట.
    వానా, పాటా రెండు చిత్రాలైతే. మొదట వాన మీద focus చేసిన లైటు, క్రమేపీ, పాటమీదకి మారడం ఈ కవితలో శిల్పం సాధించిన విశేషం.
    ఈ కవిత నిజానికి ఆ పాట గురించే!

  10. సాయము శాయరా డింభకా! గురించి రాకేశ్వర గారి అభిప్రాయం:

    09/25/2007 7:14 am

    బాగుందండి, మిషిగన్ లో దేశీ పిల్లగాలి.

« 1 ... 1450 1451 1452 1453 1454 ... 1555 »