ఈ రోజుల్లో పుస్తకాలు చదవడమే తగ్గిపోయింది. తెలుగూ అంతే. మా కొలీగ్ ఒకమ్మాయికి నేను ఎవరి గురించో “మితభాషి” అంటే అదేమిటో అర్థం కాలేదు! ఈ పరిస్థితుల్లో క్లాసిక్స్ చదవడం మరీ అరుదైన విషయం. నా లెక్కన అటువంటివి చదివినవారు మంచి విషయాలను తేలిక భాషలో విశదపరుస్తూ వ్యాసాలు రాసి సామాన్యపాఠకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తే బావుంటుంది.
ప్రాచీన తెలుగు సాహిత్యం తమకు బాగా తెలుసునని తిరిగే చాలామంది ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలను గుట్టుగా చదివి నేర్చుకుంటూ ఉండడం నా చిన్నప్పుడే గమనించాను. ఇప్పుడు ఆ సంపుటాలను చదివేవారే కరువవుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇలా ఒకవంక “క్వాలిటీ” పలచబడుతూ ఉన్నప్పటికీ గాఢమైన ఆసక్తి ఉన్నవాళ్లు మటుకు ఎప్పటికప్పుడు ఒకటీ అరా తయారవుతూనే ఉన్నారు. తక్కిన పాఠకులకు వారే “కళ్ళూ, చెవుల” రూపంలో పనిచెయ్యాలి. అలా జరిగితే కనీసం చర్చించటానికైనా కొందరు మిగులుతారు. పరుచూరి శ్రీనివాస్ వంటి వారి బాధ్యత అదే.
ఈరోజుల్లో పత్రికల్లోనూ, ఇతర మాధ్యమాల్లోనూ అందరికీ అర్థమయే వ్యవహారిక భాష ఉందంటే అందుకు గిడుగు రామమూర్తివంటి ఉద్దండులు చేసిన గట్టి ప్రయత్నాలు ఫలించాయనే గుర్తుంచుకోవాలి. ఈ లెక్కన ఎన్ని శతాబ్దాలు వెనక్కెళ్ళినా తెలుగువారు తమలో తాము సుమారుగా ఇప్పటి భాషలోనే మాట్లాడుకుని ఉంటారని అనిపిస్తుంది. సులువైన పద్ధతులను విడనాడి ఇనపగుగ్గిళ్ళను కోరుకోవడం “పండితుల” లక్షణమేమో. మొదట్లో పత్రికలను నడిపినవారిని సంపాదకులు అనకుండా యెడిటర్లు అనే అనేవారట.
స్వగతంగా సాగిన “సందుక” కవిత లో తెలంగాణా మాండలిక భాష వ్యక్తీకరణ మాధ్యమంగా ఎన్నుకోబడిందని మొదటి కొద్ది పంక్తులలోనే అర్ధమవుతుంది.అంచేత స్వగతం గా సాగిన కవిత మొత్తం ఆ మాండలిక భాషా పదజాలంతోనే సాగుతుందని ఆశించటం అసమంజసం కాదనుకుంటాను.
అసలు ఈ కవిత ప్రత్యేకమైన సొగసు ఆ పదజాల ప్రయోగం లోనే ఉంటుంది కూడాను. ఈ కవిత ఎంత కవితా శక్తిని సంతరించుకున్నదనే విషయం నా ఈ అభిప్రాయం లో సమీక్షాంశం కాదు.కాకపోతే చాలా తక్కువ శాతం తెలంగాణా మాండలిక పదాలను మాత్రమే ఈ కవిత లో వాడటం చూసి నిరుత్సాహ పడ్డాను.
“అర్ర” లో మాండలిక భాష పదాల్ని వాడినంతగా కూడా ఈ కవితలో (సందుక) వాడలేదు.రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారైనా బాగా చదువుకున్నవారు వ్రాసే సంపాదకీయాల వ్యావహారిక భాషే ఈ కవితలో అధికాధికం గా వాడబడటం కనబడుతుంది. ఆ మేరకు ఈ కవితలోని సౌందర్యాన్ని ,ఔచితిని అది బలహీన పరుస్తుంది.
ఈ క్రింది పంక్తులలో తెలంగాణా మాండలిక భాషా పద ప్రయోగం లేకపోవటం
గమనించండి.
” ముదురు రంగులోకి
జీర్ణమవుతున్న
అట్టలు లేని పుస్తకాలు…”
“ఊపిరి పోసిన
ఒక్కో వాక్యం క్రింద
అరిగిన పెన్సిల్ తో…”
“తెరలు తెరలుగా
బాగా పరిచయమున్న
ఒక కొత్త సువాసన
చుట్టుముడుతుంది”
“చెంపకానించుకున్నపుడు
వెచ్చని వాగు నీటి కింది
గరుకైన ఇసుక
మెత్తదనం ఆపేక్షగా తగులుతుంది”
“(ఎట్లా పారేసుకుంటాం)
మన తొలి యవ్వనాల
రంగురంగుల
ఉద్రేకాల్ని?”
మరొక విషయం.పైన ఉదహరించిన మూడవ స్టాంజా లో “బాగా పరిచయమున్న”దంటూనే ,మరలా దాని”నొక కొత్త సువాసన “ననడం లో వైరుధ్యం లేదూ?
C.S.Rao
నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి పంక్తి భోజనం చేసినట్టుంది నా తెలుగు సోదరులతో……కవిత రాసిన వారికి విమర్శ చేసిన వారికి, నా వందనాలు. చూస్తుంటే అందరూ కవనంలో బాగా పండిన కవుల్లాగున్నారు
మీరందరూ ఇలాగే తెలుగును ఆ భాషయొక్క తీయదనాన్ని అందరికీ పంచుతారనే భావిస్తాను….(కులాల ప్రసక్తి తేకుండా…..)
అలోక్ గారూ,
అసలు “వాన-పాట” కు సంబంధించి కవి లో గాని,కవితలో గానీ అస్పష్టత (ambiguity) ఉన్నదని నేను అనలేదు కదా!
ఒక వేళ ఒకానొక కవితలో అస్పష్టత ఉంటే, దాని లో అస్పష్టత ఉన్నదని అనవచ్చును. కానీ, దాని నాధారం చేసికొని,ఆ కవి యొక్క, దాదాపు అన్ని కవితలనీ సాధ్యమైనంత సమగ్రంగా అధ్యయనం చేయకుండా ఆ కవి లో
అస్పష్టత ఉన్నదనటం Rash and Irresponsible Comment అవుతుంది.
“వాన -పాట” కవిత చాలా స్పష్టం గా ఉంది. సందేహం లేదు. పైన నా అభిప్రాయం లో చెప్పినది దీనిలోని అననుసంధానుభూతి,రసవైరుధ్యం గురించి. అవి Contradictions క్రిందికి వస్తవి. వాటిని గురించి చెప్పవలసింది నా అభిప్రాయం లో చెప్పాను కాబట్టి ,మరలా చెప్పటం చర్విత చర్వణం అవుతుంది.
ఇంతకుముందు నేను వ్రాసిన అభిప్రాయం కేవలం ఈ కవితకు మాత్రమే పరిమితమైనది. కవికి కాదు.
పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
10/17/2007 9:13 am
ఈ రోజుల్లో పుస్తకాలు చదవడమే తగ్గిపోయింది. తెలుగూ అంతే. మా కొలీగ్ ఒకమ్మాయికి నేను ఎవరి గురించో “మితభాషి” అంటే అదేమిటో అర్థం కాలేదు! ఈ పరిస్థితుల్లో క్లాసిక్స్ చదవడం మరీ అరుదైన విషయం. నా లెక్కన అటువంటివి చదివినవారు మంచి విషయాలను తేలిక భాషలో విశదపరుస్తూ వ్యాసాలు రాసి సామాన్యపాఠకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తే బావుంటుంది.
ప్రాచీన తెలుగు సాహిత్యం తమకు బాగా తెలుసునని తిరిగే చాలామంది ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలను గుట్టుగా చదివి నేర్చుకుంటూ ఉండడం నా చిన్నప్పుడే గమనించాను. ఇప్పుడు ఆ సంపుటాలను చదివేవారే కరువవుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇలా ఒకవంక “క్వాలిటీ” పలచబడుతూ ఉన్నప్పటికీ గాఢమైన ఆసక్తి ఉన్నవాళ్లు మటుకు ఎప్పటికప్పుడు ఒకటీ అరా తయారవుతూనే ఉన్నారు. తక్కిన పాఠకులకు వారే “కళ్ళూ, చెవుల” రూపంలో పనిచెయ్యాలి. అలా జరిగితే కనీసం చర్చించటానికైనా కొందరు మిగులుతారు. పరుచూరి శ్రీనివాస్ వంటి వారి బాధ్యత అదే.
గిడుగు వెంకట రామమూర్తి – రేఖాచిత్రం (1863 – 1940) గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
10/16/2007 12:13 pm
ఈరోజుల్లో పత్రికల్లోనూ, ఇతర మాధ్యమాల్లోనూ అందరికీ అర్థమయే వ్యవహారిక భాష ఉందంటే అందుకు గిడుగు రామమూర్తివంటి ఉద్దండులు చేసిన గట్టి ప్రయత్నాలు ఫలించాయనే గుర్తుంచుకోవాలి. ఈ లెక్కన ఎన్ని శతాబ్దాలు వెనక్కెళ్ళినా తెలుగువారు తమలో తాము సుమారుగా ఇప్పటి భాషలోనే మాట్లాడుకుని ఉంటారని అనిపిస్తుంది. సులువైన పద్ధతులను విడనాడి ఇనపగుగ్గిళ్ళను కోరుకోవడం “పండితుల” లక్షణమేమో. మొదట్లో పత్రికలను నడిపినవారిని సంపాదకులు అనకుండా యెడిటర్లు అనే అనేవారట.
సందుక గురించి C.S.Rao గారి అభిప్రాయం:
10/15/2007 3:11 pm
స్వగతంగా సాగిన “సందుక” కవిత లో తెలంగాణా మాండలిక భాష వ్యక్తీకరణ మాధ్యమంగా ఎన్నుకోబడిందని మొదటి కొద్ది పంక్తులలోనే అర్ధమవుతుంది.అంచేత స్వగతం గా సాగిన కవిత మొత్తం ఆ మాండలిక భాషా పదజాలంతోనే సాగుతుందని ఆశించటం అసమంజసం కాదనుకుంటాను.
అసలు ఈ కవిత ప్రత్యేకమైన సొగసు ఆ పదజాల ప్రయోగం లోనే ఉంటుంది కూడాను. ఈ కవిత ఎంత కవితా శక్తిని సంతరించుకున్నదనే విషయం నా ఈ అభిప్రాయం లో సమీక్షాంశం కాదు.కాకపోతే చాలా తక్కువ శాతం తెలంగాణా మాండలిక పదాలను మాత్రమే ఈ కవిత లో వాడటం చూసి నిరుత్సాహ పడ్డాను.
“అర్ర” లో మాండలిక భాష పదాల్ని వాడినంతగా కూడా ఈ కవితలో (సందుక) వాడలేదు.రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారైనా బాగా చదువుకున్నవారు వ్రాసే సంపాదకీయాల వ్యావహారిక భాషే ఈ కవితలో అధికాధికం గా వాడబడటం కనబడుతుంది. ఆ మేరకు ఈ కవితలోని సౌందర్యాన్ని ,ఔచితిని అది బలహీన పరుస్తుంది.
ఈ క్రింది పంక్తులలో తెలంగాణా మాండలిక భాషా పద ప్రయోగం లేకపోవటం
గమనించండి.
” ముదురు రంగులోకి
జీర్ణమవుతున్న
అట్టలు లేని పుస్తకాలు…”
“ఊపిరి పోసిన
ఒక్కో వాక్యం క్రింద
అరిగిన పెన్సిల్ తో…”
“తెరలు తెరలుగా
బాగా పరిచయమున్న
ఒక కొత్త సువాసన
చుట్టుముడుతుంది”
“చెంపకానించుకున్నపుడు
వెచ్చని వాగు నీటి కింది
గరుకైన ఇసుక
మెత్తదనం ఆపేక్షగా తగులుతుంది”
“(ఎట్లా పారేసుకుంటాం)
మన తొలి యవ్వనాల
రంగురంగుల
ఉద్రేకాల్ని?”
మరొక విషయం.పైన ఉదహరించిన మూడవ స్టాంజా లో “బాగా పరిచయమున్న”దంటూనే ,మరలా దాని”నొక కొత్త సువాసన “ననడం లో వైరుధ్యం లేదూ?
C.S.Rao
సందుక గురించి Rakesh గారి అభిప్రాయం:
10/11/2007 11:43 pm
పల్లెస్మృతులను కండ్లముంగట సాక్షాత్కరించిండ్రు.
అభినందనలు!!!
సాయము శాయరా డింభకా! గురించి Manjula గారి అభిప్రాయం:
10/11/2007 3:36 pm
bah! predictable, juvenile!ఇది మీ worst కధ అని నా అనుమానము.
అరణ్య కవితలు గురించి rudra గారి అభిప్రాయం:
10/02/2007 10:34 pm
నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి పంక్తి భోజనం చేసినట్టుంది నా తెలుగు సోదరులతో……కవిత రాసిన వారికి విమర్శ చేసిన వారికి, నా వందనాలు. చూస్తుంటే అందరూ కవనంలో బాగా పండిన కవుల్లాగున్నారు
మీరందరూ ఇలాగే తెలుగును ఆ భాషయొక్క తీయదనాన్ని అందరికీ పంచుతారనే భావిస్తాను….(కులాల ప్రసక్తి తేకుండా…..)
వాన-పాట గురించి C.S.Rao గారి అభిప్రాయం:
10/02/2007 5:55 am
అలోక్ గారూ,
అసలు “వాన-పాట” కు సంబంధించి కవి లో గాని,కవితలో గానీ అస్పష్టత (ambiguity) ఉన్నదని నేను అనలేదు కదా!
ఒక వేళ ఒకానొక కవితలో అస్పష్టత ఉంటే, దాని లో అస్పష్టత ఉన్నదని అనవచ్చును. కానీ, దాని నాధారం చేసికొని,ఆ కవి యొక్క, దాదాపు అన్ని కవితలనీ సాధ్యమైనంత సమగ్రంగా అధ్యయనం చేయకుండా ఆ కవి లో
అస్పష్టత ఉన్నదనటం Rash and Irresponsible Comment అవుతుంది.
“వాన -పాట” కవిత చాలా స్పష్టం గా ఉంది. సందేహం లేదు. పైన నా అభిప్రాయం లో చెప్పినది దీనిలోని అననుసంధానుభూతి,రసవైరుధ్యం గురించి. అవి Contradictions క్రిందికి వస్తవి. వాటిని గురించి చెప్పవలసింది నా అభిప్రాయం లో చెప్పాను కాబట్టి ,మరలా చెప్పటం చర్విత చర్వణం అవుతుంది.
ఇంతకుముందు నేను వ్రాసిన అభిప్రాయం కేవలం ఈ కవితకు మాత్రమే పరిమితమైనది. కవికి కాదు.
C.S.Rao
ప్రతీకారం గురించి poorna chand గారి అభిప్రాయం:
10/01/2007 5:49 am
కథ బాగుంది
మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి ప్రవీణ్ గార్లపాటి గారి అభిప్రాయం:
09/30/2007 9:43 am
లక్ష్మన్న గారు,
మీ వ్యాసం చాలా బాగుంది. మీ ఫ్రాన్స్ అనుభవాలు చాలా చక్కగా వివరించారు.
వీరిగాడి వలస గురించి నెటిజన్ గారి అభిప్రాయం:
09/29/2007 1:12 am
ఔను. ఒంటరితనం చాల భయంకరమైనది.
అది అనుభవించినవారికే దాన్ని గురించి తెలుస్తుంది.
చాలా చక్కగా చెప్పారు.