Comment navigation


15548

« 1 ... 1447 1448 1449 1450 1451 ... 1555 »

  1. అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి వినీల్ గారి అభిప్రాయం:

    11/03/2007 8:09 pm

    I am shocked to know Jim Gray is missing. జిమ్ గ్రే ఫైవ్ మినట్ రూల్ పేపర్ చదివి అదే సెమిస్టర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన్ని కలవడం ఇప్పటికీ మరచిపోలేను. he was such a simple person inspite of all his achievements. thanks for the article hanuma.

  2. అదిగో పులి గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:

    11/03/2007 5:14 pm

    chuckle!

  3. విద్యాసుందరి గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:

    11/03/2007 5:08 pm

    ఒక అనర్ఘ స్త్రీ రత్నాన్ని గురించి అద్భుతమైన వ్యాసం అందించారు. రాధికాసాంత్వనము ప్రచురణకర్తగా ఈమెను గురించి వినటం తప్ప వేరేమీ తెలియదు. బాపిరాజు నారాయణరావు నవలలో ఆనాటి సంగీత విద్వాంసులగురించిన చర్చలో ఈమె ప్రస్తావన కూడా వస్తుందని గుర్తు.
    మోహన గారూ, అనేక థాంకులు!

  4. జేబఱబూచి గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:

    11/03/2007 4:51 pm

    అద్భుతం!
    బండి ఱ ఉపయోగం బూచి భీకరత్వాన్ని ఇనుమడింప చేసింది.
    “జ్యూసు లూలెస్తాను బూచీ”?? అర్ధం కాలే!

  5. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి Vamsi గారి అభిప్రాయం:

    11/03/2007 8:20 am

    Who else can write the details of the hindustani music so intricately- other thsn the sitar maestro himself. Wonderful info.

    Vamsi

  6. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి Vamsi గారి అభిప్రాయం:

    11/03/2007 3:47 am

    అవును మరి హిందుస్తానీ సంగీతం గురించి స్వతహాగా మంచి రచయిత అయిన హిందుస్తానీ సంగీత విద్వాంసులు “శ్రీ రోహిణీ గారు” కాక ఎవరు రాయగలరు? చాలా మంచి వ్యాసం.

    వంశీ మాగంటి
    http://www.maganti.org

  7. తీన్‌ కన్యా గురించి పాఠకుడ గారి అభిప్రాయం:

    11/02/2007 7:00 pm

    వేలూరి గారి నించి ఇలాంటి కథ ఎప్పుడూ expect చెయ్యలేదు. చెప్పదల్చుకున్నది స్పష్టంగా లేదు. ఇండియాలోనే వుండి పోదామనుకునే ఆ అమ్మాయిలు ఎందుకు అమెరికా అబ్బాయి సంబంధం చూడ్డానికి ఒప్పుకున్నారో అర్థం కాలేదు. అంతేకాదు, అంత స్వతంత్ర భావాలున్న అమ్మాయిలు ఒక అబ్బాయి తమింటికి తమని గేదెలని చూసినట్టు చూస్తానంటే, అందుకు ఎలా ఒప్పుకున్నారో అంతకన్నా అర్హ్తం కాదు. ఈ అమెరికా అబ్బాయి గానీ, ఇతని వేపు వాళ్ళు గానీ ఆ అమ్మాయిలకి ఇతను ఇండియా తిరిగి వచ్చేస్తాడని తప్పుగా సంకేతాలు పంపారా? కధలో అలాంటి వివరాలు లేవు మరి. ఇలాంటి ముఖ్య విషయం పెళ్ళి చూపుల్లో తేల్చుకుంటారా ఎవరన్నా? చాలా అసంబద్ధంగా వుంది ఇది.
    ఈ రోజుల్లో ఇండియాలో కెమిస్ట్రీలో గానీ, లెక్కల్లో గానీ బి.యె డిగ్రీ ఇస్తున్నారా? ఇదెప్పట్నించీ? ఇన్నాళ్ళూ ఆ సబ్జక్టుల్లో బి.యెస్సీ డిగ్రే ఇస్తారనుకున్నాను. అయినా ఇదో పెద్ద విషయం కాదు లెండి. అమెరికా వున్నా కాసిని యేళ్ళకే అమెరికాలో లాగా ఇండియాలో కూడా సైన్సూ, లెక్కల్లో బి.యె డిగ్రీ ఇస్తారనుకున్నాడేమో గోవిందరావు.
    రచయిత ఏం చెప్పదల్చుకున్నారూ? మంచి చదువూ, పొజిషనూ, సంపాదనా వున్న అమ్మాయిలు ఇండియా వొదిలి రారనీ, అంతగా అవి లేకుండా ఇండియా వొదిలి రావడానికి ఒప్పుకునే అమ్మాయిలు అమెరికాలో సంపాదించడానికి పనికిరారనీ చెప్దామనా? ఏమో, అంతా అయోమయంగా వుండి, ఇలాగే అర్థం అయింది. తప్పో, రైటో తెలీదు.
    అయినా అమ్మాయిల్ని పెళ్ళి చేసుకుని, ఇల్లూ, చేస్తున్న పనీ వొదిలి పెట్టలుఎక్కడకి పడితే అక్కడకి వచ్చేసే వొస్తువుల్లా చూడ్డం ఏమీ బాగోలేదు. అయితే ఇలాంటీ వాళ్ళు చాలా మంది వున్నారనుకోండీ. అది వేరే సంగతి.
    కధ మొదలయినప్పుడు కాస్త హాస్యంగా మొదలయితే, హాస్య కధ అనుకున్నాను. లేకపోతే, ఈ అత్తయ్య బుగ్గ గిల్లి, నవ్వడం వెకిలిగా వుంది. తల్లి ఎయిర్ పోర్టులో బావురుమనడం హస్య కధలా వుంది.
    “అత్తయ్య తల వంచుకొని, కుడికాలి బొటనవేలుతో నేలమీద సున్నాలు చుట్టుకుంటోది” – ఈ వాక్యం అంత పెద్ద వయసున్నావిడ గురించి, చిన్న పిల్లాడి (గోవిందరావు) సమక్షంలో – చదవడానికి ఇబ్బంది కలిగించింది.
    పాఠకుడు

  8. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    11/02/2007 1:34 pm

    చాలా చక్కటి వ్యాసం.

    ఆంధ్రప్రదేశ్ వెలుపల జీవితం గడిపిన వారిలో ఎంతటి వైవిధ్యం ఉంటుందో (ఉండగలదో) మచ్చుకు ఉదాహరణ ఈ వ్యాసం!

    పాడే వాళ్ళు చాలా మంది రాయలేరు. ఎక్కువమంది, బాగా రాసే వాళ్ళు బాగా పాడగా నేను చూడలేదు. రాతా, పాటా రెండూ బాగా వచ్చిన కొద్దిమందిలో రోహిణీప్రసాద్ ముఖ్యులు! సంగీతం గుతరించి రాయటమే ఒక పెద్ద కసరత్తు! అందులో అనుభవంలోకి వచ్చిన విషయాలు తేలిక తెలుగులో తెలియపరచటం మరీ పెద్ద పరీక్ష.

    సంగీత ప్రియులకు ఈ వ్యాసం మహానందం కలిగిస్తుంది అనటంలో నాకు సందేహం లేదు. ఎంతమంది “ఖాన్” లు హిందూస్తానీ సంగీతాన్ని సుసంపన్నం చేసారో చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది!

    ఈమాట పాత సంచికల్లో “అంతో ఇంతో రాయగలిగే శక్తి ఉన్న ప్రతీవారూ, తప్పక రాయాలి” అన్న సంపాదకుల వాక్యం అక్షర సత్యం. ఎన్నో వైవిధ్యాల జీవితం రుచి చూసిన (చూస్తున్న) ప్రవాసాంధ్రులు, ఇటువంటి రచనల స్పూర్తితో, మరింత ఉత్సాహంతో రచనలు చెస్తారని ఆశిస్తూ,

    వ్యాసకర్తకు ధన్యవాదాలతో,

    లక్ష్మన్న

  9. అదిగో పులి గురించి పాఠకుడు గారి అభిప్రాయం:

    11/02/2007 10:20 am

    కథ concept బానే వుంది. చెప్పిన విధానమే కాస్త మొరటుగా వుంది. సైనేడు మాత్రలని కూడా దొరుకుతాయా, అంత డైరెక్టుగా? చుట్టూ వున్న వాళ్ళు ఇంత చెత్తగా కాకుండా, ఆ మనిషికి లేని కష్టాలు వూహించుకుని, పెద్ద సాయం చెయ్యబోయే మనుషుల్లా వుంటే, ఈ కధ ఇంకా బాగుండేది. కొడుకు నైట్ డ్యూటీ వుద్యోగానికి వేడి, వేడి కాజాలూ, కూతురి పగలు వుద్యోగానికి ఫోనూ, అమెరికా బావతో పెళ్ళీ. బాగుంది వివక్షత. ఎంతైనా కూతుర్ని ఒదిలించుకుంటారు కదా, పెళ్ళి చేసి. మొత్తానికి బాగానే వుంది కథ.
    పాఠకుడు

  10. విద్యాసుందరి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    11/01/2007 9:56 am

    చాలా మంచి వ్యాసం. రచయితకు తెలుగు, కన్నడ భాషల్లో ఉన్న మంచి ప్రవేశం ఈ రచనకు బాగా ఉపయోగపడింది. గత శతాబ్దపు చరిత్రలోని అనేక ముఖ్యఘట్టాలను ప్రస్తావించారు. ఆయనకు ఉన్న విస్తృత పరిజ్ఞానం దృష్ట్యా రావుగారు మంచి విషయాలను పరిచయం చేసే వ్యాసాలను ఒక పరంపరగా రాస్తే బావుంటుంది.

« 1 ... 1447 1448 1449 1450 1451 ... 1555 »