Comment navigation


15548

« 1 ... 1445 1446 1447 1448 1449 ... 1555 »

  1. ట్రాఫిక్ సిగ్నల్ – A Twenty first century love story గురించి Avinash Vellampally గారి అభిప్రాయం:

    11/08/2007 7:41 am

    కుట్రలు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలతో
    సాగిపోయే నేటి కొత్త (చెత్త) తరం కథలకి
    భిన్నంగా ఆద్యంతం ఆసక్తి దాయకం గా
    సాగింది. నిజం గా రచయిత కి నా హృదయ
    పూర్వక వందనాలు…

  2. అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    11/08/2007 7:21 am

    హనుమ గారూ
    మీరు కొంతకాలం క్రితం రచ్చబండలో ప్రస్తావించినప్పుడు జిమ్ గ్రే గారి గురించి మొదటి సారితెలుసుకున్నాను.
    మీ వ్యాసం ఎంతో బావుంది. జిమ్ గ్రే గారికి చాలా మంచి నివాళి.
    అప్పుడప్పుడు వైజ్ఞానిక వ్యాసాలు చదివే నా బోటి వారికి ఎంతగానో నచ్చే అనౌపచారిక శైలి (ఇన్ఫార్మల్ స్టైల్) ని మీరు బాగా పట్టుకున్నారు.
    “చేసే పని మీద వ్యామోహం ఉండాలి. అప్పుడు జీవితంలో ఆనందమూ, పరిపూర్ణత్వమూ ఉంటాయ్. అది లేనప్పుడు జీవితం శూన్యం. కాబట్టి నీ మనసుని కట్టిపడేసేదో తెలుకో. నువు చేస్తున్న పనిలో నీకు ఆసక్తి లేకపోతే, అది తొందరగా విడిచిపెట్టి నీమనసుకి దగ్గరయినది వెతుక్కో” అన్న వాక్యాలు చదివి కాస్సేపు ఆలోచిస్తూ ఉండిపోయాను.
    ఇంకాస్త తరచుగా రాయండి.
    కృతజ్ఞతలతో
    శ్రీనివాస్

  3. త్యాగరాజ అష్టోత్తరశతనామములు గురించి achalla surya raja monalisa గారి అభిప్రాయం:

    11/07/2007 3:17 pm

    త్యాగ రాజ అష్టోత్తర శతనామములు చాలా బావున్నాయి.
    ముందు’ శ్రీ’ చేర్చి వుండాల్సిందేమో !

  4. అదిగో పులి గురించి Ram గారి అభిప్రాయం:

    11/07/2007 2:31 pm

    బాగుంది కధ. చాలా సరదాగా సాగిపోయింది…

  5. న త్వం శోచితుమర్హసి గురించి sandhya గారి అభిప్రాయం:

    11/07/2007 3:15 am

    నిజంగా చాలా బాగుంది

  6. అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    11/06/2007 6:59 pm

    చాలా బాగా చదివించిన వ్యాసం! సరళమైన శైలిలో ఇన్ఫర్మేటివ్ గా సాగింది. జిమ్ గ్రే గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి పాఠకులకు చక్కని అవగాహన కలిగించే వ్యాసం. సాంకేతిక విషయాలను సరళంగా వివరించటం, జిమ్ గ్రే గురించిన ఆసక్తి కరమైన పరిచయం ఆకట్టుకున్నాయి. చివరగా The Auden’s poem that was quoted at the end of the article is very appropriate and quite a touching tribute too.

  7. అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి మురళి గారి అభిప్రాయం:

    11/06/2007 6:23 am

    జిమ్ గ్రే సముద్రంలో తప్పిపోయినప్పుడు ఆయన గురించి వికీపీడియాలో చదివాను. కాని మీరు వ్రాసింది మనసుకు హత్తుకునేట్టు ఉన్నది. మీ ప్రయత్నానికి ధన్యవాదాలు, అభినందనలు!

  8. అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి కె.వి..గిరిధరరావు గారి అభిప్రాయం:

    11/05/2007 11:53 pm

    వ్యాసం చాలా బాగుంది. సాంకేతిక విషయాలను క్రొత్త పద్ధతిలో చెప్పడం బాగుంది.
    ఇలాంటి వ్యాసాలు మరిన్ని వ్రాయండి.

  9. అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    11/05/2007 11:41 am

    జిమ్ గ్రే గురించి తెలుసుకున్న ఆనందం, ఆయన ఇక లేరు అన్న వార్త వల్ల బాధ, రెండు ఒక్క సారే కలిగాయి!

    ఎన్నో వివరాలతో రాసిన ఈ వ్యాసంలో, చాలా విషయాలు చెప్పబడ్డాయి!

    రచయితకు ధన్యవాదాలతో,

    లక్ష్మన్న

  10. అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    11/05/2007 11:26 am

    ఈ వ్యాసం నాకు నచ్చటానికి రెండు కారణాలు. ఒకటి, ఒక ప్రఖ్యాత వ్యక్తి గురించి తెలుసుకోవటానికి అవకాశం దొరికింది. రెండు, ఒక క్లిష్టమైన సాంకేతిక రంగంలోని విషయాలని సరళమయిన తెలుగులో వ్రాయబూనుకుని విజయం సాధించటం. ఈ రెండు విషయాలలోనూ వ్యాసకర్త కృతకృత్యులయారు. కంప్యూటర రంగంలో జరుగుతూన్న విప్లవాన్ని అందరికీ అర్ధమయే రీతిలో ఇంకా ఇటువంటి వ్యాసాలు రాయమని రచయితని అర్ధిస్తున్నాను.

« 1 ... 1445 1446 1447 1448 1449 ... 1555 »