Comment navigation


15549

« 1 ... 1431 1432 1433 1434 1435 ... 1555 »

  1. కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి Avinash Vellampally గారి అభిప్రాయం:

    01/16/2008 7:28 am

    Excellent collection !! I had searched for this complete story for several months. I could finally get this here.
    This site is really wonderful. I hope the collection of stories, novels and classics in this site will increase in the future..

  2. ప్లేటో ఘనస్వరూపాలు (Platonic Solids) గురించి mOhana గారి అభిప్రాయం:

    01/14/2008 9:45 am

    వ్యాసాన్ని చదివి సలహాలిచ్చిన పాఠకులకు వందనాలు.
    ఇంకా మీకు తోచిన సలహాలను అందరూ ఇయ్యండి. శాస్త్ర రంగంలో
    ఇంకా వ్యాసాలను రాయాలనే నా అభిలాషకు అవి తోడ్పడుతాయి.

    1) అన్ని ఘనస్వరూపాలను గురించి ఒకే వ్యాసములో రాయాలనేదే
    నా ముఖ్యమైన ఉద్దేశము. దానిని విరిచి రాస్తే కంటిన్యుయిటీ
    ఉండదు. అందుకే ఐదు ఘనస్వరూపాలను గురించి కుదించి
    ఒకే వ్యాసములో వివరించవలసి వచ్చింది.

    2) నేను చదివిన, చూచినా పదకోశాలలో నేను ఉపయోగించిన
    టెక్నికల్ పదాలే ఉపయోగించారు. పదాలు అచ్చ తెలుగు పదాలు
    కానంత మాత్రాన వాడడానికి వెనుదీయరాదు. సాంకేతిక
    పదాలకు సంస్కృతము నిజంగా ఒక కాణాచి వంటిది.
    నాకు తెలిసి తెలుగు అకాడెమి వారు స్ఫటిక శాస్త్రముపై
    ఒక పుస్తకాన్ని ప్రచిరించారు. ఉదాహరణకు అందులో
    సమతల ముఖానికి పార్శ్విక అనే పదాన్ని ఉపయోగించారు.
    octahedronను అష్టపార్శ్విక అని అన్నారు.
    నా భావనలో దానికంటె అష్టముఖి అనే పదము బాగని
    తోస్తుంది. సుబ్బరామయ్యగారి పుస్తకాన్ని ఇక్కడ చూడవచ్చు –

    http://www.archive.org/details/SphatikaShastramu

    3) సౌష్ఠవమును గురించి ఇంతకు ముందే నేను రాసిన
    ముగ్గులు అనే వ్యాసాన్ని చదువమని వ్యాసములో, సూచికలో
    తెలిపి ఉన్నాను. ఇందులో ప్రతియొక్క అక్షానికి ముగ్గుల
    ఉదాహరణ ఉన్నది. తీరిక ఉన్నప్పుడు సౌష్ఠవము 101
    అఏ వ్యాసాన్ని రాస్తా.

    4) హెర్మన్ వేల్ పుస్తకము నన్ను ప్రాభావితము చేసిన
    పుస్తకాలలో ఒకటి. దీనిని అందరు అర్థము చేసికోవచ్చు.
    నా దగ్గర ఈ పుస్తకపు pdf file ఉంది. కాని అది పెద్దది.
    దానిని కావలసిన పాఠకులకు ఎలా అందజేయాలో తెలియలేదు.

    5) ఇక బొమ్మలను గురించి. ఇవి పారదర్శకము కనుక
    ఫోటో తీయడము చాల కష్టమయ్యింది. flash
    ఉపయోగిస్తే reflect అవుతుంది. flash లేక తీయవలసి
    వచ్చింది. Internetలో కొన్ని ఉన్నాయి కాని ఇలా చేసినవి
    లేవు.

    6) ప్లేటో ఆపాదన రావుగారు చెప్పింది సరియే. Detailsతో
    వ్యాసాన్ని పొడిగించడం ఇష్టంలేక వాటిని గురించి
    రాయలేదు.

    7) dual అంటే twin అని అర్థము, అందుకే కవల అని
    ఉపయోగించా. నా ఉద్దేశములో ఇది తప్పు అని అనుకోను.

    8) చిన్న భూషయ్య ప్రస్తావనకు కారణాలు రెండు – (1)
    pentagonతో ద్వాదశముఖి చిత్రాన్ని కింది లింకులో
    చూడగలరు.

    http://www.flickr.com/photo_zoom.gne?id=1414071323&size=o

    (2) కొద్దిగా హాస్యాన్ని ఒలకబోద్దమనే నా విఫల ప్రయత్నము.

    విధేయుడు – మోహన

  3. అదిగో పులి గురించి lahari గారి అభిప్రాయం:

    01/13/2008 8:21 pm

    simply superb , keep it up

  4. కోవెలలో పకపకలు గురించి lahari గారి అభిప్రాయం:

    01/13/2008 7:40 pm

    నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే, నేను ఇలాంటి సన్నివేశాలను గుడికి వెళ్ళినప్పుడల్లా చూస్తునే ఉంటాను, చాలా రియల్‌గా, కళ్ళకి కట్టినట్టుగా రాశారు. చదివి చాలా ఆనందించాను. మీరు ఇంకా ఇలాంటివి చాలా రాయాలి అని ఆశిస్తున్నాను.

  5. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/12/2008 9:35 pm

    వైజ్ఞానిక వ్యాసాల కథా కమామీషు

    రాజాశంకర్ గారూ, శ్రీనివాస్ గారూ,

    మీ ప్రోత్సాహనికి కృతజ్ఞతలు. మీరిచ్చిన కొన్ని సలహాలు పాటిస్తాను. మీరు వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలతో విభేదిస్తాను.

    ఎందుకు రాయాలనిపించలేదో తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నానో వివరించి digress అయ్యానన్నారు రాజాశంకర్ గారు. “నరావతారం” కి పరిచయం రాస్తూ నార్ల విష్ణావతారాలవి రాసేవాళ్ళ మీద ఎందుకు విసుర్లు వెయ్యడం? పండిత పురస్కారం గురించి ప్రకటన చేస్తూ తమ్మినేని కవుల మీద ఎందుకు చురక వెయ్యడం? వాళ్ళ వాళ్ళ దృక్పధాన్ని బట్టి తమకి ముఖ్యమైన వాటి గురించి ప్రస్తావించారు. నేను మన భాషలో సైన్సుగా చలామణి అవుతున్న వాటిని చూసి కొంత “కడుపు మండి” నాలుగు మాటలు రాశాను. రాస్తున్నది పాపులర్ సైన్సు గురించి కాబట్టి అవి అసందర్భం కాదు. నిజానికి నాదృష్టిలో చాలా అవసరం. అలాగే ప్రేరణ కలిగించిన వాటిని ప్రస్తావించడం కూడా మామూలే.

    కాని అందు మూలంగా అసలు విషయానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, అది తప్పే. ముందు ముందు ఎలాగూ లోతుగా వివరిస్తాను కనుక, అది సరిదిద్దుకునే అవకాశం వుంది.

    నేను రాయాలనుకున్నదంతా ఒకే వ్యాసంలో వివరించడం సాధ్యం కాదు. ఖగోళ శాస్త్రం మీదా, కాలెండర్ మీదా మనకి వ్యాసాలు పరంపర గానే వచ్చాయి. అవి వచ్చింది వారపత్రికల్లో కాబట్టి గత వారం విషయం గుర్తుండటం సులభం కావొచ్చు. ఈమాట, రెండు నెలలకోసారయినా, ఇంటర్నెట్ పుణ్యమా అని పాత సంచిక పక్కనే ఉండటాన పాఠకులు దారితప్పరనే నా ఆశ. కాని శ్రీనివాస్ గారన్నట్లు, ప్రతి వ్యాసమూ సాధ్యమైనంతవరకు సమగ్రంగానూ సమైక్యంగానూ ఉండాలి. మొదటి వ్యాసం కాస్త కలగాపులగంగా వున్న మాట నిజమే. ఈ విషయంలో నేను జాగ్రత్తపడాలి.

    ఇకపోతే ఈ వ్యాసాల్లో దొర్లే కవితల వలన ఉపయోగమేమిటి? పాఠకుల ఏకాగ్రతకు భంగం కావా? అన్నదానికి నా సమాధానం: కొడవటిగంటి కుటుంబరావు, “తెలుగులో ఏదన్నా వైజ్ఞానిక రచన, కథలాగా చక్కగా హృద్యంగా, ఆపబుద్ధి పుట్టకుండా రచించినది కంటపడితే పర్వం లాగుంటుంది,” అన్నాడు.

    కాని పాత్రలు, సంభాషణలు, ప్రకృతి వర్ణనలూ లేకుండా కథలా హృద్యంగా నడిపించడం ఎలాగ? అందుకు ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నిస్తారు – కవిత, జీవిత చరిత్ర, పురాణ కథ, నవ్వుతెప్పించే సంఘటన, ఇలా ఏది చాతనయితే అది.

    “విశ్వరూపం,” తెలుగు వైజ్ఞానిక సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలబడుతుందన్నాడు కొడవటిగంటి. నా ఉద్దేశంలో మైలురాయే కాదు, ఉత్తమ రచనకి గీటురాయి కూడాను. దాంట్లో, నండూరి, “సాధారణభాషలో సాపేక్షసిద్ధాంతం,” అధ్యాయాన్ని చార్లెస్ లాంబ్ పలుకులతో మొదలెట్టి, మధ్యలో కీట్సు ప్రేమగీతాన్నొకదాన్ని ఉటంకించి, షెల్లీ పద్యాన్ని పఠాభి తెనిగింపుతో సహా ఇచ్చి, పోతన భాగవతాన్నెలా మొదలెట్టాడో వివరించాడు! వాటికితోడు బాపూ కార్టూన్లు!

    సాపేక్ష సిద్ధాంతం వివరించడానికి ఇవన్నీ అవసరమా అంటే, బహుశా కాదేమో! కాని అవన్నీ ఉంటే గాని హృద్యంగా ఉండదనీ, అవి వ్యాసాన్ని మళ్ళీ మళ్ళి చదివించేలా చేస్తాయనీ రచయిత ఉద్దేశం.

    దీంట్లో ఏకాభిప్రాయం ఉండాలని లేదు. Feynman ఉపన్యాసాల్లో కవిత్వం ఎక్కడా కనిపించదు. కవిత్వం లేకుండా Brownowski ఉపన్యాసం ఉండదు. నాకు Brownowski అంటే చాలా ఇష్టం. మన ఇష్టాఇష్టాలు మన రచనల్లో వ్యక్తం అవతాయి.

    చాలా మంది పేర్లని వాడాను. వారి ప్రజ్ఞా పాటవాలు నాకున్నాయనే అపోహ నాకేమాత్రమూ లేదు. వాస్తవం చెప్పాలంటే, పులిని చూచి నక్క వాతబెట్టుకున్న ట్లవుతుందేమోనన్న భయం కొంత వుంది. కాని, చుక్కలదాకా నిచ్చెనేస్తే చూరు దాకానన్నా చేరతాం, అన్నది మన సూక్తి.

    కొడవళ్ళ హనుమంతరావు

  6. ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/12/2008 1:59 pm

    శ్రీనివాస్ గారిచ్చిన స్త్రీల, పేదల, రోగుల గురించి రాయడానికి సంబంధించిన పోలిక ఈ సందర్భంలో సమంజసంగా లేదు. ఎందుకంటే వీళ్ళ గురించి రాయడానికి వాళ్ళ జీవితంతో కావలసిన ప్రత్యక్షమైన అనుభవం వేరే వాళ్ళకుండే అవకాశం వుంది. అమెరికా జీవితం గురించి అలాంటి ప్రత్యక్షానుభవం అమెరికాలో ఉంటే తప్ప అసాధ్యం.

    “ఇంటర్నెట్ తోనూ, ఈమాట తోనూ, ఇరవై నాలుగ్గంటలూ ప్రసారమయ్యే టీవీ షోల తోనూ వేరే వాళ్ళ జీవితం గురించి తెలుసుకోలేమా? సృజనాత్మక సాహిత్యం సృష్టించలేమా?” అంటే ఎక్కడో కొడవటిగంటి కుటుంబరావు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి: సాహిత్యం జీవితవృక్షాన పూసే పువ్వు అనే ఉపమానం వాస్తవమనుకుంటే, సాహిత్యాన్నించి సాహిత్యం పుట్టడం, పువ్వునుంచి పువ్వు పుట్టడం లాంటిది – అసంభవం.

    అసాధ్యం, అసంభవం అన్నవి పెద్ద మాటలనుకోండి. ఎక్కడన్నా మినహాయింపులుండొచ్చు.

    కాని లక్ష్మన్న గారితో నేను కొంతవరకే ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయన నివాసాంధ్రులు ఎన్నిసార్లు ఇక్కడకొచ్చి వెళ్ళినా అమెరికాలోని తెలుగు జీవితం అర్థంచేసుకోలేరన్నారు. జీవితం, తెలుగు వాళ్ళదే అయినా, చాలా విశాలమయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకయినా అది అర్థమయ్యేది అసంపూర్తిగానే.
    రెండు మూడు నెలలు వాళ్ళ పిల్లల్ని చూడటానికి వచ్చినవాళ్ళు, తాము చూసి అనుభవించినంతలో అర్థం చేసుకొని రచనలు చెయ్యొచ్చు.

    మొన్నో కథ చదివాను: అమెరికాలో తెలుగు వాళ్ళు సత్యనారాయణ వ్రతం ఎంత ఘనంగా – మీగడలతో భోజనం, తాంబూలంతో ఫాటు వెండిగిన్నె ప్రదానం – చేసుకుంటున్నారో, ఒకరింట్లో స్వామి వారొకరు యజ్ఞం ఎలా జరిపించారో చెప్పి, ఇండియాలో లక్ష వత్తుల నోము ఎవరూ చేస్తున్నట్లు లేరు; అది కూడా ఇక్కడ చూసే భాగ్యం కలుగుతుందేమో అన్నారు.

    అలాంటి కథలు విలువయినవే; నిజానికి చుట్టపుచూపుగా వచ్చిన నివాసాంధ్రులే అవి మిన్నగా రాయగలరేమోమో. అవి చదివి, అక్కడ కంటే ఇక్కడే మన సంస్కృతి గురించి ఎక్కువ పట్టించుకుంటూన్నామని సంబరపడొచ్చు; లేదా, పెరిగిన ఆర్థిక స్తోమతుతో పాటు పెరగకూడనవేవో మనలో పెరుగుతున్నాయని విచారించనూ వచ్చు – చదివే వారి దృష్టిని బట్టి.

    కొడవళ్ళ హనుమంతరావు

  7. కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి సాయిక్ర్రిష్ణ గారి అభిప్రాయం:

    01/11/2008 1:41 am

    కళాపుర్ణొదయము అందించినదుకు ధన్యవాదాలు !!!
    సాయిక్ర్రిష్ణ

  8. అబద్ధంలో నిజం గురించి subrahmanyam గారి అభిప్రాయం:

    01/10/2008 10:26 pm

    కధ చాలా బాగుంది.. అయితే మామూలుగా వుంది.

  9. ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    01/10/2008 12:23 pm

    “ప్రవాసంలోని జీవితం తెలియాలంటే, ప్రవాసంలో బతకటంలో తప్ప వేరే దారి లేదు.” అన్నది ఎట్లా ఉందంటే స్త్రీల సమస్యలు, జీవితాలు తెలియాలంటే స్త్రీగానే బతకాలి, లేదా అణగారిన బడుగుజీవుల వ్యథలు తెలియాలంటే వారిలాగానే బతకాలి, రోగుల కష్టాలు తెలియాలంటే మనం కూడా రోగం తెచ్చుకోవాలి అన్నట్లుంది. అలా చేస్తే సాయపడదని కాదు, అట్లా చేయకపోతే అసలు తెలియదు అని అనుకోనవసరం లేదు.

    అమెరికా చాలా సార్లు వచ్చినంత మాత్రాన ఇక్కడి వారిని అర్థం చేసుకున్నామనుకోవడం ఎంత పొరపాటో, అసలు అమెరికా ను ప్రత్యక్షంగా చూడకపోయినంతమాత్రాన ఒకరికి ఈ విషయాలు ఏవీ చచ్చినా అర్థం కాలేవు అని అనుకోవడం అంతే పొరపాటు.

    పది కాలాలపాటు కాపురం చేసిన దంపతులు, తమ భార్య (లేదా భర్త) కన్నా ఇంకెవరో తమని ఎంత బాగా అర్థం చేసుకున్నారని చెప్పుకోవడం పెద్ద వింతా కాదు, మనకు కొత్తా కూడా కాదు కదా!

    సహృదయత, సమగ్రమైన నిశిత పరిశీలన, తప్పిదాలను, అపోహలను దిద్దుకునే ఔదార్యం ఉంటే ఎవ్వరైనా ఎవ్వరి సమస్యలనైనా అర్థం చేసుకోగలరు. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతున్న నేటి ప్రసార వ్యవస్థలో ఇక్కడ ఉన్న వాళ్ళే ఇది వ్రాయగలరు, అక్కడున్న వాళ్ళే అది వ్రాయగలరు అని అనలేం. ఇక్కడి వాళ్ళు అక్కడికి, అక్కడి వాళ్ళిక్కడికి వస్తునే ఉన్నారు, ఉంటారు.

    ఎక్కడ పొందిన అనుభవాలు అని కాక, ఎంత లోతుగా గ్రహించిన అనుభూతి అని బేరీజు వేసుకుంటే ఎవ్వరు చెప్పినా అది మనకు తాకుతుంది. అసలు “ఈ మాట” పత్రికే ఒక చక్కని ఉదాహరణ. ఎక్కడో నేర్చిన తెలుగులో, ఎప్పుడో నేర్చుకున్న భాషలో ఎక్కడెక్కడికో వచ్చి వ్రాస్తూ మాట్లాడుకూంటున్నాం,
    ఎంకా చెప్పాలంటే, ఎంతో కొత్త విషయాలను అంతే పాత భాషలో చెప్పుకుంటున్నాం కదా! ఇక వేరే చెప్పేదేముంది.

    విధేయుడు
    Srinivas

  10. నడిమి వయసు యిడుములు గురించి phaNi DokkA గారి అభిప్రాయం:

    01/10/2008 4:21 am

    సూర్యనారాయణగారూ,
    చాలా బాగున్నది ఈ పద్య మాల. చక్కని ఇతివృత్తం, పొందికైన
    మాటల ఎంపిక. ఇలాంటివి చదువుతున్నప్పుడు అనిపిస్తుంది,
    తెలుగు పద్యం ఇంకొన్నాళ్ళు జీవిస్తుందని..
    అభినందనలతో,
    డొక్కా ఫణి

« 1 ... 1431 1432 1433 1434 1435 ... 1555 »