ఇలాంటి గందరగోళం కధని ఈ మధ్య కాలంలో ఎక్కడా చదవలేదు. చివర్లో శివరావే చలపతిని ప్రయోగించాడని చెప్పి, ఇంకా గందరగోళ పెట్టాల్సింది. ప్రాక్టికాలిటీ అనే పేరుతో ప్రతీ పాత్రా ఎంత అతి తెలివిగా మాట్టాడుతాయో. “సాయంకాలం పార్కుకు వస్తావా, రాధా, మనం ప్రేమించుకుందాం” అనే లెవెల్లో మాట్టాడతాయి ఇందులో పాత్రలన్నీ “ప్రేమ” విషయంలో. “ప్రేమ” అనే పదాన్ని మనుషులు క్రియారూపంలో వాడటం మానేస్తే ఎంత బాగుంటుందో! చవకబారు పాత్రలకి ఉన్నత, ఉదాత్తత కలిగించాలని ప్రయత్నించినట్టు వుంది ఈ కధ.
మనుచరిత్ర, క్రీడాభిరామం లాంటి ఆణిముత్యాలను మీ గ్రంధాలయం అను ముత్యాలపేరు కి జత చేర్చినందుకు ధన్యవాదాలు. అందరికి బాగా అర్దమయ్యేవిధంగా తాత్పర్యము కుడా ఇవ్వగలిగితే బాగుంటుంది.
“డబ్బు ( money) ఒక్కటి ఉంటే చాలు దానిని ఎలా సంపాయించినా సరే; మనస్సు ముచ్చటపడేవి తీర్చుకోగలగడం దాని ప్రయోజనం; అలా తీర్చుకోవడం వల్ల కలిగే అనుభవమే సుఖం ఇది … “మ్లేఛ్ఛభావన” … పాశ్చాత్యభావన.
నాకంటూ ఒక ప్రవృత్తి (స్వభావం innate nature ) ఉంది; ఆ ప్రవృత్తికి తగిన పనిని ఎంచుకుని సమాజరూపంగా ఉన్న వాసుదేవుణ్ణి (the all-pervading consciousness ) సేవించినట్లయితే, నా శరీరపోషణ వేరే ప్రయత్నం అక్కరలేకుండా దానంతటదే సాగిపోతుంది; … ఇదీ సనాతనమైన భారతీయ భావన.”
పుట్టుకతోనే నిర్ణయించిన పనిని చెయ్యడం మన ధర్మం. కాదంటే అది నేరం, పాపం. అదీ కొన్ని వందల ఏళ్ళగా భారతీయ సామాజిక జీవిత వాస్తవం. దాని ఫలితంగా కళ్ళముందే ఉన్న కఠోర జీవితాన్ని కాస్తయినా గ్రహించకుండా , “ఓహో, జీవితం గురించి ఎంత సనాతనమైన గొప్ప భావన మనది,” అని రాస్తే నమ్మేదెవరు? నిజ జీవితాలకి కాస్తన్నా విలువనిచ్చేవాళ్ళు మాత్రం కాదు. తగుదునమ్మా అని పాశ్చాత్య చింతన గురించి కించిత్ అవగాహన గూడా లేని పోలికలతో బడాయిలు!
మరొక దేశానికి వెళ్లకుండా, చూడకుండా ఉత్తమముగా రాయవచ్చు.
క్రిస్తమస్ సమయములో Silver Skates అనే చిత్రాన్ని టీవీలో
అప్పుడప్పుడు చూపిస్తుంటారు. దీని మూలము Mary Mapes Dodge రాసిన
Hans Brinker or the Silver Skates అనే పుస్తకము. నేను బహుశా
20 ఏళ్లకు ముందు ఈ చిత్రాన్ని టీవీలో చూచాను. తరువాత
ఏదో పాత పుస్తకాల కొట్టులో పుస్తకాన్ని కూడ కొని చదివాను.
ఇది పిల్లల పుస్తకము, 1865లో రాయబడింది. ఇందులో Hans and Gretel
అనే ఇద్దరు పిల్లల తండ్రికి ఆరోగ్యము బాగు లేదు. అక్కడ సమీపములో
ఉండే నగరంలో ఒక స్కేటింగ్ పోటీ జరుపుతారు. అందులో విజేతలకు
వెండి స్కేట్స్ బహూకరిస్తారు. ఆ పోటీలో ఈ పిల్లలు పాల్గొంటారు.
ఆ కుటుంబం కష్టాలు కూడ తీరుతాయి. పిల్లలు తమ గ్రామంనుండి
ఎలా వెళ్తారు, ఎలా స్కేట్ చేస్తారు, ఆ కాలములో హాలండ్ దేశపు
పరిస్థితులు, నైసర్గిక వర్ణన, ఇత్యాదులు చాల చక్కగా ఈ పుస్తకములో
ఉన్నాయి. ఇందులో గమ్మత్తేమంటే శ్రీమతి డాడ్జి అమెరికా దేశములో నుండి
ఈ పుస్తకాన్ని రాశారు. ఆమె హాలండ్ దేశంపై కాలు పెట్టలేదు.
ఇప్పటి కాలానికి వస్తే, చాల దేశాల నగరాల మ్యాపులు గూగుల్ ద్వార
చూడవచ్చు. (నాకు ఎప్పుడైనా బెంగళూరు, మదరాసు, ఇత్యాదులపై
మమకారము కలిగితే ఈ మ్యాపుల ద్వార రహదారులను, భవనాలను చూచి
ఆనందిస్తా.) Internet ద్వారా అన్ని విషయాలు సేకరించుకోవచ్చు.
ఒక దేశంలో కాలు పెట్టకుండా ఆ దేశంపై రాయడం అంత కష్టం
కాదనుకొంటాను.
ఆ సూత్రం ప్రవాసంలో ఉండి వచ్చినవాళ్ళకి వర్తించదని నేననలేదు. తప్పకుండా వర్తిస్తుంది. నిజానికి, నేను లక్ష్మన్న గారితో కొంతవరకే ఒప్పుకుంటాను అంటూ, ఆయన అన్నదాంట్లో నేను అంగీకరించని విషయమొకటుందని ఓ ఉదాహరణతో పాటు వివరించాను. (పేరివ్వడం మర్చిపోయాను – పి. సత్యవతి గారి “మంత్రనగరి”)
మరో ఉదాహరణ ఇచ్చి విరమిస్తాను. ఉన్నవ రాసిన “మాలపల్లి” కి ఇతివృత్తం పల్లెలో ఉండే ఓ దళిత కుటుంబం. ఉన్నవ దళితుడు కాడు; వాళ్ళ జీవితానికీ ఆయన జీవితానికీ చెప్పుకోదగ్గ తేడా ఉంది. అయినా గూడా వాళ్ళ జీవితం గురించిన ప్రత్యక్ష అనుభవం ఆయనకుంది – ఎందుకంటే వాళ్ళూ ఆయన ఉండే సమాజంలో భాగమే. ఎంత ఊహాశక్తి గల రచయిత అయినా తను వేరే సమాజంలో ఉంటూ “మాలపల్లి” లాంటిది రాయలేడు అని నా నమ్మకం. రాస్తే అది కత్తిమీదసాము లాగుంటుంది.
“మనం ఇంటర్నెట్ యుగంలో కొచ్చాం, ప్రపంచమంతా ఒక చిన్న కుటుంబం,” అంటే నేనొకటడుతాను. గత వంద సంవత్సారాలలో అనేక దేశాల్లో అనేక మార్పులొచ్చాయి. ప్రచార సౌకర్యాలలో ఊహించలేనంత మార్పులొచ్చాయి. కాస్త విద్యావంతులైన వాళ్ళకి వేరే దేశాల్లోని జీవితాల గురించి కొంతవరకైనా తెలుసుకోడానికి అవకాశం కలిగింది. కాని రచయితలెవరైనా కేవలం తమ ఊహా శక్తి నుపయోగించి తామెప్పుడన్నా నివసించిన దేశంలో కాక వేరే దేశంలో ఉన్న మనుషుల జీవితాలని ఇతివృత్తంగా తీసుకొని గొప్ప సాహిత్యం సృష్టించారా? సృష్టిస్తే, తెలుగులో కానీ ఇంగ్లీషులో కానీ, దయచేసి కొన్ని పేర్లివ్వండి.
నేను శ్రీనివాస్ నాగులపల్లి గారితో ఏకీభవిస్తాను. కొడవళ్ళ వారు అన్నారు “ఎందుకంటే వీళ్ళ గురించి రాయడానికి వాళ్ళ జీవితంతో కావలసిన ప్రత్యక్షమైన అనుభవం వేరే వాళ్ళకుండే అవకాశం వుంది.” మరయితే, ఈ సూత్రం ప్రవాసం నుంచి తిరిగివచ్చి స్వదేశంలో స్థిరపడినవారికీ వర్తిస్తుంది కదండీ. ఎవరికి సంబంధించిన విషయాలు వారే రాయాలి అంటే, ఇక ఉహా రచనలకి స్థానం లేనట్టే. గొప్పగొప్ప కావ్యాలు అన్నీ ఊహాశక్తితో రాసినవే. అనుభవించో, మరొకరి నోట విని రాసినవి కాదు. ఇటువంటి ఆంక్షలు అభిలషణీయం కాదని నా అభిప్రాయం.
కృష్ణ ప్రేమ గురించి పాఠకుడు గారి అభిప్రాయం:
01/28/2008 1:29 pm
ఇలాంటి గందరగోళం కధని ఈ మధ్య కాలంలో ఎక్కడా చదవలేదు. చివర్లో శివరావే చలపతిని ప్రయోగించాడని చెప్పి, ఇంకా గందరగోళ పెట్టాల్సింది. ప్రాక్టికాలిటీ అనే పేరుతో ప్రతీ పాత్రా ఎంత అతి తెలివిగా మాట్టాడుతాయో. “సాయంకాలం పార్కుకు వస్తావా, రాధా, మనం ప్రేమించుకుందాం” అనే లెవెల్లో మాట్టాడతాయి ఇందులో పాత్రలన్నీ “ప్రేమ” విషయంలో. “ప్రేమ” అనే పదాన్ని మనుషులు క్రియారూపంలో వాడటం మానేస్తే ఎంత బాగుంటుందో! చవకబారు పాత్రలకి ఉన్నత, ఉదాత్తత కలిగించాలని ప్రయత్నించినట్టు వుంది ఈ కధ.
-పాఠకుడు
ఈమాట కొత్త వేషం గురించి Vasu Bojja గారి అభిప్రాయం:
01/28/2008 5:13 am
ఈమాట చాలా బాగుంది, కొత్త రూపులో. మీకు అభినందనలు. అసలు తెలుగు లొ వెబ్ సైటుని ఎలా నిర్మించాలో ఒక పాఠము తయారు చేసి పెట్టండి.
వందనములతొ,
వాసు.బొజ్జ
శ్మశానవాటి (పేరడీ) గురించి Sree గారి అభిప్రాయం:
01/28/2008 3:46 am
స్టాక్ మార్కెట్ స్థితిగతులను గుర్రంగారి సాక్షిగా అద్భుతంగా సాక్షాత్కారింపచేసారు. ధన్యవాదాలు.
క్రీడాభిరామము:1 వ భాగం గురించి Ramakumar D గారి అభిప్రాయం:
01/28/2008 2:13 am
మనుచరిత్ర, క్రీడాభిరామం లాంటి ఆణిముత్యాలను మీ గ్రంధాలయం అను ముత్యాలపేరు కి జత చేర్చినందుకు ధన్యవాదాలు. అందరికి బాగా అర్దమయ్యేవిధంగా తాత్పర్యము కుడా ఇవ్వగలిగితే బాగుంటుంది.
మహాభారతం ఏం చెప్తుంది? ఒక కొత్త కోణం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/26/2008 10:36 pm
“డబ్బు ( money) ఒక్కటి ఉంటే చాలు దానిని ఎలా సంపాయించినా సరే; మనస్సు ముచ్చటపడేవి తీర్చుకోగలగడం దాని ప్రయోజనం; అలా తీర్చుకోవడం వల్ల కలిగే అనుభవమే సుఖం ఇది … “మ్లేఛ్ఛభావన” … పాశ్చాత్యభావన.
నాకంటూ ఒక ప్రవృత్తి (స్వభావం innate nature ) ఉంది; ఆ ప్రవృత్తికి తగిన పనిని ఎంచుకుని సమాజరూపంగా ఉన్న వాసుదేవుణ్ణి (the all-pervading consciousness ) సేవించినట్లయితే, నా శరీరపోషణ వేరే ప్రయత్నం అక్కరలేకుండా దానంతటదే సాగిపోతుంది; … ఇదీ సనాతనమైన భారతీయ భావన.”
పుట్టుకతోనే నిర్ణయించిన పనిని చెయ్యడం మన ధర్మం. కాదంటే అది నేరం, పాపం. అదీ కొన్ని వందల ఏళ్ళగా భారతీయ సామాజిక జీవిత వాస్తవం. దాని ఫలితంగా కళ్ళముందే ఉన్న కఠోర జీవితాన్ని కాస్తయినా గ్రహించకుండా , “ఓహో, జీవితం గురించి ఎంత సనాతనమైన గొప్ప భావన మనది,” అని రాస్తే నమ్మేదెవరు? నిజ జీవితాలకి కాస్తన్నా విలువనిచ్చేవాళ్ళు మాత్రం కాదు. తగుదునమ్మా అని పాశ్చాత్య చింతన గురించి కించిత్ అవగాహన గూడా లేని పోలికలతో బడాయిలు!
కొడవళ్ళ హనుమంతరావు
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి mOhana గారి అభిప్రాయం:
01/26/2008 1:48 pm
మరొక దేశానికి వెళ్లకుండా, చూడకుండా ఉత్తమముగా రాయవచ్చు.
క్రిస్తమస్ సమయములో Silver Skates అనే చిత్రాన్ని టీవీలో
అప్పుడప్పుడు చూపిస్తుంటారు. దీని మూలము Mary Mapes Dodge రాసిన
Hans Brinker or the Silver Skates అనే పుస్తకము. నేను బహుశా
20 ఏళ్లకు ముందు ఈ చిత్రాన్ని టీవీలో చూచాను. తరువాత
ఏదో పాత పుస్తకాల కొట్టులో పుస్తకాన్ని కూడ కొని చదివాను.
ఇది పిల్లల పుస్తకము, 1865లో రాయబడింది. ఇందులో Hans and Gretel
అనే ఇద్దరు పిల్లల తండ్రికి ఆరోగ్యము బాగు లేదు. అక్కడ సమీపములో
ఉండే నగరంలో ఒక స్కేటింగ్ పోటీ జరుపుతారు. అందులో విజేతలకు
వెండి స్కేట్స్ బహూకరిస్తారు. ఆ పోటీలో ఈ పిల్లలు పాల్గొంటారు.
ఆ కుటుంబం కష్టాలు కూడ తీరుతాయి. పిల్లలు తమ గ్రామంనుండి
ఎలా వెళ్తారు, ఎలా స్కేట్ చేస్తారు, ఆ కాలములో హాలండ్ దేశపు
పరిస్థితులు, నైసర్గిక వర్ణన, ఇత్యాదులు చాల చక్కగా ఈ పుస్తకములో
ఉన్నాయి. ఇందులో గమ్మత్తేమంటే శ్రీమతి డాడ్జి అమెరికా దేశములో నుండి
ఈ పుస్తకాన్ని రాశారు. ఆమె హాలండ్ దేశంపై కాలు పెట్టలేదు.
ఇప్పటి కాలానికి వస్తే, చాల దేశాల నగరాల మ్యాపులు గూగుల్ ద్వార
చూడవచ్చు. (నాకు ఎప్పుడైనా బెంగళూరు, మదరాసు, ఇత్యాదులపై
మమకారము కలిగితే ఈ మ్యాపుల ద్వార రహదారులను, భవనాలను చూచి
ఆనందిస్తా.) Internet ద్వారా అన్ని విషయాలు సేకరించుకోవచ్చు.
ఒక దేశంలో కాలు పెట్టకుండా ఆ దేశంపై రాయడం అంత కష్టం
కాదనుకొంటాను.
విధేయుడు – మోహన
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/26/2008 1:07 pm
వికటకవి గారూ,
ఆ సూత్రం ప్రవాసంలో ఉండి వచ్చినవాళ్ళకి వర్తించదని నేననలేదు. తప్పకుండా వర్తిస్తుంది. నిజానికి, నేను లక్ష్మన్న గారితో కొంతవరకే ఒప్పుకుంటాను అంటూ, ఆయన అన్నదాంట్లో నేను అంగీకరించని విషయమొకటుందని ఓ ఉదాహరణతో పాటు వివరించాను. (పేరివ్వడం మర్చిపోయాను – పి. సత్యవతి గారి “మంత్రనగరి”)
మరో ఉదాహరణ ఇచ్చి విరమిస్తాను. ఉన్నవ రాసిన “మాలపల్లి” కి ఇతివృత్తం పల్లెలో ఉండే ఓ దళిత కుటుంబం. ఉన్నవ దళితుడు కాడు; వాళ్ళ జీవితానికీ ఆయన జీవితానికీ చెప్పుకోదగ్గ తేడా ఉంది. అయినా గూడా వాళ్ళ జీవితం గురించిన ప్రత్యక్ష అనుభవం ఆయనకుంది – ఎందుకంటే వాళ్ళూ ఆయన ఉండే సమాజంలో భాగమే. ఎంత ఊహాశక్తి గల రచయిత అయినా తను వేరే సమాజంలో ఉంటూ “మాలపల్లి” లాంటిది రాయలేడు అని నా నమ్మకం. రాస్తే అది కత్తిమీదసాము లాగుంటుంది.
“మనం ఇంటర్నెట్ యుగంలో కొచ్చాం, ప్రపంచమంతా ఒక చిన్న కుటుంబం,” అంటే నేనొకటడుతాను. గత వంద సంవత్సారాలలో అనేక దేశాల్లో అనేక మార్పులొచ్చాయి. ప్రచార సౌకర్యాలలో ఊహించలేనంత మార్పులొచ్చాయి. కాస్త విద్యావంతులైన వాళ్ళకి వేరే దేశాల్లోని జీవితాల గురించి కొంతవరకైనా తెలుసుకోడానికి అవకాశం కలిగింది. కాని రచయితలెవరైనా కేవలం తమ ఊహా శక్తి నుపయోగించి తామెప్పుడన్నా నివసించిన దేశంలో కాక వేరే దేశంలో ఉన్న మనుషుల జీవితాలని ఇతివృత్తంగా తీసుకొని గొప్ప సాహిత్యం సృష్టించారా? సృష్టిస్తే, తెలుగులో కానీ ఇంగ్లీషులో కానీ, దయచేసి కొన్ని పేర్లివ్వండి.
కొడవళ్ళ హనుమంతరావు
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి వికటకవి గారి అభిప్రాయం:
01/24/2008 1:53 pm
నేను శ్రీనివాస్ నాగులపల్లి గారితో ఏకీభవిస్తాను. కొడవళ్ళ వారు అన్నారు “ఎందుకంటే వీళ్ళ గురించి రాయడానికి వాళ్ళ జీవితంతో కావలసిన ప్రత్యక్షమైన అనుభవం వేరే వాళ్ళకుండే అవకాశం వుంది.” మరయితే, ఈ సూత్రం ప్రవాసం నుంచి తిరిగివచ్చి స్వదేశంలో స్థిరపడినవారికీ వర్తిస్తుంది కదండీ. ఎవరికి సంబంధించిన విషయాలు వారే రాయాలి అంటే, ఇక ఉహా రచనలకి స్థానం లేనట్టే. గొప్పగొప్ప కావ్యాలు అన్నీ ఊహాశక్తితో రాసినవే. అనుభవించో, మరొకరి నోట విని రాసినవి కాదు. ఇటువంటి ఆంక్షలు అభిలషణీయం కాదని నా అభిప్రాయం.
అబద్ధంలో నిజం గురించి swaroopa గారి అభిప్రాయం:
01/23/2008 3:48 am
అబద్దమే నిజమౌతుంది కొన్ని సార్లు. నిజమే అబద్దమౌతుంది మరి కొన్ని సార్లు. అదే కదా జీవితము
కొడుకుల శివరాం భాగవత గానం గురించి Raj గారి అభిప్రాయం:
01/22/2008 9:22 pm
చాలా బాగా ఉన్నది.. నాకు చాలా సంతోషము అయినది..