Comment navigation


15549

« 1 ... 1427 1428 1429 1430 1431 ... 1555 »

  1. శబ్ద తరంగాలు గురించి ramakrishnamurty గారి అభిప్రాయం:

    02/14/2008 3:28 am

    చాలా ఆనందం కలిగింది. నా అభిమాన మహాకవులు శ్రీ కృష్ణశాస్త్రి, శ్రీ విశ్వనాథల స్వరం వినగలగటం నా అదృష్టం.

    నా వయస్సు 60 సంవత్సరాలు.అమెరికాలో ఉన్న మా అబ్బాయి ఈ వయసులో కంప్యూటర్ నేర్పటం వల్లఈమాట లాంటి ఉత్తమ ప్రమాణాలుగల పత్రికను చదవ గలుగుతున్నాను.శీర్షికలన్నీ బాగున్నాయి. క్రమంగా రాబోయే సంచికలు కూడా పంపించవలసినదిగా ప్రార్థన.

    -కొంపెల్ల రామకృష్ణ మూర్తి.

  2. తీన్‌ కన్యా గురించి పాఠకురాలు గారి అభిప్రాయం:

    02/10/2008 12:54 pm

    లైలా యెర్నేనీ,

    మీ కామెంటు చదివాను. “ఈమాట” లో ఒక కధ మీద అభిప్రాయం గానీ, ఇంకొకరి అభిప్రాయం మీద అభిప్రాయం గానీ రాయాలంటే, సొంత పేరు వుపయోగించి తీరాలా? పెన్ నేమ్ వుండకూడదా? నేను రాసిన దాంట్లో వున్న భావనలని చూస్తారా, నా పేరు చూస్తారా? నా పేరూ, నా కులగోత్రాలూ, ఎందుకూ, నేను రాసిన అభిప్రాయం పరిశీలించడానికీ?

    ఈ మాట సంపాదకులు పాఠకులు కామెంట్లు రాసేటప్పుడు, తమ సొంతపేర్లని వాడమని అడిగారే గానీ, దాన్ని రూలుగా పెట్టలేదు. రాసిన కామెంటులో అసభ్యతా, పొగరుమోత్తనం, తిట్లూ, వగైరా లాంటీ చెత్త లేనంత వరకూ రక రకాల విమర్శలతో కూడిన కామెంట్లని, ఈమాట సంపాదక వర్గం “ఎడిట్” చేసి, వేసుకుంటూనే వుంది.

    అయినా ఎవరైనా ఏమయినా రాస్తే, ఏం రాశారో అన్నది ప్రధానం. ఎవరు రాశారన్నది సెకండరీ విషయం.   నా భావనలని స్పష్టంగా చెప్పడానికి నా పేరు అనవసరం. చెప్పే అవసరం వుందని నేననుకున్నప్పుడు, నేనే చెప్పుకుంటాను. లిమిట్సులో పాక్షికంగా ఒకటీ, రెండూ కామెంట్లు చేద్దామనుకున్నప్పుడు, అసలు పేరు రాయాల్సిన అవసరం వుందని నేననుకోను. నా పేరు లేదు కాబట్టి, నేను రాసింది చదవను అని అనుకుంటే, అది మీ ఇష్టం. అందులో బలవంతం చేసేదేమీ వుండదు.

    నేను వీలైనంతవరకూ వ్యక్తిగత విమర్శలు చెయ్యను రచనల విషయంలో. అయితే వారు రాసిందానికీ, పబ్లిక్ లో వారి ప్రవర్తనలకీ పొత్తు కుదరనప్పుడు అది వేరే సంగతి. ముఖ్యంగా ఈమాటలో ఒకరు రాసింది మాత్రమే చూస్తాను. ఆ మేరకే, ఆ విషయాలని గానీ, ఆ విషయాల వెనకున్న ఆ రచయిత/త్రుల వుద్దేశ్యాలను గానీ పరిశీలించడానికి ప్రయత్నిస్తాను. అనవసరమైన విషయాల జోలికి పోను అనవసరంగా.ఇంతే ఈ విషయం మీద నేను స్పష్టంగా చెప్పదల్చుకున్నది.

    – పాఠకురాలు

    (This comment has been edited — Editors)

  3. కోవెలలో పకపకలు గురించి kosyasura గారి అభిప్రాయం:

    02/09/2008 10:02 am

    ఏదో నారాయణ హాస్యానికన్నమాటల్ని మరీ అలా పట్టించుకోకండి.
    అసలు ఇది కధగా కాకుండా ఒక చైతన్య స్రవంతి గా చదువుతే చాలా బాగుంటుంది.
    ( ఐనా తెలుగువాడు హాస్యప్రియుడన్నవాడెవడండి. మనవాళ్ళంత సీరియస్ మనుషులు ఇంకెక్కడా లేరనుకోండి )
    అలా సరదాగా నవ్వుకోడానికి బాగుంది.
    అన్నట్టు ఫణిగారు, పోతనగారి మీద మీ అభిప్రాయం ఆంధ్రజ్యోతిలో చదివాను. బాగుంది

  4. తీన్‌ కన్యా గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    02/08/2008 4:26 pm

    పాఠకురాలూ!
    మీకు ఇంకా నామకరణ మహోత్సవమే జరగలేదుకదా! మీకు వేలురితో జయప్రభ తో కన్యాత్వం మీద చర్చ ఎందుకండి? ముందు uterus లోంచి బైటికి వచ్చి అమ్మా నాన్నతో పేరు పెట్టించుకుని, అప్పుడు మీ ఉంగా ఉంగా బంగరు భావనలను స్పష్టంగా చెబుదురుగాని.

  5. తీన్‌ కన్యా గురించి పాఠకురాలు గారి అభిప్రాయం:

    02/08/2008 11:29 am

    వేలూరిగారి గురించి జయప్రభగారు అన్నది కరెక్టే. ఆయన విమర్శల విషయంలోగానీ, మెచ్చుకోళ్ళ విషయంలో గానీ హుందాగా వుంటారు. ప్రతీదానికీ కలగజేసుకోరు. అయితే చిక్కల్లా, అవసరమైన చోట కూడా ఆయన ఏమీ అనరు. సమాధానంచెప్పడం, చెప్పకపోవడం ఆయన హక్కు అనుకోండీ. అది అందరం ఒప్పుకుంటాం. ఇక్కడ హక్కుల గురించి మాట్టాడ్డం లేదు కదా? ప్రతీ విషయంలోనూ మౌనంగా వుండటం వల్ల, ఆయన గంభీరత్వాన్ని (పాఠకుల కామెంట్ల విషయంలో) ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాదు అప్పుడప్పుడు. మొత్తానికి ఆయనంటే గౌరవమే గానీ, వేరే అభిప్రాయం లేదు.

    మొదటగా ఈ కధ పేరు గురించి. “తీస్ కన్య” ఈ కధ పేరు. జయప్రభ గారు కూడా “కన్యల” గురించి తన అభిప్రాయాలు రాశారు. “కన్య”, “కన్యాదానం”, “కన్యాత్వం”, వగైరా లాంటీ మాటలు స్త్రీలకి గౌరవం కలిగించేవేనా? ఇటువంటి మాటలు పురుషులకి లేవు కదా? ఇటువంటి ఎబ్బెట్టు మాటలు స్త్రీల పట్ల వాడటాన్ని, ఫెమిస్టులు సమర్థిస్తారా? పురుషాధిక్యత కలిగిన సమాజం లోంచి కొట్టుకు వచ్చిన ఈ పదజాలాన్ని, స్త్రీలని గౌరవించేవారు అంగీకరించాలా?

    ఇకపోతే, జయప్రభగారు, “పెద్దచదువులు చదుకొని, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, స్వతంత్రభావాలు ఎన్ని ఉన్నా, — గౌరవనీయమైన కుటుంబాలనించి వచ్చిన అమ్మాయిలు, తల్లితండ్రుల మాటలకి, సంప్రదాయానికీ గౌరవం ఇవ్వడం తప్పేమీ కాదు. పైగా, అది వాళ్ళ పరిపక్వతకి నిదర్శనం.” అని రాశారు. ఈ తప్పొప్పులు ఎవరి దృష్టిలో? స్త్రీ,పురుష సమానత్వం గురించి మాట్టాడే వారి దృష్టిలో కూడానా? ఏ కారణం చేత కానీయండీ, ఒక స్త్రీ “కన్యాదానం” చేయించుకుంటే, అది ఎవరికి తప్పు కాకుండా వుంటుందీ? స్త్రీ మెడ ఒంచి, ఒక పురుషుడి చేత పసుపు తాడు కట్టించుకుంటే, అది ఎవరికి తప్పు కాకుండా వుంటుందీ? తమని చూడ్డానికి వచ్చే పెళ్ళికొడుకుల్లో, “కాస్త నాగరీకులైన పెళ్ళికొడుకుల” కోసం చూడ్డం కూడా ఆ స్త్రీలకి గౌరవమైన విషయమేనా? ఇటువంటి పరిస్థితులు పురుషులకి కూడా వుంటాయా? ఈ “పెళ్ళిచూపులు” అనే సాంప్రదాయం ఏ విధంగా స్త్రీ,పురుష సమానత్వాన్ని సమర్థిస్తుందీ, ఫెమినిస్టు సిద్ధాంతం ప్రకారం?

    పెద్దవాళ్ళు చూపించిన సంబంధాన్ని పరిశీలించడం వేరూ, స్త్రీలని అగౌరవపరచే సాంప్రదాయ పద్ధతిలో ఆ సంబంధాన్ని పరిశీలించడం వేరూ. ఒక పురుషుడి ఇంటికి అతని పెద్దవాళ్ళు చూపించిన సంబంధం స్త్రీలు వెళ్ళి, ఆ పురుషుడిని పరిశిలించే పద్ధతి కూడా వుంటే, ఆ విషయం వేరూ. భర్త చేత దెబ్బలు తిన్న ఒక స్త్రీ, దాన్ని అగౌరవంగా తీసుకోనంత మాత్రాన, ఆ విషయం స్త్రీలకి గౌరవం కలిగించేదిగా అయిపోదు. స్త్రీ, పురుష సమానత్వ విషయాల్లో పురుషులే కాదు, స్త్రీలు కూడా చాలా తప్పుగా ప్రవర్తిస్తూ వుంటారు ఎన్నోసార్లు. అంతమాత్రాన ఆ విషయాలన్నీ కరెక్టయి పోవు.

    ఇక్కడో చిన్న సరదా విషయం. జయప్రభగారు ఇలా రాశారు: “అమెరికా నుంచివచ్చినా, కాస్త నాగరీకులయిన పెళ్ళికొడుకులు రావచ్చుగా! “. ఆంటే ఏమిటీ? అమెరికా నుంచి వచ్చే పెళ్ళికొడుకులు సాధారణంగా నాగరీకులు కారనా? కొంతమంది మాత్రం నాగరీకులుగా వుండొచ్చనా? సరదాగా వుంది, అమెరికా పెళ్ళికొడుకులకిచ్చిన చురక!

    ఒక స్త్రీకి తన కిష్టమయిన పద్ధతిలో వుండే హక్కు ఎప్పుడూ వుండాలి, ఒక పురుషుడికి వున్నట్టే. దాన్ని ఎవరూ వ్యతిరేకించకూడదు. ఈ హక్కు ప్రకారం, ఆ స్త్రీ ఇష్టమైతే సాంప్రదాయ పెళ్ళిచూపులకీ, సాంప్రదాయ పెళ్ళిళ్ళకీ ఇష్టపడొచ్చు. అది ఆ స్త్రీ వ్యక్త్రిగత విషయం అవుతుంది. అది ఆ స్త్రీ స్వేచ్చకి సంబంధించిన విషయం అవుతుంది. కానీ ఈ విషయాన్ని పబ్లిక్ లోకి తీసుకువచ్చి, అది స్త్రీలని అగౌరవ పరిచే విషయం కాదూ అని వాదిస్తే, దానికి సమాధానం చెప్పడానికి స్త్రీలే కాదు, పురుషులు కూడా ముందుకు రావొచ్చు. ఎటొచ్చీ వారు స్త్రీ,పురుష సమానత్వం గురించి సరిగా అర్థం చేసుకోవాలంతే!
    బీ. యే. డిగ్రీ గురించి నేనడిగింది ఒక చిన్న ప్రశ్న మాత్రమే. అది విమర్శ కాదు. “అయినా ఇదో పెద్ద విషయం కాదు లెండి” అని కూడా అన్నాను. అమెరికాలో బీ. యే. డిగ్రీ ఇస్తారనే అన్నాను. అవేమీ పట్టించుకోకుండా, జయప్రభగారు, నేనేదో విమర్శ చేశానని, ఈ విషయంలో చాలా ముచ్చటగా విడ్డూరపడ్డారు. ఒక చిన్న టెక్నికాలిటీకి సంబంధించిన విషయంలో చర్చ అనవసరం.
    ఒక కవిత చదివి, దాని భావం ఇదీ అని తలో పాఠకుడూ తలో విధంగా అనుకునే రోజులు ఇవి. తమకి అర్థమైనన భావం వేరే వారికి అర్థం కాకపోతే, ఆ వేరేవారు తక్కువ స్థాయికి చెందినవారు అని అనుకునే రోజులు ఇవి. అలాంటి రోజులు కధకి కూడా వచ్చినట్టున్నాయి. అందుకే ఈ మధ్య కధలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థం అవుతున్నాయి. అందుకే ప్రతీవారూ కధ చదివి, రచయిత వుద్దేశ్యం ఇదీ అని తమ భావనల్ని చెప్పుకుంటున్నారు. ఆ విషయాలు కధలోంచే స్పష్టంగా బయటికి వస్తే ఎంతో బాగుంటుందని నా భావన మరి.
    ఈ కధ నెగిటివ్ అని నేనెప్పుడూ అనలేదు. ఇందులో కొన్ని విషయాలు మాత్రమే నెగెటివ్ గా వున్నాయన్నాను. కధ స్పష్టంగా లేదు అని కూడా అన్నాను. మరి అది నా “భావన” కదా?
    చదువుకుని, మంచి మంచి ఉద్యోగాల్లో వున్న అమ్మాయిలు చాలా స్వతంత్రంగా వుంటూ, “పెళ్ళిచూపులకి” దిగడంలో వారికి అగౌరవం ఏమీ లేదన్నట్టేగా? పురుషులు మాత్రమే స్త్రీల ఇళ్ళకి వెళ్ళి చూడ్డం, గట్రా లాంటీ పద్ధతులున్న పెళ్ళిచూపుల గురించి మాట్టాడుతున్నాను ఇక్కడ. నచ్చని వాళ్ళని తిరస్కరించే పని చాలా మంచి ఉద్యోగాల్లో లేనివాళ్ళూ, గొప్పగా చదువుకోని వాళ్ళూ కూడా చేసే రోజులివి. డాక్టరేట్ డిగ్రీ వుంటేనేగానీ, నచ్చని వాళ్ళని తిరస్కరించకూడదూ అని ఎవరూ అనడం లేదు. అంటే నచ్చని వాళ్ళని తిరస్కరించడానికి పెద్ద చదువులూ, మంచి వుద్యోగాలూ అక్కరలేదనేగా అర్థం? చిన్న మనసు వుంటే చాలు.

    మొత్తానికి ఈ కధ చాలా విషయాల్లో నాకు అసంతృప్తినే కలగజేసింది. అభ్యుదయ రచయిత/త్రులు ఇలాంటి కధలు రాసినప్పుడు మాత్రమే ఇలా అనిపిస్తుంది. నా భావాలు ఎవరినైనా నొప్పిస్తే, మన్నించండి.

    – పాఠకురాలు

  6. తీన్‌ కన్యా గురించి siri గారి అభిప్రాయం:

    02/07/2008 9:59 am

    మొత్తమ్మీద తీన్ కన్యా కథ నాకు నచ్చింది. మిగిలిన పాఠకులు కథ గురించి చెప్పిన మంచి విషయాలతో ఏకీభవిస్తూ…నా అభిప్రాయాలు వ్రాస్తున్నానిక్కడ.
    అమ్మాయిలు పెళ్ళయ్యాక అమెరికా వస్తారా లేదా అన్నది తెలుసుకోకుండానే పెళ్ళి చూపుల తంతు సాధారణంగా మొదలు కాదు! ఈ విషయంలో కథ అవాస్తవంగా అనిపిస్తోంది.
    ఒక వేళ, అబ్బాయిని అస్సలు సంప్రదించకుండా అతనికి సర్ప్రిజ్ ఇద్దామని ఇలాంటి ఏర్పాటు చేసారనుకోవడానికి కూడా కథలో సూచనలు లేవు!
    బావురు మనడం, బుగ్గ గిల్లడం, నేల మీద కాలి వేలుతో సున్నాలు చుట్టడం, బోషాణాల్లాంటి సూట్ కేసులు లాంటి వాక్యాలు ఈ కథా ధోరణిలో ఇమడలేదు అనిపించింది.

    సిరి

  7. యాత్ర గురించి indraprasad గారి అభిప్రాయం:

    02/07/2008 8:53 am

    జనవరి పిత్త్స్ బర్గ్ బావుంది. మంచి ఇమేజెరీ. నదిని బాగా చెప్పేరు

  8. ఓహో యాత్రికుడా.. గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    02/07/2008 8:06 am

    శ్రీ సాలూరు రాజేశ్వరరావుగారు సినీసంగీత దర్శకులుగా మాత్రమే చాలామందికి తెలుసు. తెలుగు లలిత సంగీతంలో కూడా ఆయన ఎన్నో మంచి పాటలకి స్వరరచన చేయడమే కాకుండా వాటిని అద్భుతంగా గానం చేయడం జరిగింది. తెలుగు లలిత సంగీతానికి ఆయన నిర్వచనం ఇచ్చారనడంలో ఎటువంటి అతిశయం లేదు. “ఓహో యాత్రికుడా…”, “భారత భేరీ మ్రోగిందోయి…” లాంటి పాటలే దీనికి ఉదాహరణలు.

  9. తీన్‌ కన్యా గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    02/06/2008 11:54 am

    అమెరికా వెళ్ళగానే పెళ్ళికాని కుర్రాళ్ళ విలువ “మార్కెట్లో” పెరిగిపోతుంది. అమెరికావంటి ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ వారు సీదాసాదా కోరికలతో మామూలు జీవితాలనే గడుపుతూ ఉంటారు. ఇండియాలో మాత్రం వారి తాహతుకి సరితూగగల సంబంధాలు చూడాలనే ప్రయత్నాలు జరుగుతాయి. అటువంటి హైలీ క్వాలిఫైడ్ పెళ్ళికూతుళ్ళని చూసినప్పుడు కుర్రాళ్ళకి కలిగే అయోమయమే ఈ కథకి ప్రధానవస్తువుగా అనిపిస్తుంది. కథలో వాస్తవికత ఏమీ దెబ్బతినలేదు.

  10. తీన్‌ కన్యా గురించి Dr. V.Jayaprabha గారి అభిప్రాయం:

    02/04/2008 3:52 pm

    వేలూరిగారు తను రాసిన కథలపైన గానీ, వ్యాసాలపైన గానీ, కనీసం సంపాదకీయాలపైన గానీ వచ్చిన విసుర్లకి, విమర్శలకీ, వాద ప్రతివాదాలకీ, వితండవాదాలకీ, ఈమాటలో సమాధానం ఇవ్వడం చూసినట్టు గుర్తు లేదు. బహశా ఆయనకి అలవాటు లేదేమో! లేదా, సంపాదకుడుగా చూసీచూడనట్టు ఊరికే వుండటం పెద్దమనిషి తరహాయేమో! ఏ దయితేనేం, మిగిలిన రచయితలు మాత్రం కాస్త ఘాటైన విమర్శవస్తే చాలు, వెంటనే తారాజువ్వల్లా లేచి పోవడం చూశాను!

    తీన్ కన్యా కథమీద వచ్చిన విమర్శలు చదివింతర్వాత ఈ కాస్తా చెపు దామనుకుంటున్నాను.

    ముందుగా మూడో అమ్మాయిని గోవిందరావు చూడకపోవడం గురించి. కథని అల్లా సడెన్ గా ఆపెయ్యడం, నాకు చాలా నచ్చింది. ముగింపు పాఠకుల ఊహకి వదలడం, “ఆ అమ్మాయినికూడా చూసి ఉంటే ఏమయ్యేదో?” అనే ప్రశ్న రావడం ( లేకపోతే దిగిలుపడటం), గోవిందరావు మీద జాలి కలగడం, —–అలాగని, ఎంత వెదికినా నిశ్చయమైన సమాధానం దొరక్కపోవడం, కథకి బిగువునిచ్చాయి. అది జీవిత నైజం!

    ఇకపోతే, మిగిలిన ఇద్దరి “కన్యల” గురించీ!

    పెద్దచదువులు చదుకొని, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, స్వతంత్రభావాలు ఎన్ని ఉన్నా, — గౌరవనీయమైన కుటుంబాలనించి వచ్చిన అమ్మాయిలు, తల్లితండ్రుల మాటలకి, సంప్రదాయానికీ గౌరవం ఇవ్వడం తప్పేమీ కాదు. పైగా, అది వాళ్ళ పరిపక్వతకి నిదర్శనం. అమెరికా నుంచివచ్చినా, కాస్త నాగరీకులయిన పెళ్ళికొడుకులు రావచ్చుగా! మా వాళ్ళు చూపించిన సంప్రదాయ సంబంధాలని మేం చూడం అని భీష్మించుకొని కూచోవడం అనాగరికం. కథలో అమ్మాయిలిద్దరూ చాలా నాగరీకులు; మంచి సంస్కృతి కలవాళ్ళు అని కొట్టవచ్చినట్టు కనపడుతూన్నది.

    కథలో అన్ని వివరాలూ పూసగుచ్చినట్టు ప్రొగ్రాములో లైన్లలా చెప్పేస్తే, అది క్లాసుకోసం రాసే కాంపొజిషన్ అవుతుందేమో కానీ కథ ఎల్లాగవుతుంది?

    బి.యె. డిగ్రీ అన్నది, రవయిత ఒక ఊతపదంగా వాడినట్టుంది. అయినా, లెక్కల్లోను, సైన్సు లోనూ బి.యే డిగ్రీ ఇవ్వడం ఇప్పటికీ కొన్ని చోట్ల, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మామూలే! బి.యే (కెమిస్ట్రీ), బి.యె. (జియాలజీ) ఇవ్వడం నేను స్వయంగా చూశాను. అయినా, అది కథకి ముఖ్యమా? దానిని విమర్శించాలా? కథలో అది లోపంగా కనిపించిందా? ఔరౌరా! ఎంతవిచిత్రం?
    ఈ రోజుల్లో చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్న అమ్మాయిలు చాలా స్వతంత్రంగా ఉన్నట్టు చిత్రించడం, వాళ్ళకీ పెళ్ళిచూపులకని వచ్చిన నచ్చని అబ్బాయిలని తిరస్కరించే హక్కు ఉన్నదని చూపించడం ఈ కథ ముఖ్య ఉద్దేశం అని నా భావన. నిజానికి రచయిత ఆ తిరస్కారాలు చాలా మృదువుగా, subtle గా చెప్పారు, కథలో! A right to say NO is women’s fundamental right too, అని నిరూపిస్తున్న కథ తీన్ కన్యా.

    టాగూరుగారు రాసిన ముగ్గురమ్మాయిలకథలు ఆధారంగా చేసుకొని సత్యజిత్ రాయ్ తీసిన సినిమా (తీన్ కన్యా) లో ముగ్గురు కన్యల కథలకీ, ఈ ముగ్గురు కన్యలూ anticlimax అనచ్చు! బహుశా, అందుకోసమే ఆ టైటిల్ పెట్టారేమో!

    ఆఖరిగా, తీన్ కన్యా మంచి కథ. చక్కగా చదివించిన కథ. ఏదైనా మంచి ఫెమినిస్ట్ కథల సంపుటిలో ఇమిడే కథ!

    రచయితకి నా అభినందనలు.

    వి. జయప్రభ

« 1 ... 1427 1428 1429 1430 1431 ... 1555 »