Comment navigation


15549

« 1 ... 1426 1427 1428 1429 1430 ... 1555 »

  1. ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    02/19/2008 5:45 pm

    ఒక రోజు పొద్దున్నే ఆవేశంతో మొదలెట్టి, ఆ రోజే లంచ్‌కి ముందే పూర్తి చేసిన నా రాతలపై తమ అభిప్రాయాలను చెప్పిన అందరికీ ధన్యవాదాలు.

    పాఠకురాలికి: మీరు చెప్పే దాకా, ప్రతిభావంతులైన తెలుగు స్త్రీలను మర్చిపోయాన్నన్న విషయమే తెలియలా! అసలు నేను ఆ కోణం నుంచి తేడాగా ఎప్పుడూ చూడలా. ఒక్క మనవి. ఎంతో మంది తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, మరెంతో మంది స్త్రీమూర్తుల ప్రేమా, దయ, వాత్సల్యం లేకుండానే తెలుగు తేజోమూర్తులు వృద్ధి లోకి వచ్చారని నేననుకోను. దయచేసి ఇటువంటి తేడాలు మరి తీసుకు రావద్దు.

    సరిపెల్ల వారికి: అయ్యా సూర్యనారాయణ గారూ! 1980 లలో మీతో కలిగిన పరిచయం, మళ్ళీ ఈ మాట ద్వారా గట్టిపడుతోంది. తెలుగు నాట తెలుగు వాడి వ్యవసాయంలో ముఖ్యమైన పంట, వరి. వరి విత్తు నాటాక, కలుపు తీసి మరొక చోట పాతటం అవసరం. అలాగే, తెలుగు వాడు, తెలుగునాట నుంచి బైటకు వచ్చేదాకా, శోభిల్లే అవకాశం ఉండదేమో! నిజానికి రోహిణీప్రసాద్ గారు, ఆంధ్రాలో ఎప్పుడూ నివసించలా! కానీ, ఆయన ముంబాయి నివాసం ఆయన హిందూస్తానీ అభిరుచుల్ని సానపెట్టింది, అని అనుకుంటాను. ఈమాట కోసం మీ ఆస్ట్రేలియా అనుభవాలు పంచుకోమని కోరుతున్నా.

    కొత్తపాళీ గారు: ఇందులో నా వ్యక్తిగత విశేషాలు కేవలం ప్రతీకలే. నేను, నా కన్నా వయస్సులో మాత్రమే చిన్న వారయిన వారికి ఏం చెప్పాలో అన్నదానికి ప్రయత్నమే ఈ నా రచన.

    కొడవళ్ళ హనుమంత రావుగారు, శ్రీనివాస్ నాగుల‌పల్లి, మోహన రావు గారు, వికటకవి గారు : మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు. నేను రాసిన వాటితో అందరూ ఏకీభవించాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఒక దేశం వెళ్ళ కుండా, ఆ దేశం గురించి రాయవచ్చు. అలాంటప్పుడు, రచయిత సమర్ధుడయి, అందరిచేతా “భేష్” అనిపించుకుంటే, ఆ రాత మంచి ఫిక్షన్ అవుతుంది. వాటి గురించి నేను ప్రస్తావించటం లేదు. ప్రవాసాంధ్రులకు స్వానుభవంలోకి వచ్చిన విషయాలు ఎందుకు, ఎలా చెప్ప గల్గాలి అన్న ఆలోచన నా రాతలకి మూలం.

    అందరికీ నమస్కారాలతో,

    లక్ష్మన్న

  2. చెప్పులు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    02/19/2008 12:23 pm

    ఈ కథ నేను ఎలా మిస్సయ్యానో తెలియదు. ఈ కథ ఈమాటలో వచ్చిన రోజుల్లో (నేను ఫ్రాన్స్‌లో ఉద్యోగం చెస్తున్న రోజుల్లో), ఈమాట అంత శ్రద్ధగా చూసేవాణ్ణి కాదు. అందువల్లే మిస్సయి ఉంటాను.

    ఈ కథలో, నేనూ ఒక పాత్రే! జెయుబివితో (ఈ రచయితను మా స్నేహితులకి అలాగే తెలుసు) మళ్ళీ ఈమాట ద్వారా ఇన్నాళ్ళకు కలుసుకున్నా. పాత జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు రచయితకి థాంక్స్!

  3. ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    02/19/2008 6:42 am

    చరిత్రలో నేను ఔరంగజేబు గురించి తెలుసుకొన్న వివరాలకు, ఇక్కడ ముచ్చటించిన వివరాలకు పోలిక లేదు. ఔరంగజేబులో, ఇంత పాండిత్యం, నిశిత పరిశీలన, ముఖ్యంగా ప్రపంచ చరిత్ర, భూగోళ జ్ఞానం తెలుసుకోవాలన్న తపన ఉండటం ఆశ్చర్యమైనదే. భాషపై ఔరంగజేబు పరిశీలన కూడా అభ్యుదయమైనదే!
     

  4. చెప్పులు గురించి Mamatha గారి అభిప్రాయం:

    02/19/2008 6:41 am

    I read lot of stories upto now. But while reading this story I felt really emotional. Thanks a lot for the excellent story.

  5. గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    02/17/2008 9:48 am

    అమీర్ ఖాన్ పాడిన ఒక అరుదైన ఠుమ్రీ ఖమాజ్ రాగంలో వినవచ్చు. http://sarangi.info/sarangi/vocal/amirkhan_khamaj.wma

  6. నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి JP గారి అభిప్రాయం:

    02/16/2008 5:29 am

    తెలుగుని మన తెలుగు వారికి తెలుగు కాని వారికి నేరుపుటకు ఇంటరునెటుని మాధ్యమంగా ఎందుకు ఉపయొగించరాదు? అన్ని ముఖ్య బాషలలొ interactive WEBSITE should be there to learn Telugu. I have seen lot of discussion on extinction of Telugu but I don’t believe it. Because of development of INTERNET medium, we have a good opportunity to teach the language all over the world. Language is also getting richer by adding lot of new words by bloggers all around the world.

    I am able to see lot of rich content, thoughts, affection for the language in blogs. But i have not come accross when web site solely dedicated for learning Telugu. All should start to contribute to develop such a rich and multi media site. This will help every Telugu who don’t know the language to learn language. The site should be developed in such a way that any non-telugu who learns the TELUGU should immediately realise the SWEETNESS of Telugu.

    Sorry, For typing in English as this is 1st time for me to use RTS.

  7. నా మాట గురించి JP గారి అభిప్రాయం:

    02/16/2008 4:40 am

    వేలూరి గారు మీ పరిశీలన బాగున్నది.

  8. చిలక – గోరింక గురించి sai గారి అభిప్రాయం:

    02/16/2008 3:10 am

    కధ బావుంది కాని ఆంగ్లము ఎక్కువ అయింది. ముఖ్యంగా పాత్రలు వాటి గమనము బాగుంది. ఎంత బావా మరదళ్ళు అయినా వాళ్ళ అభిప్రాయాల్లో తేడాల వలన విడి పొవటమే మంచి ముగింపు.

  9. అబద్ధంలో నిజం గురించి Murthy Akella గారి అభిప్రాయం:

    02/15/2008 12:20 pm

    More melodrama, little away from reality, good reading, though.

  10. నా జ్ఞాపకం గురించి yasasvi గారి అభిప్రాయం:

    02/15/2008 8:15 am

    డియర్ వేలూరి,

    అనుకోకుండా మీ సైట్ లోకి రావటము, కొన్ని రచనలని చదవటము జరిగింది.

    congratulations చెప్తాను ముందు. ఎందుకంటే పత్రిక అన్నది – అదీ ఈ formలో కానివ్వండి – నడపటం కొంచెం కష్టమైన విషయమే గనక. అందునా మీరు “ఉత్తమ సాహిత్యం” తెలుగులొ ప్రచురిస్తామని మీ ధ్యేయం గ చెప్పేసరికి కొంచెం ఆసక్తి గ మీ పత్రిక ని browse చేసాను.

    నన్ను మరీ నిరాశ పరిచింది మీరు అచ్చు వేసిన కవిత్వం. బహుశా మీరు మంచి సాహిత్యాన్ని తెలిసిన వారే అయి వుంతారు. మంచి కవిత్వాన్ని కూడ. మీరు ప్రకటించిన ఉత్తమమైన అనే standard లోకి రాకపొతే పొయే, గాని మరీ నేలబారు గ వుంటే ఎలాగండీ?? పద్మలత అయల సొమయాజుల గారి ది కవిత్వమా? భాష లేదు. భావం లేదు. మిగతా వాళ్ళవి కూడ బొత్తిగా బాగులేవు. జంధ్యాల సినిమా లో “తవిక” అని వెక్కిరించిన స్థాయి లొ వున్నాయి. ఉదయకళ అన్న ఆవిడవి కాస్త మెరుగు.

    మీరు ఒక standard ని ప్రకటించాక అంతకు తగ్గ కుండా వుండక పోయినా అసలు కవిత్వం రాయటం రానివాళ్ళవో… రాయలేని వాళ్ళవో ప్రచురించటం poetry కి ద్రోహం చేయటం కాదా??

    am sorry to say this.. కవిత్వం రాయటం చాత కాని వాళ్ళు .. తమ హద్దులు తెలుసుకుని ఆగిపోవటం మంచిది. తెలుగు కవుల మీద గౌరవం వుంటేనూను, తెలుగు పాఠకుల మీద ప్రేమ కాకపోయిన కనీసం జాలి లాంటిది ఉంటేనూను.

    అనేక నమస్కారాలతో,
    యశస్వి

« 1 ... 1426 1427 1428 1429 1430 ... 1555 »