Comment navigation


15549

« 1 ... 1425 1426 1427 1428 1429 ... 1555 »

  1. చెప్పులు గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    02/27/2008 8:09 pm

    అబ్బ! ఏం కథ. కథని మించిన కామెంట్లు. ఎవరండీ ఈ కథారత్నాన్ని ఇన్నేళ్ళ తర్వాత పనికట్టుకుని తవ్వితీసిందీ?

    హీరో! అచ్చంగా ఏడుపు తెలుగు సినిమాలో నాగేశ్వర రావండి. క్లాసు మొరేల్ అంతా కిందికి లాగేశాడండి. రోజూ ఎవరో ఒకరు కన్నీళ్ళు పెట్టుకుంటే తప్ప తృప్తి లేదు. ఎంత సొల్యూషన్ లేని ప్రాబ్లెం? హీరోకి పజ్జెనిమిదేళ్ళ పసిప్రాయం. కెమిస్ట్రీ పాఠాలు వచ్చే బుర్రుంటే , రెండు తోలు ముక్కలు, కాస్త దారం, ఒక దబ్బనం తెచ్చి రెండు చెప్పులు కుట్టుకోలేడండీ? విచిత్రం కాపోతే. ఆడవాళ్ళ రెక్కల కష్టం మీద బతకటం చిన్నప్పుడే అలవాటయిపోయినట్లుంది. కాలేజీకి అన్ని మైళ్ళు నడిసేస్తుంటే, దారిలో ఎన్ని గుళ్ళొస్తాయి. ఒక్క సారి ఏ గుడి దగ్గిర ఆగినా చెప్పులు దొరుకుతాయి. కాలేజీలో జనం అంతా దండాలు పెట్టుకునేవారు, హీరో కి చెప్పులు దొరికినందుకు.

    పాఠకురాలు గాని ఈ కథ చదివితే జె.యు.బి.వి. ప్రసాదుని ఇలాటి కథ రాసినందుకు మూడు పేజీలు ఆపకుండా నిందించేవారు. ఐనా పాఠకురాలు తెలివైనది. ఇలాటి కథ ఆమె చదవదు. మంచి సబ్జెక్టూ, సబ్స్టెన్సూ ఉండాలని వారి అభిలాష. ఈ మధ్యేగా వారి అభిప్రాయాలని పరిశీలించాను. ఒక్క అసలు పేరు చెప్పనన్న మొరాయింపు తప్పిస్తే, ప్రతి అభిప్రాయమూ కొత్త కలమ్ పేరుతో రాయాలన్న వారి ఉత్సాహం ఎవరికి నచ్చదు?

    పేరులో ఏముంది -A rose is a rose is a rose is a rose. కాదా?

    లైలా
    [This comment has been edited – Editors]

  2. సాయము శాయరా డింభకా! గురించి ramya గారి అభిప్రాయం:

    02/26/2008 6:42 am

    చక్కటి కథ, అందరికీ ఎప్పుడో ఓసారి అనుభవమే ఇలాంటివి.
    కొందరు పార్టీలకి, విందులు వినోదాలకి మనతో కల్సినా, వారు చేయగలిగినా చిన్న సాయం కూడా చేయక పోవచ్చు.
    ఇంకొందరు సరదాలు పంచుకోటానికి ఆసక్తి చూపకున్నా,ఫార్మాలిటీస్ పాటించకున్నా అవసర మైన సహాయానికి రావచ్చు.
    ఎవరెలాంటి వారో అనుభవం తరువాతే మనకు తెలిసేది అందుకే మన వాడు పరాయి వాడు అనుకోకుండా మనకి వీలైన వారికి సాయం చేస్తూ పోవటమే.

  3. సప్తపది గురించి raviteja గారి అభిప్రాయం:

    02/25/2008 11:19 pm

    చాలా బాగుంది; నాకు నచ్చింది; మీరు ఇలాగే వ్రాయండి!

  4. చెప్పులు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    02/25/2008 10:57 pm

    చెప్పులు, చదువులు, కొన్ని తీపి గుర్తులు

     బళ్ళో చదువుకున్న రోజులు, కాలేజీ రోజులు, బోంబే ఉద్యోగపు రోజులూ గుర్తొచ్చాయి.

     రెండు మూడేళ్ళ కొకసారి మాఊరు, రావినూతల, వెళ్ళినప్పుడల్లా మాహైస్కూలు కెళ్తాను. పాతవిద్యార్థి వచ్చాడని సంతోషంతో మాష్టార్లు పిల్లల్తో బయట సమావేశం ఏర్పాటుచేసి నన్ను ప్రసంగించమంటారు.

    క్రింద కూర్చున్న పిల్లలని చూస్తే నా చిన్నతనం గుర్తొచ్చి, రెండు తేడాలు కొట్టొచ్చినట్లు కనబడతాయి:

     ఒకటి అల్పమయింది: ఇప్పుడు దాదాపు పిల్లలందరూ చెప్పులేసుకొని ఉన్నారు. అప్పట్లో చెప్పులేసుకొని వచ్చేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు.

     రెండోది అతిముఖ్యమయింది: ఇప్పుడ సగంమంది విద్యార్థులు అమ్మాయిలు. అప్పట్లో పైతరగతులకి వెళ్ళే కొలదీ అమ్మాయిలు పలచబడేవాళ్ళు. 

     ఇంజనీరింగ్ కాలేజీలోనయితే కొన్ని సీనియర్ల బ్యాచ్ లలో అసలు అమ్మాయిలే లేరు! రోజులు మారాయి. కట్నకానుకలు, లాంఛనాలలో మాత్రం పెద్దగా మార్పు లేదు.

     దాదాపు పాతికేళ్ళ క్రితం మొదటి ఉద్యోగం కోసం బోంబే వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ మహా నగరంలో జీవితం తలుచుకొని భయమేసింది – అప్పటిదాకా పల్లెటూరునీ హాస్టళ్ళనీ దాటి బయటక ఉండకపోవడాన. పాత కాలేజీమిత్రులుంటారని IIT కెళ్తే కొందరు కొత్త మిత్రులయ్యారు, తర్వాత సహోద్యోగులయ్యారు – హంస, OVG, నరసింహ – ఫిజిక్సు వాళ్ళు, ఎప్పుడూ పగలబడి నవ్వేవాళ్ళు. వాళ్ళ బృందంలో TIFRలో PhD చేస్తున్న లక్ష్మన్న గూడా ఒకరు. TIFR తీసుకెళ్ళేవాళ్ళు. గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, బ్రహ్మాండమైన మెస్సు! ఒకవైపు Indian Breakfast మరోవైపు Western Breakfast అని చెప్పేవాళ్ళు – Corn Flakes ని వర్ణించేవాళ్ళు.

     ఇలా రాస్తుంటే, నా కాలేజీ మిత్రుడు, కన్నెగంటి చంద్ర రాసిన ”జ్ఞాపకం చాలు నాకు” గుర్తొస్తోంది:

     ”జ్ఞాపకాలెప్పుడూ ఒంటరిగా రావు,
    ఒకదాన్నొకటి తరుముకుంటూ వస్తాయి సముద్రపు కెరటాల్లా!
     వస్తూనే వుంటాయి పెళ్ళికొచ్చే చుట్టాల్లా, తిరునాళ్ళకు జనాల్లా…
     తీగలాగి డొంకంతా కదుపుతుంది…
    మెదడు గనిని తవ్వితవ్వి జ్ఞాపకాల నిధులన్నీ బయటికి లాగుతుంది!
     … ఎట్లా వచ్చాయో అట్లాగే వెళ్ళిపోయిన జ్ఞాపకాలకు
    వీడ్కోలు పలికిన మనసంతా బెంగపడిపోయి బిక్కుబిక్కుమంటుంది
     నీరంతా వెళ్ళిపోయిన ఏరులా…
    చుట్టాలంతా వెళ్ళిపోయిన పెళ్ళివారిల్లులా…

    జ్ఞాపకాలెప్పుడూ ఒంటరిగా పోవు, నా జీవితం సగాన్ని తీసుకునే పోతాయి!”
    — వాన వెలిసిన సాయంత్రం కవితా సంపుటి.

    ప్రసాద్ గారికి ధన్యవాదాలతో,
    కొడవళ్ళ హనుమంతరావు 

  5. రంగులు గురించి తెలుగు అభిమాని గారి అభిప్రాయం:

    02/22/2008 9:34 am

    బాగుంది. చక్కటి కవిత్వం.

  6. ట్రాఫిక్ సిగ్నల్ – A Twenty first century love story గురించి gnanavenkat గారి అభిప్రాయం:

    02/22/2008 3:28 am

    Nice story, keep it up

  7. ఈమాట కొత్త వేషం గురించి జె. యు. బి. వి. ప్రసాద్ గారి అభిప్రాయం:

    02/21/2008 12:34 pm

    సురేశ్ గారూ,

    ఎప్పటి నించో ఈ రెండు మాటలూ రాద్దామనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు బద్దకం.

    “ఈమాట రచయితలు” అని మీరు ప్రవేశ పెట్టిన సెక్షను చాలా బాగుంది. ఒక రచయితకి సంబంధించిన రచనలన్నీ, ఒకే చోట ఇవ్వడం చాలా అద్భుతంగా వుంది. రక రకాల లింకుల బదులు, ఒకే లింకు పంపొచ్చు ఎవరికన్నా. నాకు చాలా నచ్చింది ఈ సెక్షను ఆర్గనైజేషన్. అభివందనలు. ఇలా చేస్తామని మీరు ఎపుడో చాలా కాలం కిందట చెప్పినట్టు గుర్తు.

    – ప్రసాద్

  8. నడిమి వయసు యిడుములు గురించి prabhala l k sastry గారి అభిప్రాయం:

    02/21/2008 4:02 am

    హర్షనీయ మాట – సూర్యనారాయణగారు మీరు వ్రాసిన పద్య
    సంకలనం మెచ్చుకో తగ్గది.. మీ రచనా శైలి పూర్వం తెలిసిన వాడిని ,
    అయినా ప్రశంసించడం వ్యక్తిగతంగా తలుస్తున్నాను . మీరు
    ముంబయి నుండి పాశ్చాత్య దేశంలో నలస ఏర్పర్చుకున్న
    తర్వాత ఈ కవిత వెబ్ లో చదివాను . కవికి సృజనాత్మక
    ప్రతిభ అవసరం అనే మాట చెప్పినట్లు మీరు నిజంగా భావుక
    పండితులు .
    ఇట్లు , పి. ఎల్. కె. శాస్త్రి

  9. చెప్పులు గురించి mOhana గారి అభిప్రాయం:

    02/20/2008 2:15 pm

    నేను కూడ హైస్కూలులో ఎస్ ఎస్ ఎల్ సి చదివేవరకు చెప్పులు
    తొడగలేదండీ! అంతే కాదు కొత్త పుస్తకాలు కొనలేదండీ, నిరుడు
    చదివిన వాళ్లవద్ద నుండి కొన్న పుస్తకాలే ఉపయోగించేవాడిని.
    ఇప్పుడు కూడ పాత పుస్తకాలంటే ఇష్టమేనండీ! కాలేజీలో
    అడుగు పెట్టడానికి ముందు టూత్పేస్టు బ్రష్షు చూచింది లేదు! ఈ
    కథ పాత జ్ఞాపకాలను తవ్వి తీసిందండీ! రచయితకు
    ధన్యవాదాలు! – మోహన

  10. ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    02/19/2008 8:37 pm

    లక్ష్మన్నకు:

    “అసలు విషయం ఏమిటంటే, ప్రవాసంలోని జీవితం తెలియాలంటే, ప్రవాసంలో బతకటంలో తప్ప వేరే దారి లేదు. నివాస ఆంధ్రుడు ఎన్ని సార్లు అమెరికాకి వచ్చి వెళ్ళినా, అమెరికాలో తెలుగు వారి జీవితాన్ని అర్ధం చేసుకోటం, వీలు పడదు.”

    మీరు చెప్పిన పై విషయం నిజమే ననిపిస్తున్నది.
    పై విషయం నిజమైతే, మీరు స్త్రీ ఐతే తప్ప స్త్రీ జీవితం మీకు అర్థం కాదు . మీరు పాఠకురాలికిచ్చిన ఈ కింది సమాధానం చూస్తే మీకు స్త్రీలలో ప్రతిభావంతులున్నారన్న సంగతి అసలు తెలియదేమో అనిపిస్తున్నది.
    లక్ష్మన్నా! మీరు, మీ వ్యాసంలో మొదటి పేరాలొ ఉదహరించిన తెలుగు తేజోమూర్తులను, మీరు క్రింద చెప్పిన విధంగా వృద్ధిలోకి తెచ్చినవారిగా స్త్రీలను గుర్తిస్తున్నారు కాని స్త్రీలు స్వయంగా తేజోమూర్తులని, మీకు అనిపిస్తున్నట్లుగా లేదు.

    “పాఠకురాలికి: మీరు చెప్పే దాకా, ప్రతిభావంతులైన తెలుగు స్త్రీలను మర్చిపోయాన్నన్న విషయమే తెలియలా! అసలు నేను ఆ కోణం నుంచి తేడాగా ఎప్పుడూ చూడలా. ఒక్క మనవి. ఎంతో మంది తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, మరెంతో మంది స్త్రీమూర్తుల ప్రేమా, దయ, వాత్సల్యం లేకుండానే తెలుగు తేజోమూర్తులు వృద్ధి లోకి వచ్చారని నేననుకోను. దయచేసి ఇటువంటి తేడాలు మరి తీసుకు రావద్దు.”

    పాఠకురాలిని ఇంకెప్పుడూ ఇలాటి తేడాలు తీసుకురావద్దంటున్నారు. ఎంచేత? పాఠకురాలు మీరు మర్చిపోయిన ఒక ముఖ్య విషయం గుర్తు చేశారు. మంచిదేగా! కాదా?

    లైలా.

« 1 ... 1425 1426 1427 1428 1429 ... 1555 »