Comment navigation


15549

« 1 ... 1423 1424 1425 1426 1427 ... 1555 »

  1. బ్లాగుల గురించి – నా మాట గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    03/01/2008 10:34 pm

    మీ మహా బ్లాగవతం బావుందండీ…

    కాకపోతీ -మీరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా బ్లాగుల వల్ల తెలుగు చదివే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎలా అంటారా, తెలుగు వాళ్ళకి పుస్తకం కొనడం అనే అంటురోగం ఎప్పటికీ అంటదు.
    లింకులో, లంకెలో ఏదో ఒకటి తెలుగొచ్చీ చదివని వాళ్ళని చదివిస్తున్నాయని నా అభిప్రాయం.

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  2. పదచిత్రాలు గురించి ఫణి గారి అభిప్రాయం:

    03/01/2008 10:29 pm

    Liked it.

  3. ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి కిరణ్ చిట్టెల్ల గారి అభిప్రాయం:

    03/01/2008 10:20 pm

    @రానారె
    జెట్ లీ “హీరో” చిత్రం కూడా ఇలానే ఉంటుంది. అది దీనికి ఒక ట్రిబ్యూట్ అనుకోవచ్చు లెండి. ఇందులో లేనిది, అందులో ఉన్నది ఏంటంటే, రంగుల్ని వాడుకున్న పద్ధతి. దొరికితే చూడండి.

  4. ఆహా గురించి ఫణి గారి అభిప్రాయం:

    03/01/2008 9:43 pm

    Some beautiful images. Some baffling questions.
    చాలా చాలా బాగుంది.
    “ఆ సాయంత్రం
    అదే ఏటి ఒడ్డున..

    సెలయేరు మీద
    చీకటి వెలుగులు రాస్తున్న
    చిత్ర లిపిని చదువుతూ

    దేనికీ అర్ధం లేదంటే..

    చిరు నవ్వు నవ్వుతూ
    ఆమె అన్నది కదా…

    “నీకు అర్ధం కానంత మాత్రాన
    అర్ధం లేనట్టేనా?” ”
    — Loved it beyond words.

  5. కల్యాణి రాగం – అనుబంధం గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    03/01/2008 8:36 pm

    ఈ క్రింది వాక్యం శుద్ధ తప్పు.

    “లక్ష్మన్న చెప్పినట్టుగా కల్యాణి రాగం 65వ మేళకర్త అయిన మేచకల్యాణి నుంచి జనించిన రాగం.”

    కళ్యాణి రాగం మేచ కళ్యాణి జన్యం కాదు. రెండు రాగాలూ, అంటే మేచకళ్యాణి నే కళ్యాణి అని పిలుస్తారు. ఇది 72 మేళ కర్త రాగాల విభజన కోసం కటపయాది చక్రం ప్రకారం కళ్యాణి రాగాన్ని మేచ కళ్యాణి గా వ్యవహరిస్తున్నారు తప్ప రెండూ ఒకటే! జన్య రాగ నిర్వచనం వేరు.

    ఈ విషయం లక్ష్మన్న గారి వ్యాసం చదివినప్పుడే రాద్దామనుకున్నాను. ఎందుకో కుదరలేదు.

    కానీ అదే విషయాన్ని ఇంకో సంగీతకారుడు బలపరచడం చూసి ఉండబట్టలేక రాస్తున్నాను.

    ఈ మాట సంపాదకులు ఇలాంటి సంగీత పరమైన వ్యాసాల్ని కూడా ప్రచురించే ముందు సంగీతం వచ్చిన వారి చేత సమీక్ష చేయిస్తే ఇలాంటి తప్పులు దొర్లవని నా అభిప్రాయం.

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  6. యాత్ర గురించి Pavan Kumar Garikapati గారి అభిప్రాయం:

    03/01/2008 8:04 pm

    ఈ కవితలు ఎంతొ బాగున్నాయి. క్లుప్తత కి అర్థం ఇదే. వినీల్ ఉక్కు పిడికిళ్ళతో వదులుతున్నాడు కవితలని. కొత్త కొత్త పద బంధాలు చాలా అందంగా ఇమిడాయి.

    పవన్ కుమార్ గరికపాటి

  7. ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి రాజేంద్ర గారి అభిప్రాయం:

    03/01/2008 8:03 pm

    లక్ష్మన్న గారూ ఆదివారం ఉదయాన్నే పరగడుపున మంచి విందు భోజనం పెట్టారు.కురసవ సినిమాల్లో తొషిరో మిఫూనె కు ప్రాధాన్యం కాస్త ఎక్కువగానే ఉంటుంది,అతను ఆనాటి జపనీయ సూపర్ స్టార్,కురసవ సినిమాలవల్ల అయ్యాడు,కానీ కొంత కాలానికి అల్ప విభేదాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయి మరిన్ని మంచి సినిమాలు చూసే (వారి కలయికలో)అవకాశం లేకుండా చేశారు,తాత్వికభావాలు వెతకటం కాదు కానీ,సమయం కలిసి వచ్చినప్పుడల్లా చూస్తున్నా రషోమన్ సారం గ్రహించలేకపోతున్నా,మీరు చెప్పాక ఈ స్తితి సహజమే అని తెలుసుకోగలిగాను.ది బాడ్ స్లీప్ వెల్,స్ట్రే డాగ్ సినిమాల గురించి కూడా తెలియజేయగలరు.అంటే కురసవ మిగిలిన సినిమాలన్నీ ఏదో అర్ధం అయ్యాయని కాదు కానీ,ఈ రెందు కాస్త కష్టం అనిపించాయి.ఫణి గారు చెప్పినట్లు రాన్ సినిమా నిజంగా కళ్ళకు విందే.

  8. ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి రానారె గారి అభిప్రాయం:

    03/01/2008 7:16 pm

    నేనూ ఈ సినిమాను నాలుగు నెలల క్రితం మొదటిసారి చూశాను. అబ్బురపరచి, బుర్రను కాసేపు గిర్రున తిప్పిన సినిమా ఇది. రూపొందించిన వారి ప్రతిభకు సాష్టాంగపడాలనిపింపజేసే కళారూపమిది. ఇదే విధంగా ప్రభావితం చేయగల యిలాంటి సినిమా ప్రపంచసినిమా చరిత్రలో ఇంకోటుందా అని అతర్జాలంలో వెతికాను. నాకు దొరకలేదు.

  9. ఓ చందమామ గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/01/2008 7:01 pm

    రోజూ చూస్తున్నా చందమామ క్రొత్తగానే కనిపిస్తాడు ప్రతిరోజూ. నిన్న చూసిన చంద్రుడే ఐనప్పటికీ, ఈ రోజు కూడా ఒక అద్భుతవైన భావాన్ని మనసులో వెలిగిస్తాడు. నాయంతెత్తు పెరిగిన నా కూతురు, పదమూడేళ్ళనుంచి చూస్తున్న నా కూతురు, రోజు రోజు నా కళ్ళకి అద్భుతంగా కనిపించటం నాకనుభవవే కదా!
    బాగా వ్రాశారండీ. వొకటికి రెండు సార్లు చదివేలా, చాలా బాగా వ్రాశారు.

  10. నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/01/2008 6:48 pm

    బావుందండి. మాట్లాడే నిశ్శబ్దాన్ని చాలా చక్కగా తెనిగించారు.

« 1 ... 1423 1424 1425 1426 1427 ... 1555 »