Comment navigation


15549

« 1 ... 1405 1406 1407 1408 1409 ... 1555 »

  1. మీ ఘంటసాల గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    04/05/2008 2:25 pm

    ఈ తరంవారికి ఘంటసాలను వీడియోలో చూడటానికి వెంకటేశ్వర మహత్యం సినిమాలోని రీతిగౌళ రాగపు పాట పనికొస్తుంది.

  2. బ్లాగుల గురించి – నా మాట గురించి sk.allabakshu గారి అభిప్రాయం:

    04/04/2008 10:44 pm

    మీ వ్యాసము బాగుంది.అనేక విషయాలు తెలిసాయి.

  3. ఈమాట కొత్త వేషం గురించి sasidhar pingali గారి అభిప్రాయం:

    04/04/2008 7:56 pm

    సాగి పోయెను నెచ్చలీ సార భరిత
    వత్సరము లెన్నొ ఈరీతి వదలి నన్ను
    ఒంటినై సాగ నిక మీద నోర్వ లేను
    వేగ రమ్మోయి ప్రియతమా ! వేడుకొందు !

    ఇటు వంటి కవితలు పద్యాలు ఇంకా కొన్ని వునాయి.
    మాకూ మీ ఈమాట లొ పాలు పంచు కోవాలనుంది.
    రచనలు పంపే విధానం తెలుపండి.
    మీ ఫాక్సు నెంబరు కూడా తెలుప గలరు.

    పింగళి శశిధర (జాబిల్లి)
    హైదరాబాదు

  4. నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి మురళి నందుల గారి అభిప్రాయం:

    04/04/2008 6:47 pm

    మంచి పద్యాన్ని పరిచయం చేసినందుకు సంతోషం. వీలుచేసుకొని, ఆ ముక్కు పద్యాన్ని కూడా వివరించగలరు.

  5. మీ ఘంటసాల గురించి naini shilender గారి అభిప్రాయం:

    04/04/2008 4:57 am

    నాకు ఘంటసాల గారు అంటె నాకు చాల అభిమానం.
    మీ ఘంటసాల పుస్తకం గురించి విన్నాను.
    మీరు చాల మంచి పని చెస్తున్నారు.
    మా నాన్న గారు ఘంటసాల గారి పాటలు gramphone records లొ
    collection చెసినారు. అతని జీవితం మొత్తం రికార్డ్స్ collection
    గురించి త్యాగం చెసినాడు.
    బాలు, సుశీల, జానకి, లీల, P.B.srinivas, జిక్కి, Rama krishna, A.M Raja,
    సత్యం, ఇతర గాయకులు అందరవి కూడ రికార్డ్స్లలొ collection చెసినారు.
    మీకు కావాలంటె నా వంతు సహాయం చెస్తాను.

    మా నాన్న గారి పేరు Naini Satyanarayana Reddy.

  6. నా మాట గురించి gks raja గారి అభిప్రాయం:

    04/03/2008 12:41 pm

    వేలూరి గారూ!
    నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాను. వచ్చి పోయే వాణ్ణి మాత్రమే. అదేమి చిత్రమో, ఇండియా లో ఉండగా నేనెప్పుడూ ‘ఈమాట చూసిన పాపాన పోలేదు. మీ పత్రిక చాలా బావుంది.’
    ఇక్కడి వాళ్ళగురించి మీ విశ్లేషణ చాలా బావుంది. నేనూ వింటుంటాను ఇట్లాంటివి. చాలా సంతోషం.
    ముందుకే నడవండి.
    రాజా.

  7. ఎడ్వర్డ్ సయీద్ (Edward Said) సంస్మరణ గురించి gks raja గారి అభిప్రాయం:

    04/03/2008 12:03 pm

    వంశీ అనె పేరు చూసినందుకు ఈ వ్యాసం చదవగలిగాను. చాలా మంచి విషయాలు తెలుసుకోగలిగాను. శ్రీశ్రీ గారిని సందర్భానుసారంగా కోట్ చేశారు. చాలా సంతోషం.
    రాజా.

  8. ఇద్దరు దుర్మార్గులు గురించి Ramam గారి అభిప్రాయం:

    04/03/2008 10:06 am

    Routine story, but not expected from Phani…విశ్లేషణలు బావున్నై.

  9. దాలిగుంటలో లీయా గురించి రానారె గారి అభిప్రాయం:

    04/03/2008 8:37 am

    చాలా బాగుంది కానీ, ఎంత ప్రేమగా చూసుకుంటున్నా యజమానిని ‘దొరసాని’ అంటూ పరాయిదానిలాగానే చూడటం నాకు నచ్చలేదు. ఇలాంటి ఆత్మకథలు చిన్నపిల్లల పత్రికలలో కనబడుతూవుంటాయి. వాటిని పెద్దలు కూడా ఇష్టంగా చదువుతారనుకోండి.

  10. లిటిల్‌సైంటిస్టు గురించి రానారె గారి అభిప్రాయం:

    04/03/2008 8:08 am

    “ఒక సంఘటనా, ఒక ఘర్షణా, ఒక మలుపూ లాంటి కధా ప్రక్త్రియలకి అలవాటు పడి పోవడం వల్ల, ఇటువంటివి కధలుగా అనిపించడం మానేశాయేమోనని అనిపిస్తోంది.” అన్నారు జె.యు.బి.వి ప్రసాదుగారు. ఇలా కాని కథాప్రక్రియ గతంలో వుండేదా? చిన్నప్పటినుంచి నేను చదివిన పిల్లల మాసపత్రికలు, బాలల రామాయణ భారత భాగవతాలు, పంచతంత్రం మొదలు ఈనాటిదాకా ఒకటీ అరా ఆంగ్ల కథలతో కలుపుకున్నా నేను చదివిన కథలు చాలా తక్కువే వుంటాయి. వీటన్నిట్లోనూ దాదాపు ఇదే ప్రక్రియ. ఈ మూసను అనుసరించకుండా ఎక్కువ కథారచనలు చేసి ప్రత్యేకత సంతరించుకొన్నవారెవరైయినా వుంటే తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన భాషలో.

« 1 ... 1405 1406 1407 1408 1409 ... 1555 »