పూకొమ్మలతో, లేరెమ్మలతో, కొమ్మలలో గిజిగాడి గూళ్ళతో, నిలువనీడలేని నిర్భాగ్యుల పాపల ఊయలలూగిస్తో, మనిషి పోయినా, తరం పోయినా నిరంతరంగా నిలబడేవి చెట్లు..
కాని రాను రాను నిర్దాక్షిణ్యంగా మూగ వృక్షాలను నరికివేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోలేని ఝాన్సీ గారి బాధ వర్ణనాతీతం.
ఇక తను పట్టుకున్న చెట్టూ లేదని, కట్టుకున్న గూడూ లేదని తెలియని వెర్రి పిచుక రోజూ వచ్చి వెతుకుకుని నిరాశతో వెనక్కి తిరిగిపోవడం కళ్ళకి కనిపిస్తూనేవుంది.
లేదు కన్పించడంలేదు. కళ్ళు మసకలు కమ్ముతున్నాయి కంటిలో తడితో.
కొ స్యా సు రా
మీ సంపాదకత్వంలో వెలువడే ఈమాట చాలా హృద్యంగా వున్నది. అభినందనలు. మా కుటుంబ సభ్యులు కొన్ని సాంప్రదాయక కవిత్వం లో పద్యాలు వ్రాశారు. నేనూ కొన్ని కవితలు వ్రాయడం జరిగింది. ఆయితె అవి ఎక్కడికీ ప్రచురణార్థం పంపలేదు. మీకు ఎలా పంపగలమో తెలుపగలరు. మా వద్ద లికిత తెలుగు సాఫ్ట్ వేరుంది. అందులొ పంపవచ్చా? లేదా ఎలా పంపాలో తెలుప గలరు.
చిన్నప్పుడు వాళ్ళ తెలుగు మాస్టారు వేసిన కూకలు జ్ఞాపకం వస్తాయి. “దినం, తద్దినం ఏంటోయ్? రోజు అనలేవూ?” అని.
ఇది నవ్వు తెప్పించింది. మొత్తమ్మీద రచయిత ఎమి చెప్పదలచుకున్నారో అని ఆలోచన చేయడం లేదు. కథనం బాగుంది.
సంపాదకులకు నమస్కారం.
తెలుగు నాటకం మీద నాకు తోచినవి రెండు మాటలు.
మనం ఎన్ని పోలికలు ఎవరితో తెచ్చుకున్నా ఏమి ప్రయోజనం? తెలుగులో నాటకరంగంలో క్రియేటివిటీ శూన్యం. ఎక్కడా ఒరిజినాలిటీ లేదు. అందుకని తెలుగు నాటకం చస్తోంది. దీనికి సృజనని గౌరవించే సంప్రదాయం తెలుగువాళ్ళకి చాలినంత లేకపోవటమే ముఖ్య కారణం. అందువల్లనే తెలివైన, సృజనాత్మకులైన రచయితలు నాటక రంగం వేపు ఏనాడు కూడా రాలేదు. నాటక రంగంలో వున్న అనేకమంది క్రియేటివిటీ మీడియోకర్ స్థాయిలోనే వుంటుందని తెలుగు నాటకపు ఇతివృత్తాలనీ, వాటిలోని సంభాషణలనీ చూసిన ఎవరైనా ఇట్టే గ్రహించగలరు. నిష్ఠూరంగా ఉన్నా ఇది పరమ సత్యం.
అందువల్ల క్రియేటివ్ పెర్సన్స్ కాని రచయితల, దర్శకుల చేతిలో ఒక కళారూపం తయారైతే ఎలా వుండగలదో – సరిగ్గా అలాగే వుంది మన నాటకం ఇవాళ. ఇందులో ప్రేక్షకుల తప్పు ఏమిటి? బాగులేని నాటకాన్ని వాళ్ళు కష్టపడి, ఊరికే వేసినా, ఫ్రీగా చూపించినా కూడా ఎందుకని చూడాలి? మిగతా భారతీయ భాషలలో ఇలా లేదు నాటకం పరిస్థితి. కనకే మరాఠీ లొనూ, బెంగాలీ లొనూ ఇవాళ్టికీ నాటకానికి ఆదరణ ఉండటం.
చెప్పుకోవలసిన మంచి కవి, రచయిత ఒక్కరైనా ఇవాళ తెలుగు నాటక రంగం వైపు చూశారా? లేదే! ఎందుకని, అన్నదే ముఖ్యమైన ప్రశ్న. మనకి మంచి విమర్శ లేనందువలన, మొహమాటం సాహిత్య రంగం లోనూ, ఇతర రంగాల లోనూ రాజ్యం ఏలుతుండటం వలన- ఇలాంటి దుస్థితి వచ్చిపడింది. తెలుగు సినిమా, తెలుగు నాటకం, సృజన లేని వ్యక్తులతో నిండిపోయి ఉన్నాయి. అందువల్ల అసలు సమస్యని వదిలేసి మనం కారణాలని ఇంకెక్కడ చూసినా లాభం ఏమిటి? సమాధానం ఎలా దొరుకుతుంది?
దీనికి పరిష్కారం తెలివైన వాళ్ళు, సృజనలో్ మేటిగా వున్న వాళ్ళు, ఈ రంగాలలోకి రావాలి. అందుకు తగిన వాతావరరణం ఇవాళ ఈ రంగాలలో కనిపించడం లేదు. డబ్బు కొందరి చేతులలో చిక్కుకుని వుంది గనక ఇవన్నీ ఇంటర్‌లింక్‌డ్ ఇష్ష్యూస్. అందువలన తెలుగు వారు ముందు తమ భాషలో వున్న ఇవాళ్టి మేటి కవులనీ, రచయితలనీ, విమర్శకులనీ ఆదరించాలి. వాళ్ళకి సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళకి సరైన ప్రోత్సాహం వుంటే, బహుశా వాళ్ళు తమ శక్తి యుక్తులని ఈ రంగాలల వైపు మళ్ళించడానికి ఆసక్తి చూపురేమో! ఏమో??
ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి Amarnath reddy గారి అభిప్రాయం:
03/31/2008 4:23 am
చాలా అద్బుతము గా వ్రాయబడినది…
చెట్టు కూలిన వేళ గురించి kosyasura గారి అభిప్రాయం:
03/30/2008 7:22 am
పూకొమ్మలతో, లేరెమ్మలతో, కొమ్మలలో గిజిగాడి గూళ్ళతో, నిలువనీడలేని నిర్భాగ్యుల పాపల ఊయలలూగిస్తో, మనిషి పోయినా, తరం పోయినా నిరంతరంగా నిలబడేవి చెట్లు..
కాని రాను రాను నిర్దాక్షిణ్యంగా మూగ వృక్షాలను నరికివేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోలేని ఝాన్సీ గారి బాధ వర్ణనాతీతం.
ఇక తను పట్టుకున్న చెట్టూ లేదని, కట్టుకున్న గూడూ లేదని తెలియని వెర్రి పిచుక రోజూ వచ్చి వెతుకుకుని నిరాశతో వెనక్కి తిరిగిపోవడం కళ్ళకి కనిపిస్తూనేవుంది.
లేదు కన్పించడంలేదు. కళ్ళు మసకలు కమ్ముతున్నాయి కంటిలో తడితో.
కొ స్యా సు రా
రచయితలకు సూచనలు గురించి venu గారి అభిప్రాయం:
03/30/2008 12:46 am
తెలుగు భాషాభివృద్ధికై మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందించదగ్గది.
వెచ్చని మనసులు గురించి కొల్లూరి సోమ శంకర్ గారి అభిప్రాయం:
03/29/2008 1:40 am
@కిరణ్ వెంకట గారూ,
ధన్యవాదాలు
@రానారె గారు,
మీ వ్యాఖ్యలు నాకు ఉత్సాహాన్ని,ప్రొత్సాహాన్ని కలిగించాయి.నెనరులు
రచయితలకు సూచనలు గురించి sasidhar pingali గారి అభిప్రాయం:
03/29/2008 1:26 am
ఆర్యా !
మీ సంపాదకత్వంలో వెలువడే ఈమాట చాలా హృద్యంగా వున్నది. అభినందనలు. మా కుటుంబ సభ్యులు కొన్ని సాంప్రదాయక కవిత్వం లో పద్యాలు వ్రాశారు. నేనూ కొన్ని కవితలు వ్రాయడం జరిగింది. ఆయితె అవి ఎక్కడికీ ప్రచురణార్థం పంపలేదు. మీకు ఎలా పంపగలమో తెలుపగలరు. మా వద్ద లికిత తెలుగు సాఫ్ట్ వేరుంది. అందులొ పంపవచ్చా? లేదా ఎలా పంపాలో తెలుప గలరు.
ధన్యవాదములు
పింగళి శశిధర
మీరు కవిత్వం ఎందుకు రాస్తారు? గురించి Rudra గారి అభిప్రాయం:
03/26/2008 3:10 pm
ఇస్మాయిల్ గారి తో ఇంటర్యూ చదువుతూంటే చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టయింది….ఇస్మాయిల్ గారికి మరియు ఈమాట సంపాదకులకు నమస్కారాలు….
బుచ్చిగాడి మళ్ళీ పెళ్ళి గురించి vimala గారి అభిప్రాయం:
03/26/2008 11:18 am
చాలా బాగు0ది
దాలిగుంటలో లీయా గురించి kosyasura గారి అభిప్రాయం:
03/26/2008 8:49 am
భౌ ! ! ! భౌ ! !
కొ శ్యా సు రా
ప్రేమికుల దినం గురించి ramya గారి అభిప్రాయం:
03/25/2008 11:54 pm
చిన్నప్పుడు వాళ్ళ తెలుగు మాస్టారు వేసిన కూకలు జ్ఞాపకం వస్తాయి. “దినం, తద్దినం ఏంటోయ్? రోజు అనలేవూ?” అని.
ఇది నవ్వు తెప్పించింది. మొత్తమ్మీద రచయిత ఎమి చెప్పదలచుకున్నారో అని ఆలోచన చేయడం లేదు. కథనం బాగుంది.
తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/25/2008 11:25 pm

rama.