Comment navigation


15549

« 1 ... 1406 1407 1408 1409 1410 ... 1555 »

  1. చీలిన మనిషి గురించి gks raja గారి అభిప్రాయం:

    04/03/2008 7:24 am

    కవిత చాలా బావుంది. ‘ఈ’మాట’ కు ధన్యవాదాలు. చందాదారులుగా చేరాల్సిన వివరాలను తెలుపగలరు.
    విధేయుడు.
    రాజా.

    [“ఈమాట” ఆన్లైనులో మాత్రమే ప్రచురించబడే పత్రిక. చందాదారులు కానవసరం లేదు. ఉచితంగా ఎన్నిసార్లైనా చదువుకోవచ్చు. –సంపాదకులు]

  2. ఎవరున్నా లేకున్నా గురించి Sowmya గారి అభిప్రాయం:

    04/03/2008 5:04 am

    మీ పరిచయం చాలా బాగుంది సుబ్బూ గారూ.
    నాకు ఇందులో…. “”బహుశా వెలితి జ్ఞాపకాల గుప్త నిధి కి తాళం చెవి” అన్న వాక్యాన్ని చూడగానే ఈ పుస్తకం చదవాలన్న కుతూహలం కలిగింది… ఈ వాక్యాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు…..

  3. పిచ్చి నాన్న గురించి Seetha గారి అభిప్రాయం:

    04/02/2008 11:26 pm

    అవును నిజమే నాన్న దృష్టిలో కూతురు ఎప్పుడూ యువరాణే…మంచి కవిత touching…

  4. ఓ చందమామ గురించి Seetha గారి అభిప్రాయం:

    04/02/2008 11:16 pm

    అబ్బ ఎంత బాగుందో…..

  5. ఆహా గురించి Seetha గారి అభిప్రాయం:

    04/02/2008 11:13 pm

    ఒక ప్రవాహంలా…అందులో పయనిస్తున్నట్టు ఉంది….You involve somuch into nature…no wonder you write so wondefuly….keep going on Subbu..

  6. గుర్తుందా గోదారీ? గురించి Seetha గారి అభిప్రాయం:

    04/02/2008 8:51 pm

    చివరి ఖండిక చాల బాగుంది…

  7. తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    04/01/2008 1:45 pm

    రమ గారూ,

    మీరు ప్రస్తావించిన ఈ క్రింది విషయాన్ని నేను అంగీకరించలేను.
    “చెప్పుకోవలసిన మంచి కవి, రచయిత ఒక్కరైనా ఇవాళ తెలుగు నాటక రంగం వైపు చూశారా? ” అని అన్నారు.
    రాసారు. విశ్వనాధ, ఆత్రేయ, శ్రీశ్రీ, దేవులపల్లి, ఆరుద్ర, ఎన్ ఆర్ నంది, గొల్లపూడి మారుతీ రావు, యండమూరి వీరేంద్రనాధ్, జంధ్యాల, సత్యానంద్, గణేష్ పాత్రో ఇలా పేరున్న ప్రతీ వాళ్ళూ నాటకాలు రాసారు. కాకపోతే ఒక నాటకం్ కాస్త ప్రశస్తి చెందగానే, వాళ్ళు మళ్ళా మరో నాటకం రాయలేదు.
    ఇప్పటికీ రాయగల సత్తా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాకపోతే అవకాశాలు లేవు. ఉన్నా, నాటకాల రిహార్స ల్స్ కి టీ తెచ్చే వాడు కూడా నాటకం ఎలా వుండాలో సలహా ఇస్తాడు. రచయిత కి స్వేచ్ఛ లేదు. అది లేని చోట ఏ రచయితా మనసుపెట్ట లేడు. నాలుగు సినిమా డి వీడీ లు ముందేసుకొని నాటకాలు రాసే రోజులివి. అందుకే రచయితలెవ్వరూ నాటకాల జోలికి పోవడం లేదని నా అభిప్రాయం.
    చూచాయగా అన్నీ వ్యాసంలో నేను ప్రస్తావించాను. విసుగు పుడుతుందని విశదంగా రాయలేదంతే!

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  8. కేయాటిక్ సమీకరణం గురించి kosyasura గారి అభిప్రాయం:

    03/31/2008 6:36 pm

    తరాల అంతరాలు నిరంతరం, తీరాల మధ్య దూరాలూ అంతే ,నిన్నని నేడు చేయలేమని తెలుసు ,అందుకే దేవుడిచ్చిన వరం జ్జాపకాలు.
    కొ శ్యా సు రా.

  9. ఓ చందమామ గురించి kosyasura గారి అభిప్రాయం:

    03/31/2008 6:13 pm

    ఇంత చిన్ని ఆకాశంలో ఎన్ని చందమామలో ఇంత చిన్ని బ్రతుకులోఎన్ని అందమామలో. పగటి పూట జాబిల్లిని వెతికే ఎంత మంది వెర్రి నాన్నలో
    ఇంకో వెర్రి నాన్న.
    కొ శ్యా సు రా

  10. చెరగని స్మృతులు 1 పన్నెండు పంపుల కథ గురించి kaja sudhakara babu గారి అభిప్రాయం:

    03/31/2008 11:03 am

    “మా ఊరికి ఆరుమైళ్ళ దూరాన ఉన్న పల్లెటూరు రాజధానిగా వేంగి రాజులు పరిపాలించారని కథ చెప్పుతూ ఉంటారు. నాకయితే ఆ కథమీద ఏమాత్రమూ నమ్మకం లేదు. అక్కడ ఆరడుగులెత్తున రెండు పెద్ద రాళ్ళు మాత్రం ఉండేవి. ఇప్పుడున్నాయోలేవో తెలియదు. ఆ రాళ్ళమీద స్కూలు పిల్లలు మేకులతో రాసిన పొడిపొడి ఇంగ్లీషు, తెలుగు అక్షరాలుండేవి, అంతే. ఆ మాటకొస్తే, ఒకప్పుడు మా ఊరునుంచి బెజవాడ వెళ్ళేరోడ్డు మీద అంతకన్నా పెద్ద రాళ్ళు పడి ఉండేవి.”

    నమస్కారం సారూ!
    నమ్మకపోతే ఎలా వెంకటేశ్వరరావు గారూ!
    మీది ఏలూరయితే మాది పెదవేగి గురూగారూ!
    ఈ మాటలో మీమాట చూసే తెవికీలో ఈ వ్యాసం వ్రాశాను !

    వేంగి

    ఒక మారు చదివి చూడండి.

    -సుధాకరబాబు

« 1 ... 1406 1407 1408 1409 1410 ... 1555 »