Comment navigation


15549

« 1 ... 1404 1405 1406 1407 1408 ... 1555 »

  1. పల్లకీ.. గురించి Ajay గారి అభిప్రాయం:

    04/08/2008 1:26 pm

    ఫణి గారూ,

    కథ బాగానే వుంది కానీ…చివరలో ఉండాల్సిన ఆర్ద్రత మిస్ అయినట్టు ఉందండి..

  2. ఓ చందమామ గురించి Lakshmi kallakuri గారి అభిప్రాయం:

    04/08/2008 9:48 am

    బాగుంది. నిత్యము ఎన్నోకళలతో సంతోషము వెలిగించే వెన్నెల బొమ్మ
    కనీకనిపించనీ దూరము కదూ! ( అమ్మనాన్నలకు.)
    ‘సాయిలక్ష్మి’

  3. నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి Kallakuri Lakshmi గారి అభిప్రాయం:

    04/08/2008 9:33 am

    వైదేహి,
    నిశ్శ బ్దాన్ని శ బ్ద రూపములో చెప్పటము మీకే చెల్లింది. మనసుల మౌనాన్ని,
    అలజడులను గుసగుసలుగ మూగ వోయిన వాయిద్యము మౌనరాగాన్ని మెరిపించటము(ఆలాపించటము) ఎంతో రసరంజనముగా నున్నది.
    గుండెల్లో దాగిన ప్రేమ సాగర(రి)కు గుండెల్లో దాగిన నిశ్శబ్దమే(మౌనమే) శబ్దము. -చివరి మూడులైనులు.
    ఏటవాలుగా విరిసే ఇంద్రధనస్సు -తుషార కన్నీటి భావ బిందువా?
    ఎలా చెప్పాలో(శబ్దపరచాలో) తెలియదే నాకు నా అనుభూతుల నిశ్శబ్దము!

    ‘సాయిలక్ష్మి’

  4. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    04/08/2008 6:45 am

    వ్యాసకర్త ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. మల్లియ రేచనవంటి ప్రాచీన నామాల్లో తల్లిపేరును చెప్పే మాతృస్వామ్య పద్ధతి ఉండేదని ఆరుద్ర రాశారు. ఈనాటికీ వినబడే చలసాని, మేడసాని, ముద్దసాని మొదలైన ఇంటిపేర్లు స్త్రీలను సూచించేవిగా అనిపిస్తాయి.

    తెలుగు బ్రాహ్మణుల ఇంటిపేర్లు కొన్ని మహారాష్ట్రకు సంబంధించినవిగా అనిపిస్తాయి. ప్రసిద్ధికెక్కిన అప్పాజోస్యుల (అప్పాజోషీ) విష్ణుభొట్ల (విష్ణుభట్) అనే పేర్లూ, వల్లభజోస్యుల (వల్లభజోషీ) మొదలైనవి ఇటువంటివే. ఇది నిజమైతే ఇందులో మరాఠీ పద్ధతిలో అప్పా అనేది వ్యక్తిగతనామం అనీ, జోషీ మాత్రమే ఇంటిపేరనీ గమనించాలి. అలాగే శ్రీధర్, మనోహర్ అనే ఇంటిపేర్లున్న మహారాష్ట్ర బ్రాహ్మణులున్నారు. శ్రీధర అనేది తెలుగు బ్రాహ్మణుల్లో వినబడే ఇంటిపేరు. వీళ్ళంతా తెలుగుప్రాంతాలకు వలసవచ్చారేమో.

    మహారాష్ట్రులకీ, రష్యన్లకీ పేర్ల క్రమంలో ఒకే పద్ధతిని పాటించే సంప్రదాయం ఉంది. లక్ష్మణ్ రఘునాథ్ కేళ్కర్ అనే పేరులో వ్యక్తిగత నామం లక్ష్మణ్. అతని తండ్రి వ్యక్తిగతనామం రఘునాథ్. వారి ఇంటిపేరు కేళ్కర్. అలాగే మిఖయీల్ సెర్గియేవిచ్ గోర్బచోవ్ అనే పేరు మూడు భాగాలుగా ఉంటుంది. మిఖయీల్ అనే వ్యక్తి సెర్గేయ్ అనే అతని కొడుకు. వారి ఇంటిపేరు గోర్బచోవ్.

    పంజాబీల్లో కొందరు సర్దార్లు గుర్మీత్ సింగ్ అని రాసి ఊరుకుంటారు. మన ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అంతే. కొందరు మాత్రం బ్రార్, భాటియా మొదలైన ఇంటిపేర్లను కూడా ఉపయోగిస్తారు. మా కొలీగ్ ఒకాయన (సర్దార్ కాని పంజాబీ) ను ఆయన ఇంటిపేరు గ్రోవర్ అనేమాటకు అర్థం ఏమైఉంటుందని అడిగాను. ఆయనకు తెలియలేదు. గురువర్ (గురువర్యుడు) అనేమాటకు అది రూపాంతరం అయిఉంటుందని నేనన్నాను. ఆయన కాదనలేదు.

    మలయాళీల్లో కొందరు మాత్రమే ఇంటిపేరు వాడతారు. ఉదాహరణకి పి.టి.ఉష పేరులో పిలాఉళ్ళకండి అనేది ఇంటిపేరు. బెంగాలీలు తమపేరుకు ఇంటిపేరు తగిలించేస్తారు.

  5. ఆహా గురించి vani గారి అభిప్రాయం:

    04/07/2008 11:15 pm

    హాయ్ !

    మీ కవిత అధ్బుతం
    మనసుని కదిలించింది ప్రకృతిలోని అందాలన్నింటినీ
    ప్రేమించిన మనసు ఆనందం వర్ణనాతీతం
    మనసు నవ్వుతుంది,
    నవ్వుతూనే కనుమరుగయ్యే కాలంకోసం వేదన చెందుతుంది
    మీ కవితను నేను మరువలేను
    ఎన్నాల్లకో నన్ను నేను చూసుకున్నాను
    _ వాణి

  6. ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి B.AJAY PRASAD గారి అభిప్రాయం:

    04/07/2008 9:23 pm

    లక్ష్మన్నగారూ
    మీ వ్యాసం చాలా బావుంది. ఒక మంచి సినిమాని సమీక్షించడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. మీకు నా హౄదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. మీ నుంచి మరిన్ని మంచి వ్యాసాలు వస్తాయని ఆశిస్తున్నాను.

    బి.అజయ్ ప్రసాద్

  7. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి Vani M గారి అభిప్రాయం:

    04/07/2008 1:49 am

    మీ వ్యాసం చాలా బాగుంది.

  8. సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    04/06/2008 11:46 am

    ఘంటసాల అభిమానులందరికీ సంగీతరావుగారితో జరిపిన ఒక మంచి ఆడియో ఇంటర్వ్యూ లభ్యం అవుతోంది. http://images.google.com/imgres?imgurl=http://www.ghantasala.info/images/krshnarjuna/small/image21.jpg&imgrefurl=http://www.ghantasala.info/
    ఇందులో ప్రధానంగా ఘంటసాల గురించిన అనేక ఆసక్తికరమైన వివరాలూ, దుర్లభమైన కొన్ని పాటలూ ఉన్నాయి. ఘంటసాల కేవలం ఒక మంచి గాయకుడే కాదనీ, ఉన్నతమైన సంగీత సంస్కారం కలిగిఉండేవాడనీ మనకు తెలుస్తుంది.

    ఇవికాక ఎనభై ఏళ్ళ వయసు దాటాక కూడా సంగీతరావుగారి జ్ఞాపకశక్తి ఎంత గొప్పదో, ఆయన గాత్రపటిమ ఏ మాత్రం ఉందో గమనించవచ్చు.

  9. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి sathibabu గారి అభిప్రాయం:

    04/06/2008 8:40 am

    వాడవల్లి నాగమురళీ కృష్ణ గారు,
    మీ మొదటి టపా అద్భుతంగా ఉంది.
    నేను మీ రెండవ టపా గురించి ఎదురు చూస్తున్నాను.

    సత్తి బాబు.

  10. ఈమాట గురించి గురించి radheshyam గారి అభిప్రాయం:

    04/06/2008 7:51 am

    సంపాదకులకు,
    ఎన్నాళ్ళనుంచో వెదుకుతున్న మంచి తెలుగు వెబ్ పేజ్ ఇన్నాళ్ళకు దొరికింది. తెలుగులో టైప్ చెయ్యాలన్న కోరిక కూడా తీరింది.
    చందమామ కోసం సెర్చ్ చేస్తున్న నాకు “ఈమాట” సైట్ కనిపించింది. కొడవడిగంటి కుటుంబరావు గారి అబ్బాయి వ్రాసిన ” చందమామ జ్ఞాపకాలు” చదివాను. చాలా బాగుంది. అక్కడ మొదలుపెట్టి మిగిలిన articles అన్నీ చదువుతూ ఎంతసేపు గడిపానో తెలియలేదు. మీ కృషికి నిజంగా జోహార్లు. ఇన్నాళ్ళనుంచి చాలా మిస్సయ్యను అనిపించింది.
    ఇకపై “ఈమాట” కుటుంబంలో నేనూ చేరుతున్నందుకు ఆనందంగా వుంది.
    చిన్న విన్నపం…చందమామ లో సీరియల్ గా వచ్చిన తోకచుక్క మొదలెన నవలలు ఎవరి దగ్గరైనా వుంటే అప్ లోడ్ చేయగలరు. లేదా ఎక్కడైనా దొరుకుతుందేమో ఎవరికైనా తెలిస్తే దయచేసి తెలుపగలరు.
    _ రాధేశ్యామ్ రుద్రావఝల, విశాఖపట్నం.

« 1 ... 1404 1405 1406 1407 1408 ... 1555 »