రానారె అన్నట్లుగానే, ఈ పద్య వ్యాఖ్యానం చాలా రసవత్తరంగా ఉంది.
“తిమ్మకవి సృష్టించిన ‘సత్యభామ’ ఒక మహాద్భుతమైన పాత్ర. మామూలుగా భారత భాగవతాల్లో కనిపించే సత్యభామ కాదు పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ. తిమ్మకవి సత్యభామకు కల్పించిన రూపే (ఇమేజ్) వేరు.”
పై మాటలూ సబబే.
తిమ్మ కవి భాగవతం లో లేనేలేని ఘట్టాన్ని కల్పించే ముందే, ” కులమును రూపమున్మగని కూరిమి కలదాననంచు” రుక్మిణి, సత్యభామలు ఇద్దరి మనసుల్లో రవరవలున్నాయని మనకు చెప్పి అప్పుడు పారిజాతప్పువ్వుతో నారద ప్రవేశం చేయించి అందమైన కథ అల్లారు కదా.
పోతన భాగవతంలో, నరకాసుర వధ తర్వాత సత్యభామతో కలిసి కృష్ణుడు దేవలొకం వెళ్ళి ఆమె అడిగితే నందనవనము నుంచి పారిజాత వృక్షము దొంగిలించి తెస్తాడు. ఒకవేళ ఆయన ఆ పని చెయ్యక పోతే సత్యభామే తెచ్చుకునేది. ఆమె విలువిద్యా కౌశలం ఎంత గొప్పదో నరకసుర వధ సందర్భంగా పోతన మనకు భాగవతంలొ చూపలేదా 🙂
భార్యల మధ్య ఈసు అంటారా – విశ్వనాథ వ్రాసిన పీఠికలో చెప్పినట్లు, – కృష్ణుడి విషయంలో అది కొద్దిగా నమ్మటం కష్టం. భాగవతంలొ నరకాసుర వధ తర్వాత చెరసాల్లో ఉన్న పదహారు వేల రాజకన్యలను విడిపించి వారికి ఎన్నెన్నో బహుమానాలిచ్చి, వాళ్ళను ద్వారక పంపించి అప్పుడుకదా ఆయన ఇంద్రుడిని చూడ్డానికి వెళ్ళింది. ఆ తతంగమంతా చూసి, అప్పుడు గరుత్మంతుడినెక్కి, ఆయనతో ఇంచక్కా వెళ్ళిన సత్యభామకు, అంత ఈసు ఎక్కడినించి వస్తుంది చెప్పండి. అదీ ఒక్క పూవు గురించి.
ఐనా తిమ్మన కవి కథ మార్చి,-సవతిని గూర్చి నారదుడి రెచ్చగొట్టే మాటలు, చెలికత్తె అవి చేరవేసినప్పుడు కలిగే చిన్నతనం – వాటినుంచీ కథ పెంచుకుంటూ రసవంతంగా కథ నడిపారు.
‘ తులసి దళం చేత్తో పట్టుకుని, పతిభక్తి అనుకుంటూ పాదసేవలూ, పూజలూ చేసే రుక్మిణి లాగా వుండే సత్యభామను తెలుగువారు అంగీకరించలేరు. ”
తెలుగు సినిమాల్లో ఆ నీరసపు నటి శ్రీరంజనితో రుక్మిణి పాత్ర వేయించి, రుక్మిణి ఇమేజ్ పాడు చేశారు. పోతన భాగవతం చదివితే ఒక చక్కని ధీర ప్రణయిని, ఆదర్శనీయమైన కథానాయిక – అసలు రుక్మిణి కనబడుతుంది గదా.
Hanumanth Rao Garu,
Excellent article, I was really looking very hard to find such books/articles .
I ‘am so happy to find your articles.
Please keep writing . you efforts are highly appreciated.
ఈ వ్యాఖ్యానం విన్నాక ఈ పద్యం ఎంత శక్తివంతమైనదో తెలుస్తోంది. నాలుగు పాదాల్లో ఎంత స్క్రీన్ ప్లే యిమిడివుందో తెలుసుకొన్నాక చాలా ఆనందం కలిగింది. మొత్తంగా ఈ శీర్షికే మహగొప్పగా వుంది. బృందావనరావుగారికి నమస్సులు.
ఏప్రిల్ 16 వ తేదీ “ఆంధ్ర నాటక దినోత్సవం“. ఇది కేవలం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి తెచ్చుకున్న రోజులా అనిపిస్తుంది. కనీసం ఒక్క తెలుగు పత్రిక కూడా తెలుగు నాటక రంగం గురించి రాయవు. కనీసం నాటక రంగంలో జీవితాన్ని వెళ్ళబుచ్చే మహామహులైనా “”ఆంధ్ర నాటక దినోత్సవం” అనేది ఒకటుందనీ గ్రహించరు. దాని గురించి ప్రజలకి తెలిసేలా కనీసం ఒక్క నాటక ప్రదర్శన అయినా చేయరు. ఎవరిదైనా ప్రోద్బలం ఉంటే ప్రోత్సాహం అదే వస్తుంది. అది ఎక్కడనుండో రావాలనుకోవడం అవివేకం. అది నాటకరంగం నుండే రావాలి. ముందుగా దాన్ని నమ్ముకొని జీవనాన్ని వెళ్ళబుచ్చే వాళ్ళే స్పందించాలి.
తెలుగు నాటక రంగలో ఓ ప్రముఖ వ్యక్తి నా ఈ వ్యాసం చదివి, తెలుగు నాటకం వెలిగిపోతోంది, మీరు రాసినట్లుగా లేదు అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో నిజం దివిటీలా కనిపించింది.
ఏదేమైనా తెలుగు నాటకానికి మంచి రోజులు వస్తాయన్నదే నా అశ ! చక్రం క్రింది భాగం పైకి రావడానికి కాస్త సమయం పడుతుంది.
ఎంత చక్కగా వ్రాశారు. ఎవరికి వారికి ఇది తమ గురించే అనిపిస్తుందేమో!
సాదాగానే మొదలయిందనుకున్నాను. కలహపు కోట గోడను నిశ్శబ్దం కరిగించడం చదువుతూనే చిన్న అలజడి. సుపరిచితమైనా, వ్యక్తం చేయలే(రా)ని భావనలను అందంగా ఆవిష్కరించారు. లక్ష్మి గారు వ్రాసిన “తుషార కన్నీటి భావ బిందువు” చాలా బావుంది.
బాగుందండి….కధలు చదివి చాలా రోజులు అయ్యింది….అప్పుడెప్పుడో పత్రికలు బాగా చదివే రోజులలో కధలు చదివినట్టు గుర్తు…..ఆ రోజులు మళ్ళీ రావు…కధలు చెప్పే, వినే ఓపిక రెండు పోయాయి…కధ చాల బాగుంది….
నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
04/25/2008 9:00 am

లైలా
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి meenakshi గారి అభిప్రాయం:
04/25/2008 7:44 am
Hanumanth Rao Garu,
Excellent article, I was really looking very hard to find such books/articles .
I ‘am so happy to find your articles.
Please keep writing . you efforts are highly appreciated.
వినినంతనె వేగ పడక గురించి sunitha గారి అభిప్రాయం:
04/24/2008 11:15 pm
మొదటి అర్ధ భాగాన్ని కొంత క్లుప్తంగ చెప్పి ఉంటే మరింత బాగుండేది.
నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి రానారె గారి అభిప్రాయం:
04/23/2008 1:51 pm
ఈ వ్యాఖ్యానం విన్నాక ఈ పద్యం ఎంత శక్తివంతమైనదో తెలుస్తోంది. నాలుగు పాదాల్లో ఎంత స్క్రీన్ ప్లే యిమిడివుందో తెలుసుకొన్నాక చాలా ఆనందం కలిగింది. మొత్తంగా ఈ శీర్షికే మహగొప్పగా వుంది. బృందావనరావుగారికి నమస్సులు.
బ్లాగుల గురించి – నా మాట గురించి sfsdf గారి అభిప్రాయం:
04/19/2008 2:11 am
మీరు బ్లాగుల గురించి రాసింది బాగుందండీ
తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి Sai Brahmanandam Gorthi గారి అభిప్రాయం:
04/15/2008 8:32 pm
నాలాంటి వ్యక్తి ఇంకొకరున్నారని ఇప్పుడే తెలుసుకున్నాను.
ఈ లింకు తట్టితే తెలుస్తుంది. కనీసం వ్యాసమైనా రాసారు. మిగతా పత్రికల్లో అదీ లేదు.
వినినంతనె వేగ పడక గురించి NARASIMHARAO గారి అభిప్రాయం:
04/15/2008 7:18 pm
ఫర్వాలేదు, బాగానేఉంది. సరదాగాకూడా ఉంది.
తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి Sai Brahmanandam Gorthi గారి అభిప్రాయం:
04/15/2008 11:23 am
ఏప్రిల్ 16 వ తేదీ “ఆంధ్ర నాటక దినోత్సవం“. ఇది కేవలం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి తెచ్చుకున్న రోజులా అనిపిస్తుంది. కనీసం ఒక్క తెలుగు పత్రిక కూడా తెలుగు నాటక రంగం గురించి రాయవు. కనీసం నాటక రంగంలో జీవితాన్ని వెళ్ళబుచ్చే మహామహులైనా “”ఆంధ్ర నాటక దినోత్సవం” అనేది ఒకటుందనీ గ్రహించరు. దాని గురించి ప్రజలకి తెలిసేలా కనీసం ఒక్క నాటక ప్రదర్శన అయినా చేయరు. ఎవరిదైనా ప్రోద్బలం ఉంటే ప్రోత్సాహం అదే వస్తుంది. అది ఎక్కడనుండో రావాలనుకోవడం అవివేకం. అది నాటకరంగం నుండే రావాలి. ముందుగా దాన్ని నమ్ముకొని జీవనాన్ని వెళ్ళబుచ్చే వాళ్ళే స్పందించాలి.
తెలుగు నాటక రంగలో ఓ ప్రముఖ వ్యక్తి నా ఈ వ్యాసం చదివి, తెలుగు నాటకం వెలిగిపోతోంది, మీరు రాసినట్లుగా లేదు అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో నిజం దివిటీలా కనిపించింది.
ఏదేమైనా తెలుగు నాటకానికి మంచి రోజులు వస్తాయన్నదే నా అశ ! చక్రం క్రింది భాగం పైకి రావడానికి కాస్త సమయం పడుతుంది.
– సాయి బ్రహ్మానందం గొర్తి
నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి padmaja గారి అభిప్రాయం:
04/15/2008 8:39 am
ఎంత చక్కగా వ్రాశారు. ఎవరికి వారికి ఇది తమ గురించే అనిపిస్తుందేమో!
సాదాగానే మొదలయిందనుకున్నాను. కలహపు కోట గోడను నిశ్శబ్దం కరిగించడం చదువుతూనే చిన్న అలజడి. సుపరిచితమైనా, వ్యక్తం చేయలే(రా)ని భావనలను అందంగా ఆవిష్కరించారు. లక్ష్మి గారు వ్రాసిన “తుషార కన్నీటి భావ బిందువు” చాలా బావుంది.
ఊర్మిళ రేఖ గురించి gopi గారి అభిప్రాయం:
04/15/2008 8:10 am