వర్ధమాన ప్రతిభావంత కవయిత్రి రేఖాజ్యోతి తల్లికి ఓ చిరు కానుక…
ముళ్లపూడి వెంకటరమణ (1931–2011) ‘కానుక’ కథకు సంక్షిప్త రూపం.
గోపన్న ఎన్ని యుగాలుగా అక్కడ చెట్ల మాటున కూర్చున్నాడో అతనికే తెలియదు. ఆకులలో ఆకై పువ్వులో పువ్వయి, ఇసుకలో రేణువై యమునలో బిందువై కృష్ణ వంశీనాదాన్ని హృదయంలో పోసుకున్నాడు. యమున ఒడ్డున పొదల మాటున దాగి కృష్ణుడి మురళి విన్నప్పుడు వూపిరి బిగబట్టుకునే కాలం గడిపేవాడు. అక్కడ పొదుపు చేసిన దానిని కొత్త వేణువును పూరించడానికి ఉపయోగించేవాడు. తీరా అది శ్రుతి శుద్ధంగా వినబడేది కాదు.
ఇంత మోహనమైన సంగీతాన్ని కృష్ణుడు ఒక వెదురు ముక్కలో ఎలా ఇమిడ్చాడా అని గోపన్న ఆలోచించాడు. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ మురళిని ఎత్తుకు వచ్చాడు. యమున ఒడ్డుకు వచ్చి, చెంగుచాటు నుంచి మురళి తీసి వాయించాలనుకునేసరికి అది కనబడలేదు.
గజదొంగ దగ్గర నేను దొంగతనమేమిటి అనుకున్నాడు గోపన్న. కాని ఆ గజదొంగ సాయంత్రం కనబడి “గోపన్నా నా మురళిని తీసుకుపోయావు కదూ… పోనీ ఇంకొకటి చేసిపెట్టు” అన్నాడు నవ్వి. గోపన్న తెల్లబోయాడు. మర్నాటి నుంచి వేణు నిర్మాణం ఆరంభించాడు. అతనిలో కొత్త శక్తి, కొత్త చైతన్యం మేల్కొన్నాయి. తన చేతులతో రూపు దిద్దుకుంటున్న మురళి రేపు కృష్ణుడి హస్తాలను అలంకరిస్తుందని ఆశపడుతూ మురళిని రూపొందించాడు.
మురళి సిద్ధం కాగానే శ్రుతి చూశాడు. గుండె బద్దలయినంత పనయింది. జీర. రెండు మూడు వేణువులు పలికినట్టుంది. కృష్ణుడు వూదుతాడన్న ఆనందంలో దానికి ఒళ్లు పులకరించిందా? అది పడేసి మరోటి చేశాడు. అదీ అంతే.
కృష్ణుడి పుట్టినరోజు వచ్చేస్తుంది. పాతిక పండగలనాడు గోపన్న ఆరంభించిన వేణు నిర్మాణం ఇంకా తెమలలేదు. రేపటికైనా సాధించి, తన వేణువును ఆయనకు సమర్పించాలి. రేపివ్వలేకపోతే ఇంక ఈ జన్మకివ్వలేడు… వేళయిపోయింది.
కొత్త వెదురు కోసి స్వరద్వారాలు వేసి, మనసులో స్వరాన్ని ఇందులో పలికించబోయాడు. ఆ స్వరం తన ఈ వేణువులో పలికితే ఇది కృష్ణయ్యకు కానుక ఇవ్వాలి. కాని అది పలకదు. ఎన్ని వేల వేణువులో చేశాడు. ప్రతి అణువునా భగవంతుడున్నాడు. ప్రతి శబ్దంలోనూ సంగీతం ఉంది, అన్న వాక్యాల తాత్పర్యం గోపన్న అర్భక దేహానికి దుర్భరమైపోయింది.
అతను ఊహించిన సంగీతాన్ని అనుభవించడానికి శక్తి చాలలేదు.
ఇన్ని వేణువుల గుట్టలో ఎక్కడో సత్యమైన కొత్త వేణువు దాగివుంది. అది సత్యమైనదేనా? ఒకప్పుడు పనికిరాదని తాను పడవేసిందేమో. చివరి మురళిని పరీక్షించడానికి ధైర్యం చాలలేదు. సత్యం తెలుసుకొని చనిపోగల శక్తి లేదు.
“ఇదే” అన్నాడు ధీమాగా.
“చూడవా” అన్నాడు కుర్రాడు.
“ఒద్దు. లగెత్తు. కిష్టయ్య చేతికియ్యి ఆయనే చూస్తాడు.”
పాతిక సంవత్సరాల గాలివాన వెలిసింది. గోపన్న మేను వాల్చాడు. తాను పని ముగించాడా. భగవంతుడికి శ్రుతి శుద్ధమైన వేణువును పంపాడా. శ్రుతి శుద్ధంగా ఉందో లేదో నిర్ణయించే జ్ఞానం తనకు ఉందా? సరిచేసే శక్తి ఆయనకు లేదని తను అనుకొన్నాడా? గోపన్నకు నవ్వు వచ్చింది.
తన పక్కనున్న వేణువులోంచి సన్నటి స్వరం నెమ్మదిగా ఇవతలికి రావడం, వచ్చి తన చెంప నిమరడం గమనించాడు గోపన్న. ఇంకో క్షణానికి ఆ పక్క మురళి, ఉత్తర క్షణార్థానికి ఇటుపక్క మురళి మేలుకున్నాయి. మరికొద్ది క్షణాలలో కుటీరంలోని సహస్ర వేణువులూ భువన మోహనంగా గానం చేయసాగాయి.
“ఎవరొచ్చినా ఎదురుచూస్తున్న ఆ ఒక్కరూ రారు! అనకు
అలసిపోకు, విశ్రాంతిగా ఉండు, ఆలోచనలు ఎంత ముంచుతాయో అంత మునుగు.
తోట బాగు చేసుకో, కవిత్వం రాసుకో, మట్టి పిసికి బొమ్మలు చేసుకో.
కిటికీ ఆవల పొర్ణమి, కళ్ళలో యమున, వెన్నెల ప్రతిఫలిస్తోంది.
అదిగో నెమ్మదిగా ఒక నవ్వు ముఖం స్పష్టమవుతోంది”
అబ్బా! పిల్లలకు అందుబాటులో వుండే సౌందర్యం అంతా ఒలకబోశారు గదా!చిన్నతనంలో చందమామలో కూడా ఇంత మరపురాని కథ చదివినట్లు గురుతులేదు. మూలకథకులకు, మీకు ఎంతెంతో జంగిడీలు.
ఆహా యెంత చక్కని తెలుగు భాష ప్రయోగమండీ. ఏదైనా తినబోతే నోరు ఊరటం మామూలే కానీ మీ భాష చదువుతుంటే నోట్లోకి నీళ్లు ఊరుతున్నాయి.మిత్రమా! ఈ పుస్తకం; కాదు కాదు పుస్తకరాజం ఎక్కడ దొరుకుతుందో చెప్ప ప్రార్థన.
నేనే! గురించి కిషోర్ గారి అభిప్రాయం:
09/24/2022 5:23 pm
చాలా బాగుంది భారతి గారు.
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి V N Reddy గారి అభిప్రాయం:
09/22/2022 1:14 am
ఘంటసాల, బాలసుబ్రమణ్యం కలసి పాడిన మరో రెండు పాటలు:
“భలే మజాలే భలే ఖుషిలే”, నీతి నీజాయితి (1967)
“దేవుడు చేసిన మనుషుల్లారా”, దేవుడు చేసిన మనుషులు (1973)
శెలవు రోజున గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
09/19/2022 1:26 pm
వర్ధమాన ప్రతిభావంత కవయిత్రి రేఖాజ్యోతి తల్లికి ఓ చిరు కానుక…
ముళ్లపూడి వెంకటరమణ (1931–2011) ‘కానుక’ కథకు సంక్షిప్త రూపం.
గోపన్న ఎన్ని యుగాలుగా అక్కడ చెట్ల మాటున కూర్చున్నాడో అతనికే తెలియదు. ఆకులలో ఆకై పువ్వులో పువ్వయి, ఇసుకలో రేణువై యమునలో బిందువై కృష్ణ వంశీనాదాన్ని హృదయంలో పోసుకున్నాడు. యమున ఒడ్డున పొదల మాటున దాగి కృష్ణుడి మురళి విన్నప్పుడు వూపిరి బిగబట్టుకునే కాలం గడిపేవాడు. అక్కడ పొదుపు చేసిన దానిని కొత్త వేణువును పూరించడానికి ఉపయోగించేవాడు. తీరా అది శ్రుతి శుద్ధంగా వినబడేది కాదు.
ఇంత మోహనమైన సంగీతాన్ని కృష్ణుడు ఒక వెదురు ముక్కలో ఎలా ఇమిడ్చాడా అని గోపన్న ఆలోచించాడు. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ మురళిని ఎత్తుకు వచ్చాడు. యమున ఒడ్డుకు వచ్చి, చెంగుచాటు నుంచి మురళి తీసి వాయించాలనుకునేసరికి అది కనబడలేదు.
గజదొంగ దగ్గర నేను దొంగతనమేమిటి అనుకున్నాడు గోపన్న. కాని ఆ గజదొంగ సాయంత్రం కనబడి “గోపన్నా నా మురళిని తీసుకుపోయావు కదూ… పోనీ ఇంకొకటి చేసిపెట్టు” అన్నాడు నవ్వి. గోపన్న తెల్లబోయాడు. మర్నాటి నుంచి వేణు నిర్మాణం ఆరంభించాడు. అతనిలో కొత్త శక్తి, కొత్త చైతన్యం మేల్కొన్నాయి. తన చేతులతో రూపు దిద్దుకుంటున్న మురళి రేపు కృష్ణుడి హస్తాలను అలంకరిస్తుందని ఆశపడుతూ మురళిని రూపొందించాడు.
మురళి సిద్ధం కాగానే శ్రుతి చూశాడు. గుండె బద్దలయినంత పనయింది. జీర. రెండు మూడు వేణువులు పలికినట్టుంది. కృష్ణుడు వూదుతాడన్న ఆనందంలో దానికి ఒళ్లు పులకరించిందా? అది పడేసి మరోటి చేశాడు. అదీ అంతే.
కృష్ణుడి పుట్టినరోజు వచ్చేస్తుంది. పాతిక పండగలనాడు గోపన్న ఆరంభించిన వేణు నిర్మాణం ఇంకా తెమలలేదు. రేపటికైనా సాధించి, తన వేణువును ఆయనకు సమర్పించాలి. రేపివ్వలేకపోతే ఇంక ఈ జన్మకివ్వలేడు… వేళయిపోయింది.
కొత్త వెదురు కోసి స్వరద్వారాలు వేసి, మనసులో స్వరాన్ని ఇందులో పలికించబోయాడు. ఆ స్వరం తన ఈ వేణువులో పలికితే ఇది కృష్ణయ్యకు కానుక ఇవ్వాలి. కాని అది పలకదు. ఎన్ని వేల వేణువులో చేశాడు. ప్రతి అణువునా భగవంతుడున్నాడు. ప్రతి శబ్దంలోనూ సంగీతం ఉంది, అన్న వాక్యాల తాత్పర్యం గోపన్న అర్భక దేహానికి దుర్భరమైపోయింది.
అతను ఊహించిన సంగీతాన్ని అనుభవించడానికి శక్తి చాలలేదు.
ఇన్ని వేణువుల గుట్టలో ఎక్కడో సత్యమైన కొత్త వేణువు దాగివుంది. అది సత్యమైనదేనా? ఒకప్పుడు పనికిరాదని తాను పడవేసిందేమో. చివరి మురళిని పరీక్షించడానికి ధైర్యం చాలలేదు. సత్యం తెలుసుకొని చనిపోగల శక్తి లేదు.
“ఇదే” అన్నాడు ధీమాగా.
“చూడవా” అన్నాడు కుర్రాడు.
“ఒద్దు. లగెత్తు. కిష్టయ్య చేతికియ్యి ఆయనే చూస్తాడు.”
పాతిక సంవత్సరాల గాలివాన వెలిసింది. గోపన్న మేను వాల్చాడు. తాను పని ముగించాడా. భగవంతుడికి శ్రుతి శుద్ధమైన వేణువును పంపాడా. శ్రుతి శుద్ధంగా ఉందో లేదో నిర్ణయించే జ్ఞానం తనకు ఉందా? సరిచేసే శక్తి ఆయనకు లేదని తను అనుకొన్నాడా? గోపన్నకు నవ్వు వచ్చింది.
తన పక్కనున్న వేణువులోంచి సన్నటి స్వరం నెమ్మదిగా ఇవతలికి రావడం, వచ్చి తన చెంప నిమరడం గమనించాడు గోపన్న. ఇంకో క్షణానికి ఆ పక్క మురళి, ఉత్తర క్షణార్థానికి ఇటుపక్క మురళి మేలుకున్నాయి. మరికొద్ది క్షణాలలో కుటీరంలోని సహస్ర వేణువులూ భువన మోహనంగా గానం చేయసాగాయి.
అన్నిటిలోనూ కృష్ణుడి మోహన గానమే. అసత్యమైన వేణువు లేనేలేదు. భగవంతుడికి ఉపయోగపడని వేణువే లేదు. గోపన్న సహస్ర వేణునాద స్వరార్ణవంలో–సాక్షాన్మహావిష్ణువై తేలుతున్నాడు.
శెలవు రోజున గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
09/19/2022 1:24 pm
అనంత నీరవ నిరీక్షణలకు నిర్మల మందాకినీ వీచికలతో సాంత్వన నిస్తాయి అంబుజోదర దివ్య పాదారవిందాలు.
చందమామ ఎంత దూరం గురించి T.subrahmanyam గారి అభిప్రాయం:
09/18/2022 6:11 am
అబ్బా! పిల్లలకు అందుబాటులో వుండే సౌందర్యం అంతా ఒలకబోశారు గదా!చిన్నతనంలో చందమామలో కూడా ఇంత మరపురాని కథ చదివినట్లు గురుతులేదు. మూలకథకులకు, మీకు ఎంతెంతో జంగిడీలు.
రామతత్వం గురించి Veena గారి అభిప్రాయం:
09/16/2022 3:32 pm
పైన ఆర్టికల్ కనబడటం లేదు.
[సాంకేతిక లోపం వల్ల కొన్ని పిడిఎఫ్ ఫైల్స్ కొన్ని కనిపించటం లేదు. లోపం సరిదిద్దే ప్రయత్నాల్లో ఉన్నాం – సం]
Sita’s Eros -A Musical గురించి Veena గారి అభిప్రాయం:
09/16/2022 3:30 pm
బాగుంది
చందమామ ఎంత దూరం గురించి Srinivas Bandaa గారి అభిప్రాయం:
09/16/2022 8:39 am
అద్భుతమైన ఊహాశక్తి!
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 11 గురించి T.subrahmanyam గారి అభిప్రాయం:
09/16/2022 3:58 am
ఆహా యెంత చక్కని తెలుగు భాష ప్రయోగమండీ. ఏదైనా తినబోతే నోరు ఊరటం మామూలే కానీ మీ భాష చదువుతుంటే నోట్లోకి నీళ్లు ఊరుతున్నాయి.మిత్రమా! ఈ పుస్తకం; కాదు కాదు పుస్తకరాజం ఎక్కడ దొరుకుతుందో చెప్ప ప్రార్థన.
అమ్మ చీర గురించి T.subrahmanyam గారి అభిప్రాయం:
09/16/2022 2:01 am
అవును సుమీ! అమ్మలు ఏదేశంలో వున్నా అంతే.
కృతజ్ఞతలతో