Comment navigation


15549

« 1 ... 126 127 128 129 130 ... 1555 »

  1. కూటి రుణం గురించి Vyboina Satyanarayana గారి అభిప్రాయం:

    10/04/2022 12:40 am

    కథ చదువుతున్నప్పుడు కళ్ళల్లో నీటిపొరలు కమ్మి అక్షరాలు కనపడకపోతే ఆ కథ గొప్ప కథ అని ఆదివిష్ణు గారు ఒక సందర్భంలో చెప్పారు. ఈరోజు నేను ఒక గొప్ప కథ చదివాను.

  2. జానకమ్మ ఇంగ్లండ్‌ యాత్ర గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    10/03/2022 8:47 am

    నా వ్యాసంలో పొరపాటు జరిగింది. ఈ యాత్రాగాథలో 1857 ప్రస్తావనే లేదు అన్నాను. అది తప్పు. రచయిత తాను లండన్‍లో చూసిన ఛాంబర్ ఆఫ్ హారర్స్ గురించి చెపుతూ, ‘నానాసాహెబ్ అనే తిరుగుబాటుదారు నేతృత్వంలో 1857లో జరిగిన కాన్పూర్ పితూరి తాలూకు శిల్పాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు… ఆ భయానక దృశ్యాలు చూసి కళ్లుతిరిగి పడిపోతాననే భయంతో ఎక్కువసేపు ఉండలేదు’ అని రాశారు.

    ఈ పొరపాటుకు క్షంతవ్యుడ్ని.

  3. కూటి రుణం గురించి బదరీనాథ్ గారి అభిప్రాయం:

    10/03/2022 7:07 am

    చాల మంచి కథ. అలివి కాని కథ.

  4. కూటి రుణం గురించి hemavathi bobbu గారి అభిప్రాయం:

    10/03/2022 6:21 am

    కథ చాలా అద్బుతంగా ఉంది.

  5. జానకమ్మ ఇంగ్లండ్‌ యాత్ర గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    10/02/2022 11:36 pm

    సుధ గారూ, ధన్యవాదాలు.

  6. జానకమ్మ ఇంగ్లండ్‌ యాత్ర గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    10/02/2022 11:33 pm

    రామారావు గారూ,
    మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ వ్యాసంలో చెప్పినట్టు జానకమ్మ పుస్తకం ట్రావెలోగ్ పరిధిని దాటి బాగా ముందుకు వెళ్లిన రచన. కుతూహలం, అబ్బురపడేశక్తి లను దాటి వెళ్లిన రచన.
    ఇందులో ‘సమకాలీన’రాజకీయ,చారిత్రక, సామాజిక,వైజ్ఞానిక,సాంస్కృతిక,భౌగోళిక విషయాల ప్రస్తావన విశ్లేషణ ఉంది. మతం, జాతులమధ్య సామరస్యం, సంఘసంస్కరణ,పారిశ్రామిక పురోభివృధ్ధి గురించి చర్చ ఉంది. స్త్రీవిద్య, ఉద్యోగాలు, స్త్రీపురుష సమానత, అనుకూల దాంపత్యాలు గురించి పరిశీలనలున్నాయి. దేశకాలమాన పరిస్థితుల విషయంలో రచయితకు సగటును మించిన పరిజ్ఞానం ఉంది.మాంఛెష్టర్ లోని మిల్లులూ ఇతర పరిశ్రమలూ రచయిత ప్రత్యేకంగా వెళ్లి చూసారు. లండన్ హోటళ్లూ ఇళ్లలోని పనివాళ్ల గురించి ఒకటికి నాలుగుమార్లు చెప్పారు. కొన్నిసార్లు గురజాడ చెప్పిన ఆధునిక మహిళ ఈమేనా అనిపించింది.

    ఈ నేపథ్యంలో, ఈ విశాల విశ్లేషణల నేపథ్యంలో వలస,వ్యాపార,కార్మిక,1857ల గురించి పుస్తకం మౌనంగా ఉండటం ఆశ్చర్యపరుస్తోంది అన్నాను..

  7. జానకమ్మ ఇంగ్లండ్‌ యాత్ర గురించి Sudha గారి అభిప్రాయం:

    10/02/2022 9:03 pm

    150 సంవత్సరాల క్రితం వచ్చిన ట్రావెలాగ్, అందులోనూ ఒక మహిళ రాయడం, ఆ కాలంలో ఆచారాలను ధిక్కరించి ముందుకు వెళ్లడం సామాన్యమైన విషయం కాదు. ఆమె గమనింపు, విశ్లేషణ అంత లోతుగా ఉండి కూడా భారతదేశంలోని పరిస్థితులను ప్రస్తావించకపోవడం ఒకరకంగా ఆశ్చర్యంగా ఉంది, బహుశా ఒరిజినల్ తెలుగు వెర్షన్ ఇంకా ఏమైనా ఉండి ఉండొచ్చా అనిపించింది. ఏమైనా మీ క్రిటికల్ రివ్యూ నచ్చింది అమరేంద్రగారు.

  8. కూటి రుణం గురించి Gireesh Kunnathattil గారి అభిప్రాయం:

    10/02/2022 12:07 pm

    ఆహా! ఎంత హాయిగా ఉంది! కథ, అనువాదమూ రెండూ చాలా చక్కగా, చిక్కగా ఉన్నాయి భాస్కర్ గారూ!

  9. గడినుడి – 72 గురించి సంపాదకులు గారి అభిప్రాయం:

    10/02/2022 11:20 am

    ముందుగా దోషాలను చూసుకోకపోవడం వలన గడినుడి ఆధారాలలో ఒక చిన్నమార్పు చేయాల్సివచ్చింది.

    7 నిలువుకు ఆధారం మార్చాము. పొరబాటుకు క్షంతవ్యులం.

    — సంపాదకులు

  10. జానకమ్మ ఇంగ్లండ్‌ యాత్ర గురించి RAMARAO KANNEGANTI గారి అభిప్రాయం:

    10/02/2022 5:29 am

    1870ల లోనే ఇంత వివరమైన పుస్తకం వచ్చిందంటే ఆశ్చర్యం! కానీ, అప్పటి పుస్తకాలలో వ్యాపార, వలసవాద విశ్లేషణలు ఉండటం Jane Austen లో పని వాళ్ళ కుటుంబాల ప్రస్తావన వెతుక్కున్నట్లు అనుకుంటాను. ప్రయాణీకుడికి ఉండవలసింది, కుతూహలం, మానసిక వైశాల్యం, అబ్బురపడే శక్తి. విశ్లేషణా శక్తి ఉండటం ఉంటే అది కొసరు. కానీ, మన కాలపు విశ్లేషణ ఆ కాలపు విశ్లేషణ ఒక విధంగా ఉండవు కదా? మనం కూడా, మన కాలపు వివాదాలకి, ఆలోచనలకీ, బద్ధులమే! ఎప్పుడైనా కాలాతీత వ్యక్తులు అరుదు.

    ఇప్పుడు కూడా, చారిత్రిక యాత్రా పుస్తకాలు చదివితే, అప్పటి విశ్లేషణలు, ఆ రచయిత గురించి తెలుసుకోవడం కోసం వాడుతారు. ఆ రచయిత దేశ కాల మాన పరిస్థితుల గురించి తెలుసుకోవడం కోసం చదువుతారు. ఇప్పుడు ఇబ్న్ బటూటా చీనా గురించి చెబితే, అది చీనా గురించే కాదు, బటూటా సొంత సమాజం, ఆ సమాజం అతనికి ఇచ్చిన దృక్పథం గురించి ఎక్కువ తెలుస్తుంది!

« 1 ... 126 127 128 129 130 ... 1555 »