నాలుగుసార్లు చదివాను. ఏ రుణమైనా తీరుతుంది కూటి రుణం ఎన్నటికీ తీరదు అంటారు. కథంతా ఈ సూత్రం పైనే నడిచింది. ఇంకా ఉదాత్తంగా నడిచింది. వడ్డించే దగ్గర తల్లి భావాలు, తండ్రి ఈర్ష్య ఇవన్నీ కూడా సహజంగా వున్నాయి. కథ చాలా నచ్చింది. అనువాదకుడు భాస్కర్ గారికి మీకు ధన్యవాదాలు. 🙏. మరుపురాని కథల జాబితాలో ఇదొకటి.
1. ఈ కథ చదివించినందుకు అమరేంద్రకు ధన్యవాదాలు.
2. కెత్తేల్ సాయిబు ఎవరు? ఈ ప్రశ్న చిన్నదే. నా జవాబు పెద్దది. అనాది మానవుడు. మిగులు ప్రవేశించాక దాత. ఎలా? అనాది మానవుని సహజాతం పంచుకోటం. అది అనివార్యత లోంచి వచ్చినదన్న ఊహ కూడా ఉంది. కావచ్చు. కాకపోవచ్చు. ఏమైనా ఇది జన్యుపరమైనదనే ఊహ నాకు బాగుంటుంది. మానవ సమాజంలో మిగులు ప్రవేశించేక ఈ పంచుకోటం సంస్కృతి అయింది. ఆ రెంటికీ మధ్య కాలం చాలా పెద్దదే. అది సహజాతం నుంచి సంస్కృతి అయిందని చెప్పటానికి మనం పదేపదే వినే మాట ఒకటి ఆధారం. అతిథి దేవో భవ. ఇది మన ప్రాంతానిదే కావచ్చు. ఇలాంటివి అనేక సంస్కృతులలో ఉండే అవకాశం ఉంది. నేను నీకు కడుపు నిండా పెట్టలేకపోతున్నాను. నన్ను క్షమించు. అని చేతులు జోడించటమూ అదే చెబుతుంది. అయితే మిగులు ప్రవేశంతో పంచుకోటం కాస్తా రూపాంతరం చెంది పెట్టడం అయింది.
3. కెత్తేల్ సాయిబు అంతేనా? కాదు. అతను ఆహార శ్రామికుడు. ఆ శ్రామికుని లక్షణం తను తయారు చేసిన ఆహారాన్ని తిన్న మనిషి ముఖంలోని ఆనందం. తను వడ్డించిన విస్తరి ఖాళీ చేసినవాని ముఖం లోని తృప్తి. వంట, వడ్డనలు వృత్తిగా మారి శ్రామికుని కడుపు నిండటానికి ఆధరువు కావచ్చు. కాని అందులోని అమ్మతనం మారిందని నాకు అనిపించదు.
4. కెత్తేల్ సాయిబు పిల్లలు ఆర్ధికంగా బాగుపడ్డారని కథ చెపుతోంది. దాని వెనక ఆర్ధికత(ఎకనామిక్సు) ఏమిటి? నేను ఫ్రీకనామిక్సు అనే పుస్తకం చదవాను. అందులో ఒక ప్రయోగం చెపుతారు. ఒక పెద్ద వ్యాపారసంస్థ భవనం అది. అందులో నాలుగు అంతస్తులు ఉంటాయి. ఆ సంస్థలో పై అంతస్తులో పైస్థాయి వారుంటారు. క్రమంగా చివరి అంతస్తులో చివరి స్థాయి ఉద్యోగులు. నాలుగు అంతస్తులలోనూ తినే తాగే పదార్ధాలుంటాయి. అమ్మేవాడుండడు. ఎవరికి కావలసినది వాళ్లు తీసుకుని పక్కన ఉన్న పెట్టెలో డబ్బులు వెయ్యాలి. పై స్థాయి వారి నుంచి కింద స్థాయి వరకూ వాటిలో ఆదాయం ఎలా ఉంటుంది – అది మీ ఊహకి వదిలేస్తాను. పిల్లలు బాగుపడ్డది సాయిబు సంపాదన వల్లనా? పేరు(బ్రాండ్ ఇమేజ్) వల్లనా? అతని వంట శిక్షణ వల్లనా? కథలో ఆ విషయ స్పష్టత లేదు. కథకి కేంద్రం అతనా? కథకుడా? కథకుడు రామలక్ష్మిని పెళ్లాడటంలో అతని కూటిఋణం తీరటంలో సాయిబు ఆదర్శం లేదా తాత్వికత ప్రభావం ఉన్నాయా? కాకపోతే భారతదేశంలో చాలాకాలం ఈ ఫ్రీకనామిక్సు ఉండేదన్న అంశం నాకు ఈ కథ ఉద్దేశ్య పూర్లకంగానో అనుద్దేశితంగానో గుర్తు చేసింది.
5. నా వ్యక్తిగత జీవితంలో అటువంటి దారిద్ర్యాన్ని అనుభవించాను. ఒక రాత్రి వేళ భరించలేక చావబోతే నన్ను రక్షించి అన్నం పెట్టి నాకు ఒక ఉద్యోగం వేయించిన ఆ మహానుభావుడు గుర్తువచ్చాడు. ఏదైనా తిండి పెట్టడం గురించే కాక దాని రుచి గురించి చెప్పటం నాకు మల్లాది వారి కృష్ణాతీరం గుర్తు చేసింది.
6. రచయితకీ, పరాయి ప్రాంతపు కథ అని గుర్తురాకుండా ఆత్మీయంగా చెప్పిన అనువాదకునికీ ధన్యవాదాలు.
తారులో చెయ్యి పెట్టడం అనుభవం గమ్మత్తుగా ఉంది. పెద్దలనుంచి అందే పరిజ్ఞానం, సొంతంగా చేసే ప్రయోగాలు వెరసి మానవుల ముందడుగులు. అందరు పెద్దలూ చాలావరకు మంచాళ్లేనని అవసరం వస్తే గానీ తెలీకపోడం మనందరి అనుభవమే. బావుందీ ఊటల్లో ప్రయాణం.
వార్కా బీచ్, గోవా: దక్షిణ గోవా మార్గో నుండి 8 కిలోమీటర్లు మరియు రాష్ట్ర రాజధాని నగరం పనాజి నుండి 40 కిలోమీటర్లు దూరం లోని వార్కా బీచ్ సుందరమైనది, తెల్లటి మెత్తటి ఇసుక తీరాల ఇక్కడ నుండి అద్భుతమైన సూర్యాస్తమయాలను చూడవచ్చు. జనబాహుళ్యాల/పర్యాటకుల రద్దీ అంతగా లేని బీచ్, వార్కా బీచ్.
కవితా హృదయులైన కవయిత్రి చామర్తి మానస లాంటి వారు వార్కా బీచ్ తీరాన జీవన సాఫల్య క్షణాలను లెక్కపెట్టగలుగుతారు… సాగరతీర సమీపాన కావ్యసుధాగానం చేస్తారు. అలాగే వారోసారి శ్రీశ్రీ, రావిశాస్త్రి, త్రిపుర తండ్రుల విశాఖ బీచ్, యారాడ కొండల దగ్గర కెళ్లి కలం ఝళిపించాలని ఓ చిన్న విన్నపం.
అందుకు వారికో చిరు కానుక (న్యూటన్ బాబు కొటేషన్):
“I do not know what I may appear to the world, but to myself I seem to have been only like a boy playing on the seashore, and diverting myself in now and then finding a smoother pebble or a prettier shell than ordinary, whilst the great ocean of truth lay all undiscovered before me.” ~ Sir Isaac Newton, one of he greatest physicist and mathematician who made seminal discoveries in several areas of science.
సివరాకరిగా ఓ సిన్న కన్ఫెషన్: మాలాంటి బడుగులు 16వ శతాబ్ధపు రోమన్ కాథలిక్ మతబోధకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భౌతికదేహాన్ని భద్రపరిచిన గోవాలోని అతి పురాతనమైన ‘బసిలికా ఆఫ్ బామ్ జీసస్’ చర్చి (The Basilica of Bom Jesus, a UNESCO Heritage site) కెళ్లి హృదయ మాలిన్యాల క్షాళనకు విఫల ప్రయత్నం చేస్తారు.
కూటి రుణం గురించి PRAVEEN NALLAMOTHU గారి అభిప్రాయం:
10/05/2022 11:15 am
కథ చదివిన అనంతరం కేరళ కెత్తేల్ హోటల్ లో సాక్షిగా ఉన్నట్టు అన్పించింది. So natural…
1983వ సంవత్సరంలో ఉద్యోగపర్వంలో ప్రవేశించిన కొత్తల్లో, బెంగుళూరులోని శేషాద్రిపురం పోలీసు స్టేషన్ కెదురుగా, సెంట్రల్ టాకీసు ప్రాంతాన ఉన్న అజంతా మెస్సు… అయ్యర్ మెస్సులో సాంబారు అన్నం తినే నన్ను చూసి గేలిచేసేవారు మా మిత్ర బృందం. అయ్యర్ మామ ఆప్యాయంగా వొడ్డించేవాడు. మెస్సులో ఒకటే రద్దీగా ఉండేది. ఇప్పటికీ మూసివెయ్యబడినట్లున్న అజంతా మెస్సు వైపు వెళ్లేటప్పుడు నా కళ్లు చెమరుస్తాయెందుకో? అయ్యర్ చేతి కూడు తిన్న రుణం తీర్చుకోనందుకా?!
కాలం నాడు ఆ అనంతపద్భనాభుడిని చూడాలని తిరువనంతపురం వెళ్లాను. ఇప్పుడు కెత్తేల్ సాయిబు నడిపిన పూటకూళ్ళ ఇంటి ఛాయలకోసం వెళ్లాలనిపిస్తోంది.
ఇలాంటి భావోగ్వేదాలకు గురిచేసిన జయమోహన్, అవినేని భాస్కర్ లకు కైమోడ్పులు.
కూటి రుణం గురించి TALAGADADIVI SURESH గారి అభిప్రాయం:
10/04/2022 5:56 am
కథ చాలాబాగుంది. మనసును కదిలించివేసింది. రచయితకు, అనువాదకర్తకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
అక్టోబర్ 2022 గురించి అవధానం రఘు కుమార్ గారి అభిప్రాయం:
10/04/2022 5:52 am
ప్రో. సూరపరాజు రాధాకృష్ణ మూర్తి గారి గురించిన అవగాహన కలిగింది. వారి గురించి రావెల సోమయ్య గారు తరచూ చెప్పేవారు.
కూటి రుణం గురించి పద్మావతి రాంభక్త గారి అభిప్రాయం:
10/04/2022 1:22 am
ఈ మధ్య ఇంతలా ఏడిపించిన కదిలించిన కథ నేను చదవలేదు. సాయిబును అమ్మగా అనుకోవడం ఎంతో అద్భుతమనిపించింది. నిజ జీవితంలో ఇటువంటి సంఘటన చూసాను, విన్నాను. మూల రచయితకు, అనువాదకులకు వేల అభినందనలు. ప్రచురించిన ఈమాట వారికి ధన్యవాదాలు
కూటి రుణం గురించి వనజ తాతినేని గారి అభిప్రాయం:
10/07/2022 5:17 am
నాలుగుసార్లు చదివాను. ఏ రుణమైనా తీరుతుంది కూటి రుణం ఎన్నటికీ తీరదు అంటారు. కథంతా ఈ సూత్రం పైనే నడిచింది. ఇంకా ఉదాత్తంగా నడిచింది. వడ్డించే దగ్గర తల్లి భావాలు, తండ్రి ఈర్ష్య ఇవన్నీ కూడా సహజంగా వున్నాయి. కథ చాలా నచ్చింది. అనువాదకుడు భాస్కర్ గారికి మీకు ధన్యవాదాలు. 🙏. మరుపురాని కథల జాబితాలో ఇదొకటి.
కూటి రుణం గురించి వివిన మూర్తి గారి అభిప్రాయం:
10/06/2022 11:46 am
1. ఈ కథ చదివించినందుకు అమరేంద్రకు ధన్యవాదాలు.
2. కెత్తేల్ సాయిబు ఎవరు? ఈ ప్రశ్న చిన్నదే. నా జవాబు పెద్దది. అనాది మానవుడు. మిగులు ప్రవేశించాక దాత. ఎలా? అనాది మానవుని సహజాతం పంచుకోటం. అది అనివార్యత లోంచి వచ్చినదన్న ఊహ కూడా ఉంది. కావచ్చు. కాకపోవచ్చు. ఏమైనా ఇది జన్యుపరమైనదనే ఊహ నాకు బాగుంటుంది. మానవ సమాజంలో మిగులు ప్రవేశించేక ఈ పంచుకోటం సంస్కృతి అయింది. ఆ రెంటికీ మధ్య కాలం చాలా పెద్దదే. అది సహజాతం నుంచి సంస్కృతి అయిందని చెప్పటానికి మనం పదేపదే వినే మాట ఒకటి ఆధారం. అతిథి దేవో భవ. ఇది మన ప్రాంతానిదే కావచ్చు. ఇలాంటివి అనేక సంస్కృతులలో ఉండే అవకాశం ఉంది. నేను నీకు కడుపు నిండా పెట్టలేకపోతున్నాను. నన్ను క్షమించు. అని చేతులు జోడించటమూ అదే చెబుతుంది. అయితే మిగులు ప్రవేశంతో పంచుకోటం కాస్తా రూపాంతరం చెంది పెట్టడం అయింది.
3. కెత్తేల్ సాయిబు అంతేనా? కాదు. అతను ఆహార శ్రామికుడు. ఆ శ్రామికుని లక్షణం తను తయారు చేసిన ఆహారాన్ని తిన్న మనిషి ముఖంలోని ఆనందం. తను వడ్డించిన విస్తరి ఖాళీ చేసినవాని ముఖం లోని తృప్తి. వంట, వడ్డనలు వృత్తిగా మారి శ్రామికుని కడుపు నిండటానికి ఆధరువు కావచ్చు. కాని అందులోని అమ్మతనం మారిందని నాకు అనిపించదు.
4. కెత్తేల్ సాయిబు పిల్లలు ఆర్ధికంగా బాగుపడ్డారని కథ చెపుతోంది. దాని వెనక ఆర్ధికత(ఎకనామిక్సు) ఏమిటి? నేను ఫ్రీకనామిక్సు అనే పుస్తకం చదవాను. అందులో ఒక ప్రయోగం చెపుతారు. ఒక పెద్ద వ్యాపారసంస్థ భవనం అది. అందులో నాలుగు అంతస్తులు ఉంటాయి. ఆ సంస్థలో పై అంతస్తులో పైస్థాయి వారుంటారు. క్రమంగా చివరి అంతస్తులో చివరి స్థాయి ఉద్యోగులు. నాలుగు అంతస్తులలోనూ తినే తాగే పదార్ధాలుంటాయి. అమ్మేవాడుండడు. ఎవరికి కావలసినది వాళ్లు తీసుకుని పక్కన ఉన్న పెట్టెలో డబ్బులు వెయ్యాలి. పై స్థాయి వారి నుంచి కింద స్థాయి వరకూ వాటిలో ఆదాయం ఎలా ఉంటుంది – అది మీ ఊహకి వదిలేస్తాను. పిల్లలు బాగుపడ్డది సాయిబు సంపాదన వల్లనా? పేరు(బ్రాండ్ ఇమేజ్) వల్లనా? అతని వంట శిక్షణ వల్లనా? కథలో ఆ విషయ స్పష్టత లేదు. కథకి కేంద్రం అతనా? కథకుడా? కథకుడు రామలక్ష్మిని పెళ్లాడటంలో అతని కూటిఋణం తీరటంలో సాయిబు ఆదర్శం లేదా తాత్వికత ప్రభావం ఉన్నాయా? కాకపోతే భారతదేశంలో చాలాకాలం ఈ ఫ్రీకనామిక్సు ఉండేదన్న అంశం నాకు ఈ కథ ఉద్దేశ్య పూర్లకంగానో అనుద్దేశితంగానో గుర్తు చేసింది.
5. నా వ్యక్తిగత జీవితంలో అటువంటి దారిద్ర్యాన్ని అనుభవించాను. ఒక రాత్రి వేళ భరించలేక చావబోతే నన్ను రక్షించి అన్నం పెట్టి నాకు ఒక ఉద్యోగం వేయించిన ఆ మహానుభావుడు గుర్తువచ్చాడు. ఏదైనా తిండి పెట్టడం గురించే కాక దాని రుచి గురించి చెప్పటం నాకు మల్లాది వారి కృష్ణాతీరం గుర్తు చేసింది.
6. రచయితకీ, పరాయి ప్రాంతపు కథ అని గుర్తురాకుండా ఆత్మీయంగా చెప్పిన అనువాదకునికీ ధన్యవాదాలు.
ఊహల ఊట 17 గురించి Lalitha P గారి అభిప్రాయం:
10/06/2022 5:59 am
తారులో చెయ్యి పెట్టడం అనుభవం గమ్మత్తుగా ఉంది. పెద్దలనుంచి అందే పరిజ్ఞానం, సొంతంగా చేసే ప్రయోగాలు వెరసి మానవుల ముందడుగులు. అందరు పెద్దలూ చాలావరకు మంచాళ్లేనని అవసరం వస్తే గానీ తెలీకపోడం మనందరి అనుభవమే. బావుందీ ఊటల్లో ప్రయాణం.
వార్కా బీచ్ గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
10/06/2022 3:21 am
వార్కా బీచ్, గోవా: దక్షిణ గోవా మార్గో నుండి 8 కిలోమీటర్లు మరియు రాష్ట్ర రాజధాని నగరం పనాజి నుండి 40 కిలోమీటర్లు దూరం లోని వార్కా బీచ్ సుందరమైనది, తెల్లటి మెత్తటి ఇసుక తీరాల ఇక్కడ నుండి అద్భుతమైన సూర్యాస్తమయాలను చూడవచ్చు. జనబాహుళ్యాల/పర్యాటకుల రద్దీ అంతగా లేని బీచ్, వార్కా బీచ్.
కవితా హృదయులైన కవయిత్రి చామర్తి మానస లాంటి వారు వార్కా బీచ్ తీరాన జీవన సాఫల్య క్షణాలను లెక్కపెట్టగలుగుతారు… సాగరతీర సమీపాన కావ్యసుధాగానం చేస్తారు. అలాగే వారోసారి శ్రీశ్రీ, రావిశాస్త్రి, త్రిపుర తండ్రుల విశాఖ బీచ్, యారాడ కొండల దగ్గర కెళ్లి కలం ఝళిపించాలని ఓ చిన్న విన్నపం.
అందుకు వారికో చిరు కానుక (న్యూటన్ బాబు కొటేషన్):
“I do not know what I may appear to the world, but to myself I seem to have been only like a boy playing on the seashore, and diverting myself in now and then finding a smoother pebble or a prettier shell than ordinary, whilst the great ocean of truth lay all undiscovered before me.” ~ Sir Isaac Newton, one of he greatest physicist and mathematician who made seminal discoveries in several areas of science.
సివరాకరిగా ఓ సిన్న కన్ఫెషన్: మాలాంటి బడుగులు 16వ శతాబ్ధపు రోమన్ కాథలిక్ మతబోధకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భౌతికదేహాన్ని భద్రపరిచిన గోవాలోని అతి పురాతనమైన ‘బసిలికా ఆఫ్ బామ్ జీసస్’ చర్చి (The Basilica of Bom Jesus, a UNESCO Heritage site) కెళ్లి హృదయ మాలిన్యాల క్షాళనకు విఫల ప్రయత్నం చేస్తారు.
కూటి రుణం గురించి PRAVEEN NALLAMOTHU గారి అభిప్రాయం:
10/05/2022 11:15 am
కథ చదివిన అనంతరం కేరళ కెత్తేల్ హోటల్ లో సాక్షిగా ఉన్నట్టు అన్పించింది. So natural…
శ్రీనాథుని చాటుపద్యములు గురించి JANIKHAN గారి అభిప్రాయం:
10/05/2022 1:57 am
మహా ప్రసాదం
కూటి రుణం గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
10/04/2022 10:15 pm