Comment navigation


15548

« 1 ... 115 116 117 118 119 ... 1555 »

  1. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి గుమ్మడిదల రంగారావు గారి అభిప్రాయం:

    11/30/2022 1:29 pm

    వ్యాసం బాగుంది. త్యాగయ్య కీర్తనల్లొ వాడిన తెలుగు పదాలు కొన్ని నేడు అస్సలు ప్రాచుర్యంలొ లేవు. వాటిని గురించి ప్రస్తావించితే మనకి తెలియని త్యాగరాజు కాస్తైనా తెలిసె అవకాశం వుండేది. ఆయన రచనల్లొ తామసము అనే పదప్రయోగం తరచుగా కనిపిస్తుంది. ఆయన వాడిన తెలుగు పదాలు మరికొన్ని మనకు తెలియనివి వున్నాయి. మచ్చుకు కొన్నిటిని వివరిస్తే బాగుండేది. ఆయన కాలంలో సామాజిక పరిస్థితులమీద కీర్తనలు లేకపొవటం ఎప్పటికీ అర్ధంకాని విషయం. కృతులన్నీ భక్తిమీదనె కేంద్రీకృతమై వున్నాయి. అందుకేనేమో నేడు శాస్త్రీయ సంగీతం ప్రజల ఆదరణకు నోచుకోవటం లేదు. పాశ్చాత్య సంగీతంగూడా చర్చి లోనే పుట్టినప్పటికీ కాలక్రమంలో దానికి ఒక సొంత దారి ఎంచుకున్నది. అందుకే నేటికీ సామాన్య ప్రజల ఆదరణకు నోచుకున్నది. మనిషికి కలిగే అనుభూతికి అనుగుణంగా వుంది ఆ బాణీ. మన సంగీతం అలా కాదు. మన సంగీతం భక్తి నుంచి బయటపడలేకపోయింది. నేటి జీవిత సమస్యలకు భక్తి సమాధానం చెప్పలేక పోతుంది. సినిమా పాటలకున్న ఆదరణ శాస్త్రీయ సంగీతానికి లేకపోవటానికి కారణం మన శాస్త్రీయ సంగీతం సగటు మనిషి భావోద్వేగాలను అర్ధం చేసుకోలేక పోవటమే. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జీవనం. కానీ వ్యవసాయం మీద ఒక్కటంటే ఒక్క పాట కూడా రాయలేదు త్యాగయ్య. నేటి సమస్యలకు రాముడు ఏవిధంగానూ సమాధానం చెప్పలేడు. మన సంగీతంలో వున్న లోపాన్ని గూడా చూపితే బాగుండేది. చదువరులకు ఒక సమగ్ర అవగాహన కలిగే అవకాశం ఉండేది. మరో వ్యాసంలోనైనా నాటి తెలుగుకు నేటి తెలుగుకు వ్యత్యాసం తెలిపితే బాగుండును. చిత్రమేమిటంటే త్యాగయ్య పాటలు సింహభాగం తెలుగులో వున్నప్పటికీ తెలుగునాట ఆదరణ లేదు. తమిళులకు కృతులలోని భాష భావం పెద్దగా అర్ధంగాకపోయినా వారు బాగా ఆదరిస్తున్నారు. త్యాగయ్యకన్నా చాల ఏళ్ళు ముందు జీవించిన అన్నమయ్య సంకీర్తనల్లో భక్తితో పాటు ప్రాపంచిక విషయాలమీదగూడా పాటలు వున్నాయి. కానీ ఆనాటికి గురుశిష్య పరంపర వ్యవస్థ లేకపోవటంతో అన్నమయ్య పాటలు ఎలా పాడాడో మనకు తెలియదు. త్యాగయ్య ఎలా పాడాడో తెలుసు మనకు. నేటికీ అలానే పాడుతున్నాము.

  2. ఖాళీ కవిత గురించి Anuradha గారి అభిప్రాయం:

    11/30/2022 8:06 am

    Thank you Vijay Bhaskar garu; Thank you Srinivas Banda garu.

  3. ఈ రచన నా సొంతం కాదు! గురించి గుమ్మడిదల రంగారావు గారి అభిప్రాయం:

    11/30/2022 5:06 am

    గ్రంథ చౌర్యం మీద చర్చ బాగుంది. ఒకరు రాసింది మరొకరిదిగా చెప్పుకుంటే గ్రంథచౌర్యం అంటాముగదా! మరి ఒకరు రాయనిదాన్ని ఆపాదించితే దానిని ఏమంటారో తెలుసుకోవాలని వుంది. ఉదాహరణకు త్యాగరాజ కృతులుగా చలామణి అయ్యే కృతులు అన్నే త్యాగరాజు రచించినవి కాదు అనే వాదన వుంది. అన్నమయ్య సంకీర్తనలు, వేంసన పద్యాలలో గూడా వారు రాయనివి వారికి ఆపాదించారు అని నమ్మేవారు వున్నారు. మన ఆలోచన మనదిగా చెబితే పట్టించుకోని లోకం, అదే ఆలోచనను ఏ పెద్దమనిషికొ ఆపాదించితే ప్రజలు ఆదరిస్తారు. అందుకని, కొందరు తమ ఆలోచనలను ఇతరులకు ఆపాదించి తమ మాటలకు వచ్చిన గుర్తింపుని వైకారియస్ ప్లెషర్ తో ఆనందిస్తారు. సాహిత్యంలో ఈ ప్రక్రియను ఏ మందురో ఎవరైనా పెద్దలు చెప్పాలని మనవి.

  4. ఈ రచన నా సొంతం కాదు! గురించి తఃతః గారి అభిప్రాయం:

    11/29/2022 12:10 pm

    శ్రీ భూషణ్: మళ్ళీ మీ నుంచి మరొక వ్యాసం -షేక్స్పియర్ తవ్వుకున్న గనుల గురించి- వస్తుందని ఎదురు చూస్తూ -నమస్కారాలతో -తః తః

    “All Shakespearean villains are Italian ” -Russell.

  5. బాలానందం గురించి Anjali గారి అభిప్రాయం:

    11/29/2022 11:08 am

    చిన్నప్పుడు ఈ పాటని మా నాన్నమ్మ పాడేది. ఇంకా ఎన్నో కథలు చెప్పేది, ఆ తర్వాత మా నాన్న, ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు. ఎంతో ఆనందంగా ఉండేది జీవితం. చీకటి పడిందంటే చాలు నాన్న పక్కలోనో, లేదా నానమ్మ పక్కలోనో దూరి వాళ్ళు చెప్పే కథలు వింటూ, చందమామను చూసుకుంటూ, సన్నజాజి పందిరి కింద హాయిగా నిద్రపోయేవాళ్ళం. ఎంతో మధురంగా ఉండేవి ఆ రోజులు. అలాంటి అనుభూతులు గాని,జ్ఞాపకాలు గాని ఈతరం పిల్లలు తర్వాత తరానికి తీసుకెళ్లలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి లేవు కదా. ఇప్పుడు వాళ్లకున్న జ్ఞాపకం ఒకటే వాళ్ళ చేతిలో ఉండే సెల్‍ఫోన్ ఏ బ్రాండ్ అని. రారండోయ్… అనే పాట మా పిల్లలకు వినిపించాలని చాలా అనుకున్నాను. ఇన్నాళ్ళకి ఆ కోరిక తీరింది మీ ద్వారా. ధన్యవాదములు 🙏🙏

  6. తెలుగు వ్యాసం గురించి యెల్చాల నర్సింలు గారి అభిప్రాయం:

    11/29/2022 9:09 am

    ఈమాట సంపాదకులకు నమస్కారములు.

    ఈ “తెలుగు వ్యాసం” పైన వ్యాసం చాలా బాగుంది. వక్కణం తిరుమల రామచంద్ర గారికి కృతజ్ఞతలు. ఇంకా వ్యాసం మీద వ్యాసం అంటే దాని విస్తృతి, పరిధి, వ్యాస రకాలు, వ్యాస నిర్మాణం, వ్యాస పరిణతి, పరిమాణం వంటి విషయాల మీద ప్రత్యేకమైన వచన రచనలు వస్తే బాగుంటుంది. దీనిమీద విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది.

  7. ఈ రచన నా సొంతం కాదు! గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    11/25/2022 8:40 pm

    భూషణ్ గారూ: గ్రంథచౌర్యం గురించి సమగ్రమైన, సునిశితమైన చక్కని వ్యాసం వ్రాశారు. అలాగే చౌర్యానికి గురైన మా నాన్నగారి వ్యాసాన్ని ప్రస్తావించి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చినందుకు అనేకానేక ధన్యవాదాలు 🙏 ఇండియా ప్రయాణం, అనారోగ్యం, ఇతర వత్తిళ్లలో వెంటనే స్పందించలేకపోయాను.

    తః తః గారూ: మీరన్నది నిజం. చెళ్ళపిళ్ళవారు శ్రీశ్రీతో మాట్లాడుతూ “మన కవిత్వానికి లక్షణం కంఠవశమయ్యే రచన” అన్నారు. ఇది అబ్బూరివారి పుస్తకంలో ప్రస్తావించారు. పైన హనుమంతరావుగారు కూడా quote చేశారు.

    ఇదే విషయం గురించి మా నాన్నగారు కవిత్వం నా దృక్పథం (2010లో వ్రాసిన వ్యాసం)లో ప్రస్తావించారు. అది జయంతిలోనో మరో అచ్చు పత్రికలోనో తర్వాత ప్రచురింపబడినా వెబ్ లింకు లేదు. అయినా ఆ సందర్భం గురించి ఆయన వ్రాసిన వ్యాసంలో ఒక పేరాని ఇక్కడ quote చేస్తున్నాను.

    “ఛందోబద్ధంగా పద్యం వ్రాయగలిగితే చాలు దానికి ఏదో ఒక మేరకు readability వస్తుంది. ఏదో ఒక మేరకు కంఠవశం అయ్యే గుణం అది సంతరించుకుంటుంది. అంటే, ప్రాచీన ఛందోరీతుల ఔదార్యం వల్ల, వైశిష్ట్యం వల్ల ఒక handsome subsidy రచయిత పొందవచ్చునన్నమాట. కానీ, వచన కవిత అలా కాదు. వచన కవిత వ్రాయబోయి ఎందుకూ కొరగాని భ్రష్టమైన వచనమే వ్రాయడం చాలా సందర్భాలలో జరుగుతుంది. తిలక్ గారు వచన కవితలపై కల్పించిన మక్కువతో ఎన్నో వచన కవితల్ని, అక్కడక్కడనైనా చదివాను. సత్యమైన విషయమేమిటంటే, ఆకట్టుకొనే కవితల కోసం వెదికినా అవి ఎక్కువగా కనిపించకపోవటం, కంఠవశమయ్యే గుణం వాటికి లేకపోవటం, మనల వదలకుండా వెంబడించే పంక్తుల సమాహారం లేకపోవటం.”కంఠవశమయ్యే గుణం” అని ఈ వ్యాసంలో పదే పదే ప్రస్తావించటం జరుగుతున్నది. ఇది చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి పదబంధం. ఒకసారి శ్రీశ్రీగారు వేంకటశాస్త్రిగారిని (శ్రీశ్రీగారికి శాస్త్రిగారంటే చాలా గౌరవమట) వినయంగా అడిగారట,’కవిత్వానికి ప్రధాన లక్షణమేమిటి’ అని. దానికి వారు’కంఠవశమయ్యే గుణం కవితకు ప్రధాన లక్షణాలలో ఒకటి’అని అభిభాషించారట.“

    ఈ వ్యాసం ప్రతి నాకు అందుబాటులో ఉండటానికి ఒకే ఒక్క కారణం మా నాన్నగారి ప్రతి తెలుగు రచనను నేను టైప్ చేయడం మాత్రమే 😊

  8. ఈ రచన నా సొంతం కాదు! గురించి Kodavalla Hanumantha Rao గారి అభిప్రాయం:

    11/24/2022 9:39 pm

    శ్రీశ్రీ, శాస్త్రిగార్ల సంభాషణ

    అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవనకుతూహలం” నుండి:

    వెంకటశాస్త్రి గారంటే శ్రీశ్రీకి అపార గౌరవభక్తులుండేవి. శాస్త్రి గారితో పరిచయమయిన తరువాత శ్రీశ్రీ కొంచెం తడబడుతూ “కవిత్వం మీద తమ అభిప్రాయమేఁవి” టన్నాడు. అప్పటికే వయో వృద్ధులూ, అస్వస్థులూ అయిన శాస్త్రిగారు మందహాసం చేసి “నేను కవినేనా?” అని అడిగారు. తనలా అడగటంతో ఏమన్నా పొరబాటు చేశానా అని సందేహిస్తూ “మీరు కాకపోతే ఈ ఆంధ్రదేశంలో మరెవ్వరండీ కవి?” అన్నాడు శ్రీశ్రీ గట్టిగా. శాస్త్రిగారు నవ్వారు. “కవిత్వం అంటే ఏదికాదో చెప్పటం సులభం కానీ, ఏది కవిత్వమో చెప్పటం కష్టం… మన కవిత్వానికి లక్షణం కంఠవశం కాగల రచన. మననం చేసుకోవటానికి అనువయిన పద సంచయనం చెయ్యాలి. కర్ణపేయంగా ఉండాలి. రసనాగ్ర నర్తకి! అంతవరకూ నేను సాధించాను”. శాస్త్రి గారు తనలో తాను నవ్వుకుంటూ పడకకుర్చీ మీద వెనక్కి తలపెట్టారు. ఆకస్మాత్తుగా ముందుకు వంగి “అయితే అంతమాత్త్రాన అది కవిత్వం అయిపోదు…” శాస్త్రిగారెవర్నో లోపలినుంచి పిలిచారు. మేము లేచాం. శ్రీశ్రీని చూస్తూ శాస్త్రి గారన్నారు. -“నువ్వు చెప్పు కవిత్వం అంటే ఏఁవిటో… అంత సులభఁవటయ్యా? అసలు నిర్ణయించేవారే లేరే ఈ దేశంలో. నీకు నేనూ నాకు నువ్వూ తప్ప… అంచేతనే కాబోలు మనం అనువాదాలూ, అనుసరణలతో ప్రారంభించాం… పోయిరండి” అన్నారు.

    ఆనాటి శాస్త్రి గారి నిర్వచనాన్ని శ్రీశ్రీ నాతో జీవితాంతం దాకా ప్రస్తావించేవాడు. ఈనాటి ‘ప్రయోగాత్మక’ కవితలో కంఠవశం కాగల లక్షణం లోపించిందని శ్రీశ్రీకి తెలుసు. అంచేతనే అలాంటి కవిత్వానికి భవిష్యత్తు సంకోచప్రదమనేవాడు. అంతేకాదు, ఇతర భాషల్లోంచి కవిత్వాన్ని అనువందిచటం కూడా తెలుగు సాహిత్యాభ్యుదయానికి ముఖ్యాంశం అని అంటూ “శాస్త్రిగారూ అలా అన్నారే” అనేవాడు.

    — కొడవళ్ళ హనుమంతరావు

  9. ఈ రచన నా సొంతం కాదు! గురించి తమ్మినేని యదుకులభూషణ్ గారి అభిప్రాయం:

    11/24/2022 12:48 am

    తః తః గారు :
    నమస్తే.
    ఈ వ్యాసం వ్రాసినందుకుగాను, మీరు పంచుకున్న సమాచారం ఫలశ్రుతిగా భావిస్తాను. నా దగ్గర 16 శతాబ్దపు ఆంగ్ల వర్ణ విన్యాసంతో ఉన్న పుస్తకాలు ఒకటి రెండు ఉన్నాయి. నా యవ్వనకాలంలో మిట్ట మధ్యాహ్నం పూట- మన ప్రబంధకవులకు సమకాలికుడైన Shakespeare నాటకాలు చదివి – అతని కల్పనాశక్తికి అబ్బురపోయిన క్షణాలు సజీవంగా ఉన్నాయి. అంతటివాడి వెనుక గల చోదకశక్తిని వెలికి తీసిన పరిశోధకులు ధన్యులు. ఈ విషయం ఎందుకనో నా దాకా రాలేదు. మీరు తెలిపినందుకు ఎంతో సంతోషం. ఈ ఏడాది చదవదగిన పుస్తకాలు ముగించేదాకా, ఈ అరుదైన పొత్తాన్ని ఆలస్యం చేయకుండా తెప్పించుకుని చదవాలన్న తహతహను ఆపుకుంటున్నాను -భూషణ్.

  10. సినారె: ఒక స్మరణ గురించి మల్లేశం గడ్డమీది గారి అభిప్రాయం:

    11/24/2022 12:23 am

    వివరణ, అభినందన బాగుంది. విశ్వంభర, మట్టి మనిషి ఆకాశంతో పాటుగా విశ్లేషణ ఉంటే ఇంకా బాగుండేది. విశ్లేషణతో పాఠకులకు మరింత విషయ పరిజ్ఞానం అందేది..

« 1 ... 115 116 117 118 119 ... 1555 »