“కాప్పా… రే కాప్పా… సొక్కాలు వద్దురా. దమ్మదొరల కుర్చీల్లో కూర్చోవద్దు బిడ్డా…” అంటూ ఆక్రోశించే తల్లి…
“అమ్మను వదిలేయకు. అమ్మను నీతోనే ఉంచుకో. అమ్మకు ఇప్పటివరకు మనం చేసింది చాలా పెద్ద అన్యాయం, పాపం. ఆమె అన్నెంపున్నెం ఎరుగని అమాయక జంతువు. జంతువుల బాధను ఓదార్చడం అసాధ్యం. కాబట్టి అది అంతులేనంత లోతుగా నిలిచిపోతుంది. అమ్మకు చేసిన అన్యాయానికి అన్ని విధాలా ప్రాయశ్చిత్తం చెయ్యి…” అన్న ప్రజానందుల (శ్రీ నారాయణ గురువు గారి శిష్యుడు) వారి దీవెనల ఆదేశం…
సమాజం లోని అట్టడు వర్గానికి చెందిన అసహాయుల అరణ్యరోదనను వినిపించుకోమని, సామాజిక న్యాయం, సకలజనుల సౌభాగ్యంతో కూడిన సమసమాజ నిర్మాణం జరగాలని ఆశించిన జాతిపిత బాపూ, భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన జ్యోతిరావ్ ఫూలే, సంఘ సంస్కర్తలు, ఆధ్యాత్మిక గురువులు, దేశప్రగతి కోసం పోరాడిన, పోరాతున్న ప్రజానాయకులు, ఆత్మబలిదానాలు చేస్తున్న వీరులు…
సామాజిక, ఆర్ధిక, రాజకీయ వెనుకబాటుతనంతో తరతరాలుగా అన్యాయానికి బలౌతున్న వారి గురించి “నూఱు నాఱ్కాలికళ్” తమిళ్ కధలో ఆవిష్కరించిన జయమోహన్ గారికి, మాత్రుకను “వంద కుర్చీలు”గా తెలుగులో అనుసృజించి గుండెను పిండేసిన అవినేని భాస్కర్ గారికి కైమోడ్పులు అని అనలేని అసహాయత నాది. ఆ తల్లి ఆక్రందనలలో దహించుకుపోతూ…
~ త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు
ఊహల ఊట 19 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
12/03/2022 11:35 pm
ఊహల ఊట 19వ భాగం చదివాను. పనసకాయ పొట్టు గింజలు తొనలు పనస ప్రస్థానం బాగుంది. సమాజంలో బీద గొప్ప తేడాలను చిన్నతనం నుండే గమనించడం పెద్దయ్యాక ఆ తేడాని తాను పోగొట్టాలి అనుకోవడం కుంతల పాత్ర ద్వారా పలికించడం రచయిత్రి మనోభావాలకు అద్దం పడుతోంది. మంచి సందేశాన్ని అందించిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ చాగంటి తులసి గారికి అభినందన వందనాలు.
లోకో భిన్న రుచి..
ఆహ్లాదాలూ తియ్యందనాలూ తప్ప వివక్షల వాస్తవాలు తెలియని వారికి అవి చేదు విషాల్లా కనిపిస్తాయి..అనవసరపు విషాదాలనిపిస్తాయి..
వంద కుర్చీలు గురించి Sivakumar Tadikonda గారి అభిప్రాయం:
12/03/2022 7:26 pm
ఇది కథ కాదు. కల్పన కాదు. చారిత్రికతని నింపుకుని, అద్భుతమైన అక్షరాల పేనికతో చేసిన సంఘర్షణభరిత నిజజీవిత చిత్రణ. భార్యాభర్తలు ఒకరినొకరు ఎంపిక చేసుకోవడంలో కూడా కాల్క్యులేషన్! కథగా మలచింది మాత్రం గుర్తుండిపోయే ముగింపునిచ్చి అనిపిస్తుంది. ఈ జీవితం తన కెలా తెలిసిందో రచయిత కథలోనే చెబుతాడు. “అతని ఇంటినుండి అతని శిష్యడైన ఒక యువరచయిత … ఉత్తర కేరళలో కాసర్కోడులో ఏదో ఉద్యోగం చేస్తుంటాడతను. ఇక్కడికి వచ్చినప్పుడు సుందర రామసామి ఇంటి మేడమీద ఉంటాడు. నేను సుందర రామసామితో మాట్లాడుతుంటే కొన్నిసార్లు అతనూ వచ్చి మా మాటల్లో కలిసేవాడు. అతని పేరు జెయమోహన్ అని గుర్తు.” ఈ కథని రాసినందుకు జయమోహన్ గారికీ, అనువాదం అనిపించకుండా తెనిగించిన భాస్కర్ గారికీ ధన్యవాదాలు!
“ఎంగిలి” పదం వాడుక “ఎంగిలి ఆకులు,” “ఎంగిలి మెతుకులు” వాడకాల్లో సరయినదే గానీ, నోటిలోంచి కారేదాన్ని గుంటూరులో మాత్రం “చొంగ” అనేవారు. చివర్లో, “చొంగ కారిన ఆమె ముఖం దిండుమీద ఒక పక్కకు ఒరిగిపోయింది.” అని ఉండాలి కదా అనుకున్నాను. భాస్కర్ గారివైపు “ఎంగిలి కారడం” వాడుక సరయినదే నేమో ననిపించింది.
గాడిదల సంత పక్కన ఉన్న ప్రభుత్వాసుపత్రి గూర్చి కాప్పా పంపిన రిపోర్ట్ తరువాత డాక్టర్ మాణిక్యం ఉద్యోగానికి ఎసరుపెట్టిన వైనం, 2007లో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల నుండీ వచ్చిన క్షతగాత్రులని సరిగ్గా చూడట్లేదని అమెరికాలోని వాల్టర్ రీడ్ ఆర్మీ మెడికల్ సెంటర్ కి సంబంధించిన ఇద్దరిని పదవులనించీ తొలగించడాన్ని గుర్తుకు తెచ్చింది. బుష్ ప్రభుత్వం, యుధ్ధానికి ఎంత ఖర్చవుతుంది అంటే నాకేం తెలుసు అని జవాబిచ్చింది. ఇంక యుధ్ధానికి పంపుతున్నవాళ్లల్లో ఎంతమందికి దెబ్బలు తగిలి హాస్పిటల్‌కి వస్తారో అని ఆలోచించే తీరిక ఎక్కడున్నది? వస్తున్నవాళ్లందరినీ చేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి అని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చెబితే, ఇటు కాంగ్రెసు, అటు అధ్యక్షుడు డబ్బుల్లేవు, సరిపుచ్చుకొమ్మని చేతులెత్తేశారు. హాస్పిటల్లో బెడ్లు లేక కారిడార్లల్లోనూ, నేలమీద యుధ్ధ వీరులు పడివున్నారు అని పేపర్లో వార్త రాగానే మాత్రం, ముందు ఒక ఇద్దర్ని పైపదవుల్లోనించీ పీకేశారు. ఇది కులంతో కాక వ్యవస్థకి సంబంధించిన విషయం.
రావణుడి దుర్గుణములు తోలగితే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ధన్యులము🙏
డిసెంబర్ 2022 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
12/03/2022 5:54 am
మంచి సంపాదకీయం. బాధ్యత నిండిస మాటలు.
మనలో అధ్యాపక-రచయితలు చాలా మంది ఉన్నారు. కౌమార్యంలో బాలబాలికల మీద వీరి ప్రభావం చాలా గణనీయం. వారి ఆలోచనలూ రాగద్వేషాలూ తెలుసుకొనే అవకాశం వీరికి ఎక్కువ. ఈ ఏజ్ గ్రూప్ కోసం వీరిలో కొందరైనా రాస్తే బావుంటుంది.
భయంకరమైన జీవితాల వాస్తవ కథ.. మొదటిసారి అటువంటి జీవితాల కథ కన్నీళ్లు తుడుచుకోడం మరిచిపోయి చదివాను.. ఇటువంటి జీవితాలు ఇంకా కొద్దిపాటి తేడాతో కొనసాగుతున్నాయి..
తమిళులకు ట్రాజెడీని బ్లో అప్ చేసే గుణం ఉన్నట్టు తోస్తుంది నాకు. బాలచందర్ ‘మరోచరిత్ర’ని ట్రాజెడీ చేశాడు. ఇద్దరు యువ ప్రేమికుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. I can not like it. అలాగే మరో చిత్రాన్నీ! సమాజంలో ఉన్న ఒక అవలక్షణాన్ని ఇంత హృదయవిదారకంగా చిత్రించి – పాఠకుల గుండెను చీల్చి, రక్తాన్ని పిండుకుని, గొప్ప రచయితగా పేరు తెచ్చుకోటం ‘కళ’ అనిపించుకోదు. బాలచందర్ పేరూ డబ్బూ కూడా తెచ్చుకున్నాడు. మాలదాసరి (ఆముక్త మాల్యద) కథను శ్రీ వేలూరి (శివరామ శాస్త్రి) వారి కాలాన ఉన్న వ్యవస్థను సున్నితంగా తెగనాడుతూ ఎంత హృద్యంగా చెప్పారో –
భాస్కర్, మీ అనువాదాన్ని మూల కథా రచనపై పైన చెప్పిన నా అభిప్రాయానికి ఏమీ సంబంధం లేకుండా ప్రత్యేకంగా మెచ్చుకోవాలి.
వంద కుర్చీలు 2 గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
12/04/2022 5:05 am

వంద కుర్చీలు 2 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
12/03/2022 8:29 pm

Janaki’s Zen గురించి Mahesh గారి అభిప్రాయం:
12/03/2022 6:08 am
రావణుడి దుర్గుణములు తోలగితే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ధన్యులము🙏
డిసెంబర్ 2022 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
12/03/2022 5:54 am
మంచి సంపాదకీయం. బాధ్యత నిండిస మాటలు.
మనలో అధ్యాపక-రచయితలు చాలా మంది ఉన్నారు. కౌమార్యంలో బాలబాలికల మీద వీరి ప్రభావం చాలా గణనీయం. వారి ఆలోచనలూ రాగద్వేషాలూ తెలుసుకొనే అవకాశం వీరికి ఎక్కువ. ఈ ఏజ్ గ్రూప్ కోసం వీరిలో కొందరైనా రాస్తే బావుంటుంది.
వంద కుర్చీలు 2 గురించి Manpreetam KV గారి అభిప్రాయం:
12/03/2022 1:02 am
ఎన్నో ఏండ్ల వివక్షను చూపించిన కథ. చదివాక ఒక సైలెన్స్ అలుముకుంది. కథ గురించి ఏమి చెప్పలేను. ఇలాంటి కథను తెలుగులోకి తెచ్చిన భాస్కర్ గారికి ధన్యవాదాలు.
వంద కుర్చీలు 2 గురించి Sudha గారి అభిప్రాయం:
12/02/2022 11:23 pm
Thank you for translating this story Bhaskar garu….
వంద కుర్చీలు 2 గురించి jwalitha గారి అభిప్రాయం:
12/02/2022 7:07 pm
భయంకరమైన జీవితాల వాస్తవ కథ.. మొదటిసారి అటువంటి జీవితాల కథ కన్నీళ్లు తుడుచుకోడం మరిచిపోయి చదివాను.. ఇటువంటి జీవితాలు ఇంకా కొద్దిపాటి తేడాతో కొనసాగుతున్నాయి..
వంద కుర్చీలు 2 గురించి తః తః గారి అభిప్రాయం:
12/02/2022 3:40 pm
తమిళులకు ట్రాజెడీని బ్లో అప్ చేసే గుణం ఉన్నట్టు తోస్తుంది నాకు. బాలచందర్ ‘మరోచరిత్ర’ని ట్రాజెడీ చేశాడు. ఇద్దరు యువ ప్రేమికుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. I can not like it. అలాగే మరో చిత్రాన్నీ! సమాజంలో ఉన్న ఒక అవలక్షణాన్ని ఇంత హృదయవిదారకంగా చిత్రించి – పాఠకుల గుండెను చీల్చి, రక్తాన్ని పిండుకుని, గొప్ప రచయితగా పేరు తెచ్చుకోటం ‘కళ’ అనిపించుకోదు. బాలచందర్ పేరూ డబ్బూ కూడా తెచ్చుకున్నాడు. మాలదాసరి (ఆముక్త మాల్యద) కథను శ్రీ వేలూరి (శివరామ శాస్త్రి) వారి కాలాన ఉన్న వ్యవస్థను సున్నితంగా తెగనాడుతూ ఎంత హృద్యంగా చెప్పారో –
భాస్కర్, మీ అనువాదాన్ని మూల కథా రచనపై పైన చెప్పిన నా అభిప్రాయానికి ఏమీ సంబంధం లేకుండా ప్రత్యేకంగా మెచ్చుకోవాలి.
– నమస్కారాలతో -తః తః