శ్రీ దాసరి: నేను కథ మంచి చెడుల గురించి వ్యాఖ్యానించలేదు. కథనం గురించి మాత్రమే రాశాను. ఈ కథలో వివక్షత డైరక్ట్‌గా చూపబడలేదు. నాకు అర్థమైనంతవరకూ – తరతరాలుగా వివక్షకు గురి అయిన ఒక తండా లోని ఒక స్త్రీ తన తండాను వివక్ష పాలు జేసిన సమాజంలోకి తన కొడుకు వెళ్ళిపోవటాన్ని సహించలేకపోవటాన్ని విపులంగా కధనం చేసింది – ఆ తల్లి ప్రవర్తన ఆ కొడుకు ఉరి వేసుకుని చచ్చి పోదామనుకునే స్థాయిలో. (నావంటి పాఠకులకు వికారం పుట్టేటంతగా.)
మరొక వైపు ఆ కొడుకు వంటి వారిని వారి చిన్నతనంలో వారికి తిండీ బట్టా ఇచ్చి వారిని సమాజం గౌరవించేటట్టుగా ఎదిగేటట్టుగా విద్యా బుద్ధులు నేర్పిన ఒక వ్యవస్థ ఉండటాన్నీ, ఆ వ్యవస్థ పట్ల ఆ కొడుకుకు కృతజ్ఞత ఉండటాన్నీ చూపింది.
నమస్కారాలతో -తః తః
ఊహల ఊట 19 గురించి సుమనస్పతి రెడ్డి గారి అభిప్రాయం:
12/07/2022 10:03 pm
ఇంతకు ముందరి 18 గల్పికల్లో లానే ఏదో వంకన ఆరోగ్యకరమైన తిండీ, వంటల, రుచుల ప్రస్తావన తెస్తూనే, ఈ మారు మాత్రం ఉత్తి తిండంటే వెగటు, వైముఖ్యం కలిగించే సామాజికార్థిక అంతరాల చైతన్యాన్నీ అలవోకగా పట్టుకొచ్చి కలిపేసి కలత రేపి పెట్టారు పాఠకుల పొత్తికడుపుల్లో, తులసి గారు!
దానితో పాటు పనస్పొట్టు కొట్టడం నుండి మొదలుకొని అందరినీ మెప్పించే కూరను వండి దాన్ని పంచుకోవడం దాకా
పనిదనం పట్టింపుదనాన్ని, శ్రమైకానందపు చలాకీదనాన్నీ మరింత ప్రయోజనకరమైన రీతిలో ఆవిష్కరించి పడేశారు!
కథల్లో ఇదొక కొత్త తీరు పనిదనం! ఆర్తి నిండిన అరుదైన కమ్మదనం!
మనసుని పిండేసింది. వివక్షను పక్కన పెడితే, అలాంటి అమ్మని ఎలా చూసుకోవాలో తెలియక నరకయాతన పడే అతనిలో నన్ను నేను చూసుకోగలిగాను. మా ఇంట్లో ఇద్దరు మానసిక సమస్యలు ఉన్నవాళ్ళున్నారు. వారితో అప్పుడప్పుడూ జరిగే ప్రహసనాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఏది ఏమైనా అలోచింపచేసే కథ ఇది. నేను తమిళ్ లో వెతికి చదివే ప్రయత్నం చేస్తాను. మీ అధ్బుతమైన అనువాదానికి అభినందనలు.
తఃతః గారూ
మంచి కథ గురించి మీ అభిప్రాయం, దానితో జోడించిన చక్రపాణీయం గమనించాను..ధన్యవాదాలు.
ఈ కథ ఎంతోమందిని కదలించిందని కూడా మీరు గమనించమని కోరుకుంటున్నాను.
‘తమిళులకు ట్రాజడీలను బ్లోఅప్ చేసే గుణముంది’, ‘…రచయుతగా పేరుతెచ్చుకోవడం ‘కళ’ అనిపించుకోదు’ లాంటి స్వీపింగ్ నిర్ధారణలు సమంజసమేనా అన్నదీ ఆలోచించమని విన్నపం చేస్తున్నాను.
ముందే అన్నట్టు, లోకో భిన్న రుచి..
కుల, మత, ఆర్థిక, రాజకీయ సమస్యలతో అల్లుకుపోయిన సమకాలీన సమాజంలో తన కళ్ళముందు జరిగే అన్యాయాన్ని ఏమాత్రం ఎదిరించలేని అశక్తతను ఆవిష్కరించిన సాహితీ సృజనలెన్నో… హోవర్డ్‌ఫాస్ట్ రాసిన స్పార్టకస్, ఎలక్స్ హేలీ రాసిన ఏడు తరాలు (రూట్స్), హారియట్ బీచర్ స్టో రాసిన టామ్‌మామ ఇల్లు (అంకుల్ టామ్స్ కేబిన్), హావర్డ్‌ఫాస్ట్‌దే ఇంకో నవల స్వేచ్చాపథం (ఫ్రీడమ్‌రోడ్), మక్సీమ్‌గోర్కీ అద్భుత రచన అమ్మ, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి నవల, ఇంకెన్నెన్నో….
“ఏ సమాజమూ తప్పించుకోలేని, పూర్తిగా బయట పడలేని అవలక్షణం వివక్షత ” అన్న డా. వై. వాసుదేవరావు గారూ…
జయమోహన్ గారి తమిళ మాత్రుక, అవినేని భాస్కర్ గారి అద్బుత అనుసృజన “వంద కుర్చీలు” కధ ప్రధాన పాత్రల (సొక్కాలు వద్దురా. దమ్మదొరల కుర్చీల్లో కూర్చోవద్దు బిడ్డా… కాప్పా… అనే అమ్మ… నాయాడుల కులానికి చెందిన కాప్పన్… కాప్పన్ నుంచి ధర్మపాలన్ గా ఎదిగిన కలెక్టర్ గారు… నిబద్దతతో పేదలకు వైద్యం చేస్తున్నా సస్పెండ్ కాబడిన డాక్టర్ మాణిక్యం పాత్రలను) ఆ నేపధ్యాన్ని, ఎన్ని వందల అధికార కుర్చీలు అధిష్టించినా వివక్షతతోకూడిన సమాజపు ఉక్కుపిడికిలిలో చిక్కుకుని విలవిలలాడుతారే తప్ప వారు ఆశించే పూర్తి మార్పు తేలేరని సూచిస్తున్న ఈ కధను సమగ్రంగా విశ్లేషించగల సమర్ధురాలు మమత కొడిదెల. వాకిలి అంతర్జాల సాహిత్య పత్రికలో ” హోకా హే” శీర్షికన వ్యాసపరంపరను అందించిన కామ్రేడ్ మమత కొడిదెల.
శ్రీ శర్మ గారికి: ఆ రోజు బొంబాయిలో టాక్సీ స్ట్రైక్ ఉంది. నేను దర్జాగా విక్టోరియా ఎక్కి నేరుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కార్యాలయానికి వెళ్లాను (గుర్రపు బగ్గీని విక్టోరియా అనడం వాడుక అనుకుంటాను, శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ వారి రచనల్లో చాలా సార్లు విక్టోరియా ఎక్కి దిగడం చదివి ఉంటిని.)
Sri Dasari: మీ కొత్త సినిమా ద్వారా మీరు ఏం సందేశం ఇస్తారని ఎవరొ అడిగితే చక్రపాణి ‘సందేశం ఇవ్వాలనుకుంటే టెలిగ్రాం ఇవ్వచ్చు సినిమా తీయటం ఎందుకు?’ అన్నారట. I was talking about story writing (story as an art form). In my opinion a good story writer is one who melts *his/her reader, does not mince. ఇహ వివక్షతలంటారా – ఏసమాజమూ తప్పించుకోలేని, పూర్తిగా బయట పడలేని అవలక్షణం వివక్షత- ఎదురు వివక్షతకు దోహదం చేయటం కూడా.
ఈ వ్యాసం, వ్యాఖ్య చాలా ఆలశ్యంగా ఈ రోజే చూసాను. అద్బుతంగా ఉంది మీ వ్యాఖ్య lyla yerneni గారూ కొన్నేళ్ల క్రితం నేను రచ్చబండలో రాస్తున్నప్పుడు, అప్పుడే తెలుగు వికీపీడియా నిర్మించటం మొదలు పెట్టారు. నన్ను అందులో సహాయం చెయ్యమంటే, నాకు టెంప్లేట్లు, లైఫ్ హిస్టరీ డిక్టేషన్లు బాగా అలవాటే కాబట్టి, నమూనాలేగదా తెలుగువారికి కావలసింది అని, నా సంగతే రాస్తానన్నా. నా పేరూ, ఊరూ, మా అమ్మానాన్నా పేర్లూ, పుట్టిన ఊళ్లూ గట్రా నాకన్నా ఎవరికి బాగా తెలుస్తాయి? పని తేలిక గదా అందుకని.
అప్పుడు నాకు చెప్పబడింది ఏంటంటే, వికీపీడియాలు – ‘ఫేమస్ పీపుల్’ ను ప్రజలకు పరిచయం చెయ్యటానికి అని. మీరు రాసిన ఈమాట చాలా ఆలోచనీయం. లోకంలో బ్రతికిన ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. పేరు పెట్టుకోటం అనే పద్దతి మానవజాతిలోకి వచ్చాక కొందరి పేర్లు మిగిలిపోయాయి. అలా పేర్లు మిగిలిపోటమే చరిత్ర అనే భావనగా మానవుడి భావనగా స్థిరపడ్డాక మిగిలిపోటం అనే ఆశ కూడా వచ్చింది. అంత సుదూరాంశం పక్కనుంచి మనగురించి మనకి చెప్పుకోవాలనిపిస్తే చెప్పుకునే అవకాశం సోషల్ మీడియా ఇచ్చింది. దీన్ని మనం పంచుకోటం అనుకోవచ్చు. రైలు ప్రయాణాలలో ఒకప్పుడు మనుషులు ఒకరి గురించి తెలుసుకునే అలవాటుండేది. మన గురించి మనం చెప్పుకునే అవకాశం వికీపీడియా ఇవ్వకపోయినా ఫేస్బుక్ వంటివి ఇస్తున్నాయని నేను అనుకుంటున్నాను.
అన్వర్, ఉత్తినే తప్పులు వెతకుదాం అని కాదు గానీ, ఇది చెపుదాం అని ఈ వాఖ్య రాస్తున్నా.
నేను దర్జాగా విక్టోరియా ఎక్కి నేరుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కార్యాలయానికి వెళ్లాను.
అర్ధం చూసుకున్నారా? అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీసు ఉండేది ‘విక్టోరియా టెర్మినస్” అనే రైల్వే స్టేషన్ దగ్గిరలో. “ట్రైన్ ఎక్కి విక్టోరియా టెర్మినస్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కార్యాలయానికి వెళ్లాను.” అని ఉండాలి అనుకుంటా మీ అనువాదం. ఈ మధ్యన ఆ ట్రైన్ స్టేషన్ పేరు కూడా “ఛత్రపతి శివాజీ టెర్మినస్” గా మార్చారు.
అనువాదం బాగుంది. నేను కొన్నేళ్ళు బాంబే లో ఉద్యోగం చేసినందు వల్ల ఈ సంగతి తెల్సు – కేవలం లక్ష్మణ్ కార్టూన్ కోసమే టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కొనేవారు బాంబేలో వేలకొద్దీ ఉన్నారు. కొన్ని రోజుల్లో ఆయన కార్టూన్ లు చూసి రోజు రోజంతా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. కామన్ మాన్ అనేది బోంబే లో ప్రతీ ఒక్కరికీ సరిగ్గా అతికినట్టూ, వర్తించినట్టు ఉండేది. ఆయన కార్టూన్ల వల్ల వచ్చినదే “చల్తా హై” (సర్దుకు పోదాం, ఫర్వాలేదోయ్, మనందరం ఒకటే వగైరా) అనే నానుడి ఆ నగరంలో (లేదా వైస్ వెర్సా). ఇప్పటికీ కూడా అలాగే ఉందని అని నేను నమ్ముతున్నా – శివాజీ టెర్మినస్, ముంబయి అని పేర్లు మార్చినా.
నమస్తే
వంద కుర్చీలు 2 గురించి తః తః గారి అభిప్రాయం:
12/07/2022 10:11 pm
శ్రీ దాసరి: నేను కథ మంచి చెడుల గురించి వ్యాఖ్యానించలేదు. కథనం గురించి మాత్రమే రాశాను. ఈ కథలో వివక్షత డైరక్ట్‌గా చూపబడలేదు. నాకు అర్థమైనంతవరకూ – తరతరాలుగా వివక్షకు గురి అయిన ఒక తండా లోని ఒక స్త్రీ తన తండాను వివక్ష పాలు జేసిన సమాజంలోకి తన కొడుకు వెళ్ళిపోవటాన్ని సహించలేకపోవటాన్ని విపులంగా కధనం చేసింది – ఆ తల్లి ప్రవర్తన ఆ కొడుకు ఉరి వేసుకుని చచ్చి పోదామనుకునే స్థాయిలో. (నావంటి పాఠకులకు వికారం పుట్టేటంతగా.)
మరొక వైపు ఆ కొడుకు వంటి వారిని వారి చిన్నతనంలో వారికి తిండీ బట్టా ఇచ్చి వారిని సమాజం గౌరవించేటట్టుగా ఎదిగేటట్టుగా విద్యా బుద్ధులు నేర్పిన ఒక వ్యవస్థ ఉండటాన్నీ, ఆ వ్యవస్థ పట్ల ఆ కొడుకుకు కృతజ్ఞత ఉండటాన్నీ చూపింది.
నమస్కారాలతో -తః తః
ఊహల ఊట 19 గురించి సుమనస్పతి రెడ్డి గారి అభిప్రాయం:
12/07/2022 10:03 pm
ఇంతకు ముందరి 18 గల్పికల్లో లానే ఏదో వంకన ఆరోగ్యకరమైన తిండీ, వంటల, రుచుల ప్రస్తావన తెస్తూనే, ఈ మారు మాత్రం ఉత్తి తిండంటే వెగటు, వైముఖ్యం కలిగించే సామాజికార్థిక అంతరాల చైతన్యాన్నీ అలవోకగా పట్టుకొచ్చి కలిపేసి కలత రేపి పెట్టారు పాఠకుల పొత్తికడుపుల్లో, తులసి గారు!
దానితో పాటు పనస్పొట్టు కొట్టడం నుండి మొదలుకొని అందరినీ మెప్పించే కూరను వండి దాన్ని పంచుకోవడం దాకా
పనిదనం పట్టింపుదనాన్ని, శ్రమైకానందపు చలాకీదనాన్నీ మరింత ప్రయోజనకరమైన రీతిలో ఆవిష్కరించి పడేశారు!
కథల్లో ఇదొక కొత్త తీరు పనిదనం! ఆర్తి నిండిన అరుదైన కమ్మదనం!
వంద కుర్చీలు 2 గురించి Bhaskar G గారి అభిప్రాయం:
12/07/2022 9:37 pm
మనసుని పిండేసింది. వివక్షను పక్కన పెడితే, అలాంటి అమ్మని ఎలా చూసుకోవాలో తెలియక నరకయాతన పడే అతనిలో నన్ను నేను చూసుకోగలిగాను. మా ఇంట్లో ఇద్దరు మానసిక సమస్యలు ఉన్నవాళ్ళున్నారు. వారితో అప్పుడప్పుడూ జరిగే ప్రహసనాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఏది ఏమైనా అలోచింపచేసే కథ ఇది. నేను తమిళ్ లో వెతికి చదివే ప్రయత్నం చేస్తాను. మీ అధ్బుతమైన అనువాదానికి అభినందనలు.
వంద కుర్చీలు 2 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
12/06/2022 11:06 pm
తఃతః గారూ
మంచి కథ గురించి మీ అభిప్రాయం, దానితో జోడించిన చక్రపాణీయం గమనించాను..ధన్యవాదాలు.
ఈ కథ ఎంతోమందిని కదలించిందని కూడా మీరు గమనించమని కోరుకుంటున్నాను.
‘తమిళులకు ట్రాజడీలను బ్లోఅప్ చేసే గుణముంది’, ‘…రచయుతగా పేరుతెచ్చుకోవడం ‘కళ’ అనిపించుకోదు’ లాంటి స్వీపింగ్ నిర్ధారణలు సమంజసమేనా అన్నదీ ఆలోచించమని విన్నపం చేస్తున్నాను.
ముందే అన్నట్టు, లోకో భిన్న రుచి..
వంద కుర్చీలు 2 గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
12/06/2022 2:55 am
కుల, మత, ఆర్థిక, రాజకీయ సమస్యలతో అల్లుకుపోయిన సమకాలీన సమాజంలో తన కళ్ళముందు జరిగే అన్యాయాన్ని ఏమాత్రం ఎదిరించలేని అశక్తతను ఆవిష్కరించిన సాహితీ సృజనలెన్నో… హోవర్డ్‌ఫాస్ట్ రాసిన స్పార్టకస్, ఎలక్స్ హేలీ రాసిన ఏడు తరాలు (రూట్స్), హారియట్ బీచర్ స్టో రాసిన టామ్‌మామ ఇల్లు (అంకుల్ టామ్స్ కేబిన్), హావర్డ్‌ఫాస్ట్‌దే ఇంకో నవల స్వేచ్చాపథం (ఫ్రీడమ్‌రోడ్), మక్సీమ్‌గోర్కీ అద్భుత రచన అమ్మ, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి నవల, ఇంకెన్నెన్నో….
“ఏ సమాజమూ తప్పించుకోలేని, పూర్తిగా బయట పడలేని అవలక్షణం వివక్షత ” అన్న డా. వై. వాసుదేవరావు గారూ…
జయమోహన్ గారి తమిళ మాత్రుక, అవినేని భాస్కర్ గారి అద్బుత అనుసృజన “వంద కుర్చీలు” కధ ప్రధాన పాత్రల (సొక్కాలు వద్దురా. దమ్మదొరల కుర్చీల్లో కూర్చోవద్దు బిడ్డా… కాప్పా… అనే అమ్మ… నాయాడుల కులానికి చెందిన కాప్పన్… కాప్పన్ నుంచి ధర్మపాలన్ గా ఎదిగిన కలెక్టర్ గారు… నిబద్దతతో పేదలకు వైద్యం చేస్తున్నా సస్పెండ్ కాబడిన డాక్టర్ మాణిక్యం పాత్రలను) ఆ నేపధ్యాన్ని, ఎన్ని వందల అధికార కుర్చీలు అధిష్టించినా వివక్షతతోకూడిన సమాజపు ఉక్కుపిడికిలిలో చిక్కుకుని విలవిలలాడుతారే తప్ప వారు ఆశించే పూర్తి మార్పు తేలేరని సూచిస్తున్న ఈ కధను సమగ్రంగా విశ్లేషించగల సమర్ధురాలు మమత కొడిదెల. వాకిలి అంతర్జాల సాహిత్య పత్రికలో ” హోకా హే” శీర్షికన వ్యాసపరంపరను అందించిన కామ్రేడ్ మమత కొడిదెల.
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 14 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
12/05/2022 5:58 pm
1972లో విక్టోరియా నెం.203 అన్న విజయవంతమైన హిందీ సినిమా వచ్చింది. అందులో విలాసవంతమైన గుర్రపుబగ్గీది ప్రముఖ పాత్ర.
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 14 గురించి anwar గారి అభిప్రాయం:
12/04/2022 11:29 pm
శ్రీ శర్మ గారికి: ఆ రోజు బొంబాయిలో టాక్సీ స్ట్రైక్ ఉంది. నేను దర్జాగా విక్టోరియా ఎక్కి నేరుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కార్యాలయానికి వెళ్లాను (గుర్రపు బగ్గీని విక్టోరియా అనడం వాడుక అనుకుంటాను, శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ వారి రచనల్లో చాలా సార్లు విక్టోరియా ఎక్కి దిగడం చదివి ఉంటిని.)
వంద కుర్చీలు 2 గురించి తఃతః గారి అభిప్రాయం:
12/04/2022 2:32 pm
Sri Dasari: మీ కొత్త సినిమా ద్వారా మీరు ఏం సందేశం ఇస్తారని ఎవరొ అడిగితే చక్రపాణి ‘సందేశం ఇవ్వాలనుకుంటే టెలిగ్రాం ఇవ్వచ్చు సినిమా తీయటం ఎందుకు?’ అన్నారట. I was talking about story writing (story as an art form). In my opinion a good story writer is one who melts *his/her reader, does not mince. ఇహ వివక్షతలంటారా – ఏసమాజమూ తప్పించుకోలేని, పూర్తిగా బయట పడలేని అవలక్షణం వివక్షత- ఎదురు వివక్షతకు దోహదం చేయటం కూడా.
నమస్కారాలతో – తఃతః
*his ఒక్కటీ రాసి వదిలేస్తేనే ఒక వివక్షత!
ష్! ఆమె పని చేసుకుంటోంది గురించి వివిన మూర్తి గారి అభిప్రాయం:
12/04/2022 11:51 am
ఈ వ్యాసం, వ్యాఖ్య చాలా ఆలశ్యంగా ఈ రోజే చూసాను. అద్బుతంగా ఉంది మీ వ్యాఖ్య lyla yerneni గారూ కొన్నేళ్ల క్రితం నేను రచ్చబండలో రాస్తున్నప్పుడు, అప్పుడే తెలుగు వికీపీడియా నిర్మించటం మొదలు పెట్టారు. నన్ను అందులో సహాయం చెయ్యమంటే, నాకు టెంప్లేట్లు, లైఫ్ హిస్టరీ డిక్టేషన్లు బాగా అలవాటే కాబట్టి, నమూనాలేగదా తెలుగువారికి కావలసింది అని, నా సంగతే రాస్తానన్నా. నా పేరూ, ఊరూ, మా అమ్మానాన్నా పేర్లూ, పుట్టిన ఊళ్లూ గట్రా నాకన్నా ఎవరికి బాగా తెలుస్తాయి? పని తేలిక గదా అందుకని.
అప్పుడు నాకు చెప్పబడింది ఏంటంటే, వికీపీడియాలు – ‘ఫేమస్ పీపుల్’ ను ప్రజలకు పరిచయం చెయ్యటానికి అని. మీరు రాసిన ఈమాట చాలా ఆలోచనీయం. లోకంలో బ్రతికిన ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. పేరు పెట్టుకోటం అనే పద్దతి మానవజాతిలోకి వచ్చాక కొందరి పేర్లు మిగిలిపోయాయి. అలా పేర్లు మిగిలిపోటమే చరిత్ర అనే భావనగా మానవుడి భావనగా స్థిరపడ్డాక మిగిలిపోటం అనే ఆశ కూడా వచ్చింది. అంత సుదూరాంశం పక్కనుంచి మనగురించి మనకి చెప్పుకోవాలనిపిస్తే చెప్పుకునే అవకాశం సోషల్ మీడియా ఇచ్చింది. దీన్ని మనం పంచుకోటం అనుకోవచ్చు. రైలు ప్రయాణాలలో ఒకప్పుడు మనుషులు ఒకరి గురించి తెలుసుకునే అలవాటుండేది. మన గురించి మనం చెప్పుకునే అవకాశం వికీపీడియా ఇవ్వకపోయినా ఫేస్బుక్ వంటివి ఇస్తున్నాయని నేను అనుకుంటున్నాను.
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 14 గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
12/04/2022 11:24 am
అన్వర్, ఉత్తినే తప్పులు వెతకుదాం అని కాదు గానీ, ఇది చెపుదాం అని ఈ వాఖ్య రాస్తున్నా.
అర్ధం చూసుకున్నారా? అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీసు ఉండేది ‘విక్టోరియా టెర్మినస్” అనే రైల్వే స్టేషన్ దగ్గిరలో. “ట్రైన్ ఎక్కి విక్టోరియా టెర్మినస్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కార్యాలయానికి వెళ్లాను.” అని ఉండాలి అనుకుంటా మీ అనువాదం. ఈ మధ్యన ఆ ట్రైన్ స్టేషన్ పేరు కూడా “ఛత్రపతి శివాజీ టెర్మినస్” గా మార్చారు.
అనువాదం బాగుంది. నేను కొన్నేళ్ళు బాంబే లో ఉద్యోగం చేసినందు వల్ల ఈ సంగతి తెల్సు – కేవలం లక్ష్మణ్ కార్టూన్ కోసమే టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కొనేవారు బాంబేలో వేలకొద్దీ ఉన్నారు. కొన్ని రోజుల్లో ఆయన కార్టూన్ లు చూసి రోజు రోజంతా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. కామన్ మాన్ అనేది బోంబే లో ప్రతీ ఒక్కరికీ సరిగ్గా అతికినట్టూ, వర్తించినట్టు ఉండేది. ఆయన కార్టూన్ల వల్ల వచ్చినదే “చల్తా హై” (సర్దుకు పోదాం, ఫర్వాలేదోయ్, మనందరం ఒకటే వగైరా) అనే నానుడి ఆ నగరంలో (లేదా వైస్ వెర్సా). ఇప్పటికీ కూడా అలాగే ఉందని అని నేను నమ్ముతున్నా – శివాజీ టెర్మినస్, ముంబయి అని పేర్లు మార్చినా.
నమస్తే
[రచయిత ఉద్దేశ్యం విక్టోరియా కారియేజ్ అని బహుశా – సం.]