“ఈ కథలో వివక్షత డైరక్ట్‌గా చూపబడలేదు” అన్న ప్రియమైన శ్రీ తఃతః గారూ! మీకు చెప్పగలిగినంత వాడిని కాను, అయినా విన్నవించుకుంటున్నాను.
మనదేశం లోని ఆదివాసులు, గిరిజనులు, సమాజం లోని అట్టడువర్గానికి చెందిన బడుగు వర్గం వారూ… వివక్షతకు గురైనారనో లేదా చారిత్రక తప్పిదమైన సమాజ వికృతస్వరూపమనో ఏదన్నా అనండి… అది జయమోహన్ గారి యీ “వంద కుర్చీలు” కధలో ఎలా చూపబడిందో యీ క్రింది వాక్యాలు మరోసారి చదివిచూడరా…
” ప్రభుత్వపు లెక్కల్లో పేరు, ఊరు వంటి వివరాలున్న పన్ను కట్టేవారే చనిపోయి అనాథ శవాల్లా కుళ్ళిపోతుంటే తిరువిదాంగూర్ స్టేట్‌లోని నాయాడులు ఎందరు చచ్చారన్నది ఎవరు పట్టించుకుంటారు. సగానికి పైగా వలసవచ్చిన వాళ్ళతో నిండిపోయిన పెద్ద పట్టణాల్లో నాయాడుల గురించిన వివరాలు ఎవరికీ పెద్దగా తెలిసుండదు.
“పగటి పూట వెలుతురులో భిక్ష అడుక్కోవడం అన్నదే పెద్ద అభివృద్ధిగా, సామూహిక గౌరవంగా మా పూర్వీకులు భావించి ఉండవచ్చు. నగరం అన్నది నిర్విరామంగా చెత్తను బయటపడేస్తూనే ఉంటుంది. ఆ చెత్తకుప్పల్లో పురుగుల్లా మావాళ్ళు పిల్లల్ను కని వంశాన్ని ఉద్ధరించారు.
“హాస్టల్లో కూడా నేను ఒంటరిగానే ఉండేవాడిని. ట్రైబల్స్ కోసం ఉన్న ఆ హాస్టల్లో ఉన్న ఏకైక నాయాడిని నేనే. నాతో గది పంచుకోడానికి ఎవరూ లేరు. నాకొక్కడికి మాత్రం అక్కడి మరుగుదొడ్డి వాడుకోవడానికి నిషేధం.”
“వీడున్న ఇదే వయసులో నేను ప్రతిరోజూ ఆ పాచిపోయిన ఎంగిలి కూడే తిని బతికాను. ఎలా బతికానో మరి. నా వయసున్న పిల్లలు ఎందరో వర్షాకాలాల్లో చనిపోయేవారు. చచ్చిపోయిన పిల్లల్ని కాళ్ళతో పట్టి ఎత్తుకుని బిరబిరమని సాగే కరమన ఏటిలో పడేసేవాళ్ళు.”
“నేను నాలాంటి వాళ్ళ గొంతుకగానూ, చెయ్యిగానూ ఈ వ్యవస్థలో ఉండాలి. నాలాంటివాళ్ళు అంటే పాకీవాళ్ళు ఊడ్చి తీసుకొచ్చి, గాడిదసంత హాస్పిటల్‌లో మనుషుల చెత్తగా రాశి పోయబడినవాళ్ళు. ప్రజారోగ్యం కోసం కోట్లను ఖర్చుబెట్టే ఈ ప్రభుత్వం అక్కడ చావుబతుకుల్లో మగ్గిపోతున్న వారి ప్రాణాలకోసం ఎందుకు ఖర్చు పెట్టకూడదు? ఆ డాక్టర్లనెందుకు వాళ్ళనూ మనుషులుగా భావించేలా చెయ్యకూడదు? వీలు కాదు అనేవాళ్ళని దండించండి. మీలో ఒకడికి ఆ హాస్పిటల్లో సరిగ్గా చూసుకోలేదంటే మీ గొంతులు వినిపిస్తారే, మీ ధర్మగుణం పైకి ఉబుకుతుందే!” కాప్పన్ నుంచి ధర్మపాలన్ గా ఎదిగిన కలెక్టర్ ఆవేదన.
నిబద్దతతో పేదలకు వైద్యం చేస్తున్నా సస్పెండ్ కాబడిన డాక్టర్ మాణిక్యం పాత్ర రోదనను మరోసారి ఆలకించండి.
Janaki’s Zen గురించి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ గారి అభిప్రాయం:
12/09/2022 5:13 am
ఇలా జరిగివుంటే ఎంత బావుండుననిపించేలా వుంది. రాముడి అవతార లక్ష్యం ఎలా నెరవేరటం మరి?
కథ పేరు – విషాద నగరం. Isn’t that enough warning for me to switch to another story! Unfortunately, my eye scanned the scanty material already. It is obvious the writer intends to kill, in this story. And he is really in a mad rush to do it.
కొన్ని కథలలో, నవలలలో -ఒక పాత్ర ఇంకో పాత్రను కథలోని పరిస్థితులు, మానసిక స్థితుల వల్ల – హింసించటం, చంపటం జరుగుతుంది. కాని, ముందే ‘వయొలెన్స్’ దృష్టిలో పెట్టుకుని, రచయిత డెలిబరేట్‍గా కల్పించే (writerogenic) చావులకు, విషాదాలకు, రచయితే జవాబుదారీ. ఇంకెవరూ లేరు. These killer writers go scot-free.
డిటెక్టివ్ ఫిక్షన్ కాకుండా, మిగతా పుస్తకాల్లో కథల్లోని ‘పాత్రల మరణాల’ గురించి, కధా రచయితలు, నవలా రచయితలు కొందరు రాశారు. ఎందుకు కొంతమంది రచయితలు మాత్రమే హింస, చావు, హత్యలు, తమ రచనలలో ఎక్కువగా చూపిస్తారు, అది, మంచిదా, చెడ్డదా అనేదానికి ఎవరికీ అవగాహన లేదు. గ్రాఫిక్ వయొలెన్స్ ఎందుకు ఉంటుంది కొందరి రచనల్లో, అని కొన్ని నెలల కింద నేను వేసిన ప్రశ్నకిక్కడ సాహితీకారుల నుండి ఏం జవాబు రాలేదు.
“How to read Literature like a professor” by Thomas C. Foster -పుస్తకం లో ఛాప్టర్ 11 –… More Than It’s Gonna Hurt You: Concerning Violence — ఇలాటి విషయాల గురించి ఆలోచించటానికే కేటాయించినట్టుంటే, ఈ ఇంగ్లిష్ ప్రొఫెసర్ ఏమన్నాడో చూద్దామని ఈ మధ్య, చదివాను. థామస్ ఫోస్టర్‍కీ సమాధానం ఏమీ లేదు. ఛాప్టరు ఆఖరులో–ఫిక్షన్ రచయితల వయొలెన్స్ మనం జెనరలైస్ చెయ్యలేం, మనకు వీరిని భరించక తప్పదు, లేకుంటే సాహిత్యంలో మనకు షేక్స్‌పియర్, హోమర్, లారెన్స్, హెమింగ్వే, తదితరులుండరు కదా, అందరూ జేన్ ఆస్టిన్ లాటి పుస్తకాలే రాయలేరు కదా, అని ఒక హాస్యం చేసి వదిలేశాడు.
ఈ ‘విషాదనగరం’ కథలో: ఈ మినీ కథ చెపుతున్నతనికి అన్నీ ఫ్రీగా రావాలి. ఇల్లు ఫ్రీగా రావాలి. రానందున కొంత మంట. ఆకాశం, వెన్నెల, ఎదురింటి అందమైన పాపాయి ఫ్రీగా వచ్చినందున అతని కిష్టం. వీటన్నిటిలో (కథకుడితో సహా) రచయిత -ఉష్ కాకీ! అని మాయం చెయ్యగలిగిందెవరు? ఎవరిని మాయం చేస్తే, అతడు గుచ్చాలనుకునే ముల్లు కసిక్కిన దిగుతుంది విషాదవిషం?
ఈ కథలో అమ్మా నాన్నలు absent. వారి మీద కాని, ఇరుగుపొరుగుల మీద కాని, చివరకు ఫ్రీగా పైనెంతో ఎత్తు మీంచి ఆ పాపాయిని చూసి ఆనందించే కథకుడి (Detached God like, solitary figure) మీద కాని, ఈ పాపాయిని రక్షించే బాధ్యత లేదు. (Where the hell are they?) రచయిత చాతుర్యంగా తన బ్లేమ్, సమస్త తెలుగుజనాలూ సింపథైజ్ చేసేట్టు, అందరి దృష్టీ -పొలిటీషియన్స్, వారి గ్రీడ్, చేతగానితనం, పర్యావర్తం పొల్యూషన్, దాని మూలాన జరిగే ఘోరాల మీదికి మూడు ముక్కల్లో మళ్లించాడు. By doing so, the writer has reduced conflict with a very large population and pocketed them confidently as his readers.
But then to do so, Isn’t it wonderfully clever of the writer! Isn’t that stupendously smart? No. Not at all. It is a dishonest sadistic writing for habituated masochistic babes in woods. It is contrived, formulaic, and routine. జంతురక్షణ, పర్యావరణ రక్షణ. ఇవి ఇప్పటి అందరి ఫేవరిట్ పెట్ ప్రాజెక్ట్స్. ఇవి ఎత్తుకుంటే, రచయిత ఎంతో గొప్ప హృదయం ఉన్నవాడిగా కొందరు బొందన పడతారు. సమాజంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే మేధావిగా కొందరు ఊహిస్తారు. రచయితలకు నిజానికి అలాటి wisdom ఏమీ ఉండనవసరం లేదు. అసలు వీరే కార్యాలయంలోనూ బాధ్యతాయుతమైన పనులు చేస్తుండక పోవచ్చు.
పాఠకులు కొందరు, కథను, మెచ్చుకున్నారు. ఈ పాఠకులు వాళ్లు వచ్చి, వాళ్లు కథ చదివి ఎలా గిలగిల్లాడారో చెపుతారు. ఆ సీన్ చూశాక, the useless masochistic exhibitionism, for a purposeless sadistic stint – అని మళ్లీ నాకనిపించింది.
నా చిన్నతనంలో, మా తమ్ముడికి, సరదాకి ఒక చిన్న ప్లాస్టిక్ గన్ కొనిపెట్టారు. దాని ఉద్దేశం, బచ్చాగాడు గోడ కేసి కొట్టుకుంటే ఓ పుల్ల చివర ఉండే చిన్న సక్షన్ కప్ గోడకి కాసేపు అతుక్కుని, ఊడి పడతది. అప్పుడు మళ్లీ ఆ కుంక, అది తెచ్చుకుని మళ్లీ మళ్లీ గోడ కేసి కొట్టుకోవాలి. అలా వాడటం మానేసి, ఇంట్లో అటూ ఇటూ తిరిగే మా కేసి కొట్టటం మొదలెట్టాడు. నాకు –అమ్మా, కొడుతున్నాడే, నాన్నా, ఊఁ, ఊఁ, అని కళ్లు నలుపుకుంటూ ఏడవటం; మేష్టారూ, చూడండీ, కొడుతున్నాడు- అని ఏడవాల్సిన అగత్యం ఏమిటి? సుబ్రంగా రెండు తుంపులు చేసి ముఖాన కొట్టాను. ఇప్పటికీ ఇంట్లో అందరికీ చెప్పుకుని ఏడుస్తుంటాడు, O she is so cruel, she broke my toy! అని.
ఈ విషాద నగరం కథ గురించి మరో సంగతి: కొన్నాళ్ల తదనంతరం, రచయిత పనిగట్టుకు వచ్చి, పాఠకుల అభినందలను స్వీకరించాడు. రచయిత, వారి ఫాలోయర్స్ locusts లాగా ఈమాట అభిప్రాయ వేదికపై వచ్చి వాలినపుడు, వారి సంభాషణలు విన్న తర్వాత, ఒక విచిత్ర అనుభవం కలిగింది. ఇది నేను సరిగా చెప్పగలనో లేదో కానీ, ప్రయత్నిస్తాను.
కథలోని నగరం లోని, ఒక గాడ్ ఫర్సేకెన్ వీథిలో, ఒక విషాదఘటన చూస్తానికి, ఆ ఇంటిముందు ఎలా వీధిలోని వారు క్యూరియాసిటీతో మూగారో; ఈమాట అభిప్రాయాల వీధిలో, ఈ కథ పాఠకులు గుమికూడటం- అచ్చంగా అలాగే ఉందనిపించింది. It is the same scene. Inside the story. And outside the story. That I thought is eerie. Surreal. మినీ కథలోని onlookersకి సంభాషణలు లేవు. కాని కథ చదివిన onlooker/పాఠకుల సంభాషణలు ఇక్కడ విన్నాను. ఈ మొత్తం సీన్ కలిపి చూసిన నాకు, ఒక ‘పెయింటింగ్ ద సేమ్ వికెడ్ ట్రాజిక్ సీన్, వితిన్ ద పెయింటింగ్’ చూసిన doubled unpleasantness కలిగించింది.
కొందరు రచయితల గురించి అటువంటప్పుడు నా ఆలోచనలు: ఎందుకు వారి అనువాదాల్లో, రచనల్లో శవాలను బొమ్మలతో సహా వీరు మేగజీన్ లోకి లాక్కొస్తారు, పత్రిక ఒక morgue అనుకుంటారా? కొందరు రక్తాన్ని జెల్లీబీన్స్ లాగా రోడ్ల మీద చూపుతారు, కొందరు ఉర్దూ రచయితలకు ప్రాస్టిట్యూట్ల దుర్దశ మీద మహా వ్యధ, ఒక పక్కన రచయిత తాగి తామే స్వయంగా అక్కడ దొర్లుతూనే. మైగాడ్! ఎప్పుడో పాత వార్ గురించి, కీబోర్డ్ మీద వీళ్లేడిసే లోపల కొత్త వార్ రానే వచ్చె. ఈ రచయితల వ్యర్థపు వెనకబడిన ఏడుపులెందుకు? ఎందుకు వయొలెన్స్, ఏడుపుల మీదే వీరి దృష్టి?
మెడికల్ ఫీల్డ్‌లో iatrogenic disasters ఉంటయ్యి. They are unwanted. By all. రచనారంగంలో కొన్ని రచనలలో కేవలం రచయిత prompted death and disasters ఉంటయ్యి. They are wanted, by some sort of readers. The writer gets praise. ఈ చిన్నకథ, పాఠకుల పార్టిసిపేషన్, అందుకు ఉదాహరణ, అని నాకనిపించింది.
I say to myself, what’s the big deal! Writers write as they wish. I read what I like, and when I like. I silently walk away from some writers. I have the freedom.
మొదట్లో బోర్ కొట్టింది. ఏదో పాత కథ చదువుతున్నాను, ఈ రోజుల్లో ఇలా ఉండదు అనేట్టు అనిపించింది. తర్వాత కథ లోపలికి వెళ్తున్నకొద్దీ మనిషి నైజం, డబ్బుతో మనుషులు మారిపోడం – ఇలాంటివి ఎప్పుడూ ఒకలాగే ఉన్నాయనిపించింది. పేద గొప్ప తేడా ఎప్పుడూ ఉంది. అది మారదు.
అంతా పనసమయం – ఆ విషయంలో నాకు నోరూరింది. చాలా ఆనందించాను చదివి.
అంటు, అత్తగారు గురించి Venkateswararao VEMURI గారి అభిప్రాయం:
12/12/2022 4:23 pm
ఈ “కథ” కనిపించినప్పుడల్లా చదువుతూనే ఉంటాను.
నాకు నచ్చిన పద్యం: శబ్దాలంకారపు సంగీత మాధుర్యం గురించి దేవేంద్రనాధ రెడ్డి మల్లం గారి అభిప్రాయం:
12/11/2022 12:44 pm
చాలా బాగుంది పద్యపఠనం. కడు ముచ్చటైన ఆంధ్ర భాషా యోష సేవ. ఎవరన్నారు తెలుగుభాష మీద ఆదరణ తరుగుతోందని?
ఊహల ఊట 19 గురించి యర్రమిల్లి నళిని గారి అభిప్రాయం:
12/11/2022 7:42 am
ఊహలకు రెక్కలు వచ్చి కలలు కలిసివస్తే పేదరికం ధనిక అనే అసమానతలు ఉండవు. కుంతల వంటి పాత్రల ద్వారా ఆవిష్కరణ చేసిన తీరు ఈతరం వారికి కూడా బాగానే ఉంటుంది…
వంద కుర్చీలు 2 గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
12/09/2022 10:29 am
“ఈ కథలో వివక్షత డైరక్ట్‌గా చూపబడలేదు” అన్న ప్రియమైన శ్రీ తఃతః గారూ! మీకు చెప్పగలిగినంత వాడిని కాను, అయినా విన్నవించుకుంటున్నాను.
మనదేశం లోని ఆదివాసులు, గిరిజనులు, సమాజం లోని అట్టడువర్గానికి చెందిన బడుగు వర్గం వారూ… వివక్షతకు గురైనారనో లేదా చారిత్రక తప్పిదమైన సమాజ వికృతస్వరూపమనో ఏదన్నా అనండి… అది జయమోహన్ గారి యీ “వంద కుర్చీలు” కధలో ఎలా చూపబడిందో యీ క్రింది వాక్యాలు మరోసారి చదివిచూడరా…
” ప్రభుత్వపు లెక్కల్లో పేరు, ఊరు వంటి వివరాలున్న పన్ను కట్టేవారే చనిపోయి అనాథ శవాల్లా కుళ్ళిపోతుంటే తిరువిదాంగూర్ స్టేట్‌లోని నాయాడులు ఎందరు చచ్చారన్నది ఎవరు పట్టించుకుంటారు. సగానికి పైగా వలసవచ్చిన వాళ్ళతో నిండిపోయిన పెద్ద పట్టణాల్లో నాయాడుల గురించిన వివరాలు ఎవరికీ పెద్దగా తెలిసుండదు.
“పగటి పూట వెలుతురులో భిక్ష అడుక్కోవడం అన్నదే పెద్ద అభివృద్ధిగా, సామూహిక గౌరవంగా మా పూర్వీకులు భావించి ఉండవచ్చు. నగరం అన్నది నిర్విరామంగా చెత్తను బయటపడేస్తూనే ఉంటుంది. ఆ చెత్తకుప్పల్లో పురుగుల్లా మావాళ్ళు పిల్లల్ను కని వంశాన్ని ఉద్ధరించారు.
“హాస్టల్లో కూడా నేను ఒంటరిగానే ఉండేవాడిని. ట్రైబల్స్ కోసం ఉన్న ఆ హాస్టల్లో ఉన్న ఏకైక నాయాడిని నేనే. నాతో గది పంచుకోడానికి ఎవరూ లేరు. నాకొక్కడికి మాత్రం అక్కడి మరుగుదొడ్డి వాడుకోవడానికి నిషేధం.”
“వీడున్న ఇదే వయసులో నేను ప్రతిరోజూ ఆ పాచిపోయిన ఎంగిలి కూడే తిని బతికాను. ఎలా బతికానో మరి. నా వయసున్న పిల్లలు ఎందరో వర్షాకాలాల్లో చనిపోయేవారు. చచ్చిపోయిన పిల్లల్ని కాళ్ళతో పట్టి ఎత్తుకుని బిరబిరమని సాగే కరమన ఏటిలో పడేసేవాళ్ళు.”
“నేను నాలాంటి వాళ్ళ గొంతుకగానూ, చెయ్యిగానూ ఈ వ్యవస్థలో ఉండాలి. నాలాంటివాళ్ళు అంటే పాకీవాళ్ళు ఊడ్చి తీసుకొచ్చి, గాడిదసంత హాస్పిటల్‌లో మనుషుల చెత్తగా రాశి పోయబడినవాళ్ళు. ప్రజారోగ్యం కోసం కోట్లను ఖర్చుబెట్టే ఈ ప్రభుత్వం అక్కడ చావుబతుకుల్లో మగ్గిపోతున్న వారి ప్రాణాలకోసం ఎందుకు ఖర్చు పెట్టకూడదు? ఆ డాక్టర్లనెందుకు వాళ్ళనూ మనుషులుగా భావించేలా చెయ్యకూడదు? వీలు కాదు అనేవాళ్ళని దండించండి. మీలో ఒకడికి ఆ హాస్పిటల్లో సరిగ్గా చూసుకోలేదంటే మీ గొంతులు వినిపిస్తారే, మీ ధర్మగుణం పైకి ఉబుకుతుందే!” కాప్పన్ నుంచి ధర్మపాలన్ గా ఎదిగిన కలెక్టర్ ఆవేదన.
నిబద్దతతో పేదలకు వైద్యం చేస్తున్నా సస్పెండ్ కాబడిన డాక్టర్ మాణిక్యం పాత్ర రోదనను మరోసారి ఆలకించండి.
Janaki’s Zen గురించి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ గారి అభిప్రాయం:
12/09/2022 5:13 am
ఇలా జరిగివుంటే ఎంత బావుండుననిపించేలా వుంది. రాముడి అవతార లక్ష్యం ఎలా నెరవేరటం మరి?
కుండీలో మర్రిచెట్టు గురించి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ గారి అభిప్రాయం:
12/09/2022 4:43 am
హృదయం ద్రవించిపోయిందండీ నిజంగా… మహా అన్న శబ్దానికి దృశ్యరూపం మహావృక్షం!
ఉదయాలు గురించి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ గారి అభిప్రాయం:
12/09/2022 4:34 am
చక్కగా చెప్పారు, ఉదయాల గురించి. నిద్రావస్థ గురించీ.
విషాద నగరం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
12/08/2022 4:21 pm
కథ పేరు – విషాద నగరం. Isn’t that enough warning for me to switch to another story! Unfortunately, my eye scanned the scanty material already. It is obvious the writer intends to kill, in this story. And he is really in a mad rush to do it.
కొన్ని కథలలో, నవలలలో -ఒక పాత్ర ఇంకో పాత్రను కథలోని పరిస్థితులు, మానసిక స్థితుల వల్ల – హింసించటం, చంపటం జరుగుతుంది. కాని, ముందే ‘వయొలెన్స్’ దృష్టిలో పెట్టుకుని, రచయిత డెలిబరేట్‍గా కల్పించే (writerogenic) చావులకు, విషాదాలకు, రచయితే జవాబుదారీ. ఇంకెవరూ లేరు. These killer writers go scot-free.
డిటెక్టివ్ ఫిక్షన్ కాకుండా, మిగతా పుస్తకాల్లో కథల్లోని ‘పాత్రల మరణాల’ గురించి, కధా రచయితలు, నవలా రచయితలు కొందరు రాశారు. ఎందుకు కొంతమంది రచయితలు మాత్రమే హింస, చావు, హత్యలు, తమ రచనలలో ఎక్కువగా చూపిస్తారు, అది, మంచిదా, చెడ్డదా అనేదానికి ఎవరికీ అవగాహన లేదు. గ్రాఫిక్ వయొలెన్స్ ఎందుకు ఉంటుంది కొందరి రచనల్లో, అని కొన్ని నెలల కింద నేను వేసిన ప్రశ్నకిక్కడ సాహితీకారుల నుండి ఏం జవాబు రాలేదు.
“How to read Literature like a professor” by Thomas C. Foster -పుస్తకం లో ఛాప్టర్ 11 –… More Than It’s Gonna Hurt You: Concerning Violence — ఇలాటి విషయాల గురించి ఆలోచించటానికే కేటాయించినట్టుంటే, ఈ ఇంగ్లిష్ ప్రొఫెసర్ ఏమన్నాడో చూద్దామని ఈ మధ్య, చదివాను. థామస్ ఫోస్టర్‍కీ సమాధానం ఏమీ లేదు. ఛాప్టరు ఆఖరులో–ఫిక్షన్ రచయితల వయొలెన్స్ మనం జెనరలైస్ చెయ్యలేం, మనకు వీరిని భరించక తప్పదు, లేకుంటే సాహిత్యంలో మనకు షేక్స్‌పియర్, హోమర్, లారెన్స్, హెమింగ్వే, తదితరులుండరు కదా, అందరూ జేన్ ఆస్టిన్ లాటి పుస్తకాలే రాయలేరు కదా, అని ఒక హాస్యం చేసి వదిలేశాడు.
ఈ ‘విషాదనగరం’ కథలో: ఈ మినీ కథ చెపుతున్నతనికి అన్నీ ఫ్రీగా రావాలి. ఇల్లు ఫ్రీగా రావాలి. రానందున కొంత మంట. ఆకాశం, వెన్నెల, ఎదురింటి అందమైన పాపాయి ఫ్రీగా వచ్చినందున అతని కిష్టం. వీటన్నిటిలో (కథకుడితో సహా) రచయిత -ఉష్ కాకీ! అని మాయం చెయ్యగలిగిందెవరు? ఎవరిని మాయం చేస్తే, అతడు గుచ్చాలనుకునే ముల్లు కసిక్కిన దిగుతుంది విషాదవిషం?
ఈ కథలో అమ్మా నాన్నలు absent. వారి మీద కాని, ఇరుగుపొరుగుల మీద కాని, చివరకు ఫ్రీగా పైనెంతో ఎత్తు మీంచి ఆ పాపాయిని చూసి ఆనందించే కథకుడి (Detached God like, solitary figure) మీద కాని, ఈ పాపాయిని రక్షించే బాధ్యత లేదు. (Where the hell are they?) రచయిత చాతుర్యంగా తన బ్లేమ్, సమస్త తెలుగుజనాలూ సింపథైజ్ చేసేట్టు, అందరి దృష్టీ -పొలిటీషియన్స్, వారి గ్రీడ్, చేతగానితనం, పర్యావర్తం పొల్యూషన్, దాని మూలాన జరిగే ఘోరాల మీదికి మూడు ముక్కల్లో మళ్లించాడు. By doing so, the writer has reduced conflict with a very large population and pocketed them confidently as his readers.
But then to do so, Isn’t it wonderfully clever of the writer! Isn’t that stupendously smart? No. Not at all. It is a dishonest sadistic writing for habituated masochistic babes in woods. It is contrived, formulaic, and routine. జంతురక్షణ, పర్యావరణ రక్షణ. ఇవి ఇప్పటి అందరి ఫేవరిట్ పెట్ ప్రాజెక్ట్స్. ఇవి ఎత్తుకుంటే, రచయిత ఎంతో గొప్ప హృదయం ఉన్నవాడిగా కొందరు బొందన పడతారు. సమాజంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే మేధావిగా కొందరు ఊహిస్తారు. రచయితలకు నిజానికి అలాటి wisdom ఏమీ ఉండనవసరం లేదు. అసలు వీరే కార్యాలయంలోనూ బాధ్యతాయుతమైన పనులు చేస్తుండక పోవచ్చు.
పాఠకులు కొందరు, కథను, మెచ్చుకున్నారు. ఈ పాఠకులు వాళ్లు వచ్చి, వాళ్లు కథ చదివి ఎలా గిలగిల్లాడారో చెపుతారు. ఆ సీన్ చూశాక, the useless masochistic exhibitionism, for a purposeless sadistic stint – అని మళ్లీ నాకనిపించింది.
నా చిన్నతనంలో, మా తమ్ముడికి, సరదాకి ఒక చిన్న ప్లాస్టిక్ గన్ కొనిపెట్టారు. దాని ఉద్దేశం, బచ్చాగాడు గోడ కేసి కొట్టుకుంటే ఓ పుల్ల చివర ఉండే చిన్న సక్షన్ కప్ గోడకి కాసేపు అతుక్కుని, ఊడి పడతది. అప్పుడు మళ్లీ ఆ కుంక, అది తెచ్చుకుని మళ్లీ మళ్లీ గోడ కేసి కొట్టుకోవాలి. అలా వాడటం మానేసి, ఇంట్లో అటూ ఇటూ తిరిగే మా కేసి కొట్టటం మొదలెట్టాడు. నాకు –అమ్మా, కొడుతున్నాడే, నాన్నా, ఊఁ, ఊఁ, అని కళ్లు నలుపుకుంటూ ఏడవటం; మేష్టారూ, చూడండీ, కొడుతున్నాడు- అని ఏడవాల్సిన అగత్యం ఏమిటి? సుబ్రంగా రెండు తుంపులు చేసి ముఖాన కొట్టాను. ఇప్పటికీ ఇంట్లో అందరికీ చెప్పుకుని ఏడుస్తుంటాడు, O she is so cruel, she broke my toy! అని.
ఈ విషాద నగరం కథ గురించి మరో సంగతి: కొన్నాళ్ల తదనంతరం, రచయిత పనిగట్టుకు వచ్చి, పాఠకుల అభినందలను స్వీకరించాడు. రచయిత, వారి ఫాలోయర్స్ locusts లాగా ఈమాట అభిప్రాయ వేదికపై వచ్చి వాలినపుడు, వారి సంభాషణలు విన్న తర్వాత, ఒక విచిత్ర అనుభవం కలిగింది. ఇది నేను సరిగా చెప్పగలనో లేదో కానీ, ప్రయత్నిస్తాను.
కథలోని నగరం లోని, ఒక గాడ్ ఫర్సేకెన్ వీథిలో, ఒక విషాదఘటన చూస్తానికి, ఆ ఇంటిముందు ఎలా వీధిలోని వారు క్యూరియాసిటీతో మూగారో; ఈమాట అభిప్రాయాల వీధిలో, ఈ కథ పాఠకులు గుమికూడటం- అచ్చంగా అలాగే ఉందనిపించింది. It is the same scene. Inside the story. And outside the story. That I thought is eerie. Surreal. మినీ కథలోని onlookersకి సంభాషణలు లేవు. కాని కథ చదివిన onlooker/పాఠకుల సంభాషణలు ఇక్కడ విన్నాను. ఈ మొత్తం సీన్ కలిపి చూసిన నాకు, ఒక ‘పెయింటింగ్ ద సేమ్ వికెడ్ ట్రాజిక్ సీన్, వితిన్ ద పెయింటింగ్’ చూసిన doubled unpleasantness కలిగించింది.
కొందరు రచయితల గురించి అటువంటప్పుడు నా ఆలోచనలు: ఎందుకు వారి అనువాదాల్లో, రచనల్లో శవాలను బొమ్మలతో సహా వీరు మేగజీన్ లోకి లాక్కొస్తారు, పత్రిక ఒక morgue అనుకుంటారా? కొందరు రక్తాన్ని జెల్లీబీన్స్ లాగా రోడ్ల మీద చూపుతారు, కొందరు ఉర్దూ రచయితలకు ప్రాస్టిట్యూట్ల దుర్దశ మీద మహా వ్యధ, ఒక పక్కన రచయిత తాగి తామే స్వయంగా అక్కడ దొర్లుతూనే. మైగాడ్! ఎప్పుడో పాత వార్ గురించి, కీబోర్డ్ మీద వీళ్లేడిసే లోపల కొత్త వార్ రానే వచ్చె. ఈ రచయితల వ్యర్థపు వెనకబడిన ఏడుపులెందుకు? ఎందుకు వయొలెన్స్, ఏడుపుల మీదే వీరి దృష్టి?
మెడికల్ ఫీల్డ్‌లో iatrogenic disasters ఉంటయ్యి. They are unwanted. By all. రచనారంగంలో కొన్ని రచనలలో కేవలం రచయిత prompted death and disasters ఉంటయ్యి. They are wanted, by some sort of readers. The writer gets praise. ఈ చిన్నకథ, పాఠకుల పార్టిసిపేషన్, అందుకు ఉదాహరణ, అని నాకనిపించింది.
I say to myself, what’s the big deal! Writers write as they wish. I read what I like, and when I like. I silently walk away from some writers. I have the freedom.
-Lyla
Janaki’s Zen గురించి వీరభద్రం గారి అభిప్రాయం:
12/08/2022 4:54 am
సుగ్రీవుడిని తన బాధలేవో తననే పడమని, ధర్మం తప్పిన వాలిని ఏమనకుండా వచ్చేస్తాడా రాముడు. రావణుడిని మార్చినట్లే వాలినీ మార్చి ఉండవలసింది.
ఊహల ఊట 19 గురించి Anand Chaganti గారి అభిప్రాయం:
12/08/2022 4:09 am