పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16393

  1. సన్నటి నూలుపోగు గురించి Shrutha keerthi అభిప్రాయం:

    10/02/2024 3:19 pm

    అయ్యంకాళి, గాంధీజీల సమావేశంలో ఏం జరిగి ఉండవచ్చో అని ఊహించి జయమోహన్ రాసిన కథ ఇది అన్నారు. నిజంగానే జరిగిన సంఘటనే, గాంధీ గారి మాటలే అన్నట్టుగా ఉంది. కుమార్ గారి అనువాదం బాగుంది.

  2. అక్టోబర్ 2024 గురించి Sivakumar Tadikonda అభిప్రాయం:

    10/02/2024 3:17 pm

    మంచి వ్యాసం. కుట్ర అని పెద్దగా అరిచేవాళ్ళే పెద్ద కుట్రదారులని ప్రఛ్ఛంద రాజకీయాలు నిరూపిస్తున్నాయిగా!

  3. అప్రకటిత యక్షగానం: రామదాసు చరిత్రం గురించి వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:

    10/02/2024 2:32 pm

    వెంకటరావుగారికి ధన్యవాదాలు.
    తాళపత్రాలస్కాన్‍ – https://archive.org/details/Telugu_TEL_B_0679__R_2592
    క్రిందిచోట “ramadasu charitra” కోసం వెతకి చూడవచ్చు.
    https://www.tamildigitallibrary.in/goml-data?language=telugu
    పిడియఫ్‍ పుట 65నుండి ‘రామదాసుచరిత్రం’ ఉంది. పత్రాలు స్కాన్‍లో అస్తవ్యస్తంగా ఉన్నాయి.

  4. అజ్ఞాతవాసి గురించి Vijaya Karra అభిప్రాయం:

    10/02/2024 2:29 pm

    శైలజ గారు !
    మీకు కథ నచ్చినందుకు సంతోషంగా వుంది. ధన్యవాదాలు !
    -విజయ

  5. కథకుడి అంతర్మథనం గురించి డాక్టర్ రమేష్ కుమార్ ఘండికోట అభిప్రాయం:

    10/02/2024 11:11 am

    డాక్టర్ అల్లాడి మోహన్ వైద్య విద్యార్థిగానూ ఇంటర్నీగా 88/89 సం నాకు పరిచయమై కొన్ని సంవత్సరాల తరువాత, వైద్య అధ్యాపకుడి ఆ పరిచ యం ఆత్మీయమైన స్నేహంగా మారింది.డెర్మటాలజీలో ఇంటర్నీగా పూర్తి 15 రోజుఉండీ, నన్ను బాగా అల్లాడి ంచి నన్ను మళ్ళీ డెర్మటాలజీ రివైస్ చేసేంత గా ప్రశ్నల సునామీ సృష్టించి జవాబులు రాబట్టించాడు. ఆ తరువాత 34 సంవత్సరాల సర్వీస్ లో చూడాలో ఇలాంటి పిడుగును అప్పుడే అనుకున్నా వీడు చాలా ఘటికుడు భవిష్యత్తులో గొప్ప వైద్యుడు,అధ్యాపకుడు పరిశోధకుడు అవుతాడు అనుకున్నా. పువ్వు పుట్టగానే పరిమళించింది. మోహన అద్భుతమైన విశ్లేషణతో ముళ్ళపూడి వారిని మించాడు ఎలాగైనా నాలా బాపూరమణల వీరాభిమాని గనుక ఆ ఒరవడి వచ్చింది. ఎలాగైనా శ్యాం రచనలు చదవాల నిపిస్తుంది. ‌విద్వాన్ సర్వత్రా పూజ్యతే. దీర్ఘాయుష్మాన్ ప్రొఫెసర్ డాక్టర్ రైటర్ అల్లా మోహన్ . అల్లాడించేశావ్.ఒక పీఠిక లేదా ముందు మాట ఎలా రాయాలో అనుకునే వారికిది మాస్టర్ పీస్

  6. సన్నటి నూలుపోగు గురించి Gowri Kirubanandan అభిప్రాయం:

    10/02/2024 9:15 am

    ఈ కథను అనువాదం చేసింది ఎస్. కుమార్ అని ప్రారంభంలోనే ఉంది. కథ, అనువాదం బాగా ఉన్నాయి.

  7. అప్రకటిత యక్షగానం: రామదాసు చరిత్రం గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    10/02/2024 8:59 am

    ఈ కాలంలో కూడా తాళపత్ర ప్రతుల్ని చదివి, పరిష్కరించి, అందరికి అందుబాటులోకి తేవడం చాలా గొప్ప విషయం. వెంకటరావుగారి కృషికి ధన్యవాదాలు.

  8. మాతృకాంక్ష గురించి వరిగొండ కాంతారావు అభిప్రాయం:

    10/02/2024 4:07 am

    చాల మంచి కవిత. ఆరుద్రంత మంచితనం. ధన్యవాదాలు.

  9. సన్నటి నూలుపోగు గురించి శశికళ అభిప్రాయం:

    10/02/2024 2:26 am

    జయ మోహన్ గారి కథలు ఆపకుండా చదివించడమే కాకుండా అంతరాల్లో ఒక సన్నని నూలుపోగు బంధం కథలతో ఏర్పడుతుంది. అవినేని గారి అనువాదం ఆపకుండా చదివించింది.

  10. అప్రకటిత యక్షగానం: రామదాసు చరిత్రం గురించి ఆళ్ళ వెంకట మంగపతి రావు అభిప్రాయం:

    10/02/2024 1:23 am

    మంచి పరిశోధన మరియు పరిష్కరణ.