పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16393

  1. కథకుడి అంతర్మథనం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    10/03/2024 1:51 pm

    >> ముళ్ళపూడి వారిని మించాడు…(డా. ఘండికోట గారు)

    మోహన్‌గారు రాసిన సమీక్ష సులభంగా, అర్ధమయ్యేలా చాలా బాగుంది కానీ ముళ్ళపూడి రాసిన సమీక్షలు, కధలు, కాకరకాయలు చదివిన ఎవరూ ఈ మాట అనలేరు. అమరావతి కధలకి ముళ్ళపూడి సమీక్ష రాసారు (ముందుమాట కూడా). అది మీరు చదవలేదు అనిపిస్తుంది మీరు ఇక్కడ రాసిన వ్యాఖ్య చూస్తే. ముఖ్యంగా మోహన్ గారంటే మీకు ఎంత అభిమానం ఉన్నా ఇక్కడ అసలు విషయం శ్యామ్‌గారి పుస్తకం. అది మీరు చదివారా? ఆ విషయం చెప్పి ఉంటే బాగుండేది. నేను మీ, మోహన్‌గారి, శ్యామ్‌గారి విద్వత్తుని వెక్కిరించడం లేదని గమనించగలరు. వ్యాఖ్యాత ఒక పుస్తకం గురించి ప్రస్తావిస్తే మీరు ఆ పుస్తకాన్ని వదిలేసి వ్యాఖ్యాత గురించి ప్రస్తావించారు. అదే నేను చెప్పదల్చుకున్నది.

  2. కాలుష్యాష్టకం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    10/03/2024 1:11 pm

    * ఏ. తె. కలుషితము తిరుపతి లడ్డూ
    కలుషితములు గోవులు, తిను దధిగ్రాసంబులున్
    కలుషితము కలుపు నేయి
    కలుషితములు ఏడుకొండలును మహి నీకలిలో

    * ఏ. తె. మనయాత్రలు కలుషితములు
    కలుషితమగు మనచేతలతో దేవుడి చేతులు
    గట్టిగ కట్టిన విడిపించుకుని
    వెంకన్న దైవమె జనుల గాపాడవలెన్

    *ఏ. తె – “ఏమో తెలియదు” అనే వృత్తం. ఆయన అష్టకం కలుషితం చేసి దశకం చేసినందుకు శ్యామలరావుగారికి క్షమాపణలతో. 🙂

  3. సంఘర్షణల పళ్ళచక్రం మధ్య నిలిచిన ‘అనుపమ’ గురించి ఎమ్వీ రామిరెడ్డి అభిప్రాయం:

    10/03/2024 12:43 pm

    ఇల్లిందల సరస్వతీదేవి గారి నవల ‘అనుపమ’ చదవలేకపోయిన లోటును తీర్చారు సుభద్రాదేవి గారు. ఆనాటి సామాజిక పరిస్థితుల్ని అవగాహన చేసుకోటానికి ఇలాంటి నవలలు ఉపకరిస్తాయి. సూక్ష్మంగా కథను వివరించటంతోపాటు పాత్రల గురించి అందించిన విశ్లేషణ బాగుంది. శీలా సుభద్రాదేవి గారికి అభినందన పూర్వక ధన్యవాదాలు.
    – ఎమ్వీ రామిరెడ్డి

  4. అప్రకటిత యక్షగానం: రామదాసు చరిత్రం గురించి D.V.N. మల్లికార్జున శర్మ అభిప్రాయం:

    10/03/2024 11:38 am

    శ్రీ భట్టు వెంకటరావు ఈ అరుదైన రచనను వెలుగులోకి తీసుకొని రావడం వెనుక ఎంతటి శ్రమ ఉండగలదో పరిశోధన రంగంలో కృషి చేసే వారికి బాగా తెలియగలదు. ఇటువంటి కళారూపాన్ని తెలుగు వారికి అందుబాటు లోకి తెచ్చిన వెంకటరావు గార్కి అభినందనలు . ప్రదర్శన యోగ్యమైన ఈ యక్షగానాన్ని తగిన కళాకారులకు చేరవేయడం, ప్రాచుర్యానికి తగు ప్రోత్సాహ సహకారాలను అందించగల సమర్ధత గల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సాంస్కృతిక శాఖలు చేయగలవని ఆశిస్తాను.

  5. అజ్ఞాతవాసి గురించి రమ అభిప్రాయం:

    10/03/2024 6:26 am

    విజ్జి పిన్ని! కొత్త గా భలే ఉంది కధ 😘.

  6. సత్సంగం గురించి v.srinivasa rao అభిప్రాయం:

    10/03/2024 1:38 am

    ఆహా’ ఎంత హాయిగా అనిపిస్తున్నదో చదివిన తరువాత. ధన్యవాదాలండీ.

  7. పరిపాకం గురించి v.srinivasa rao అభిప్రాయం:

    10/03/2024 1:28 am

    అద్భుతంగా, ఆచరణీయంగా ఉన్నది. ధన్యవాదాలు రచయితకు మరియు ఈమాటకు.

  8. పాత్రదానం గురించి V.Srinivaasaraavu. అభిప్రాయం:

    10/03/2024 1:04 am

    చాలా బావుంది, ధన్యవాదాలు.

  9. పంచేంద్రియాలు: 1. వాసన గురించి Srinivasa Rao .V అభిప్రాయం:

    10/03/2024 12:59 am

    వ్యాసం ఎంతో బావుంది. ఉపయోగకరం మరియు ఆనందకరం. రచయితకు, ఈమాటకు ధన్యవాదాలు.

  10. పంచేంద్రియాలు: 1. వాసన గురించి Srinivas అభిప్రాయం:

    10/03/2024 12:09 am

    Liked the clear scientific explanation of a difficult subject. In addition, telugu terminology used for the scientific terms is perfect and easy to understand. I read the word ‘shadabam’ for the first time. In text books I read “Anuvu” and “paramanuvu” words for molecule and atoms. But Banuvu usage is new.
    Interpretation of Upanishad’s sayings, in light of scientific knowledge, is interesting.

    I tahnk Sri Venkateswararao Garu for the article and EEMATA for publishing the same.

    Looking forward to many more such interesting articles.