కొన్నేళ్ళ పాటు ఆ కథ రాసింది ఎవరో, ఆ కథ పేరేమిటో ఏమీ గుర్తు లేదు. ఈ కథ నిజంగా గొప్ప కథేనా? ఏమో, నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ వనసంతర్పణం జరుగుతున్న ఆ తోటకెళ్ళి భోజనం చేస్తున్న బావగాణ్ణి ఒక్కసారి చూసుకోవాలనుంటుంది కళ్ళనిండా, ఈ రోజుకీ.

ఈ పులి వేటకన్నీ కలిసొచ్చాయి. ముందస్తుగా మిసెస్ పేకిల్‌టైడ్ తనకి పులిని చూపెట్టిన వారికి వెయ్యి రూపాయిల బహుమతి ప్రకటించింది. అదృష్టవశాత్తూ పక్కనే వున్న ఒక వూళ్ళో పెద్ద పులి తిరుగుతోందనీ, చాలా మేలు జాతి పులి అనీ, కొడితే అలాటి పులినే కొట్టాలనీ వదంతులు వినొచ్చాయి.

“ఎదిగిన కొడుకును కొట్టలేను. అందుకే నా భార్యను కొట్టాను. ఇదిగో చూడవే! ఈ పెళ్ళి జరగదు. కాదు కూడదు అని నా ఇష్టం లేకుండా జరిపించావంటే, ఆ తర్వాత నీవు నాతో కాపురం చేయడం కుదరదు. భర్త ప్రక్కన నిలబడితేనే ఆ భార్యకి గౌరవం. అర్థం అయ్యిందా?” విసవిసా వెళ్ళి పోయాడు గురుమూర్తి.

జీబ్రా క్రాసింగ్ వద్ద ఆగి లేదా కనీసం నెమ్మదిగా నడిపి పాదచారులను రోడ్డు దాటనివ్వాలనేది డ్రైవర్లు పాటించాల్సిన కనీస మర్యాద! కానీ ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. లెఖ్ఖ లేకుండా దూసుకు పోతున్నారు. వారికి అవసరం ఏముంది? అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, నియంత్రించడానికి ట్రాఫిక్ పోలీసులూ లేరు.

పూర్ణయ్యని బావగాడంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరమూ లేదు. పెళ్ళి గాని, పేరంటం గాని, వంట హంగంతా బావగాడే. వంటవాళ్ళని కూర్చోనిచ్చేవాడు […]

[రచ్చబండలో, 2006 జులై 31న వేలూరి వేంకటేశ్వర రావు వ్రాసిన టపా (సౌలభ్యం కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము.)] 006 ఏప్రిల్ నెలలో వెల్చేరు నారాయణ […]

నారాయణ రావు రోజుకో కవిత రాసేవాడని చెపితే మీరు నమ్మరు. రాజు, నేను ఆ కవిత చదవటం; ‘చెత్త, చింపెయ్యండి,’ అని అనడం మామూలు. నవ్యకవితలు కాకండా సంప్రదాయ కవిత్వం వల్లించినప్పుడు మాత్రం మాకు చిరాకేసేది; నిజం చెప్పొద్దూ! అవి మనకి అవసరం అని ఆయన ఆ రోజుల్లో అనేవాడు. ఇప్పుడు కదూ తెలిసింది అదెంత నిజమో!

ఆధునిక వర్ణచిత్రకళను సమూలంగా మార్చివేసిన క్యూబిౙమ్ పద్ధతికి ఆద్యులైన బ్రాక్, పికాసో ద్వయంలో ఒకరిగా, ఇరవయ్యవ శతాబ్ది మేటి చిత్రకారుల త్రయం, బ్రాక్, పికాసో, మథీస్‌లలో ఒకరిగా ప్రసిద్ధి కెక్కిన చిత్రకారుడు జ్యార్జ్య్ బ్రాక్. ఆ మహోన్నత చిత్రకారుడు బ్రాక్ గురించి ఎస్. వి. రామారావు వ్రాసిన వర్ణ చిత్ర సహిత సమగ్ర వ్యాసం; సుశ్రావ్య పద్యపాఠి జువ్వాడి గౌతమరావు గానం చేసిన రుక్మిణీ కళ్యాణం; బహుముఖ ప్రజ్ఞాశాలి, నటి, గాయని, క్రీడాకారిణి టి. జి. కమలాదేవి గురించి పరుచూరి శ్రీనివాస్ సంక్షిప్త వ్యాసం; సాహిత్య విమర్శకుడు, విశ్వనాథ పాండిత్య కరదీపిక, జువ్వాడి గౌతమరావు గారి గురించి రమణ జువ్వాడి పరిచయ వ్యాసం, వారి సాహిత్యధార నుంచి రెండు వ్యాసాలు; ఈ సంచికలో ప్రత్యేకం.


ఇంకా: వింజమూరి బాలమురళి, మూలా సుబ్రహ్మణ్యం, విన్నకోట రవిశంకర్, పాలపర్తి ఇంద్రాణి, ఆర్. శర్మ దంతుర్తి, జెజ్జాల కృష్ణ మోహన రావుల కవితలు; మాధవ్ మాౘవరం, గౌరి కృపానందన్‌, సాయి బ్రహ్మానందం గొర్తిల కథలు; జువ్వాడి గౌతమరావు, చీమలమర్రి బృందావనరావు, సురేశ్ కొలిచాల, వేలూరి వేంకటేశ్వర రావుల వ్యాసాలు, శీర్షికలు…

గూగోళ జ్ఞానంమన అనుభవాలను గుర్తుంచుకోవడం కోసం భాషలను పుట్టించుకొని, వ్రాయటం నేర్చుకొని సమాచారాన్ని పెంచుకోవడం పంచుకోవడమే మన లక్ష్యంగా, సమాచారమే మన ఉనికికి ప్రమాణంగా చేసుకున్నాం. సమాచార జీవితం యదార్థం గానూ, యదార్థ జీవితం సమాచారంగా మారడానికి పనికొచ్చే జ్ఞాపకంగా మాత్రమే మనం బ్రతుకుతున్నాం.

తిరగబడ్డ తొమ్మిదిఇప్పుడీ సంగతి నాకు కాక నీకొక్కడికే తెలుసు. ఇంకెవరికీ చెప్పకు! నువ్వు మర్చిపోకు! నువ్విందాక అన్నావే కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ బుర్రలు, వాటిని నడిపే మేధావులందర్నీ వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని లెక్కలేసుకోమను. కానీ ఇప్పుడు అర్థమయిందా మన లెక్కలన్నీ శుద్ధ తప్పని?

పద్దాలుగాడు తాగుబోతు. పచ్చి దొంగ. తాగినప్పుడు రంగిని చితక తంతాడు. రంగి ఒక్కత్తే కాదు; మరొక ఆడదానితో పోతాడు. అయినా రంగికి వాడంటే ఉన్న ఆకర్షణ ఏమిటో బోధపడలేదు. వాడు దొంగతనం చెయ్యడానికి సహాయం కూడా చేస్తుంది. వాడితో ఎన్ని అవస్థలు పడ్డా మళ్ళీ వాడి పక్కకే చేరటం నాకు నచ్చలేదు. రంగి మానసికస్థితి ఒక పట్టాన బోధపడలేదు.

స్వతహాగా సత్య వీరనారి. నరకుని లాంటి వీరునితో యుద్ధం చేసే అవకాశం వచ్చింది. ఆ ఉత్సాహం కొంత. తన పరాక్రమం భర్త ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు భర్త ముందు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆ ఆనందం కొంత. ఇటు శత్రువును చూస్తూ, అటు ప్రియుని చూస్తూ ఏకకాలంలో వీరాన్నీ, శృంగారాన్నీ ప్రదర్శిస్తున్నది.

రాజీ! నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని చీర మార్చుకుని రా. మన ప్లాను ప్రకారం సినిమాకి వెళ్తున్నాం. ఈ ఉంగరం సంగతి పూర్తిగా మర్చిపో. కాసేపట్లోనే ఉన్నట్లుండి కలగన్నట్లు ఎక్కడ పెట్టావో జ్ఞాపకం వస్తుంది. పోగొట్టుకున్న వస్తువును కని పెట్టడానికి ఇది ఒక దారి.

ఇంగ్లీషు పొయిట్రీ క్లాసు చెప్పే ఎస్.వి.ఎల్.ఎన్ గారి క్లాసులో పాఠం కంటే హస్కే ఎక్కువ. దీపావళికి ఎవరెవరో ఏం కాల్చారూ అని అడుగుతూ ఆయన చిన్నప్పటి సొంత గోల చెప్పడం మొదలు పెట్టాడు. మిగతా స్టూడెంట్లూ ఎవరికి తోచినవి వాళ్ళు మధ్య మధ్యలో చెబుతున్నారు. శీనుగాడు మాత్రం మౌనంగా ఉన్నాడు.