ఈమాట నవంబర్ 2012 సంచికకు స్వాగతం!


సీటెడ్ న్యూడ్ – బ్రాక్ (1906)

ఆధునిక వర్ణచిత్రకళను సమూలంగా మార్చివేసిన క్యూబిౙమ్ పద్ధతికి ఆద్యులైన బ్రాక్, పికాసో ద్వయంలో ఒకరిగా, ఇరవయ్యవ శతాబ్ది మేటి చిత్రకారుల త్రయం, బ్రాక్, పికాసో, మథీస్‌లలో ఒకరిగా ప్రసిద్ధి కెక్కిన చిత్రకారుడు జ్యార్జ్య్ బ్రాక్. ఆ మహోన్నత చిత్రకారుడు బ్రాక్ గురించి ఎస్. వి. రామారావు వ్రాసిన వర్ణ చిత్ర సహిత సమగ్ర వ్యాసం; సుశ్రావ్య పద్యపాఠి జువ్వాడి గౌతమరావు గానం చేసిన రుక్మిణీ కళ్యాణం; బహుముఖ ప్రజ్ఞాశాలి, నటి, గాయని, క్రీడాకారిణి టి. జి. కమలాదేవి గురించి పరుచూరి శ్రీనివాస్ సంక్షిప్త వ్యాసం; సాహిత్య విమర్శకుడు, విశ్వనాథ పాండిత్య కరదీపిక, జువ్వాడి గౌతమరావు గారి గురించి పరిచయ వ్యాసం, వారి సాహిత్యధార నుంచి రెండు వ్యాసాలు; ఈ సంచికలో ప్రత్యేకం.


ఈ సంచికలో: