ఫెళ ఫెళ ఉరుముల్తో టప టప చినుకుల్తో వాన
ఊరంతా ముంచేసే వాన కాలవలన్నీ ఉప్పెంగే వాన
పైర్లన్నింటినీ కళకళలాడించే వాన
నాలుగు నెలలుగా చూసినా రాని వాన
Category Archive: సంచికలు
కూటి కోసం నకిలీ తారలు
చిరంజీవులు మాధవీలు
రూపాయి దండల రెపరెపల్లో
రగిలిపోతే మొగలి పొదలు
ఏవి చేరాల్సిన చోటికి
వాటిని చేరుస్తూ కాలం
ఎగుడు దిగుళ్ళ రహదారి మీద
అలవోకగా పయనం సాగిస్తుంది
కాగితం గతం
కలం కళ్ళలో కదలాడే ఒక పురాజ్ఞాపకం
అంతరంగం
నిత్యం అలలతో ముందుకీ వెనక్కీ ఊగే
నిస్సహాయ సముద్రం.
మొట్టమొదటగా పికాసో చిత్రాలను చూచి సంభ్రమాశ్చర్యాలను పొందాడు బ్రాక్. తాను ఇంతవరకు చూడని క్రొత్త పద్ధతి, పికాసో యొక్క చిత్రకళా విధానం ఇతన్ని కలవరపరిచినై. తాను చేసే ఫావిౙమ్ పద్ధతితో ఇక లాభం లేదు, ఏదో మార్పు తేవాలి తన చిత్రాలలో అనుకున్నాడు. అందుకే ద్విగుణీకృత నిశ్చయంతో చిత్రాలను వెయ్యడం ప్రారంభించాడు.
ఎమర్జన్సీ సడలించిన తరువాత 1977లో గౌతమరావు లోక్‌సభకి జనతా పార్టీ నుండి పాత మిత్రుల ప్రోద్బలంతో బలవంతంగా పోటీ చేశారు. రాజకీయంగా ఆయనని ప్రభావితం చేసింది జయప్రకాశ్ నారాయణ్. ఆ ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన ఉపన్యాసం హృదయాన్ని కదిలించి వేసిందని ఎంతో మంది ఎన్నో ఏళ్ళు చెప్పుకోగా నేను విన్నాను.
ఆగస్టు నెలలో తెలుగుదేశం పలువురు ప్రముఖుల్ని కోల్పోయింది. అందరి గురించి తెలుగు పత్రికలు నిడివైన వార్తలనే అందించాయి, వారి వారి అభిమానులు, శిష్యులు ఘనంగా నివాళులర్పిస్తూ వివరంగానే వ్యాసాలు రాశారు, ఒక్క కమలా చంద్రబాబు గారి విషయంలో తప్ప.
దాదాపు 35,000 సంవత్సరాల క్రితమే చంద్రుని గమనాన్ని మానవుడు అర్థం చేసుకున్నాడనడానికి మనకు ఆధారాలున్నాయి. ఆఫ్రికాలో దొరికిన లెబోంబో ఎముకపై వరుసగా 29-గీతలు ఉండడం శాస్త్రజ్ఞులను ఆశ్చర్య పరిచింది. ఇది ఆ కాలంలో చంద్రుని గమనానికి, స్త్రీల ఋతుచక్రంలో రోజులను లెక్కించడానికి ఉపయోగించి ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల ఊహ.
వ్యవహార భాషావాదం పుట్టి నలభై యేళ్ళ పైచిలుకైనా ఆ వ్యవహారభాషంటో ఏమిటో, దాని సమగ్ర స్వరూపమేమిటో నిర్ణయించినవారెవరూ ఇంతవరకు లేరు. ఆంధ్ర కావ్యభాషకే సరి అయిన వ్యాకరణం మనకు ఇంతవరకూ లేదు. భాష యొక్క సమగ్రస్వరూపం నిర్ణయించడమనేది సుఖసుఖాల మీద తేలేపని కాదు. కావ్యభాష సంగతే ఇట్లా వుంటే దారీ తెన్నూ లేని వ్యావహారిక భాషను వ్యాకరించ బూనుకోవటం సంగతి వేరే చెప్పనక్కఱ లేదు.
ఈ తెలుగు దేశములో అసలు గ్రంథము చదువకనే, చక్కగా అధ్యయనము చేయకనే దానిని గూర్చి స్వేచ్ఛగా వ్రాయుటయో, మాట్లాడుటయో మిక్కిలిగా అలవాటు అయినది. ఈ రామాయణ కల్పవృక్షము సంస్కృత కావ్యమున కనువాదమనుట అటువంటి వానిలో నొకటి. అయినను దోషము లేదు. కాదు కనకనే కాదని చెప్పుట. కథారంభములోనే ఇది స్వతంత్ర్య కావ్యమని స్పష్టముగా దెలియును.
జువ్వాడి గౌతమరావు పద్యపఠనానికి సుప్రసిద్ధులు. వారు పఠించిన రుక్మిణీ కళ్యాణం పూర్తి పాఠం (ఇంట్లో పాడుతుండగా రికార్డు చేసినది,) జువ్వాడి రమణ గారి సౌజన్యంతో ఈమాట పాఠకులకు అందిస్తున్నాం.
2012 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ ఆవార్డ్లు ప్రకటించాము. వీటికి గాను ఆలూరి భుజంగరావు గారు, రామినేని లక్ష్మి తులసి ఎంపికైనారని చెప్పడానికి సంతోషిస్తున్నాము. ఈ ప్రకటనతో పాటు తులసి కవిత్వ తత్వాన్ని పాఠకులకు పరిచయం చేస్తున్నాము.
పొద్దున్నే ఎనిమిదయ్యింది. బల్లుల్లా రకరకాల సైజుల కారులు, పెద్దవీ, చిన్నవీ, బుల్లిబుల్లివీ! గోడమీద బల్లులు పురుగు కనిపించంగానే దబుక్కున దూకినట్టు ముందుకారు వెనకాతల కాస్త […]
పినాకపాణి గార్ని చూస్తే ఓ త్యాగరాజూ, ఓ దీక్షితారూ, ఓ శ్యామశాస్త్రీ – ఈ ముగ్గురి రూపం ఒక మనిషిని ఆవహించిందా అనిపిస్తుంది. సంగీత పాఠం చెప్పడంలో శిష్యులకుండాల్సిన శ్రద్ధ, జిజ్ఞాస కంటే వందరెట్లు ఎక్కువగా ఆయనలో కనిపిస్తుంది. అటువంటి వారి వద్ద నేర్చుకోవడం ఒక అదృష్టం. ఆయన వట్టి గురువు కాదు. గురువులకే గురువు.
కన్నయ్య, భార్య బుల్లెమ్మ, వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారిగా బుల్లెమ్మకి ఓ చీరె కొందామని వస్తారు. ఆ కొట్టు, ఆ లైట్ల హడావిడి చూడంగానే కన్నయ్యకి భయంవేస్తుంది, తనని బయటికి గెంటేస్తారేమోనని! భయపడుతూ భయపడుతూ ” మా ఆడోళ్ళకి చీరెలు కొనాలండి,” అంటాడు, కొట్లో గుమాస్తాతోటి, అదేదో తప్పుచేసిన వాడిలా!
వ్యక్తిగతంగానో, ఆయన రచనల ద్వారానో తెలిసినవారికే కాదు, ఈమాటకు మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికీ రోహిణీప్రసాద్ ఆకస్మిక మరణం ఒక పిడుగుపాటు. ఈమాటకు రోహిణీప్రసాద్ లేని లోటు ఇంకెవరూ, ఇంకెప్పటికీ పూడ్చలేనిది.
అమెరికా నించి కృష్ణమూర్తిగారు తిరిగి వచ్చిన తరవాత తెలుగుశాఖ వాళ్ళే ఆయనని తమ శాఖలో కలుపుకుని ఉంటే ఏమయి ఉండేది అన్న ప్రశ్న నన్నెప్పుడూ ఆలోచింపజేస్తూ ఉంటుంది. మొదటిది, పరిశోధనలో అంతర్జాతీయంగా ఒప్పుకున్న ప్రమాణాలు ఆయన తెలుగుశాఖలలో అమలులోకి తెచ్చేవారు.
సాహిత్య దంపతులు ఆర్. సుదర్శనం, ఆర్. వసుంధరాదేవి విశ్వనాథ సత్యనారాయణగారితో బహుశా పంతొమ్మిదొందల అరవైల చివరలో జరిపిన ఇష్టాగోష్టి ఇది. ఇందులో సాహిత్యం కన్నా ఎక్కువ వేదాంత పరమైన అంశాల మీదే చర్చ జరిగింది. కాని, వాటిపై విశ్వనాథ వారికి ఎంత లోతైన అవగాహన ఉన్నదో మనకు తెలుస్తుంది.
ఒకరు(లు) మరొకరు(లు)ని
కనుమరుగు చేసేస్తూ వ్యాపించే
అందమైన అబధ్ధం లాంటి నిజం పేరు
నాగరికత.