తమ అనుభవాలు ఆలోచనలు భావుకతతో బాధతో ఆవేశంతో ప్రేమతో పదిమందికీ పంచుకుందామనీ, సమాజానికి దిశానిర్దేశనం చేద్దామనీ, కవిగా గొప్ప పేరు తెచ్చుకుందామనీ ఎందరో ఉత్సాహపడుతుంటారు. కానీ వీరికి ఇప్పటిదాకా ఆచరణలో పెట్టగలిగే సూచనలిచ్చి వారిని ప్రోత్సహించే దిశగా ఏ ప్రయత్నమూ లేకపోవడం విచారకరం. సాహిత్యంపై తన అపోహలను బాహాటంగా ఒప్పుకుంటూ, వాటికి ప్రాయశ్చిత్తంగా కవి కావాలనుకునే వారు వెంటనే పాటించగలిగే సూచనలిస్తూ మాధవ్ మాౘవరం రాసిన బోధనాత్మక సోదాహరణ వ్యాసం కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు ఈ సంచికలో. ప్రాచుర్యంలో ఉన్న కొన్ని కవిత్వ పద్ధతులతో పాటుగా కవిత్వం నిజంగా ఏమిటి, కవి ఏర్పరచుకోవలసిన లక్షణాలు, కవిగా కొనసాగడం ఎలా? వంటి ఉపయుక్త అంశాలు కూడా ఈ వన్‌స్టార్ గైడ్ లాంటి వ్యాసంలో చర్చించబడ్డాయి.
ఈ సంచికలో:
- కవితలు: పునరుత్థానం – బివివి ప్రసాద్; రెండు కవితలు – మానస చామర్తి; విశాఖ వృక్షయాగం అక్టోబర్ 2014 – తఃతః; అనావిష్కృతం – విన్నకోట రవిశంకర్.
- కథలు: బంగార్రాజు ముద్దు – తాడికొండ శివకుమారశర్మ; భగవంతుడో సాక్షి – ఆర్ శర్మ దంతుర్తి; అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ఇండియా ప్రయాణం – శ్యామలాదేవి దశిగి.
- వ్యాసాలు: సాహిత్యావగాహన: మరొక దృక్పథం – వేలూరి వేంకటేశ్వర రావు; కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు – మాధవ్ మాౘవరం; ప్లూటో గ్రహచారం – వేమూరి వేంకటేశ్వరరావు; రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు – ఏల్చూరి మురళీధరరావు.
- ఇతరములు: నాకు నచ్చిన పద్యం: కార్తీక శివజ్యోత్స్న – భైరవభట్ల కామేశ్వరరావు పద్యసాహిత్య శీర్షిక; నా గురువు శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి – వేదుల సత్యనారాయణ శర్మ ప్రసంగం; వేమనపై కట్టమంచి – శబ్దతరంగాలు విభాగంలో పరుచూరి శ్రీనివాస్ సమర్పణలు.