గడినుడి-70 సమాధానాలు

అడ్డం

  1. అమృతవల్లి నాగసేనుల మధ్య బంధము
    సమాధానం: పులిమ్రుగ్గు
  2. చుక్క నిజం లేని కల్లబొల్లికబుర్లు
    సమాధానం: మిధ్యావాదము
  3. దిల్ రుబా! యితడడిగినది పానశాలలో నొక మధుపాత్ర!
    సమాధానం: రుబాయతు
  4. విభీషణుని భార్యను కాస్త కదిలించామా యుద్ధమే !
    సమాధానం: సమర
  5. స్త్రీలింగం పుంలింగం కాదు నాలుగవ లింగం
    సమాధానం: వాయులింగం
  6. రెండు మోక్షాలు గల కృష్ణుని కాలం
    సమాధానం: ద్వాపరము
  7. మన పని వ్రాసిన వాడు
    సమాధానం: విధి
  8. మంగళకరంగా పెళ్ళి మీకు జరగాలంటే ఈ జపం చేయాలి
    సమాధానం: కుజ
  9. నేర్పుగ నడిపే గుఱ్ఱం కలది
    సమాధానం: చతురంగ
  10. కోటికి పడగలెత్తితే నెత్తికెక్కదూ
    సమాధానం: కోటీరము
  11. 32 అడ్డు, 12, 62 నిలువులను చెక్కిన శిల్పి
    సమాధానం: జక్కన్న
  12. పైపైవి పోగా నీ చేతి లో మిగిలేది
    సమాధానం: నికరం
  13. తేనెపట్టు దీనికి ఇష్టం, దీని పట్టు మనకు కష్టం
    సమాధానం: భల్లుకం
  14. ఓర్పు గలిగిన వృక్ష మాత!
    సమాధానం: క్షమా
  15. ఇటు పిలిస్తే రాక్షసుడు. అటు పిలిస్తే దేవుడు
    సమాధానం: మురా
  16. తీక్ష్ణమైన ఎండ.. రోజు మొదటి భాగంలోనే
    సమాధానం: రౌద్రం
  17. పిల్లికి చచ్చు గింజలు కూడా వెయ్యని రకం ఇది
    సమాధానం: నాసి
  18. దీనిపై సవారు వమ్ము కాదు
    సమాధానం: వారువము
  19. న్యాయంగా సంస్కృతంలో ఇది నల్లని నల్లకలువ
    సమాధానం: నీలేందీవర
  20. ఆకాశంలో తిరిగేది
    సమాధానం: విహంగమ
  21. తరగతిలో గుంపు
    సమాధానం: తతి
  22. స్మృతికిణాంకము ఇతనిచే రాయబడినది
    సమాధానం: చేరా
  23. చెవులకు ఈ రవం శీధురసం. గడసామ్యం వల్ల కావచ్చు
    సమాధానం: వంశీ
  24. 33 నిలువు కొట్టేది
    సమాధానం: బుస
  25. చచ్చిన యజ్ఞపశువు
    సమాధానం: ప్రమీత
  26. చప్పరించిన ఆకు కెంత గుబులు
    సమాధానం: చీకాకు
  27. ప్రవహించే టోపీ
    సమాధానం: తపారు
  28. మనోజ్ఞమైన బండికర్ర
    సమాధానం: కూబరము
  29. చిత్రమైన బలము
    సమాధానం: శబలము
  30. ఇటైతే తగ్గడం. అటైతే సున్నా.
    సమాధానం: డిగు
  31. మూడు గంటలు
    సమాధానం: జాము
  32. రూపాయి నాణెం బరువు ఉన్న రూపాయి నాణెం ఆకారం
    సమాధానం: వర్తులము
  33. చివరకి శ్మశానంలో పోటీ చేస్తాడా ఈ పౌరుషవంతుడు!”
    సమాధానం: పంతకాడు
  34. ఈ గీతాలు మనసులో తిరుగుతూనే ఉంటాయి.
    సమాధానం: భ్రమర
  35. అడ్డంగా బోయేవి
    సమాధానం: తిర్యక్కులు
  36. ఠా! అంటూ చెల్లాచెదరైన నగ ఆనుపాను గంటిరా ఎవరైనా?
    సమాధానం: ఠాకంరణంభ
  37. అనుపమానమైన యుద్ధంలో ఓడినా యితడు జయుడే!
    సమాధానం: రావణుడు

నిలువు

  1. నగరంలో ఉండడమా? గతంలోనే ఉండిపోవడమా?
    సమాధానం: పురావాసం
  2. దొంగిలించు
    సమాధానం: మ్రుచ్చిలించు
  3. ఆసకలిగిన ఆలోచన
    సమాధానం: ధ్యాస
  4. ఈయన రీతి ఇంతింతై కావ్యజగత్తంతా నిండింది.
    సమాధానం: వామనుడు
  5. కొంచెం వెల
    సమాధానం: దర
  6. ఈ పట్టుపడితే దేవుడైనా దిగిరావాలి .. సింబాలిగ్గా
    సమాధానం: బాసింపట్టు
  7. అంచు తగిలినా చావే
    సమాధానం: తుదిముట్టు
  8. 32 అడ్డుతో సలసల మరిగేది
    సమాధానం: రుధిరం
  9. ఇరువైపులా సాగిన బొమముడి
    సమాధానం: భ్రూకుటీ
  10. పాచి
    సమాధానం: వితున్నము
  11. గద్దర్ గారితో కాస్త జాగ్రత్త
    సమాధానం: జరభద్రం
  12. చిక్కినా అందమే …నమ్మా!
    సమాధానం: చక్క
  13. బంగారపు నిగనిగలకు పుట్టిల్లు
    సమాధానం: గని
  14. కొబ్బరి తురిమేందుకు మేమడగం!
    సమాధానం: కోరం
  15. అది తిరుగుతూనే ఉంటుంది. మన కాలి నంటిందా మనం తిరగలేం.
    సమాధానం: ముల్లు
  16. ఈ వైపు గాలి సోకితే చేయ్యాడదు కాలాడదు
    సమాధానం: పక్షవాతము
  17. న్యాయంగా సంస్కృతంలో అందరికీ వెలుగు పంచుతుంది
    సమాధానం: కరదీపికా
  18. కసిగా విజృంభించి చంపు
    సమాధానం: కసిమసగు
  19. లక్ష్మి ఆక్రందన రామునికి తెలిపిన హనుమ
    సమాధానం: మారుతి
  20. ద్విరేఫాల మధ్యలో నీ అడ్డేమిట్రా. వచ్చేవాటిని ఆపకురా.
    సమాధానం: రానీరా
  21. ఇది పెద్దన రకము
    సమాధానం: రౌరవం
  22. తెలుగు ప్రాచీనతను మోసిన పాము
    సమాధానం: నాగబు
  23. చేతిలోనే ఏకంగా పాఠశాల
    సమాధానం: చేతబడి
  24. వేడెక్కని బుర్ర కలది
    సమాధానం: శీతలము
  25. మీకు కూడా చిన్నగా
    సమాధానం: మీకూ
  26. నెత్తురు తోడిది
    సమాధానం: చీము
  27. ఇక్ష్వాకు శాఖలో మొలిచిన వాడే
    సమాధానం: కుశ
  28. పాతాళములోని ఒక జీవి
    సమాధానం: పాము
  29. కురచైన చోళ్ళు కాలుతున్నాయి
    సమాధానం: రగులు
  30. సంతలో జాగ్రత్త పడిపోగలవు
    సమాధానం: బజారు
  31. దేవతల పిలుపు కర్దముని వలపు
    సమాధానం: దేవహూతి
  32. జలుబు మొదలైనట్టి నాసిక అనిపించే మేఘం
    సమాధానం: జలముక్కు
  33. లోన ఇష్టం ఉంది కానీ సందేహము
    సమాధానం: అరమర
  34. కృష్ణుడిచ్చిన మాట విన్న చెవి ఈమె. కృష్ణుడిని నానా మాటలు అన్న నోరు ఈమె శిశువుది.
    సమాధానం: శ్రుతశ్రవ
  35. అనధికార జాతీయక్రీడ అంత చెడ్డదేం కాదు
    సమాధానం: చెడుగుడు
  36. పై పసుపు పొర తీసేసిన కాకిబంగారం
    సమాధానం: భ్రకం
  37. కారణంలో చెడు లేకపోతే ఇది వీరునికి ధర్మమే
    సమాధానం: రణం