అడ్డం
- ఈశానదిక్కున ఉన్నదుర్గాదేవి (5)
సమాధానం: అపరాజిత - సుదర్శన్ పట్నాయక్‌కు కావల్సిన ముడిసరుకు (3)
సమాధానం: ఇసుక - అనుగ్రహించు కృప ప్రతీక్షణము (4)
సమాధానం: దయచూపు - సందేహములో పడ్డ యుగము (4)
సమాధానం: ద్వాపరము - ఇది లేని ఇల్లుండదు (3)
సమాధానం: పునాది - క్షురకుడైనా క్షత్రియుడైనా ఇది చేత ధరించాలి (2)
సమాధానం: కత్తి - పద్యానికి ఉండాల్సింది (2)
సమాధానం: యతి - పావడలో అక్షరం లోపించి చివరికి జత కూడి పెళ్ళయిన అమ్మాయి అయింది (4)
సమాధానం: పరిణీత - గుర్రాలు చివర అశ్వశాలలో ఉండే దున్నపోతు (4)
సమాధానం: లులాయము - కూచిపూడి నృత్య విశేషం (5)
సమాధానం: భామాకలాపం - నొప్పి కలిగించేవి చెట్లకి కాసేవికావు (5)
సమాధానం: లెంపకాయలు - రోగంతో పక్షులు చేసే ధ్వనా? కాదు పాము (4)
సమాధానం: నలికీచు - ఖజానా రహస్యం (3)
సమాధానం: బండారం - పాతాళభైరవిలో సాహసం చేసే రామారావు భక్తుడు (3)
సమాధానం: డింగరి - పరిచారిక కుటుంబంలోని పిల్లా? (4)
సమాధానం: ఇంటిపాప - దృష్టిదోషం పోవాలంటే చేసేది ఎందుకూ పనికిరానిది (5)
సమాధానం: దిగదుడుపు - కల్పవృక్షము-ధాన్యవిశేషము (5)
సమాధానం: పారిజాతము - తిరిగి వగను కనపడేలా చేసే ఆ జంట (4)
సమాధానం: కనుగవ - తుమ్మెదకి దొరికే భిక్షాన్నం (4)
సమాధానం: మధుకరం - పద్యానికి 11అడ్డం ఎంతో ఇదీఅంతే (2)
సమాధానం: ప్రాస - బుడ్డి సీతాపతి సావాసంతో మొదలైంది (2)
సమాధానం: సీసా - కోర్టువారు పిలిచిన రోజు వెళ్తే అప్పు సులభంగా తీర్చే పద్ధతి తెలుస్తుంది (3)
సమాధానం: వాయిదా - మంట తలకెక్కేది ఇక్కడినుండే (4)
సమాధానం: అరికాలు - నీళ్ళమధ్య పోటు చివర చేరితే పుట్టుమచ్చ పుడుతుంది (4)
సమాధానం: జటులము - కోతి, కప్ప, తేలు అడపాదడపా పడే కష్టాలు (3)
సమాధానం: తిలలు - లేతవయస్సు మగపిల్లలకి వచ్చేది ఋషికి కూడా ఉంటుందా? (5)
సమాధానం: మునిమీసము
నిలువు
- అన్న కాపరి వేషంలో ఉన్నా ఎవరికీ కీడు తలపెట్టడు (5)
సమాధానం: అనపకారి - తలతెగిన పరితాపంలో జనసమ్మర్దము (3) [-
సమాధానం: రాటము - బ్రహ్మచారి రహస్యం తిరగబడి కవాటంలో దాక్కుంది (6)
సమాధానం: తడుపుదాలుపు - అడవిపందికీ ఊరపందికీ పుట్టిన జంతువు వల్ల కలిగే నిర్బంధం (3)
సమాధానం: ఇబ్బంది - తీరములు నమిలే శబ్దం (4)
సమాధానం: కరకర - రావణుడిభార్య అర్థభాగంలో గట్టు (2)
సమాధానం: దరి - తేలిక జాడ (3)
సమాధానం: చూచాయ - ఆ తొమ్మిది తర్వాత వచ్చే అల్లుడు (3)
సమాధానం: జామాత - కూతురు నదిగా మారి పదిహేను రోజులకొకమారు వస్తుంది (3)
సమాధానం: తదియ - పార్వతి సూర్యుడి కూతురు? (3)
సమాధానం: యమున - పాము మరక మధ్యలో ఉంటే ఆకర్షించడు (5)
సమాధానం: లాగడాగుడు - తగువులుకీ తంటాలుకీ వచ్చి సహాయపడేవాడు వెనకే ఉంటాడు (3)
సమాధానం: వకీలు - వాకిటి క్రింది భాగం తలకిందులై మార్గం చివర పాము ప్రత్యక్షమైంది (5)
సమాధానం: పడగదారి - కోమటి మొహాన ఉన్నది తిరిగి మనమొహాన కూడా లేస్తుంది (3)
సమాధానం: మొటిమ - 10అడ్డానికి ఇదుండాలి (3)
సమాధానం: పదును - మహాసిద్ధులలో ఒకటి గొప్పతనము కలది (3)
సమాధానం: గరిమ - దండితనములో అప్పుడప్పుడు కనిపించేది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కాబోలు (3)
సమాధానం: దంతము - సారా తడి వస్తువు (6)
సమాధానం: ద్రవపదార్థము - ఎల్లప్పుడూ స్వప్న సమయమేనా? (5)
సమాధానం: కలకాలము - గడ్డ మధ్య మద్యం ఉంటే శ్రీకృష్ణుడు (4)
సమాధానం: కంసారాతి - చదరంగములోశకటము సరాసరి (3)
సమాధానం: సగటు - వాహనములు అప్పుడప్పుడు ఇలా తడుస్తాయి (3)
సమాధానం: వానలు - బంగ్లాదేశ్ లో జనతాపార్టీ (3)
సమాధానం: అవామీ - హృదయంలేని సహాయం చేస్తే సగం మిగులుతుంది (2)
సమాధానం: సాము