రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

కుందాపన: చిన్నోడి అమ్మ

రచన: రవి వీరెల్లి
డిసెంబర్ 2017

ఖాళీ అయిన కేరింతల మూటలు విప్పుకుంటూ
బావురుమంటున్న ఇంటి ముందు
లోకంలోని ఎదురుచూపునంతా
కుప్పబోసి కూర్చుంటుందామె.

పసుపు పచ్చని సీతాకోక చిలుక
పంచప్రాణాలని మోసుకొచ్చే వేళయింది.
పాలపుంతల నిడివి కొలిచొచ్చినంత గర్వంగా
విచ్చుకున్న రెప్పల్లోంచి వ్యోమగామిలా దిగుతాడు వాడు.

ఏళ్ళ ఎదురుచూపులు
ఆత్మల ఆలింగనంలో
చివరి ఘట్టాన్ని పూర్తిచేసుకుని
పలకరింతల పులకరింతలు ఇచ్చిపుచ్చుకుంటాయి.

ఊరేగిస్తున్న దేవుని పల్లకి
భక్తుల భుజాలు మారినంత పవిత్రంగా
పుస్తకాల సంచి భుజాలు మారుతుందప్పుడు.

నాలుక రంగు చూడకుండానే
ఏ ఐస్క్రీమ్ బార్ తిన్నాడో
పసిగట్టే ఆమె కళ్ళు
లంచ్ బ్యాగు బరువు అంచనా వేసి తృప్తిగా నవ్వుకుంటాయి.

వాడు ఏ దార్లో పాదం మోపుతాడో తెలీక
రోడ్డుకీ ఇంటికీ ఉన్న ఆమాత్రం దూరం
లెక్కలేనన్ని దార్లుగా చీలి ఆహ్వానిస్తుంది.

ఆమె వెనకాలే వస్తూ వస్తూ
తలలెత్తి చూస్తున్న గడ్డిని ఓసారి పుణికి
చెట్టుమీని పిట్టగూట్లో గుడ్ల లెక్క సరిచూసుకుని
ముంగిట్లో కొమ్మకు అప్పుడే పుట్టిన గులాబీకి ముద్దుపేరొకటి పెట్టి
నిట్టాడి లేని దిక్కుల గోడలమీద
ఇంత మబ్బు ఎలా నుంచుందబ్బా అనుకుంటూ
అటు ఇటు చూస్తాడు.

అంతలోనే
పొద్దున్నే వాణ్ని వెంబడించి ఓడిపోయిన
తుమ్మెదొకటి
కొత్త పూలను పరిచయం చేస్తా రమ్మని
ఝూమ్మని వానిచుట్టూ చక్కర్లు కొడుతుంది.

పసిపిల్లల చుట్టే తుమ్మెదలెందుకు తిరుగుతాయోనని
ఆమె ఎప్పట్లాగే ముక్కున మురిపెంగా వేలేసుకుని
వాణ్ని ఇంట్లోకి పిలుస్తుంది.

పొద్దున్న ఆమె అందంగా రిబ్బన్ ముడి వేసి కట్టిన లేసులు
వాడు హడావిడిగా విప్పి
చెవులు పట్టి సున్నితంగా కుందేళ్ళను తెచ్చినట్టు
అరుగు మీద విప్పిన బూట్లను ఇంట్లోకి తెస్తాడు.

దాగుడుమూత లాడుతూ
బీరువాలో దాక్కున్న పిల్లోనిలా
ఇంట్లో ఉన్న ఆటబొమ్మలన్నీ
వాడి పాదాల సడి కోసం
చెవులు రిక్కించి వింటుంటాయి.

పువ్వుమీద తుమ్మెద లాండ్ అయినంత సున్నితంగా
వాడు ఆమె వొళ్ళో వాలిపోయి
కరిగించి కళ్ళ నిండా పట్టి మోసుకొచ్చిన క్షణాల్ని
జాగ్రత్తగా
ఆమె కాళ్ళ ముందు పోసి పూసగుచ్చుతాడు.

ఆమె ఎప్పుడో నేర్చుకుని మరిచిపోయిన
కొన్ని బతుకు పాఠాల్ని
మళ్ళీ ఆమెకు నేర్పుతాడు.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • కలయిక
  • కుందాపన: కప్పతల్లి
  • ఆత్మ ఘోష
  • కుందాపన: దిగులు పువ్వు
  • కుందాపన: Solitary

ఇటువంటివే…

  1. కుందాపన: దిగులు పువ్వు
  2. కుందాపన: Solitary
  3. కుందాపన: కప్పతల్లి
  4. కుందాపన: రాత్రికి లోకువై
  5. ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి

డిసెంబర్ 2017 సంచికలో ...

  • Indian groceries
  • అందీ అందని కావేరీ సంగమం…
  • ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి
  • ఒక అంతర్ముఖుని బహుముఖ రూపాలు
  • కల కాని వేళ తను
  • కుందాపన: Solitary
  • కుందాపన: కప్పతల్లి
  • కుందాపన: చిన్నోడి అమ్మ
  • కుందాపన: దిగులు పువ్వు
  • కుందాపన: రాత్రికి లోకువై
  • కూచిపూడి పదం–భుజంగరాయ శర్మ
  • గడి నుడి – 14
  • గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4
  • టోరాబోరా వంటమనిషి
  • డిసెంబర్ 2017
  • తెరచాటు-వులు: 11. జాటర్ డమాల్! (అంటే అర్థం లేదు అని అర్థం)
  • దర్శకుడు బి. ఎన్. రెడ్డితో ముఖాముఖీ
  • నాకు నచ్చిన పద్యం: చూపులు కలిసిన శుభవేళ
  • నాపై కథ రాస్తావా?
  • నేను లేని ప్రపంచం
  • పర పరాగ్ ​- 1970​
  • వో షామ్ కుచ్ అజీబ్ థీ…
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 12
  • సడి లేని సంభాషణలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కుందాపన: Solitary
కుందాపన: కప్పతల్లి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.