Match

రేయిలో వాలిపోయే ప్రియమైన మనుషులు పారిపోయినపుడూ కాదు.
రేయి నిద్రను వెలేసినపుడూ కాదు.

బయలుదేరిన బస్సుకిటికీని వేలాడుతూ వచ్చే చంద్రుడు వెక్కిరిస్తున్నప్పుడూ కాదు.

తిరిగి వెళ్ళిపోతూ
మనం నవ్వుకోనపుడో నేను కనీసం వెనక్కి తిరగనందుకు సీట్లో కూచుని సచ్చిపోతున్నపుడో పుట్టిందంతా ప్రేమే.

అంతా ప్రేమే
నువ్విచ్చినవన్నీ వద్దన్నందుకు
నా నిద్రమీద మంటేసి ఎండుచేపలు ఆరేసిన చీర కాల్చిన చప్పుడు గుండెల్లోకి తన్నుతున్నావు చూడూ అంతా అదంతా ప్రేమే.

బంక ఒంటి లంకదానా
నిన్ను వొద్దన్న నా నిద్ర వెలితి నిండా నిండుకున్నదీ ప్రేమే.


కాశి రాజు

రచయిత కాశి రాజు గురించి: పీజీ ఇన్ రూరల్ డెవలప్‍మెంట్, భూమధ్యరేఖ (కవిత్వం ), 2014. ...