రాత్రి

మెలకువ అంటే
నేను దగ్గరకంటూ జరగడం, నువ్వు నిండా కప్పుకోవడం మాత్రమే.
కళ్ళు తెరవడం కాదని ఒళ్ళుకైతే తెలీదు.

నిద్రపోవడం అంటే
వాంఛలు ఆరిపోయే వాయిదాలాంటి నీ ముద్దు.
కళ్ళు మూయడం కాదని చీకటికైతే తెలుసు.

రాత్రంటే నువ్వూనేనేనని
తెలిసీ తెలీకపోవడం.


కాశి రాజు

రచయిత కాశి రాజు గురించి: పీజీ ఇన్ రూరల్ డెవలప్‍మెంట్, భూమధ్యరేఖ (కవిత్వం ), 2014. ...