Question

సూరీడు మంచునీ
మంచు చెట్లనీ కప్పుకునుంటే
ఇంకా తెల్లారనట్టు మోసపోయాను.

పడవపువ్వుల్ని కుట్టుకుని
నది
ఇసకంచు చీర చుట్టేసుకుంది.
వొట్టి రెల్లుగడ్డి బీడుల్ని మాత్రమే
నన్ను తీసుకోమంది.

కాళ్ళు తడిపేవన్నీ నీళ్ళనుకుని
ఇంకా తడుద్దామని దేహాన్ని మొత్తమూ
ముంచుతున్నాను.

ఈతరాదని ఎవరు గుర్తుచేస్తారు నాకు?


కాశి రాజు

రచయిత కాశి రాజు గురించి: పీజీ ఇన్ రూరల్ డెవలప్‍మెంట్, భూమధ్యరేఖ (కవిత్వం ), 2014. ...