కొలత

పెరిగిన గడ్డం, పెదాలకి అడ్డొచ్చే మీసం
పెద్దగా ఇబ్బంది పెట్టవు.
అంటుకున్న ఎంగిలి అద్దంలో చూసుకున్నాకయితే
ఒకప్పుడు చేత్తో తుడిచిన మనుషుల్ని ఎలా వెతుక్కోవాలి మరి?

ఇలా బాగున్నావని
ఎవరన్నా అంటే
అలా అన్నది ఎన్నో మనిషో లెక్కెట్టుకు తీరతావు, గడ్డమూ గీసుకోవు.
ప్రేమ
కొలవగలిగేది మరి.


కాశి రాజు

రచయిత కాశి రాజు గురించి: పీజీ ఇన్ రూరల్ డెవలప్‍మెంట్, భూమధ్యరేఖ (కవిత్వం ), 2014. ...