పల్లవి:
వానా నువ్వెంత జాణవే
జలజల రాగాల జలవీణవే!
జలజల రాగాల జలవీణవే!
అనుపల్లవి:
భూమిగుండెలో కరిగి
మండుటెండలో మరిగి
తిరిగి నింగికెగసి మెరిసే
మబ్బుదండల రాలుపూతవే |వానా|
మండుటెండలో మరిగి
తిరిగి నింగికెగసి మెరిసే
మబ్బుదండల రాలుపూతవే |వానా|
చరణం:
మెరుపుచీర చుట్టుకుని
ఉరుముగజ్జె కట్టుకుని
మొయిలుగట్లు దాటుకుని
నీటిపూలు చల్లేవటే
పచ్చిక పసరువై మట్టికి ఉసురిచ్చేవటే
పంటచేను ఒంటికి చినుకు లాల పోసేవటే |వానా|
ఉరుముగజ్జె కట్టుకుని
మొయిలుగట్లు దాటుకుని
నీటిపూలు చల్లేవటే
పచ్చిక పసరువై మట్టికి ఉసురిచ్చేవటే
పంటచేను ఒంటికి చినుకు లాల పోసేవటే |వానా|
అనుచరణం:
గగనపు నీళ్ళ జల్లెడ వెంట
వెండి నీరెండ నిండ
విల్లై విరిసిన ఏడురంగుల పంట
నీ మాయ కాదటే |వానా|
వెండి నీరెండ నిండ
విల్లై విరిసిన ఏడురంగుల పంట
నీ మాయ కాదటే |వానా|
చరణం:
మా ఇంటిచూరు నీటితీగవే
ఏటిపాయ మీద తేట నురగవే
కొండవాగు కొత్తనడకవే
బండరాళ్ళకూ ఎండుటాకుకూ
గడ్డిపూలకూ లేతచిగురుకూ
ముద్దులిచ్చి పొయేవటే |వానా|
ఏటిపాయ మీద తేట నురగవే
కొండవాగు కొత్తనడకవే
బండరాళ్ళకూ ఎండుటాకుకూ
గడ్డిపూలకూ లేతచిగురుకూ
ముద్దులిచ్చి పొయేవటే |వానా|
అనుచరణం:
ఆకుచెంపపై మెరిసి
సోకు వనమంతా తడిపి
వయసంతా వరదై వాగల్లే ఉరికేవటే
నింగినుంచి నేలకు దూరాలు కొలిచేవటే |వానా|
సోకు వనమంతా తడిపి
వయసంతా వరదై వాగల్లే ఉరికేవటే
నింగినుంచి నేలకు దూరాలు కొలిచేవటే |వానా|