పత్రికా రచయితలందరూ మడికట్టుకున్న మహానుభావులని, నిస్స్వార్థపరులనీ, దుడుకుగా, రుజువులు లేకుండా ఎప్పుడూ రాయరనీ అనుకోవడం వ్యామోహమే! పత్రికలన్నీ వర్గరాజకీయాలకి (ఆంధ్రదేశంలో అయితే కులమత రాజకీయాలకి కూడా!) అతీతం అని అమాయకుడు కూడా నమ్మడు.
ఈమాట జులై 2008 సంచిక విడుదల!
ఈమాట జులై 2008 సంచికకు స్వాగతం. ఈ సంచికలో శబ్ద తరంగాలు శీర్షికలో భద్రిరాజు కృష్ణమూర్తి, ఆరుద్ర తో ఇంటర్వ్యూ, సి. మృణాళిని గారి ఉపన్యాసం. జె.యు.బి.వి. ప్రసాద్, సాయి బ్రహ్మానందం గొర్తి, శర్మ దంతుర్తి గార్ల కథలు. ఇంకా వ్యాసాలు, కవితలు, ఇతర ఆకర్షణలు.
సామాజిక నవలల్లో కథనా శిల్పం అన్న అంశంపై డా. మృణాళిని గారు కాలిఫోర్నియా లో చేసిన ప్రసంగం నిడివి: షుమారు 90 నిమిషాలు (54.5 […]
అవగాహనశక్తి పరభాషలో కన్నా సొంతభాషలో సులభంగా సాధ్యమౌతుంది. సొంతభాషకు వ్యాకరణం నేర్చుకునే అవసరం ఉండదు; ఇంగీషువ్యాకరణం నేర్చుకోటం కష్టంకాబట్టి అవగాహన చేసుకోకుండానే బట్టీపెట్టే అలవాటు పిల్లలలో ఎక్కువగా కనిస్తుంది.
నమశ్శివాయ గారి ప్రసంగంతో పాటు శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన పద్యాలూ వినండి.
శ్రీశ్రీలో శిల్పం తప్ప మరేమీ లేదు. నారాయణబాబులో శిల్పం లేకపోవడమే ఒక గొప్ప శిల్పం అన్న ఆరుద్ర అభిప్రాయాలు ఆయన మాటల్లోనే వినండి
భద్రిరాజు కృష్ణమూర్తి గారితో సుమనస్పతి (ఆకాశవాణి) ఇంటర్యూ
నా నమ్మకం ఒక్కటే ! మనిషిగా పుట్టడం ఒక అదృష్టం. మనం మనకోసమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసమూ బ్రతకాలి. అప్పుడే మన జీవితానికి విలువ. ఇదే నా బిలీఫ్!
ఇంతలోపే ఆ కాగితం మా అయ్య దగ్గరికి ఎగిరొచ్చి, ఆగక అక్కడినుంచీ, మోపులు కడుతున్న నాదగ్గరకొచ్చింది. ఆ కాగితాన్ని చూడగానే, పట్టుకోవాలనిపించింది.
ఐతే, ఈ వర్ణనలో ఎక్కడా పర్యాటక దృష్టి కనబరచకుండా, కవి తనకై కలిగిన అనుభూతిని, ఆలోచనని, తన్మయత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.
ఎన్ని మార్లు విన్నానో
పాటలాటి ఈ మాటల
నెన్ని మార్లు చూచానో
రసవత్తర దృశ్యాన్ని,
మానసికమైన వృద్ధాప్యం సోకకుండా కాలం గడిపేవారిలో ఒక లక్షణం కనబడుతుంది; వారు బాహ్యప్రేరణలకు పాజిటివ్‌గా స్పందిస్తూ ఉంటారు. ఎప్పుడో పంకజ్ మల్లిక్ తదితరుల ప్రభావంతో మొదలైన రజనీగారి సంగీతప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
తను ఎంచుకున్న దారి తప్పైనా ఒక ఆదర్శం కోసం ఎంచుకున్నట్టుగా హీరో యొక్క సామాజిక విలువల్ని చూపి హీరోయిజాన్ని నిలబెట్టాడన్నమాట. అంతేకాక ముగింపుని అలా ప్రేక్షకుల ఆలోచనకే వదిలేసి, హీరో స్థాయిని నిలబెట్టాడు.
ఆ వంట వాసనలకి స్వర్గం ఇంట్లో, ముఖ్యంగా వంటిట్లోనే వుందని నమ్మాడు సుబ్బారావు. “ఏంటోయి ఇవాళ వంట?” అని అడిగాడు హాస్యంగా, అన్నీ కనబడుతూ వున్నా.
ధనమదాంధుల కొలువేల తాపసులకు? అన్నాడు పోతన. తాపసులకేనా? సాధారణ జనులకు మాత్రం ఎందుకు?
కలుసుకోవాలనుంటుంది
రక్తనాళాల గజిబిజి దారుల్లో
తప్పిపోయిన ఒక రక్తపుబొట్టుని
ఆ క్షణం నాకు
నా చుట్టూ నేను కట్టుకున్న
గోడల గుర్తుకూడా వుండదు
కదలని పెదవుల తొణికిసలాటలో
సరిగమల్ని సరిదిద్దుకుంటూ
మగత మగత నిద్రలో జోగుతున్న కోటిగాడు గబుక్కున లేచి కూర్చున్నాడు ‘కొట్టకండి, కొట్టకండి, అమ్మా నన్ను కొట్టడానికి మళ్ళీ ఒచ్చేరే, నేనేం చేసేనే?వద్దని చెప్పవే’ అంటూ…
సెన్సారుషిప్పు సంగతి దేవుడెరుగు, వాటిపై గూండాలదాడి జరుగుతుంటే చిద్విలాసపు చిరునవ్వుల్లో అంతా ఈశ్వరేచ్చ అనే ప్రభుత్వాన్ని చూస్తే ఏ ప్రజాస్వామ్యికవాది గుండెలుప్పొంగవూ?
కవిత్వభాషకీ, వ్యావహారిక భాషకీ మధ్యనున్న తేడాలు, భాషలో ఉన్న వివిధ ప్రత్యేకాంశాలు కవిత్వంలో సాధించే ప్రయోజనము గూర్చి యీ వ్యాసంలో నాకు తెలిసినంతలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.