ప్రతిభ యనగా నేమి? అపూర్వవస్తు నిర్మాణ దక్షమైన ప్రజ్ఞయే ప్రతిభ యని అభినవగుప్తుని అభిప్రాయము. ఎప్పటికప్పుడు నవనవముగా వికసించు బుద్ధియే ప్రతిభ, దాని కాశ్రితుడై నిపుణమైన వర్ణనలు చేసేవాడే కవియని భామహుడను ఆలంకారికుడు ప్రతిభను నిర్వచించెను. ప్రతిభయే కవిని అకవి నుండి వేఱుచేసే లక్షణం.
Category Archive: వ్యాసాలు
ప్రాచ్యంలో కవులు సాధారణంగా ఆధ్యాత్మిక ఆర్తిని సూచించడానికి రతిని వర్ణిస్తారు. పరమాత్మను స్త్రీగా (ఉమర్ ఖయ్యామ్), పురుషుడిగా (సూరదాసు, క్షేత్రయ) భావించి కవిత చెప్పారు. ఈ రతి ఎలియట్‍లో విరతిగా కావ్యవస్తువు అయింది. అంటే, లైంగికవాంఛ, దాని సాఫల్యము ఎలియట్ కవితలలో అభావరూపంలో ఉంటుంది.
ఎంతో గొప్ప నవలలు రాసిన జేన్ ఆస్టిన్, ఎమిలీ బ్రాంటీ, షార్లెట్ బ్రాంటీ, జార్జి ఎలియట్, ఎలిజబెత్ గాస్కెల్ వంటివారు ప్రణయానికి తమ నవలల్లో పెద్దపీట వేశారు. కానీ ఈ రష్యన్ అక్కచెల్లెళ్ళు మాత్రం సమాజంలో తమ స్థానానికీ, ఎదుగుదలకూ పోరాడే స్త్రీ పాత్రలనే సృష్టించారు.
ఆధునిక వర్ణనాత్మక భాషశాస్త్రజ్ఞుల వలె సూత్రాలను ఉదాహరణలతో అతి తక్కువ పారిభాషిక పదాలతో తన వ్యాకరణాన్ని 191 పద్యాలతో రాసిన కేతన తొలి తెలుగు వ్యాకర్త. సంస్కృత సంప్రదాయంలో పాణినీయ పరిభాషకు భిన్నంగా తేలికైన మాటలతో రాసిన మొట్టమొదటి తెలుగు వ్యాకరణం. అందరూ చదవదగ్గది, చదివి ఆలోచించదగ్గదీను!
స్త్రీపురుష సంబంధాల్లో భావోద్వేగాల కంటే ఇంగితజ్ఞానానికి, ప్రణయవేగం కంటే పరస్పరగౌరవానికి, ఆర్ధిక సమానతల కంటే బౌద్ధిక సమానతలకూ ప్రాధాన్యం ఇచ్చిన రచయిత్రి జేన్. ఆమె నవలల్లో స్త్రీపురుషులిద్దరూ విలువల్లో, జీవన విధానంలో, ప్రాపంచిక దృక్పథంలో సమవుజ్జీలుగా ఉన్నపుడే ‘ప్రేమ’ అనే పదానికి అర్థం ఉంటుంది.
చక్కటి తెలుగు పదం ‘దీవెన’ అని కేతన వాడినా దీనిని సంస్కృతీకరించి ‘ఆశీరర్థకం’ అని వాడటం వల్ల తర్వాతి కాలంలో ఇంతకుముందే చెప్పినట్లు వ్యాకరణ పరిభాషలో క్లిష్టత ఏర్పడి సామాన్యులకు అర్థం కాకుండా పోయింది. తేలికైన మాటలలో, సులభమైన శైలిలో వ్యాకరణం ఎలా రాయవచ్చో కేతనను చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది.
బడిలో చదువుకొనేటప్పుడు మనము ఉత్పలమాలకు గణములు భ/ర/న/భ/భ/ర/వ, శార్దూలవిక్రీడితమునకు గణములు మ/స/జ/స/త/త/గ, ఇలా చదువుకొని జ్ఞాపకములో పెట్టుకొనేవాళ్ళము. ఒక్కొక్కప్పుడు అనిపించేది మఱేదైనా సులభ మార్గము ఉంటే బాగుంటుందని. సార్థకనామ గణాక్షర వృత్తములలో ఈ ఇబ్బంది ఉండదు. గణముల పేరులు వృత్తముల పేరులో ఉంటాయి.
రామారావుగారి కథలు చదివించవని చాలామంది అంటే, అలా తప్ప మరోలా రాయలేక పోయానని ఆయన వినయంగా అన్నారు. ఆ మాటలకీ, ఆ వినయానికీ అర్థమేమిటంటే, ఆ కథలు అలానే రాయాలి అని. నాకు తెలిసిన ప్రపంచ సాహిత్యంలో రామారావుగారిలా కథ చెప్పేవాళ్ళు ఎంతోమంది లేరు.
కా.రా. కథలపద్ధతి వేరు. కా.రా. పేదలకంటే నిరుపేదల గురించి కథలు రాస్తాడు. అయితే మనుషులను మంచివారిగా గాని చెడ్డవారిగా గాని చూపడం అతడి కథాప్రయోజనం కాదు. మనిషి మంచివాడుగా గాని చెడ్డవాడుగా గాని ఎలా మలచబడుతున్నాడు మారుతున్నాడు అన్నది అతని కథావస్తువు.
జేన్ ఆస్టిన్ ‘నేను అందరిదాన్నీ’ అని ఏనాడూ చెప్పుకోలేదు కాని, అందరూ ఆమె తమకే చెందుతుందని అనుకున్నారు. తమ సిద్ధాంత పరిధుల్లోకి ఆమెను లాక్కువెళ్ళాలని ప్రయత్నించారు. ఆమె మరణించి రెండు శతాబ్దాలు గడిచినా, ఇప్పటికీ ఆమెను చర్చించుకుంటూనే ఉన్నారు. అందుబాటులో ఉన్న ఆరు నవలల్లోనూ లోతుల్ని వెతుకుతూనే ఉన్నారు.
సాహిత్యంలోగాని యితర కళలలోగాని ఉద్యమాలు ఆయాకాలాల జీవనదర్శనాలప్రభావంలో ఆవిర్భవిస్తాయి. కాని వాటితో పోవు. అస్తిత్వవాదం అనేక సాహిత్యోద్యమాలలాగే వచ్చింది, పోయింది. ఉద్యమం చరిత్రలో కలిసిపోతుంది, సాహిత్యం నిలిచి ఉంటుంది. నిలిచి ఉన్న అస్తిత్వవాద సాహిత్యపరిచయమే ప్రస్తుత ప్రయత్నం. వాదం గౌణము, సాహిత్యం ముఖ్యము.
1942లో జరిగిన దౌర్జన్యములకు కాంగ్రేసే ఉత్తరవాదులని గవర్నమెంటువారు నిందించగా గాంధిగారు కాదనిరి. రాజప్రతినిధి దర్శనమివ్వలేదు. ఆయన ఉపవసింపగా ఆయనకు ప్రాణాపాయకర పరిస్థితి కలిగెను. అంతట బ్రిటీషు ప్రభుత్వమువారాయనను 1944 సం. మే 6వ తేదీన చెరసాల నుండి వదిలివేసిరి.
రాతియుగంలో సహజసిద్ధంగా లభించే లోహపు కణికలు మానవుడి కంటికి కనబడినప్పుడు వాటిని పదిలంగా భద్రపరచి ఉంటాడు. ఆకుపచ్చగా ఉండే తామ్ర కర్బనితం రాళ్ళనీ, నల్లగా ఉండే అంజన గంధకిదము రాళ్ళనీ గుండ చేసి ఈజిప్టులోని పురాతన రాజవంశీయులు సౌందర్య సామగ్రులుగా ఉపయోగించినట్లు దాఖలాలు ఉన్నాయి.
వ్యాకరణ రచనలో కేతన లాఘవం, అది కూడా తేలిక తెలుగు మాటలలో అప్పటికీ ఇప్పటికీ కూడా ఏ వ్యాకర్తలోనూ కనిపించదనిపిస్తుంది. అందువల్లనే చిన్న చిన్న మాటలలో, చిన్న కంద పద్యంలో కేతన తెలుగు క్రియా స్వరూపాన్ని వర్ణించిన తీరుకు తెలుగు వ్యాకరణాలను, భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసే వారందరూ కూడా ఆనందిస్తారు.
ఇలా మానవాతీత శక్తులు లేవని, అవి మన ఊహాజనితాలనీ చెప్పడం వల్లనే కాబోలు 20, 21వ శతాబ్దుల్లోనూ ఆన్ రాడ్క్లిఫ్ ఒక సంచలన రచయిత్రిగా సాహిత్యవేత్తల మన్ననను పొందుతోంది. ఇది మౌలికంగా సెంటిమెంటల్ నవలే. కానీ అందులో సస్పెన్స్నూ, థ్రిల్నూ పొందుపరచడంలో ఆన్ రాడ్క్లిఫ్ చూపిన ప్రతిభ వల్ల ఇది ఒక అసాధారణ రచన అయింది.
హాప్కిన్స్ విక్టోరియాయుగపు వాడు. టెన్నిసన్, బ్రౌనింగ్, స్విన్బర్న్లకు సమకాలికుడు. కాని కవిగా వాళ్ళలో చేరడు. అతడు యిరవయ్యవ శతాబ్దపు ఆధునిక కవి. ఎలియట్ తన గురించి అన్నాడు: తాను ఆధునికుల్లో పురాతనుడు, పురాతనుల్లో ఆధునికుడు అని. హాప్కిన్స్ ఆంగ్లోశాక్సన్ మూసలోని ఆధునికుడు.
సూర్యోదయం మొదట్లో పొడవుగా సాగిన నీడ మధ్యాహ్నం సూర్యుడు నెత్తిమీదకు వచ్చే వేళకి చిన్నదవుతూ, మళ్ళీ పొడవుగా సాగుతుందన్న విషయం మనకు తెలుసు. కనుక నీడ పొడవును బట్టి, అది మధ్యాహ్నమైతే, ఇంకా సూర్యాస్తమయానికి 7 గడియల పొద్దు ఉందనీ, అదే ఉదయపు నీడ అయితే, సూర్యోదయం అయి 7 గడియల పొద్దు అయిందనీ తెలుసుకోవచ్చు.
త్రిభంగి అంటే మూడు భంగములు గలది. భంగము అంటే ఇక్కడ విఱుపు. అనగా పాదము స్పష్టముగా మూడు విఱుపులతో నుండాలి. ఈ విఱుపులకు అంత్యప్రాస కూడ ఉంచుట వాడుక. సామాన్యముగా మూడు అంత్యప్రాసలు ఉంటాయి. ఈ త్రిభంగి పుట్టు పూర్వోత్తరాలు సరిగా తెలియవు.
తెలుగులో ఈ సమాసాలకు సంబంధించిన అవగాహనంతా సంస్కృతం నుండి తెచ్చుకున్నదే. అందువల్ల పాఠశాల స్థాయినుండి స్నాతకోత్తర స్థాయివరకూ సమాసాల కన్నా వాటి సాంకేతికపదాల విషయంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడుతూండటం గమనార్హం. కేతన ఇచ్చిన నిర్వచనం చిన్నయసూరి పై నిర్వచనం కన్నా సులభంగా అర్థమవుతూందన్నది ఎవరైనా నిర్వివాదంగా అంగీకరించాల్సిందే.
ఎవరయినా పెద్ద ఆర్టిస్ట్ చనిపోగానే తెల్లారి కాగితపు పేపర్లకు కార్టూనిస్టులు వేసే బొమ్మలలో ఆ సదరు చిత్రకారుడు ఒక సంచి తగిలించుకుని మేఘాల మధ్య స్వర్గమో ఇంకే శ్రాద్ధమో అనే ఒక పిండాకూడు ద్వారం దగ్గరికి వెడుతుంటాడు కదా, అటువంటి బొమ్మలని చూసినపుడల్లా మాకిరువురికి ఎక్కడ కాలాలో అక్కడ కాలేది.