కమ్యూనిజంలో ఉన్నప్పుడు అది సోవియట్ యూనియన్ కావచ్చు, తూర్పు ఐరోపా కూటమిలో ఉన్న దేశం కావచ్చు, అక్కడి మనుషుల అంతరంగాన్నీ బాహ్య జీవితాన్నీ ఒక వింత ఒత్తిడి విడతీసి వేరు చేసేస్తుంది. రష్యనులు ‘స్లోజ్న’ అని పిలుచుకునే ఈ స్థితి, ఈ విడతీత ‘క్లిష్టమైనది’. మాస్కోలో చదువుతో ముడిబడ్డ ఉద్యోగాలు కమ్యూనిస్టు పార్టీతో సత్సంబంధాలుండిన వారికే దక్కేవి.
Category Archive: వ్యాసాలు
సంస్కృత వృత్తములను ఏవిధముగా ఎనిమిది త్రిక గణములతో, నాలుగు రెండక్షరముల గణములతో, రెండు ఏకాక్షరపు గణములతో వివరించగలమో, అదే విధముగా దేశి ఛందపు వృత్తములను కూడ బ్రహ్మ, విష్ణు గణములతో, ఒక గురువు, రెండు లఘువులతో వివరించ వీలగును.
కాని నేను ఫలానా ఛందస్సులో వ్రాయాలని సంకల్పించను. భావం ఛందస్సులో నిముడాలనే బదులు ఛందస్సు భావంలో నిముడాలనే అభిప్రాయం గల వాణ్ణి నేను. అట్లని పద్యాలలో వ్యర్థ పదాలు చోటు చేసికొనరాదు. అందుచేత నొక అపూర్వమైన ఛందస్సు భావంలో స్ఫురించినప్పుడు కాదనక దానినట్లే స్వీకరించినాను. అందుచేత అనేకనూతనవృత్తాలను, ఖండ, చతురశ్ర, మిశ్ర, త్ర్యస్రగతులలో సాగే అనేకమాత్రాపద్యభేదాలను వివరించుటయే ఈ వ్యాసంయొక్క లక్ష్యం.
ఈ భూమిపై ఎందరో పిల్లలు ఆకలితో చనిపోతుంటే అంగారక గ్రహ యాత్ర కోసం బిలియన్ల డాలర్ల ఖర్చును నేను ఎలా సూచించగలుగుతున్నానని మీ లేఖలో అడిగారు. అయ్యో! ఆకలితో చనిపోతున్న పిల్లలున్నారని నాకు తెలీదు, ఇప్పటినుంచి మానవాళి ఈ సమస్యను పరిష్కరించే వరకు నేను అన్ని అంతరిక్ష పరిశోధనల నుంచి విరమించుకుంటాను వంటి సమాధానాలు మీరు ఆశించరని నాకు తెలుసు.
ఈ కథ – సృష్టికి, సృష్టికర్తకూ ఉన్న సంబంధం గురించి; మానవీయతకు, అమానవీయతకూ ఉన్న సంబంధం గురించి; వికారానికి, అందానికీ ఉన్న సంబంధం గురించి; మేధకు, ఉద్వేగానికీ ఉన్న సంబంధం గురించి; శాస్త్రజ్ఞానానికి, యథార్థానికీ ఉన్న సంబంధం గురించి; ప్రకృతికి, మనిషికీ ఉన్న సంబంధం గురించి సరికొత్త వ్యాఖ్యానం.
దామెర్ల రామారావు జీవితకాలంలోనే ఇంతటి ప్రశంసలను అందుకున్నారు. కానీ ఈరోజు భారతదేశంలో రామారావును ఎరిగినవారు ఎవరూ లేరనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అరకొర జ్ఞాపకాలే మిగిలాయి. ఆంధ్రదేశ వీరగణంలో అస్పష్టమూర్తిగానే రామారావు నిలిచారు. జాతీయ ఆధునిక చిత్రకళ గ్యాలరీలో దామెర్ల చిత్రాలు మచ్చుకు ఒక్కటైనా కనిపించవు.
‘ఈ గొప్ప చిత్రకారుడు దామెర్ల రామారావు ఇరవై ఎనిమిదేళ్ళ చిన్న వయసులోనే కాలం చెందారు గానీ, ఆయన కనక పూర్ణాయుష్కులు అయి ఉంటే…’ అని కొందరు పెద్దమనుషులు సభా సంప్రదాయాలననుసరించి ఊపిరి పొడుగ్గా వదులుతారు గానీ పూర్ణాయుష్కులు అయి ఉంటే మాత్రం ఏమవుతుంది?
ఇందులో ఉన్నది క్రమాలంకారం. వరుస క్రమంలో ఒకదానిపై మరొకటివైరంతో ఉన్నట్లుగా వర్ణన. అంటే, తుమ్మెదలు సంపంగి పూలపై వాలవు, కానీ సీత అలకలు అంటే ముంగురుల కిందనే సంపంగి వంటి ముక్కు ఉంది. అందువల్ల తుమ్మెదల పై సంపెంగలదాడి వలె ఉంది. అట్లాగే తామర పూలకు చంద్రునికి వైరం. కానీ ఇక్కడ ఆమె చేతులు పద్మాల వలె ఉంటే వాటితో ముఖమనే చంద్రుణ్ణి మన్మథుడు వైరిగా ఏర్పరచాడు.
కూల్డ్రే దొర కూడా కలోనియల్ బ్రిటిష్ చిత్రకళానైపుణ్యానికి అవతల నిలబడలేదు-ఆయనదీ అదే నేత. కానీ దారితెన్ను, అతీగతీ లేని చిత్రకళాపథంలో నాటికి ఆ ప్రాంతాల్లో ఆయన కాటన్ దొర వంటి పనే చేసేరు – మంచి పంటకు మొలకలెత్తించారు నారు పోసేరు. ఆ సరసన దామెర్ల రామారావు, ఆయన సాటి కళాకారులు, మిత్రులు అతి కొద్దిమంది గొప్ప చిత్రకారులుగా మిగిలారు-ఇక్కడ.
అన్నాచెల్లెళ్ళను గురించి ఇలాంటి వస్తువు అంతకుముందు ఇంగ్లీషు నవలల్లో ఎవ్వరూ చిత్రించలేదు. ఒకరకంగా ఇది జార్జి ఎలియట్ ఆత్మకథాత్మక నవల అనీ, ఆమెకు అన్న పట్ల అమితమైన ప్రేమ ఉండేదనీ విమర్శకులంటారు. ఇప్పటి విమర్శకులు ఫ్రాయిడియన్ సిద్ధాంతాలతో వ్యాఖ్యానించడానికి పుష్కలంగా అవకాశం ఉన్న నవల ఇది.
జావాలో సంస్కృత పదములతో కూడుకొన్న ప్రాచీన జావాభాషలో కావ్యములను వ్రాసినారు అక్కడి కవులు. వీటిని కాకవిన్ అంటారు. కాకవిన్ రామాయణము మొట్టమొదట వెలువడినది. అది సంస్కృత ఛందములలో వ్రాయబడినది. అంతే కాదు, అక్కడి కవులు, లాక్షణికులు క్రొత్త ఛందములను కూడ కల్పించినారు.
ఈమాట డిసెంబర్ 2021 ముందుమాట పుస్తకావిష్కరణల పోలిక అన్న ఒక కొత్త అంశాన్ని లేవనెత్తింది. ఈనాటి తెలుగు పుస్తకావిష్కరణల పద్ధతి ఒక ప్రహసనమే కావచ్చు. దానికి మార్పు కూడా అవసరమే కావచ్చు కానీ ‘పాశ్చాత్య పద్ధతి నవలంబించండి’ అన్న సూచన మాత్రం ఈనాటి తెలుగు రచయితల, ప్రచురణకర్తల, పుస్తకశాలల పరిస్థితిని ఏమాత్రం పరిగణన లోనికి తీసుకోలేదని అనిపించడానికి కారణాలు చాలా వున్నాయి.
బుజ్జాయిగారు అలా కాదు అమిత సింప్లీ ఆయన బొమ్మల బ్యూటీ. బుజ్జాయిగారి బొమ్మలతో పోల్చుకోదగిన అలతి రేఖల ఆర్టిస్ట్ అంత సులువుగా మరెవరూ కానరారు. అందువల్లనే ఒకానొక సమయంలో దేశంలోకెల్లా ప్రఖ్యాతి గాంచిన ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రికలో బుజ్జాయిగారి బొమ్మలు మాత్రమే ప్రచురితం అయ్యాయి. మరే తెలుగు చిత్రకారులు ఎంత ప్రయత్నించినా అందులో చోటు చేసుకోలేకపోయారు.
కావున నా సూచన ఏమనగా ఋ-కారమునకు యతి బహుళము చేయవలయునని. అనగా రి-కారము, రు-కారము రెండింటితో చెల్లించుటకు శాస్త్రబద్ధముగా అనుమతి నొసగవలెనని. ఈ శాస్త్రసమ్మతి విశ్వవిద్యాలయముల ద్వారా, భాషాశాస్త్రజ్ఞులద్వారా, పండితులద్వారా, ప్రభుత్వము ద్వారా జరుగవలయును. అంతేకాక విలోమ ఉపయోగమును కూడ బహిష్కరించవలెను.
కవులను, సాహిత్యకారులను దేశంనుంచి తరిమేయడంలో రష్యా ప్రతిభే వేరు. అలా స్వదేశం నుంచి పారిపోక తప్పని పరిస్థితి ఎదురైన ఒక రచయిత్రి కరొలీనా పావ్లోవా . ఆమె పారిపోవడానికి కారణం జార్ ప్రభువు కాదు. తోటి సాహితీవేత్తలు పెట్టిన మానసిక హింస. మగరచయితల బహిష్కరణకు రాజ్యం కారణమైతే, ఈ రచయిత్రి పారిపోవడానికి కారణం ఆ మగ రచయితలే. వినడానికి ఎంత దారుణంగా ఉన్నా అదే నిజం.
వికీర్ణం (radiation) అనేది ప్రాణాంతకమైన ప్రమాదాన్ని తీసుకొచ్చే ‘అమ్మవారు’ కాదని తెలుస్తున్నాది కదా! మనం అంతా బహుకొద్ది మోతాదులలో అసంకల్పంగా వికీర్ణం ప్రసారం చేస్తూనే ఉన్నాం, మన ఎముకలలో ఉండే అనిశ్చల పొటాసియం కారణంగా. మన వంటగదులలో నల్లసేనపురాయితో చేసిన తీనెలు కాని ఉంటే అవి కూడా కాసింత వికీర్ణాన్ని ప్రసారం చేస్తూనే ఉంటాయి.
వానలో తడవనివారు, కాఫ్కా పేరు విననివారు ఉండరు. అతడి గురించి రెండు విషయాలు లోకానికి తెలుసు, అతన్ని చదవనివారికి కూడా. ఒకటి, తన రచనలను అన్నిటిని తన మరణానంతరం చింపి చెత్తలో వేయమని కోరాడని. రెండు, ఇద్దరమ్మాయిలతో మూడుసార్లు పెళ్ళి నిశ్చయమై, మూడుసార్లు భగ్నమయిందని. చివరకు పెళ్ళి చేసుకోకుండానే చనిపోయాడు. తన నలభయ్యవ ఏట.
సామాన్యముగా ఉదాహరణములలో ప్రతి విభక్తికి మొదటి పద్యము ఒక వృత్తము, తఱువాత కళికోత్కళికలుగా రగడ భేదములను వ్రాయవలెను. అంతములో ఒక సార్వ విభక్తిక పద్యముండును. కళికోత్కళికలు లేక కూడ ఉదాహరణములను కొందఱు కవులు వ్రాసిరి. దేవీనవరాత్రుల పండుగ సమయములో అలాటి ఉదాహరణమును ఒకదానిని నేను వ్రాసినాను. దేవికి ఆర్య అని కూడ పేరు, కావున ఈ పద్యములను ఆర్యాభేదములలో వ్రాసినాను. కావున ఇది ఆర్యోదాహరణము!
నమీరూ అతని భార్యా చక్కని ఆతిథ్యమిచ్చే మనుషులు. ఆ రియాద్ వాళ్ళిద్దరి చిన్నపాటి సుందర ప్రపంచం. ప్రపంచపు నలుమూలలనుంచీ వచ్చే అతిథులతో దాన్ని పంచుకోవడం వారికి ప్రీతిపాత్రమైన విషయం. ఫెజ్ నగరంతో స్నేహ సామరస్యాలు సాధించడంలో నమీర్ నాకు ఎంతో సాయంచేశాడు. చక్కని సలహాలూ సూచనలూ ఇచ్చాడు.
తన 17వ యేటే తన డైరీలో రాసుకున్న వాక్యాలను చూస్తే ఆమె తదనంతర జీవితం, సాహిత్యం ఎలా ఉంటాయో తెలుస్తుంది. ‘పిరికివాళ్ళంటే నాకిష్టం లేదు. వివాహం విషయంలో నాకో అనుమానం. నిజంగా భర్త తెలివైనవాడైతే తన భార్య భీరువుగా ఉంటే సహించగలడా?’ అంటుంది. భయం, సంకోచం స్త్రీల లక్షణం అనే భావజాలాన్ని చాలా చిన్నతనం నుంచే ఆమె వ్యతిరేకించేది.