నిశ్శబ్దం ఎక్కడ?
పురుగుదో పిట్టదో
ఏదో ఒక పాట
వినిపిస్తునే ఉంటుంది
నిశ్చలత్వం ఎక్కడ?
చిన్నవో పెద్దవో
అన్ని చెట్ల ఆకులూ
కదులుతునే ఉంటాయి
కాస్త లోతుగా చూస్తే..
పాటకీ పాటకీ మధ్య
ఠీవిగా కూర్చున్న
నిశ్శబ్దం
కదిలే ఆకుల మధ్య
కదలకమెదలక నిల్చున్న
చెట్ల మొదళ్ళు!
రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి:
2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. “ఏటి ఒడ్డున” కవితా సంపుటి (2006), “ఆత్మనొక దివ్వెగా” నవల (2019), “సెలయేటి సవ్వడి” కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్లో ఫేకల్టీగా పని చేస్తున్నారు.
...
పూర్తిగా »