కొన్ని జెన్ పద్యాలు – 1


మంచు పొర

గాలితెమ్మెరలు ఆలవోకగా
ధూళినేదో పరచడం చూశా
గాఢంగా పరచుకున్న మంచుపొర
అలలపై ఆలవోకగా చెదరడం చూశా!


హృదయం

తెల్ల మబ్బు తునక
ఇటు నుంచి అటు
రహస్యమేదో తేలుతూ ఇలా!


కోరిక

ఎంత బావుండు
ఈ వెన్నెల్లో ప్రాణం విడిస్తే
ఎంత బావుండు
ఆ చీకటేదో పెనవేస్తే!


మరణం

చూడాలనుంది
మబ్బుతునక లేని చంద్రుడిని
నా మరుజన్మలో
కమలం శీర్షాన!


రచయిత తల్లావజ్ఝుల లలితాప్రసాద్ గురించి:

తల్లావజ్ఝుల లలితాప్రసాద్ సుప్రసిద్ధ రచయిత. ముఖ్యంగా జెన్ తత్వానికి సంబంధించిన పద్యాలు, కవితలు అలాగే సాహిత్య వ్యాసాలను ప్రముఖ తెలుగు ఇ-పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఆయన రాసిన “కొన్ని జెన్ పద్యాలు” వంటివి సాహితీ ప్రియుల ప్రశంసలు అందుకున్నాయి.

 ...