ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పురస్కారం, 2025

2025వ సంవత్సరానికి ‘ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహితీ పురస్కారం’ ప్రముఖ కవి శ్రీ విన్నకోట రవి శంకర్ గారికి ఇవ్వడానికి అవార్డు కమిటీ నిర్ణయించింది.

2020 లో ప్రారంభించబడిన ఈ పురస్కారం ఇప్పటివరకు ఐదుగురు ప్రముఖ తెలుగు కవులు, కవయిత్రులని సత్కరించింది. శ్రీ రవి శంకర్ ఆరవ గ్రహీత.

‘కుండీలో మర్రి చెట్టు’, ‘రెండో పాత్ర’, ‘వేసవి వాన’, ‘మంచు కరిగాక’ లాంటి రచనల్లో శ్రీ రవి శంకర్ గారి గాఢమైన మానవతా దృష్టి, సాధారణ ప్రపంచంలో మనకి గోచరించని అసాధారణ సత్యాలని అత్యంత సరళమైన భాషలో ప్రకటించ గలిగే ప్రతిభ, తాత్విక దృష్టి ఆయన ఎంపికకు ప్రధాన కారణాలని పురస్కార కమిటీ సభ్యులు తెలిపారు.

అవార్డు ప్రదానోత్సవ తేదీ, వేదికల వివరాలు కమిటీ తరువాత తెలియజేస్తుంది.