దట్టమైన పొగమంచు అలముకున్న వేకువజామున వారణాసికి అంబులెన్స్ చేరుకుంది. నటరాజ్ పూరణిని నిద్ర లేపాడు. ఆ వేకువ జాము చలిలోనూ గంగానది రాళ్ళమెట్ల అంచులో ఎంతోమంది స్మారక కర్మలు చేస్తున్నారు. ఎందరో స్త్రీపురుషుల తలలు గంగలో మునకలు వేసి లేస్తున్నాయి. పురోహితులు, సాధువులు, పశువులు, శవాలు, తిరగాడుతున్నారు. నటరాజ్ హరిశ్చంద్ర ఘాట్ ఎటువైపో ఒకరి దగ్గర కనుక్కున్నాడు.
Category Archive: అనువాదాలు
ఋగ్వేదంలోని పదవ మండలంలో 129వ సూక్తంగా ఉన్న నాసదీయ సూక్తం ఈ సృష్టి ఎక్కడినుండి వచ్చిందో, ఎలా సృష్టింపబడిందో అన్న విషయాల గురించి మహాశ్చర్యకరమైన ప్రశ్నలు వేస్తుంది. భారతీయ భాషా సాహిత్యాన్ని సూటిగా మూలం నుండి కాకుండా ఆంగ్లానువాదం నుంచి అనువాదం చేయడం క్షమించరాని నేరం. అందుకే సంస్కృత మూలం నుండి ముత్యాల సరాలకు దగ్గరిగా ఉండే ఛందంలో నేను చేసిన తెలుగు అనువాదం ఇది.
ఆయన ఆర్ధికంగా జర్మనీ వెనుకబాటుతనం, ప్రజలు మోస్తున్న అవమానభారాన్ని దగ్గరగా చూశారు. అంత ఘోరమైన ఓటమి, ప్రళయ వినాశనం తరవాత, తప్పు చేశామన్న భావనతో కుంగిపోయిన ఆ దేశాన్ని గుర్తించారు. తమ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నపుడు కూడా, పశ్చాత్తాపంతో చింతించే ప్రజల మనస్సాక్షి ఎంత గొప్పదో అన్న ఆలోచన వచ్చింది ఆయనకు. అంతకన్నా ఎక్కువ వినాశనాన్నే, అమెరికా జపాన్‌కు కలిగించింది.
హైస్కూల్ చదువు పూర్తయ్యాక పై చదువులకి డబ్బు అవసరమైంది. చెల్లి ఇంకా బడిలో చదువుతుండడం, ఓ రిసెప్షనిస్టుగా పని చేసే అమ్మ జీతం కుటుంబానికి సరిపోకపోవడం వల్ల, రెండేళ్ళు చదువు ఆపి, ఏదైనా పని చేసి డబ్బు ఆదా చేయాలని, ఆ తరువాత చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. తనకి ఇష్టమైన సైకాలజీ చదవాలనుకున్నాడు. అయితే, ఆపాటి చదువుతో ఉద్యోగం సంపాదించడం కష్టం. పైగా కోవిడ్-19 మాంద్యం నుంచి నగరం ఇంకా కోలుకోలేదు.
గ్రనాద నడకరాయుళ్ళ స్వర్గసీమ. పెద్దగా దూరాలేమీ లేవు. ఏ వీధిని చూసినా రంగులీనుతూ కళకళలాడుతూ కనిపించింది. నాలో ఉత్సాహం నింపింది. ఎలాంటి అభద్రతాభావమూ కలుగలేదు. జనజీవితం నింపాదిగా సాగిపోతోంది. మనుషులు సౌమ్యుల్లా కనిపించారు. ఆప్యాయంగా పలకరించారు. స్నేహంగా సాయపడేవారిలా అనిపించారు.
అన్ని కంప్యూటర్ ఎంట్రీ పాయింట్లకి మనుషులను నియమించాక ఒక మనిషి ఎక్కువగా ఉన్నారని తెలిసింది. అది ఎవరా అని చూసినప్పుడు అతనితోపాటు ఉద్యోగంలో చేరడానికి వచ్చిన ఆ అమ్మాయేనని గుర్తుకు వచ్చింది. ఆమెను రప్పించాడు. ఆమె వణుకుతూ, కంగారుగా వచ్చి అతని గది గాజు తలుపు బయట నిల్చుంది. నెమ్మదిగా ఆమెకేసి చూశాడు. ఆమె వణుకు స్పష్టంగా కనబడుతోంది. గాలిలో ఆకులు అల్లాడుతున్నట్టు వణుకుతోంది అనుకున్నాడు.
ఇవన్నీ ఇంట్లో మరుగు దొడ్లు లేనివారికి, డబ్బులిచ్చి వెళ్ళలేని వారికే. ఇప్పుడు ధారావిలో ప్రభుత్వం వసూళ్ళ వేటకు, గుళ్ళకు ఏ మాత్రం తీసిపోని, రాజభవనం లాంటి డబ్బులు చెల్లించే మరుగు దొడ్లను తీసుకువచ్చింది. తెల్లారి నాలుగు గంటలకు తెరిచి, రాత్రి ఒంటి గంటకంతా మూసేస్తారు. తెరిచేటప్పుడు మనుష్యులు వచ్చి తెరవమని చెబుతారు. నాలుగు గంటల నుండి ఒక్కొక్కరిగా ఏడు, ఏడున్నరకల్లా గుమిగూడటం మొదలవుతుంది.
ఏటవాలుగా ఉన్న నదీ తీరాన్ని ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతున్న ఆ బండ్లను అక్కడ ఉన్న సైనికులు తోసి సాయం చేస్తున్నారు. కాలినడకన వెళ్ళే రైతులు పాదాలు మునిగిపోయేంత దుమ్ము, ధూళిలో అతికష్టం మీద నడుస్తున్నారు. కానీ ఆ పెద్దాయన మాత్రం కదలకుండా అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇంక ముందుకెళ్ళడానికి ఏ మాత్రం వీలుకానంతగా అలసిపోయాడు. రక్షణ స్థావరాల ఆవలి ప్రాంతం పరిశీలించి నేను మళ్ళీ వంతెన దాటుకొని తిరిగి వచ్చాను.
పొరుగున ఉన్న గ్వాతెమాల, ఓందూరాస్ దేశాలలో ఉన్నట్టుగా కాకుండా ఎల్ సల్బదోర్ ప్రజల రూపురేఖలు ఎక్కువగా యూరోపియన్లను పోలి ఉన్నాయనిపించింది. కాస్తంత పరిశోధన తర్వాత అక్కడి జనాభాలో ఎనభై ఆరుశాతం మెస్తీహోలు అని, పదమూడు శాతం యూరోపియన్లు అని, ఒకే ఒక్కశాతం నేటివ్ ఇండియన్లనీ తెలిసింది.
మరియమ్మ వచ్చి స్టేజ్ మీద నిలబడింది. శంకరన్ కుర్చీకి ఎదురుగా. అతడికి పుట్ట నుంచి జెర్రి వేగంగా బయటకొచ్చి శరీరమంతా సరసరమని పాకుతున్న అనుభూతి. పవిత్రన్ మాస్టర్ సైగ చేయగానే ఆమె ఆ లంగాను కుప్పగా జారవిడిచింది. గదంతా చిక్కటి నిశ్శబ్దం అలుముకుంది. ఆ లంగా ఆమె కాళ్ళ కింద వంకరగా గీసిన సున్నాలా వచ్చి పడ్డది. కాలితో రంగు వెలిసిన ఆ లంగాను కాస్త దూరంగా నెట్టింది. స్టేజ్ మీద కూర్చుంది.
మత్తుగా జోగుతున్న ముసలివాళ్ళ మధ్య
గడ్డకట్టే చలిలో గుర్రాలను చూస్తూ ఆ యాత్రికుడు.
అతని మీసం గడ్డకట్టిన మంచు ముక్క.
కనురెప్పలు జీవం లేని వెండి నెలవంకలు.
గుర్రాల డెక్కల కింద ఎగసిపడుతున్న పొడిమంచు ధూళి
అక్కడి ఒక కూడలిలో ‘చూడు చూడు అంటూ ఒక శిల్పం చూపించాడు మార్కో. అతను ముందే చెప్పిన, హనుమంతుడి పోలికలు పుష్కలంగా ఉన్న ఆకృతి అది. దానికి మార్కో పెట్టిన పేరు ‘మాయన్ హనుమాన్’. ఆమాట అక్కడికి వచ్చిన ఒక భారతీయ టూరిస్టు మార్కోతో అన్నాడట – దాన్ని మార్కో ఖరారు చేసి వాడేస్తున్నాడు.
అడవి వృక్షాలు, వాటిని ఆనుకున్న దట్టమైన పొదలూ లతల మధ్య ఉన్నాయా శిథిలాలు. మేము వెళ్ళినప్పుడు మరికొంత మంది సందర్శకులు ఉన్నారు కాబట్టి సరిపోయింది గానీ లేనట్టయితే అదంతా వింతగా, కాస్తంత భీతి కొలిపేలా అనిపించేదే. అక్కడ అవన్నీ చూపించడానికి సహాయకులు, గైడ్‌లూ లేరు. కనీసం సమాచారం చెప్పే బోర్డులన్నా లేవు.
కొండల వెనకాల నుంచి మా ముందున్న సరోవరాన్ని వర్ణభరితం చేస్తూ సూర్యుడు మెలమెల్లగా రంగప్రవేశం చెయ్యడం కానవచ్చింది. ‘అసలు నువ్వా శునకాలకు థాంక్స్ చెప్పుకోవాలి. వాటి పుణ్యమా అని ఇంత చక్కని ప్రదేశం చేరి సూర్యోదయం చూడగలుగుతున్నావ్’ అని చెణికింది జెమ్మా. ఆమె ఈ ప్రదేశానికి తరచూ వస్తూ ఉంటుందట.
You come uninvited and knock at the door
for me! I won’t be there then!
Did you really knock at the door for me?
No; you come knocking at my door uninvited
since you really don’t need me!
(బాలాంత్రపు రజనీకాంతరావు కవిత ‘అనుకోని ఆఖరి అతిథి’కి ఆంగ్లానువాదం.)
వర్షం గట్టిగా కురుస్తోంది. చేతులు లేని గోనెపట్టా తొడుక్కున్న ఒక వ్యక్తి ఖాళీ రోడ్డు దాటి కఫే వైపు వస్తున్నాడు. ఆ చుట్టుప్రక్కలే ఎక్కడో కుడివైపున పిల్లికూన ఉండాలి. ముంజూరు క్రిందనుండి వెళ్ళి చూద్దునా అని ఇంకా మనసులో అనుకుంటోంది. ఆమె అలా తలుపు దగ్గర బయట నిలబడి ఆలోచిస్తూంటే, ఆమె వెనక ఎవరో గొడుగు తెరిచి పట్టుకున్నారు. మరెవరో కాదు, ఆ హోటల్‌లో పనిచేసే మెయిడ్.
సెంట్రల్ అమెరికా దేశాలు ప్రపంచంలోకెల్లా అతి తక్కువమంది యాత్రికులు తిరుగాడేవి. నేరాల పుట్టలుగా, రాజకీయ అవ్యవస్థ దిట్టలుగా, నియంతల కంచుకోటలుగా, మాఫియా ముఠాలకు స్వర్గసీమలుగా, సైనిక తిరుగుబాట్లకు కేంద్రబిందువులుగా అపార అపఖ్యాతిని గడించాయి. యాత్రికులకు వెంపరం కలిగించే ఖ్యాతి అది.
హోటల్‌కి వెళ్ళి టీ తాగాను. ఆకలి వేయలేదు.కడుపులో మంటగా అనిపించింది. రోజూ భోజనం పంపమని హోటల్లో ఉన్న వ్యక్తితో చెప్పాను. నా చిరునామా విని “పగలైతే పర్లేదు గానీ రాత్రి పూట హోటల్ కుర్రాళ్ళు అటు రావడానికి భయపడతారండీ. ఒకమ్మాయి ఆ ఇంటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది తెల్సా? ఆమె అక్కడే తిరుగుతుంది అంటారు మరి. మీకు దెయ్యాలంటే భయం లేదా సార్?” అన్నాడు.
పర్వత శిఖరాలు… కాలంతో వాటికి పనేముంది? కాలాతీతమైన స్థితి వాటిది. సిక్కులు ప్రార్థించేటప్పుడు, ‘సత్ శ్రీ అకాల్’ అంటారు. అ-కాలం. కాలంతో పని లేనిది. ఎంత గొప్ప మాట. కాలాతీత అవస్థలో ఎవరి కాలానికైనా అంతం ఎలా వస్తుంది? కాలా! ఓ మృత్యుదేవతా! నా దగ్గరకు రావడానికి ధైర్యం చెయ్యొద్దు! నిన్నెత్తి విసిరేస్తాను! ఎందుకని… కొంచెం కూడా బాధ అనేదే లేదు? బాధ అనేదే జీవితం. అది జీవితం మీద ఎప్పుడూ కదలాడే, మృత్యువు నీడ.
ఆమెకు ఈ తంతు అంతా అయోమయంగా అనిపించేది. ఉజిరెలో హాస్టల్లో అమ్మాయిలు పెళ్ళి గురించి, భర్త గురించి గుసగుసలాడుతూ కిసుక్కున నవ్వుకుంటున్నవారు ఆమెను చూడగానే మాటలాపి మౌనం వహించేవారు. ఎందుకంటే ఆమెకి భర్త గురించి, పెళ్ళి గురించి, తర్వాతి సంగతుల గురించి మాటలు వింటే యాక్ అనిపించేది. అందుకే ఆమె వచ్చాక హాస్టలు అమ్మాయిల ఆటపట్టింపులు ఆగిపోయేవి.