The Unexpected Last Guest

The Unexpected Last Guest!
అనుకోని ఆఖరి అతిథి!
You come uninvited and knock at the door
for me! I won’t be there then!
Did you really knock at the door for me?
No; you come knocking at my door uninvited
since you really don’t need me!
My wife showers hospitality
to an uninvited guest
Who comes knocking at my door!
పిలవకుండా వస్తావు, నువ్వు నా కోసం తలుపు తడతావు! అప్పుడు నేనుండను!
నిజానికి నువ్వు తలుపు తట్టడం అచ్చంగా నేను కావలిసేనా?
కాదు; కాదు గనకనే
నేను అక్కర్లేదు గనకనే – పిలవకుండా వచ్చి,
నువ్వు నా కోసం తలుపు తడతావు!
అభ్యాగతుడిగా గాని, అతిథిగా గాని
నా యింటికి వచ్చి తలుపు తట్టిన మిత్రుడికి
ఆతిథ్యం యిస్తుంది – ఫలహార పానీయాలతో
మా ఆవిడ!
I will make you sit and make you listen to my song,
It is the guest who has to get exhausted, not me to go on singing!
You come uninvited and knock at my door!
Not to listen to me sing, since I won’t be there!
My heart stops beating for a moment
Just to think of it!
కూచోబెట్టి, దస్త్రం విప్పి, నా పాట వినిపిస్తాన్నేను!
అతిథే అలిసిపోవాలేమో కాని
అలసటుండదు నాకు – అలా యెంత సేపయినా
వినిపించడానికి!
పిలవకుండా వచ్చి, నువ్వు నా కోసం
తలుపు తడతావు!
నా పాట వినడానికి కాదు; పాడటానికి
అప్పుడు నేనుండను గద!
అది తల్చుకుంటేనే ఒక క్షణం
పని చేయడం మానేస్తుంది గుండె?
I become breathless, hope gets tired; my imagination runs riot!
When my wife is not in a position to shower hospitality,
When I am not there to sing,
Knowing well that I won’t be there at my door!
Do you think I am afraid that you will step in?
ఆగిపోతుంది శ్వాస! అలిసిపోతుంది ఆశ;
ఉక్కిరి బిక్కిరవుతుంది ఊహ!
మా ఆవిడ ఆతిథ్యం ఇయ్య లేనప్పుడు
నేను పాడటానికి లేనప్పుడు
నేను లేకుండా చూసి
నీ అంతటి అభ్యాగతుడు
మా యింటి తలుపు తడితే యెలాగ!
నేనుండనేమో అని తప్ప
నువ్వు తలుపు తడితే నాకు భయమా?
Yesterday, I saw in the dream
the impregnable sky, I became one with its minute smoke screen;
whether it be the endless sea or the limitless nothingness
unable to get a grasp, I scream, it turns out to be the name of the known God!
It was a reachable grasp and I, who was becoming invisible
found myself with my skin intact on my bed in the middle of the night!
Rising above the limitless constellations
Does all this mean that I am so afraid?
నిన్న రాత్రి కలలో చూశా –
అనంతమైన ఆకాశం –
అందులోకి సూక్ష్మ ధూమ రేఖలా దూసుకుని
అంతర్లీన మయిపోయాను –
అంతులేని సాగరంలోనో
అగాధమయిన శూన్యంలో నో అంతర్లీనమవుతున్నప్పుడు
అందుకో తగ్గ ఆధారమేదో దొరక్క
అరచినట్లొక్క కేకేశాను
అలవాటయిన దేవుడి పేరది .
అందుకో తగ్గ ఆధారం; –
అంతర్థానం కాబొయ్యే నేను
అమాంతంగా శరీరం తొడుక్కుని
అర్థరాత్రి నా పక్క మీదున్నాను.
శూన్యంలో మునిగిపోవడం
అంతులేని అంతరిక్షంలో పెరిగిపోవడం
అంటే అంత భయమా నాకు?
You are knocking at many people’s doors!
And making a non-entity of many others;
That is why my heart stops beating at the thought of your arrival!
I become breathless, hope gets tired, imagination runs riot!
There are many things I need to do;
Need strength to do them;
Need to get fame, got to preserve the values!
Wings need to sprout for the birds in my nest,
they need to fly!
Even then I am not needed;
నువ్వు చాలా మంది కోసం తలుపు తడుతున్నావు!
చాలా మందిని లేకుండా చేస్తున్నావు
అందుకే నీరాక తలుచుకుంటే
పని చెయ్యడం మానేస్తుంది గుండె
ఆగిపోతుంది శ్వాస, అలిసిపోతుంది ఆశ,
ఉక్కిరి బిక్కిరవుతుంది ఊహ!
చెయ్యవలసిన పనులున్నాయి
చెయ్యడానికి శక్తి కావాలి;
పేరు రావాలి, విలువ నిలవ చేయాలి!
నా గూటిలో రెక్కలురాని పక్కి బలగానికి
రెక్క లెదగాలి, ఎగిరిపోవాలి!
అప్పుడూ నేను అక్కర్లేక పోవడం.
Got to complete the signatures and set the files right
like a transferred government employee;
settle all the issues and relinquish my chair!
Then if you knock at my door, I will become invisible!
However, your visit is as per your wishes, not mine;
If at all I turn out to be you, on whose wishes will my visit be?
బదిలీ అయిన ప్రభుత్వోద్యోగి లాగ
పని బకాయిలు పూర్తిచేసి సంతకాల బాకీలు తీర్చి,
ఫైళ్ళ దొంతరలు పేర్చి
చెయ్యవలసిన అప్పగింతలు చేసి
కూర్చునే కుర్చీ ఖాళీ చేస్తాను.
అప్పుడు నువ్వు నా తలుపు తడితే
నేనే అంతర్థానమయి వుంటాను!
ఇంతా చేసి, నీ రాక జరిగేది నీ యిష్టానుసారమే; నాది కాదు;
ఎప్పటికైనా నేనే నీవైతే అప్పుడా రాక ఎవరి యిష్టానుసారం?

(ఇదొక్కటీ, ఇద్దరు ముగ్గురు సహచర సహోద్యోగి మిత్రుల్ని కోల్పోయాక 1960లో రాశాను – రజని.)