ఒక తురకోడు పెద్ద కులస్తుడైన పిళ్ళైపై ఎలా చెయ్యి చేసుకుంటాడు? అని ఒక ముఠా సరంజామా వేసుకుని వస్తే, శాలమహాదేవాలయం ట్రస్టీ అనంతన్ నాయర్ వాళ్ళను ఆపి ‘పోయి మీ పనులు మీరు చూస్కోండ్రా! వావీ వరుసల్లేకుండా అడ్డగోలుగా ఒళ్ళు కైపెక్కి జంతువులా ప్రవర్తిస్తే తురకోడి చేతుల్లోనైనా చస్తాడు, చీమ కుట్టయినా చస్తాడు’ అన్నాడట. అనంతన్ నాయర్ మాటకు శాలబజార్‍లో ఎవరూ ఎదురు చెప్పరు.
Category Archive: అనువాదాలు
నిచ్చెన చివరిమెట్టు ఎక్కిన తర్వాత, నిటారుగా నిలబడి, మీరు చేతులు పైకి ఎత్తి చందమామను తాకవచ్చు. మేము జాగ్రత్తగా నిలబడి కొలుచుకున్నాం కూడా. (అప్పట్లో అది దూరంగా జరిగిపోతుందన్న అనుమానం ఏమాత్రం రాలేదు.) మీరు చేతులు ఎక్కడ పెడుతున్నారన్నది జాగ్రత్తగా గమనించవలసింది.
కొంచెం సేపు నిశ్శబ్దం ఆవరించింది. ఆ యువకుడిని తన పందెం ప్రతిపాదనతో డిస్టర్బ్ చేయడంలో పొట్టి వ్యక్తి సఫలమయ్యాడు. కాసేపు స్థిరంగానే కూచున్నా, అతనితో ఏదో అశాంతి బయలు దేరింది. అటూ ఇటూ కుర్చీలు మారాడు. చేతుల్తో ఛాతీ రుద్దుకున్నాడు కాసేపు. వీపు మీద, మెడ మీద చేత్తో తట్టుకుంటూ ఆలోచించాడు. చివరికి ఒక కుర్చీలో కూలబడి మోకాళ్ళ మీద చేతుల్తో టక టకా కొడుతూ కూచుండి పోయాడు కాసేపు. పాదాలు నేల మీద తడుతున్నాయి.
చాలా సందర్భాలలో, మీరు చూడకూడదనుకున్నదాన్ని అంతర్జాలం ఏదో విధంగా మీకు చూపిస్తుంది. మీరు ఈ రోజు వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటారు. కానీ, దానికి ముందు, బలవంతంగా మీకు కెన్యాలో జరిగిన మారణహోమం గురించి ఒక కథనం చూపించబడుతుంది. మనకు సహజంగా వ్యతిరేకత పట్ల ఉండే ఒగ్గు వల్ల, మన దృష్టిని ఆకర్షించాలని కోరుకునేవాళ్ళు చెడువార్తలనే సృష్టిస్తారు.
మధ్యాన్నం అయ్యేసరికి సూర్యుని ప్రతాపం పెరిగిపోయింది. ఎండ తీక్షణమయింది. వేడి భరించడం కష్టమయింది. మనం వర్ణచిత్రాలలో చూసే ఎడారిలోని ఒంటెల బిడారుల్లో ఈ తీక్షణత గోచరించదు. చిత్రకారుల తూలికలకు అందని అసౌకర్యమది. జీవశక్తిని పీల్చేసే ఆ ఎండల మండిపాటును ప్రత్యక్షంగా అనుభవిస్తే తప్ప ఆ అసౌకర్యాలు మనకు బోధపడవు.
నానమ్మ చాలా ఏళ్ళుగా నిద్ర మాత్ర వేసుకుంటుంది రోజూ. ఆమె నిద్రపోయిందని నిర్థారించుకుని తాతయ్య లేచి ఉంగరం కోసం అంతటా వెదికాడు. వాష్ బేసిన్ దగ్గర, బీరువాలో, బాత్‌రూములో, అన్ని చోట్లా. ఉంగరం పోయిన సంగతి భార్యకు ఎలా చెప్పాలో తెలీడంలేదు ఆయనకి. ఏదైనా వస్తువు పోయిందంటే నానమ్మకి నేరమూ నేరస్తులూ వీటి గురించి చాలా అంచనాలుండేవి. పోగొట్టుకున్నవాళ్ళ అసమర్థత మీద కూడా.
నిలోవ్ గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి, నది మీదకి దృష్టి సారించాడు. ఎక్కడా అలల కదలిక లేదు. నీరూ, ఒడ్డూ జంటగా నిద్రపోతున్నట్టున్నాయి. చేప పిల్లల అలికిడికూడా లేదు. అకస్మాత్తుగా నల్లని బంతిలా ఏదో నీడ అవతలిగట్టు మీద దొర్లినట్టు అనిపించింది నిలోవ్‍కి. కళ్ళు చికిలించి చూశాడు. నీడ మాయమయింది. అంతలోనే మరోసారి కనిపించింది. ఈసారి ఆనకట్టమీద అటూ ఇటూ వంకరటింకరగా నడుస్తూ.
ఈ బృహత్ పర్వతాలు ప్రకృతి మాత దేవాలయాలు, ఈ శిఖరారోహణలు ఆమెకు మనం అర్పించే పూజా నైవేద్యాలు. మేము కూడా తీర్థయాత్రికులమే గదా అనిపించింది. పర్వతాలు ఎక్కడం, పాదయాత్రాంజలులు అర్పించడం, ఆ ప్రక్రియలో మనలోకి మనం తొంగి చూసుకోవడం… అది కదా కొండల మీద నెలకొన్న కోనేటిరాయళ్ళ దర్శనాల అంతరార్థం!
చెట్టు కొమ్మలు పలచబడడంతో అడ్డులేని గాలి ఆమెని ఈడ్చి కొడుతూ వుంది. ఎంత అవస్థ పడ్డా అవతలి వైపు చెట్టు కొమ్మలందట్లేదు. నిరాశతో దుఃఖం వొచ్చిందామెకి. మళ్ళీ శక్తి కూడదీసుకొని చెట్టు కొమ్మలందుకునేంతలో గాలి వాటిని విడిపించింది. ఆమె పట్టులోంచి జారిపోయిన చెట్టు కొమ్మలు ఆమె మొహాన్ని గాలి విసురుకు కొరడాలలా కొట్టాయి. గాలి, చెట్టు కొమ్మలూ కలిసి ఆమె గొంతుకు ఉరి బిగించాయి.
ప్రస్తుత మొరాకో యాత్ర నేను కోవిడ్ ఉపద్రవంలో ఎదుర్కొన్న కష్టనష్టాలనుంచి బయటపడటానికి బాగా ఉపకరించింది. మనసుకు ఎంతో అవసరమయిన శాంతిని ఇచ్చింది. నాలో స్ఫూర్తిని నింపింది. ప్రయాణ దాహాన్ని పునరుద్ధరించింది. గత ఆరేళ్ళలో ఇది నా మూడో మొరాకో యాత్ర. అంతా కలసి దాదాపు నెలరోజులు మొరాకోలో తిరుగాడాను. మూలమూలలూ చూశాను.
అసలు కాలేజీ చదువు చదవడమనేదే నాకు సమయం వృథా తప్పా మరేం లేదు అని నాకు అకస్మాత్తుగా అనిపించింది! నేనొక కళాకారుడిని. నావంటి వాడికి చరిత్ర, ఆర్థిక శాస్త్రం లేదా రాజనీతి శాస్త్రం చదివి ఆ పట్టా పొందడం వల్ల ఏమిటి ఉపయోగం? నిజానికి నాకు కావలసిన చదువు ఏదయినా ప్రసిద్ధ చిత్రకళా విశ్వవిద్యాలయాల నుండి పుచ్చుకోవలసిన ఫైన్ ఆర్ట్స్ పట్టా కదా?
వర్ణా నది ఒడ్డున పట్నానికి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది భీమా ఊరు. ఒంట్లో ఎంత బలమున్నా, అది ఆ చిన్న వూర్లో అతని కడుపు నింపలేకపోయింది. ముంబయికి వచ్చాడు. ఊరంతా గాలించినా తగిన పని దొరకలేదు. ముంబయిలో పని దొరికి, బాగా సంపాదించాలనీ, భార్యకు కాసుల పేరు చేయించాలనీ కన్న కలలు చెదిరిపోయాయి. పని మీద ఆశ వదులుకుని శివారులో ఉన్న అడవి దగ్గర ఒక చిన్న ఊరికి చేరాడు. అక్కడికి చేరాక దగ్గర్లో ఒక క్వారీలో రాయి కొట్టే పని దొరికింది.
ఢిల్లీ నగరం గురించి విశేషంగా రాసి, తిరుగులేని వ్యంగ్య రచయితగా పేరు తెచ్చుకున్నా ఫిక్ర్ తౌన్స్వీకి సాహిత్య అవార్డులు ఏవీ రాలేదు. ఇప్పటికీ తక్కిన హిందుస్తానీ రచయితలంత విరివిగా ఆయన పేరు వినిపించదు. కానీ ఒక్కసారి అలవాటైతే మాత్రం మర్చిపోలేని చమత్కార వచనం ఆయనది. తప్పక చదవాల్సిన రచయిత. ప్రతినిత్యం వాడుకలో ఉన్న పదాలకి తనదైన శైలిలో అర్థాలు, నిర్వచనాలు ఇచ్చారు లుఘాత్-ఎ-ఫిక్రీ అనే రచనలో.
ఈ భూమిపై ఎందరో పిల్లలు ఆకలితో చనిపోతుంటే అంగారక గ్రహ యాత్ర కోసం బిలియన్ల డాలర్ల ఖర్చును నేను ఎలా సూచించగలుగుతున్నానని మీ లేఖలో అడిగారు. అయ్యో! ఆకలితో చనిపోతున్న పిల్లలున్నారని నాకు తెలీదు, ఇప్పటినుంచి మానవాళి ఈ సమస్యను పరిష్కరించే వరకు నేను అన్ని అంతరిక్ష పరిశోధనల నుంచి విరమించుకుంటాను వంటి సమాధానాలు మీరు ఆశించరని నాకు తెలుసు.
తిరిగి హోటలుకు వెళ్ళేటపుడు ఆ దేశపు పార్లమెంటు భవనము, సాయుధ రక్షకుల పర్యవేక్షణలో ఉన్న రాజప్రాసాదమూ కనిపించాయి. రబాత్ నగరాన్ని నడకరాయుళ్ళ స్వప్నసీమ అనవచ్చు. నగరంలో తిరుగుతోంటే ఆత్మీయంగా అనిపిస్తుందే తప్ప సంభ్రమాశ్చర్యాలు, మనమీద నగరం వాలిపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న భావన కలగనే కలగవు.
విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచి పెట్టాడని, రాహువు కపటంగా దేవతల ఆకృతిలో వచ్చి అమృతాన్ని పొందే ప్రయత్నం చేశాడని, ఆ విషయం పసిగట్టి విష్ణువుకు ఆ విషయాన్ని చేరవేశారని తెలుసుకున్న రాహువుకు సూర్యచంద్రుల మీద తీరని పగ కలిగిందనీ వివరించాను. అలా రాహువు పగసాధింపు చర్య నేటికీ కొనసాగుతుందని చెప్పాను. ప్రతీ రోజూ ఈ రాహువు సూర్యచంద్రులను వాళ్ళ సంచలనంలో కొంతసేపు పీడిస్తూ ఉంటాడు. దాన్నే రాహుకాలం అంటారు.
రాత్రిళ్ళు భోజనానంతరం ఇలా మా ఇంట్లో చెప్పుకునే కబుర్లు భలే ఉంటాయిలే. ఆరోజు మేము కలుసుకున్న కొత్త వ్యక్తులు, పాఠశాలలోని ఉపాధ్యాయుల లేదా కార్యాలయాల్లోని ఉన్నతాధికారుల దౌర్జన్యాలను, అతి వేషాల గురించి తమాషా పడుతూ వారి హెచ్చులని వెక్కిరించుకుంటూ ముచ్చటించుకుంటాము.
జిబ్రాల్టర్ జలసంధి దక్షిణ తటాన, మధ్యధరా సముద్రం అట్లాంటిక్ మహాసముద్రాన్ని పలకరించే చోట కాపలా సిపాయిలా నిలచి ఉండే నగరం టాంజియర్. ఆ జలసంధి ఎంతో సన్నపాటిది. ఒకచోట భూభాగాల మధ్య దూరం పదమూడు కిలోమీటర్లే. విరామమంటూ లేకుండా కార్యకలాపాలు సాగే సముద్ర మార్గాలలో జిబ్రాల్టర్ జలసంధి ప్రముఖమైనది.
చిరాకు తగ్గని గణపతమ్మ ముఖాన్ని చూస్తూ కొన్ని క్షణాలు నిలబడ్డవాడు ఏమనుకున్నాడో, హఠాత్తుగా పరిగెత్తుకెళ్ళి గణపతమ్మ లావుపాటి శరీరాన్ని గట్టిగా హత్తుకున్నాడు. బియ్యం నానబెట్టిన గిన్నెని కోపంగా వంటగట్టు మీద పెట్టి, పెంటను తొక్కిన దానిలా ఛీ! అని పక్కకు జరిగి నిలబడింది గణపతమ్మ.
కాళ్ళు భూమిలో పాతేసినట్టు కదలడానికి మొరాయించాయి. చిమన్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అతడు చెప్పింది కరెక్టే. ఇక్కడ నుంచి లేచి వెళ్ళాలి నేను. ఆమె ఏ క్షణంలో ఏం చేస్తుందో? బాగ్ లోంచి కత్తి తీసి పొడిస్తే మాత్రం ఎవరు చూడొచ్చారు? అసలు ఆమె ఒక చేత్తో తోస్తే చాలు నేను కుప్పకూలిపోతాను. అంత బలంగా ఉన్నాయి ఆమె చేతులు. కొంపదీసి కరుడుగట్టిన నేరస్తుడెవరైనా ఆ బుర్ఖాలో లేడు కదా? వెన్నులో చలి పుట్టింది.