గాలివాటపు జీవనం.
ఆడంబరాల హోరు,
యవ్వనం మెఱుఁగులు
చెరిగిపోయే మెరుపులు.
సమయజ్ఞానంతో
బిరాన ఎంచుకో నీదైన క్షణం.

క్వెన్క నుంచి గుయాకీల్ 250 కిలోమీటర్లు. మధ్యలో ఒకచోట విరామం కోసం ఆగాం, అంతే. అంతా కలసి ప్రయాణానికి నాలుగున్నర గంటలు పట్టింది. దారంతా వర్షం – బయట అసలేమీ కనిపించనంత వర్షం. క్వెన్క వదిలీ వదలగానే రోడ్డు ఆండీస్ పర్వతాల మధ్య మెలికలు తిరుగుతూ సాగింది.

కథ చెప్పుకోవడంలో ఎదురయ్యే సమస్యేమిటో, వాళ్ళు వెంటనే పసిగట్టగలిగారు. కొత్తగా ఒక కథను చెప్పడం మొదలుపెడితే మనచేతనే సృష్టించబడ్డ పాత్రధారులు పునఃసృష్టితో దేవుళ్ళుగా మారి ఎప్పుడు మళ్ళీ కథ లోపలికి ప్రవేశిస్తారో మనం ఖచ్చితంగా చెప్పలేం. వాళ్ళు మనల్ని చూసి నవ్వి, చేతులతో సైగ చేసి, మారీచుడిలా ఆశ చూపి కుట్ర చేసి ఎటో దూరంగా తీసుకెళ్ళిపోతారు. చిట్టచివరికి కుట్ర బయటపడేసరికి మనం సెలవు తీసుకోవాల్సిన సమయం దగ్గరపడుతుంది.

మంచం మీంచి చూస్తున్న పాపకు తెరిచివున్న తలుపులో నుంచి, మసక చీకట్లో ఏదో రాచుకుంటున్న శబ్దంతో గుట్టుగా ఒక ఆకారం అటూ ఇటూ నెమ్మదిగా తిరగడం కనపడుతోంది. ఇప్పుడు సరిగా కనపడుతోందది; క్రమేపీ బూడిద రంగు మచ్చలా మారి చుట్టూ వున్న చీకట్లో కలిసిపోయింది. రాచుకుంటున్న శబ్దం ఆగిపోయింది. దగ్గర్లో చెక్క నేల కిర్రుమన్న శబ్దం. దూరాన మళ్ళీ అదే శబ్దం… అంతా నిశ్శబ్దం. ఆ ఆకారం న్యాన్యా అని అర్థమైంది. న్యాన్యా వ్రతంలో ఉంది.

ఆ వస్తువులన్నిటిని క్షిప్ర అంతకు ముందు కూడా చూసింది. కానీ ఇప్పుడు అవి మరీ కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. తార భర్త వాటన్నిటిని క్షణంలో బయట పారేస్తాడేమో. తార తన హృదయంలో ఎన్నో అవమానాలను పెట్టుకొని భరించింది. ‘ఒకరోజున ఇవన్నీ సర్దుతాను అనుకుంటాం. కానీ, వాటిని అలాగే వదిలి ఎకాయెకిన చెప్పాపెట్టకుండా ఈ లోకాన్ని వదులుతాం.’ తార పార్థివశరీరం ముందు నిలబడగానే క్షిప్రకు ఈ ఆలోచన మనసులో మెదిలింది.

ఆండీస్ పర్వత శ్రేణి విస్తరించి ఉన్న దక్షిణ అమెరికా దేశాలలో మొక్కజొన్ననుంచి తయారు చేసే చిచా అన్న మదిర తెప్పించుకొని రుచి చూశాను. ఆ పానీయం ఆ ప్రదేశాల్లో మాత్రమే తయారవుతుందట. దాని మూలాలు ఇన్కా నాగరికత పూర్వపుదినాల నాటివట. ఇన్కా ప్రజానీకం కూడా పండుగలు పబ్బాలలో ఈ మదిరను కాచి విరివిగా సేవించేవారట.

ఈ ముసలోడెందుకు ఇంతలా శివా! శివా! అని కేకేస్తూ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాడో అని కూడా అనిపించసాగింది. సమయం దొరికినప్పుడల్లా చిలకస్వాముల పక్కన చేరి ఆయన్ని ఆటపట్టించడంలో ఆనందం పొందాడు. రోజులు గడిచిన కొద్దీ చిలకస్వాములతో ఒక మాటయినా మాట్లాడించాలని పంతం పట్టాడు అర్చకస్వామి. అయితే అది అంత సులువయిన పనిగా అనిపించలేదు. చాలావరకు చిలకస్వామి ఏ రకంగానూ ప్రతిఘటించేవాడు కాడు.

మూడు మైళ్ళు పరుగెట్టాక కట్టెలకు వెళ్ళిన ఇద్దరూ ఎదురుగా వస్తూ కనిపించేరు. వాళ్ళు నిజంగానే చుట్టలు తాగుతూ కాలక్షేపం చేశారు. కట్టెలు ఇంకో గంటలో వస్తాయని వీరితో బొంకారు. ఈ ఇద్దర్నీ చూశాక పరుగెట్టే ఇద్దరూ ఆగి చెప్పారు శవం కదలడం, మూలుగు వినడం అవీ. ఇది విన్న వాళ్ళు వీళ్ళని వెక్కిరించారు పిరికిపందలని. మొత్తానికి నలుగురూ కలిసి మరోసారి శ్మశానానికి తిరిగొచ్చారు. గుడిసెలోకి వెళ్ళాక తెల్సింది – కాదంబిని శవం అక్కడ లేదు.

నేను నిశ్చయత కోరుకున్నది గణితంలో మాత్రమే కాదు. రెనె డెకార్ట్ లాగా నాక్కూడా బయటి ప్రపంచమంతా ఒక కల కావచ్చునని అనిపించేది. ఒకవేళ అది నిజంగా కలే అయినా, ఆ కలను కనడం నిజం కాబట్టి, ఆ కలను నేను అనుభూతి చెందుతున్నది నిస్సందేహమైన వాస్తవం కాబట్టి నా ఉనికి అనుమానించలేనిదని నాకు అనిపించింది.

ఆ మేడమీది రెస్టరెంటు పాతపట్నపు సంపూర్ణ దృశ్యాన్ని కళ్ళకు కట్టింది. పట్నంలోని ఎన్నో భవనాలూ లాండ్‌మార్కులూ ఆ దీపాల వెలుగుల్లో చక్కగా కనిపించాయి. సెంట్రల్ ప్లాజా, మెట్రోపాలిటన్ కథెడ్రల్, కొండమీద నెలకొన్న వర్జిన్ మేరీ విగ్రహం, ఊళ్ళోని బసీలికా స్పైరు – అన్నీ ఎంతో చక్కగా కనిపించాయి.

“మీరు అమ్మాయి వివరాలు ఫోటోలు చూసినట్టు వాళ్ళు కూడా మీ అబ్బాయి ఫోటో ఉద్యోగం చదువు ఇవన్నీ చూడాలి కదా. ఇవాళే మీ వివరాలన్నీ వాళ్ళకు పంపించేస్తాం. వాళ్ళు చూసి ఓకే చెప్పగానే మీకు తెలియజేస్తాం.” ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా వచ్చిపడుతున్న మాటలు. రోజూ చెప్పే అవే అబద్దాలకు మన ముఖాలలో ఎలాంటి మార్పు ఉండదు. కంగారు ఉండదు. చెరగని చిరునవ్వుతో ఎంతో ఇష్టంగా చేస్తున్నట్టు సహజంగా ఉండటం వీలవుతుంది.

నాకు ముందునుంచీ ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలలో యూరోపియన్ల రాకకు పూర్వమే విలసిల్లిన మాయన్, ఇన్కా నాగరికతల విషయంలోను, అవి యావత్ ప్రపంచానికీ అందించిన సాంస్కృతిక వారసత్వం విషయంలోనూ ఆసక్తీ ఆరాధనా ఉన్నాయి. అక్కడి దేశాలలో ఇప్పటికీ కొనసాగుతోన్న ఘనమైన దేశవాళీ సంస్కృతి పట్ల ఆకర్షణ ఉంది.

రామచంద్రమూర్తి అర్థమయిందన్నట్టు తలూపి వెంటనే తన చివరి కోరిక కోరుకున్నాడు. కానీ “నీ యాస తమాషాగా ఉందే! దేవతలు మాట్లాడేదిలా లేదే!” అని వ్యాఖ్యానించి మరీ కోరుకున్నాడు. దేవత నొచ్చుకున్నాడు, కొద్దిగా కోపం తెచ్చుకున్నాడు. “దేవతల యాసా? అంటే? ఉన్నట్టుండి నేను మాట్లాడే తీరును ఆక్షేపించడానికి దేవతల యాస ఏదో నువ్వెప్పుడైనా విన్నావా ఇంతకు ముందు?” దేవత మొఖంలో దైవత్వం కాస్త తగ్గింది.

కైలాసరావు చూపు ఆమె వెంటే వెళ్ళింది. ఆమె గది లోపలికి వెళ్ళిపోయింది. ‘కిఱ్ఱు’మనే శబ్దంతో తలుపు మూసుకుని, ఆయన చూపు తలుపుకు గుద్దుకుంది. మూసిన ఆ తలుపు మీద ఒక ఆడ మనిషి ఆకారం చిత్రలేఖనంలా కనిపించింది. వయసు పదహారేళ్ళు ఉంటుంది. నున్నగా దువ్విన తలమీద నాగరం, పాపిడికి రెండుపక్కలా నెలవంక బిళ్ళ, వదులుగా జారవిడిచిన జడకు జడకుప్పెలు, నుదుట వెలుతురును వెదజల్లే ముత్యాల పాపిడిబిళ్ళ.

బాపు ఒక నిట్టూర్పు విడిచి రాట్నం వడిగా తిప్పసాగారు. కీచుమని శబ్దం రావడం మొదలై, దారం పురి వదులయ్యి తెగిపోయింది. బాపు మళ్ళీ దారం కలిపి తిప్పడం మొదలు పెట్టారు. దారం మళ్ళీ తెగింది. ఆయన వేళ్ళకీ చక్రానికీ మధ్య వుండే సమన్వయం లోపించినట్టుగా వుంది. మళ్ళీ మళ్ళీ దారం తెగిపోతోంది. బాపు తల పూర్తిగా కిందికి వంచి, తన దృష్టినంతా చక్రం మీద కేంద్రీకరించారు. ఆయన వేళ్ళు వణకడం ప్రారంభించాయి.

జ్యోతిష్మంతమైన యజ్ఞరథమునెక్కి
తమమునెల్లనీవు తరిమివేసి
భీమరూపమందు శత్రుదంభముజేసి
వేదనిందకులను వెడలగొట్టి
గోత్ర భిదము సల్పి స్వర్గ విభము నిల్పి
రాక్షసులను చంపు రక్షకుడవు!

నాకు చిన్నతనం నుండి పరిచయం, అలవాటు, చనువూ ఉన్న ఏరు ఇది. నా చిన్ననాటి స్నేహితురాలు. వర్షాకాలంలో ఆమె తెంపరితనం. రాత్రివేళల్లో ఆమె మౌనం. మంచుకాలపు వేకువ జాముల్లో ఆమె సిగ్గు. ఎంత దగ్గరది ఈ ఏరు నాకు! వంపు తిరిగి ఆదీ అంతమూ లేకుండా అనంతమైన ఒక డొంకదారిలా ప్రవహిస్తూ సాగే ఆమెలో నాకు తెలియని వేలాది రహస్యాలు ఉన్నట్టు అనిపిస్తోంది.